మంత్రి ఇచ్చిన హామీలు.. | Guarantees given by the Minister | Sakshi
Sakshi News home page

మంత్రి ఇచ్చిన హామీలు..

Published Sun, Nov 9 2014 3:29 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

Guarantees given by the Minister

 భగత్‌సింగ్ నగర్ కాలనీలో నివాసముంటున్న నిరుపేద కూలీలకు గతంలో ఇండ్ల పట్టాలు జారీ చేశారు. కానీ ఇండ్లకు ఇంటి నెంబర్లు లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇంటి నెంబర్లు వెంటనే వేయించేలా రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశాలు ఇస్తాం. పట్టాలు లేకుండా నివాసముంటున్న అర్హులైన నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయిస్తాం.

వెంటనే విద్యుత్ లైన్ నిర్మాణం ప్రారంభానికి కృషి చేస్తా. తాగునీటి సమస్య పరిష్కారానికి జూన్‌లో బోర్లు వేయిస్తాం. అర్హులైన నిరుపేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎంతటి వ్య యానికైనా సిద్ధంగా ఉంది. జిన్నింగ్, భవన ని ర్మాణ కార్మికుల సమస్యలను పరి ష్కరించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

 జోగు రామన్న : అమ్మా బాగున్నవా? నీ పేరేంది..?
 చంద్రకళ : బాగున్నాం.. నా పేరు చంద్రకళ సారూ..
 జోగు రామన్న : ఏంపని చేస్తావు.? ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నరు..?
 చంద్రకళ : కూలీ పనిచేస్తా సారు.. ఎనిమిదేళ్లుగా ఉంటున్నం.. మా ఇండ్లకు పట్టాల్లేవు పట్టాలిప్పించండి.
 జోగు రామన్న : ఇక్కడ ఉండేటోళ్లకు పట్టాలివ్వాలని గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులకు చెబుతా.
 జోగు రామన్న : బాబు.. నువ్వేం పనిచేస్తావు..?
 భరత్ : జిన్నింగ్ మిల్లులో పనిచేస్తా సార్.
 జోగు రామన్న : ఏ జిన్నింగ్‌లా..?
 భరత్ : మమత జిన్నింగ్‌ల పనికి పోత సార్. మిల్లు బంద్ ఉన్నప్పుడు కూలీ పనికిపోతా. తాపీమేస్త్రీ చేతికింద పనిచేస్తా. ఇప్పుడు మిల్లు నడుస్తంది పని దొరుకుతుంది. కానీ.. కూలీ తక్కువ వస్తుంది. కష్టమైతంది.
 జోగు రామన్న : రోజుకు ఎంత వస్తుంది.?
 భరత్ : రోజుకు రెండు వందల వస్తాయి.
 బాబూ : మా ఇండ్లకు కరెంట్ లేదు. రాత్రి బయటకు పోవాలంటే పరేషాన్ అయితోంది.
 జైనాభీ ఫాతిమా : ఘర్‌మే సాంప్ ఆరైసాబ్.. కరెంట్ నైతో అందేరేమే రహేరై.. బహుత్ తక్లిబ్ హోరై. (ఇండ్లలోకి పాములు వస్తున్నై, కరెంట్ లేక చీకట్లో బతుకుతున్నం.)
 బిస్మిల్ల : మచ్ఛర కాట్రై సాబ్. (దోమలు కుడుతున్నాయి) జరాలస్తున్నై.
 జోగు రామన్న : తొందరలోనే కరెంట్ పెట్టిపిస్తం.
 జోగు రామన్న : ఏం కాకా.. నీ పేరేంది..?
