హైదరాబాద్,న్యూస్‌లైన్: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావును రజత సింహాసనంపై కూర్చోబెట్టి యాక్టర్లు, డాక్టర్లు కలసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం రవీంద్రభారతి ప్రధాన వేదికపై శనివారం రాత్రి జరిగింది. రాజ సప్తస్వరం, టి.సుబ్బిరామిరెడ్డి లలితకళా పరిషత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని 90వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్లు, యాక్టర్లు పుష్పగుచ్ఛాలు, శాలువలతో అక్కినేని సత్కరించారు.
అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీనటి లకిష్మ మాత్రం తన వద్ద పుష్పగుచ్ఛాలు లేవంటూ, ‘ఐ లవ్‌యూ అక్కినేని’ అంటూ ఆలింగనం చేసుకోవడం కొసమెరుపు. సినీనటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం, మురళీమోహన్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు తదితరులతో పాటు పలువురు డాక్టర్లు, యాక్టర్లు పాల్గొన్నారు.