పోస్ట్ లో మంత్రులకు చీరలు, గాజులు
Published Sat, Feb 13 2016 2:01 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలకు చీరలు, గాజు లను పోస్ట్ చేశారు. జిల్లా గిరిజన వర్సిటీ సాధన సమితి, అఖిలపక్షం, విద్యార్థి సంఘాలు శనివారం ఈ చర్యతో తమ నిరసన తెలిపాయి. జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన వర్సిటీ సాధన సమితి కన్వీనర్ రితేష్ రాథోడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, బీజేపీ నాయకులు నగేష్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement