బీసీల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అటవీ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఆయన ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలుతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జనాభా ప్రాతిపదికన అధిక సంఖ్యలో ఉన్న బీసీల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటామని, హరిత తెలంగాణకు కృషి చేస్తున్నామని అన్నారు.
బీసీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట: మంత్రి
Published Tue, Feb 23 2016 12:11 PM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM
Advertisement
Advertisement