 జ్ఞానోభ : పింఛన్ వస్తలేదు. ఇప్పియ్యండి సార్. మొన్న దరఖాస్తు వెట్టిన. ఇయ్యాలని సార్లకు చెప్పుండ్రి.
 గంగమ్మ : కొడుకు, కోడలు కూలిపని చేస్తరు. నేను కూడా కూలికి పోతుంటి కానీ, మనుమండ్ల కోసం ఇంటి కాడ ఉంటున్న పింఛను వస్తలేదు.
   జోగు రామన్న : వెయ్యి రూపాయలకు పెంచిన పింఛన్లు ఇచ్చుడు షురు చేసినం. వృద్ధులందరికీ పింఛన్లు వస్తాయి. అధికారులకు చెబుతాం..
 జోగు రామన్న : బాబు మీ ఇల్లు ఏదీ?
 సయ్యద్ : అటు కిందికి ఉంటది.  సార్లు వస్తున్నరని తెలిసి ఇక్కడికి వచ్చిన. మేస్త్రీ పనికి పోయినప్పుడు కాలుకు దెబ్బ తాకి విరిగింది. పింఛను ఇప్పించండి.
 జోగు రామన్న : చెప్పాను కదా.. అర్హులైన వారందరికీ పింఛన్లు వస్తాయి. డాక్టర్ సర్టిఫికేట్ కోసం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నాకు ఫోన్ చేయూ.. డాక్టర్‌తో మాట్లాడి సర్టిఫికేట్ ఇప్పిస్తా.
 ఎల్లమ్మ : పింఛన్ ఇప్పియ్యు సారు...
 జోగు రామన్న : నీకు 65 ఏళ్లు ఉంటాయా అమ్మా..?
 ఎల్లమ్మ : కాదు.. సార్ నా భర్త సచ్చిపోయి నాలుగేళ్లవుతోంది.
 జోగు రామన్న : భర్త చనిపోయినట్లు సర్టిఫికేట్ తీసుకున్నావా? పింఛన్ కోసం మొన్న దరఖాస్తు చేసుకోలేదా.. మరి?
 ఎల్లమ్మ : అప్పుడు సార్లు ఇచ్చిన కాగితం కూడా నా దగ్గర ఉంది. అవిపెట్టి దరఖాస్తు చేసుకున్న. కానీ పింఛన్ రావడంలేదు. చనిపోయినట్లు కాగితం ఉంది.
 జోగు రామన్న : సర్పంచ్‌కు చెబుతా, పింఛన్ ఇప్పిచ్చేట్లు చూస్తా.
   జోగు రామన్న : నీ పేరేమిటి. నువ్వు ఏం చేస్తావు..?
 విఠల్ : విఠల్. నేను పదేళ్లసంది ఇక్కడనే ఉంటున్నా.. జిన్నింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న. మా కాలనీలో రోడ్లు లేవు. మస్తు పరేషాన్ అవుతున్నం. జర చూడండి సారు.
 పోసాని : బోరింగ్ నుంచి నీళ్లు తీసుకుని వస్తున్నప్పుడు రోడ్డు సరిగ్గా లేక కింద పడి దెబ్బలు తాకుతున్నై. ఒకరి కాలు విరిగింది.
 జోగు రామన్న : రోడ్డు పనులు చేపిస్తాము. ఇప్పడిదాక పని చేయాలని వేరోల్ల వద్దకు పోతుంటిమి. తెలంగాణ వచ్చింది కదా. ఒక్కొక్కటిగా సమస్యలన్నీ మనమే పరిష్కరించుకుందాం.
 విష్ణు : సారు మా వాడలో తాగేందుకు సరిగ్గా నీరు దొరుకుతలేదు. ఇక్కడ అందరు మజూరి చేసి బతుకుతున్నరు. పనులకు వెళ్లకుండా బిందెలు పట్టుకొని బోరింగుల దగ్గర ఉంటున్నం. దేర్‌సె కామ్‌పె గయేతో కామ్ నహి మిల్హ్రాహై.
 జోగు రామన్న : ఇప్పుడు బోర్లు వేస్తే నీళ్లు సరిగ్గా పడవు. రెండు నెలల్లో బోర్లు వేయిస్తాం.
 మంచిదమ్మా.. వెళ్లొస్తా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement