
ప్రజా సంక్షేమమే ధ్యేయం
⇒ రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
⇒ కామాయిలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం
జైనథ్(ఆదిలాబాద్): కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకుసాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని కామాయి గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. యావత్ భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.
పేదల కోసం ఆహార భద్రత, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు సన్నబియ్యం, ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి, డబుల్ బెడ్ రూం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ విద్య వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు ప్రతీ రైతు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేసామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ఖరీఫ్, రబీ సాగుల కోసం ఎకరానికి ఎరువుల ఖర్చుల కోసం రూ. 4వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్న ట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 1.08లక్షల ఉద్యోగ ఖాళీ లున్నాయని, ఇందులో వివిధ సుమారు 50వేల పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ సైతం ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారి కోసం ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. యువత స్వయం ఉపాధి వైపు కూడా ఆలోచన చేయాలని, సొంతంగా చిన్న చిన్న పరి శ్రమల స్థాపనకు ముందుకు వస్తే అవసరమైన అవకాశాలు కల్పిస్తామని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేవలం మూడేళ్లలో ఇన్ని కార్యక్రమాలు చేపడితే, కళ్లు లేని ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలతో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.
ఇకనైనా వి మర్శలు మాని, అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రజ లు కూడా విజ్ఞతతో ఆలోచించి, రానున్న ఎన్నికల్లో ప్రజల కోసం అహర్నిశలు పరితపిస్తున్న టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆది లాబాద్ ఏఎంసీ చైర్మన్ ఆరే రాజన్న, ఐటీడీఏ డైరెక్ఖర్ పెందూర్ దేవన్న, లక్ష్మీనారాయణ స్వామి ఆలయ చైర్మన్ సర్సన్ లింగారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య, జైనథ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎల్టి భూమారెడ్డి, గ్రామ సర్పంచ్ వైద్య శాలిని, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండ ల అధ్యక్షుడు కుంచెట్టి కేశవ్, ఎంపీటీసీల సంఘం మం డల గౌరవ అధ్యక్షుడుఊషన్న, గ్రామస్తులుపాల్గొన్నారు.