
అభివృద్ధి కనిపించడం లేదా?: జోగు రామన్న
తెలంగాణలో మీకు అభివృద్ధి కనిపించడం లేదా అని అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రతిపక్షాలపై మండి పడ్డారు.
దేవరకొండ: తెలంగాణలో మీకు అభివృద్ధి కనిపించడం లేదా అని అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రతిపక్షాలపై మండి పడ్డారు. రెండున్న రేళ్లలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో నిరుపేదలు లబ్ధి పొం దుతున్నప్పటికీ ప్రతిపక్షాలు అదేపనిగా విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి అనం తరం విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని నివారించడానికి సీఎం కేసీఆర్ కంకణబద్ధులై, మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు అందించనున్నట్లు చెప్పారు.