ఘనంగా మంత్రి ‘జోగు’ జన్మదిన వేడుకలు | Minister Jogu Ramanna Birthday Celebration In Adilabad | Sakshi
Sakshi News home page

ఘనంగా మంత్రి ‘జోగు’ జన్మదిన వేడుకలు

Published Thu, Jul 5 2018 10:32 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Minister Jogu Ramanna Birthday Celebration In Adilabad - Sakshi

మంత్రికి కేక్‌  తినిపిస్తున్న మావల సర్పంచ్‌ రఘుపతి

ఆదిలాబాద్‌టౌన్‌: రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలను బుధవారం ఆయన నివాసంలో కార్యకర్తలు, నాయకుల మధ్య కేక్‌ కట్‌చేసి ఘనంగా జరుపుకున్నారు. అంతకు ముందు పట్టణంలోని శాంతినగర్‌ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి జోగు రామన్నకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఐ నర్సింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మంత్రులు పలువురు ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్వీ ట్లు, పండ్లు పంచిపెట్టారు. టపాసులు పేల్చి సం బరాలు జరుపుకున్నారు. ఆ ప్రాంతమంతా  సం దడి సందడిగా కనిపించింది.

మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావ్, డీసీసీబీ చైర్మన్‌ ముడుపు దామోదర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రంగినేని మనీషా, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరె రాజన్న, మావల సర్పంచ్‌ రఘుపతి, పార్టీ మా వల మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, ఐసీడీఎస్‌ ఆర్గనైజర్‌ కస్తాల ప్రేమల, పద్మశాలి సంఘం జి ల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, జాగృతి జి ల్లా అధ్యక్షుడు రంగినేనీ శ్రీనివాస్, పీఆర్టీయూ జి ల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ జట్టు అ శోక్, బోథ్‌ మాజీ మార్కెట్‌ చైర్మన్‌ తులశ్రీనివాస్, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు మెట్టు ప్రహ్లాద్, సూరం భగవాండ్లు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు,  తరలివచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

, రక్తదాన శిబిరం ప్రారంభిస్తున్న మంత్రి, చిత్రంలో ఎమ్మెల్యే బాపూరావ్, చైర్‌పర్సన్‌ మనీషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement