ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సోమవారం తెలంగాణ మంత్రి జోగు రామన్న కలిశారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సోమవారం తెలంగాణ మంత్రి జోగు రామన్న కలిశారు. జోగు రామన్న ఈ సందర్భంగా తన కుమారుడు వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. కుమారుడి వివాహ పత్రికను చంద్రబాబుకు అందజేశారు. భేటీ అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ తన కొడుకు పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కలిసినట్లు చెప్పారు.