నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ టౌన్ : సర్కార్ బడుల్లో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం పట్టణంలోని సేవాదాస్ విద్యామందిర్ ఎయిడెడ్ పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల పథకంలో భాగంగా సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ మనిషా, జెడ్పీటీసీ అశోక్, మావల సర్పంచ్ రఘుపతి, తహసీల్దార్ వర్ణ, ఎంఈవో జయశీల, ఎంపీడీవో రవిందర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే కొత్త అండర్ బ్రిడ్జ్‌లు
జైనథ్ : గతంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్‌లతో గ్రామాల్లో ఏర్పడిన సమస్యల పరిష్కారానికే కొత్త అండర్ బ్రిడ్జ్‌లు నిర్మింస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆయన మండలంలో గిమ్మ, గూడ–సిర్సన్న గ్రామాల వద్ద నిర్మించనున్న రైల్వే కొత్త అండర్ బ్రిడ్జ్‌ల కోసం స్థల పరిశీలన చేశారు. అంతకు ముందు భోరజ్ గ్రామం వద్ద గతంలో నిర్మించిన అండర్ బ్రిడ్జ్‌ను రైల్వే అధికారులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భోరజ్ గ్రామస్తులు అండర్ బ్రిడ్జ్‌తో ఎదుర్కుంటున్న సమస్యలను మంత్రి ముందుంచారు. డివిజనల్ ఇంజనీర్ చక్రపాణి, నాయకులు తల్లెల చంద్రయ్య, సర్సన్ లింగా రెడ్డి, రోకండ్ల సురేష్ రావ్, పొద్దుటూరి కిష్టా రెడ్డి, తోట రమేష్, మద్దుల ఊషన్న, అయిండ్ల భగవాన్‌దాస్, కోల భోజన్న, గ్రామస్తులు ఉన్నారు.
ముగిసిన క్రికెట్ పోటీలు
మండలంలోని కోర్ట గ్రామంలో శివరాత్రి సందర్భంగా 20 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. మొత్తం 42 జట్లు పాల్గొనగా అర్లి(టీ) మొదటి స్థానం కైవసం చేసుకోగా కోర్ట టీం రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న ఇరు టీం సభ్యులకు బహుమతులను ప్రదానం చేశారు. జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మొదటి బహుమతిగా రూ.15వేలు, వైష్ణవి కన్‌స్ట్రక్షన్ వారు రెండవ బహుమతిగా రూ. 7వేలు అందించారు. నాయకులు మనోహర్, తల్లెల చంద్రయ్య, సర్సన్ లింగా రెడ్డి, బొల్లు అడెల్లు, మహేష్ భోజన్న ఉన్నారు.
నందీశ్వర ఆలయంలో మంత్రి పూజలు
బేల : మహాశివరాత్రిని పురస్కరించుకోని మండలంలోని బాది నందీశ్వర ఆలయంలో మంత్రి జోగు రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రావుత్ మనోహార్, ఎంపీపీ కుంట రఘుకుల్ రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల మాజీ అధ్యక్షుడు క్యాతం రాఘవులు, నాయకులు ఉన్నారు.