గత ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే వాతావరణం అనుకూలించక వీలు కాలేదు. ఈ ఏడాది వాతావరణంబాగా అనుకూలిస్తున్నందున, సీఎం నిర్ణయించిన తేదీన ‘ఒకేరోజు కోటి మొక్కలు’ నాటేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆటవీ మంత్రి జోగు రామన్న తెలిపారు.
శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల సమీక్షా సమావేశం, తెలంగాణకు హరితహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గతంలో 100 చెట్లు నాటితే నిర్వహణ కోసం చెట్టుకు రూ.5 ఇచ్చేవారమన్నారు. ఇప్పుడు 50 చెట్టు నాటితేనే చెట్టుకు రూ. 5 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొక్కలు ప్రాణవాయువును వదులుతాయన్నారు.
మానవులకే కాదు, జంతువులకు మొక్కల అవశ్యకత ఎక్కువేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో కూడా కళాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఒక్క సీఎం కేసీఆర్‌కే ఇది సాధ్యమైయ్యేలా చేశారన్నారు. దీన్ని 28 రాష్ట్రా ప్రభుత్వాలు అమలు చేయాలని ఆలోచిస్తున్నాయని చెప్పారు.
ఒకే రోజు కోటి మొక్కలు: జోగు రామన్న
Published Fri, Jun 10 2016 5:22 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement