railway under bridge
-
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ టౌన్ : సర్కార్ బడుల్లో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం పట్టణంలోని సేవాదాస్ విద్యామందిర్ ఎయిడెడ్ పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల పథకంలో భాగంగా సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, మున్సిపల్ చైర్పర్సన్ మనిషా, జెడ్పీటీసీ అశోక్, మావల సర్పంచ్ రఘుపతి, తహసీల్దార్ వర్ణ, ఎంఈవో జయశీల, ఎంపీడీవో రవిందర్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే కొత్త అండర్ బ్రిడ్జ్‌లు జైనథ్ : గతంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్‌లతో గ్రామాల్లో ఏర్పడిన సమస్యల పరిష్కారానికే కొత్త అండర్ బ్రిడ్జ్‌లు నిర్మింస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆయన మండలంలో గిమ్మ, గూడ–సిర్సన్న గ్రామాల వద్ద నిర్మించనున్న రైల్వే కొత్త అండర్ బ్రిడ్జ్‌ల కోసం స్థల పరిశీలన చేశారు. అంతకు ముందు భోరజ్ గ్రామం వద్ద గతంలో నిర్మించిన అండర్ బ్రిడ్జ్‌ను రైల్వే అధికారులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భోరజ్ గ్రామస్తులు అండర్ బ్రిడ్జ్‌తో ఎదుర్కుంటున్న సమస్యలను మంత్రి ముందుంచారు. డివిజనల్ ఇంజనీర్ చక్రపాణి, నాయకులు తల్లెల చంద్రయ్య, సర్సన్ లింగా రెడ్డి, రోకండ్ల సురేష్ రావ్, పొద్దుటూరి కిష్టా రెడ్డి, తోట రమేష్, మద్దుల ఊషన్న, అయిండ్ల భగవాన్‌దాస్, కోల భోజన్న, గ్రామస్తులు ఉన్నారు. ముగిసిన క్రికెట్ పోటీలు మండలంలోని కోర్ట గ్రామంలో శివరాత్రి సందర్భంగా 20 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. మొత్తం 42 జట్లు పాల్గొనగా అర్లి(టీ) మొదటి స్థానం కైవసం చేసుకోగా కోర్ట టీం రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న ఇరు టీం సభ్యులకు బహుమతులను ప్రదానం చేశారు. జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మొదటి బహుమతిగా రూ.15వేలు, వైష్ణవి కన్స్ట్రక్షన్ వారు రెండవ బహుమతిగా రూ. 7వేలు అందించారు. నాయకులు మనోహర్, తల్లెల చంద్రయ్య, సర్సన్ లింగా రెడ్డి, బొల్లు అడెల్లు, మహేష్ భోజన్న ఉన్నారు. నందీశ్వర ఆలయంలో మంత్రి పూజలు బేల : మహాశివరాత్రిని పురస్కరించుకోని మండలంలోని బాది నందీశ్వర ఆలయంలో మంత్రి జోగు రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రావుత్ మనోహార్, ఎంపీపీ కుంట రఘుకుల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల మాజీ అధ్యక్షుడు క్యాతం రాఘవులు, నాయకులు ఉన్నారు. -
వర్షం కురిస్తే రాకపోకలు బంద్
జహీరాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జిలో నిలుస్తున్న వరద నిర్వహణ లోపంతో ప్రజల ఇబ్బందులు జహీరాబాద్: వర్షం కురిస్తే చాలు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు గగనమే. కిందికి పూర్తిగా వరద చేరడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి. జహీరాబాద్ ప్రజల సౌకర్యార్థం ఐదేళ్ల క్రితం భవానీ మందిర్ వెనుకవైపు రోడ్డుకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించారు. దీంతో వర్షం పడినప్పుడల్లా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిర్వహణ లోపం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్‌కు పడమర వైపు నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలోకి వర్షం నీరు వచ్చి చేరుతోంది. వర్షం పడితే వచ్చే వరద బయటకు పోయేందుకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో వర్షానికి బ్రిడ్జి కిందకు వచ్చి చేరే నీటిని ఎప్పటి కప్పుడు డీజిల్ ఇంజన్లతో తోడాల్సి వస్తోంది. భారీ వర్షం కురిస్తే చాలు వరద నీరు అధిక మొత్తంలో బ్రిడ్జి కిందకు వచ్చి చేరుతోంది. ఒక్కోసారి 24 గంటల పాటు రాకపోకలు నిలిచిన పోయిన సందర్భాలున్నాయి. బ్రిడ్జి కిందకు చేరే వర్షం నీటిని డీజిల్ ఇంజన్ల సాయంతో బయటకు తోడాల్సి ఉంటుంది. వర్షం పడితే అప్పటి కప్పుడు మున్సిపల్ సిబ్బంది డీజిల్ ఇంజన్లు తెచ్చి నీటిని తోడడం ఇబ్బందికరంగా మారింది. తప్పని దూర ప్రయాణం బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరి రాకపోకలు స్తంభించడంతో దూర ప్రయాణం చేయక తప్పడం లేదు. బాగారెడ్డిపల్లి, శాంతి నగర్, హమాలీ కాలనీ, డ్రైవర్స్ కాలనీలు రైల్వే స్టేషన్‌కు దక్షిణం వైపున ఉన్నాయి. ఉత్తరం వైపున ఉన్న రాచన్నపేట, సుభాష్‌గంజ్, హనుమాన్ వీధితో పాటు పలు కాలనీలు ఉన్నాయి. ఆయా కాలనీల మధ్య దూరం తక్కువే. రైల్వే స్టేషన్ మాత్రమే ఉంది. అండర్ బ్రిడ్జిలో వర్షం నీరు వచ్చి చేరితో రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద నుంచి రాక పోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో సుమారు కిలో మీటరు దూరం ప్రయాణం చేయాల్సిందే. ఇబ్బందులు పడుతున్నం రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు వచ్చి చేరుతున్నందున రాకపోకలు ఇబ్బందులు వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. – ఎన్.నిజాముద్దీన్ పటేల్, శాంతినగర్ కాలనీ కాలినడకన వెళ్తున్నాం వర్షపు నీరు రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచి పోతున్నాయి. మోటారు సైకిల్‌పై వెళ్లేందుకు అధిక ప్రయాణం చేయాల్సి వస్తున్నది. రైలు పట్టాలపై నుంచి కాలినడకన వెళుతున్నాం. – బి.సంగమేశ్వర్, బాగారెడ్డిపల్లి కాలనీ ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నాం రైల్వే బ్రిడ్జి కిందకు చేరుతున్న వర్షం నీటిని ఎప్పటికప్పుడు తోడేసేందుకు చర్యలు చేపడుతున్నాం. వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేనందున ఇంజన్ల ద్వారా తోడివేయిస్తున్నాం. అయినా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. – శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ ఏఈ -
ధాన్యం బస్తాలు సీజ్
తాడేపల్లి: అధిక లోడ్‌తో వెళుతున్న ఓ లారీ నుంచి ధాన్యం బస్తాలు కింద పడిపోగా... డ్రైవర్ వాటిని వదిలేసి వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి... ప్రజాపంపిణీకి ఉద్దేశించిన బియ్యం బస్తాలతో బుధవారం సాయంత్రం ఓ లారీ విజయవాడ నుంచి తాడేపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాములకు వెళుతోంది. తాడేపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు రాగా... లారీ పై భాగంలో అధికంగా వేసిన బస్తాలు బ్రిడ్జికి తగిలి కింద పడిపోయాయి. కానీ, డ్రైవర్ వాటిని వదిలేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న తాడేపల్లి మండల తహసీల్దారు వెంకటేశ్వర్లు రోడ్డుపై పడిపోయిన మొత్తం 25 బస్తాలను (ఒక్కోటీ 50 కేజీలు) సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.