- అమలు కోసం అధికారుల సన్నాహాలు
- నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి జోగు రామన్న
‘మేడారం హరితవనం’ సత్ఫలితాలిచ్చేనా ?
Published Wed, Jul 20 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
ఎస్‌ఎస్‌తాడ్వాయి : హరితహారం పథకం కింద వనదేతలు కొలువు దీరిన మేడారాన్ని హరితవనంలా తిర్చిద్దిద్దాలనే సంకల్పంతో అధికార యంత్రం సిద్ధమైంది. గతలో మేడా రం చుట్టూ పక్కల నాలుగు వైపులా సమరుగా 3 కిలోమీటర్ల మేరకు కంకవనం ఉం డేది. పలు రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్య లో రావడంతో అసియాఖండంలోనే అతిపెద్ద జాతరగా పెరొందింది. 1996లో జాతరను గత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో అప్పటి నుంచి వనదేవతలకు ఆదరణ పెరుగుతోంది. వేల మందితో మొదలైన భక్తుల రాక కొటి మంది భక్తులకు చేరింది.
కంక కర్రలతో గుడారాలు ఏర్పాటు
రెండేళ్లకోసారి జరిగే జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు మేడారం అటవీ ప్రాంతంలో ఉన్న కంకవనాలను నరికి గుడారాలు ఏర్పా టు చేసుకుంటారు. భక్తులు కంకవనాలను విచ్చలవిడిగా నరకడంతో ప్రస్తుత పరిస్దితుల్లో కంకవనాలు కనుమరుగైపోయాయి. మేడా రం అటవీ ప్రాంతం సమారుగా 2వేల హె క్టార్లు ఉండేది. ఇందులో వెయ్యి హెక్టార్ల మేర కు కంకవనం విస్తరించి ఉండేదని ఆ గ్రామ గిరిజనులు చెబుతున్నారు. ఈ ప్రదేశంలో హరితహారంలో భాగంగా కంకచెట్లు నాటితే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు.
చెట్లే భక్తులకు విడిది
మేడారం వచ్చిన భక్తులు చెట్ల కిందనే వంటావార్పు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. జాతర సమయంలోనే కాకుండా మిగతా రో జుల్లో కూడా మేడారం వచ్చే భక్తులు చెట్ల కిం ద విడిది చేస్తారు. గత ఏడాది హరితహారంలో భాగంగా సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో మేడారం రోడ్ల వెంట మొక్కలు నాటారు. వేసవి కాలంలో వాటి సంరక్షణను పట్టించుకోకపోవడంతో ఎండల తీవ్రతకు నాటి మొ క్కల్లో సగానికిపైగా మొక్కలు ఎండిపోయా యి. సమ్మక్క తల్లి చిలకల గుట్టకు రక్షణ కవచం కోసం గుట్ట చుట్టూ 3 వేల మీటర్ల వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా మూడేళ్ల క్రితం ప్రభుత్వం రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో 1500 మీటర్ల వరకు గుట్ట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కానీ మిగిలిన 1500 మీట ర్లు ఫెన్సింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని పూజారులు ఫిబ్రవరిలో జరిగిన జాతర సందర్భంగా ప్రభుత్వ పాలకుల దృష్టి కి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం మేడారంలో అటవీశాఖ మంత్రి జోగురామన్న పర్యటించనున్న నేపథ్యంలో అంతరించిపోయిన అడవిని పూర్వవైభవం తీసుకువచ్చేలా మేడారాన్ని హరితవనంలా తీర్చిద్దిదేలా చూడాల్సిన ఉంది.
Advertisement