Madaram
-
ఐటీ హాబ్‌గా మేడ్చల్ జిల్లా!
హైదరాబాద్ నగర శివారుల్లో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త పరిశ్రమలతో వందలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, వేలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించటమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. హైదరాబాద్– వరంగల్ పారిశ్రామిక కారిడార్‌తోపాటు హైదరాబాద్ (Hydearabad) మహానగరం నలువైపులా పారిశ్రామిక పార్కుల విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాటు ఐటీ శాఖ మంత్రి కావటంతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప్పల్ జెన్ ప్యాక్ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు, నగరానికి ఉత్తరాన కండ్లకోయలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిని వేగవంతం చేయటంతోపాటు నగరానికి తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్ మండలం మాదారంలో ఇండ్రస్టియల్ పార్కు (Madaram Industrial Park) స్థాపనకు కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇదే మండలంలోని పోచారంలో దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఇన్ఫోసిస్‌ను మరో రూ.750 కోట్ల పెట్టుబడులతో మరింత విస్తరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫోసిస్ (Infosys) విస్తరణపై ఇటీవల వారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పోచారంలో ఇన్ఫోసిస్ వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పింస్తోంది. మరింత విస్తరింపజేయటం ద్వారా త్వరలో కొత్తగా వందలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. నరానికి తూర్పు వైపు ఐటీ విస్తరణలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో... పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించటంతోపాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వే సౌకర్యం, నీటి సరఫరా, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కొండలు, గుట్టలు, అటవీ భూములు కాకుండా ఇతర భూములను ఎంపిక చేయాలని సూచించింది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ భూములను కూడా గుర్తించాలని, వాటి బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ ధరలను తెలపాలని పేర్కొంది.చదవండి: హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ మరో జీడీసీస్థానికంగా ఉన్న వనరుల వివరాలతోపాటు ఏఏ పరిశ్రమలకు భూములు, ప్రాంతాలు అనువుగా ఉంటాయన్న విషయాలతో అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. భూములను గుర్తించిన తర్వాత ఆయా ప్రాంత చిత్రాలు (లొకేషన్ మ్యాప్‌లు) తయారు చేసి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)కి పంపించాలని నిర్దేశించటంతో అందుకు అనుగుణంగా కార్యాచరణకు వ్యూహా రచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూముల సమగ్ర సర్వేలో రెవెన్యూ యంత్రాంగం తలములకలైనట్లు తెలుస్తోంది. సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని మేడ్చల్ జిల్లా (Medchal District) పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మేడ్చల్ జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంటే.. తొమ్మిది నెలల కాలంలో రూ.380 కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక వేత్తలు 130 కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లాలో కొత్తగా 783 భారీ, సూక్ష్య, మధ్యతరహా పరిశ్రమలను రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లాలో మరో 46,356 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు.చదవండి: షంషేర్.. చార్మినార్..కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లా ఐటీ హాబ్‌గా మారనుంది. ప్రస్తుతమున్న పరిశ్రమలకు తోడుగా మేడ్చల్‌లో హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ, ఘట్కేసర్లో ఐటీ అండ్ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, గుండ్ల పోచారంలో ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ రానున్నాయి. మేడ్చల్ జిల్లా ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని పోచారం, ఘట్కేసర్, ఉప్పల్, శామీర్‌పేట, మేడ్చల్, కీసర, బోడుప్పల్, చెంగిచర్ల తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం భూసేకరణకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. -
మేడారం బయల్దేరిన పగిడిద్దరాజు
గుండాల: వన దేవత సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామం అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు సోమవారం మేడారం బయల్దేరాడు. గుండాల మండలంలోని యాపలగడ్డలో సోమవారం పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగలకు( జెండాలకు), శివసత్తులకు, ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజును గద్దెల వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు, హిజ్రాలు నృత్యాలు చేశారు. పడగలను, నగలు, గజ్జెలు ధరంచిన వడ్డెలు ఊరేగింపుతో కాలిడనకన మేడారం బయల్దేరారు. ఆదివాసీ నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించుకుంటూ తీసుకెళ్లారు. మేడారం వెళ్లే భక్తులు సైతం యాపలగడ్డ వద్ద పగిడిద్దరాజును దర్శించుకుని వెళ్లారు. కాగా బుధవారం పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలకు వద్దకు చేర్చుతామని, దీంతో సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభమవుతుందని అర్రెం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెలు, పూజారులు అర్రెం అప్పయ్య, బుచ్చయ్య, లక్ష్మినర్సు, చిన్న కాంతారావు, సత్యం, జోగయ్య, ఇద్దయ్య, పెద్ద కాంతారావు, నాగేశ్వరావు, సమ్మయ్య, ముత్తయ్య, భిక్షం రమేష్, నాగేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘మేడారం హరితవనం’ సత్ఫలితాలిచ్చేనా ?
అమలు కోసం అధికారుల సన్నాహాలు నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి జోగు రామన్న ఎస్‌ఎస్‌తాడ్వాయి : హరితహారం పథకం కింద వనదేతలు కొలువు దీరిన మేడారాన్ని హరితవనంలా తిర్చిద్దిద్దాలనే సంకల్పంతో అధికార యంత్రం సిద్ధమైంది. గతలో మేడా రం చుట్టూ పక్కల నాలుగు వైపులా సమరుగా 3 కిలోమీటర్ల మేరకు కంకవనం ఉం డేది. పలు రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్య లో రావడంతో అసియాఖండంలోనే అతిపెద్ద జాతరగా పెరొందింది. 1996లో జాతరను గత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో అప్పటి నుంచి వనదేవతలకు ఆదరణ పెరుగుతోంది. వేల మందితో మొదలైన భక్తుల రాక కొటి మంది భక్తులకు చేరింది. కంక కర్రలతో గుడారాలు ఏర్పాటు రెండేళ్లకోసారి జరిగే జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు మేడారం అటవీ ప్రాంతంలో ఉన్న కంకవనాలను నరికి గుడారాలు ఏర్పా టు చేసుకుంటారు. భక్తులు కంకవనాలను విచ్చలవిడిగా నరకడంతో ప్రస్తుత పరిస్దితుల్లో కంకవనాలు కనుమరుగైపోయాయి. మేడా రం అటవీ ప్రాంతం సమారుగా 2వేల హె క్టార్లు ఉండేది. ఇందులో వెయ్యి హెక్టార్ల మేర కు కంకవనం విస్తరించి ఉండేదని ఆ గ్రామ గిరిజనులు చెబుతున్నారు. ఈ ప్రదేశంలో హరితహారంలో భాగంగా కంకచెట్లు నాటితే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు. చెట్లే భక్తులకు విడిది మేడారం వచ్చిన భక్తులు చెట్ల కిందనే వంటావార్పు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. జాతర సమయంలోనే కాకుండా మిగతా రో జుల్లో కూడా మేడారం వచ్చే భక్తులు చెట్ల కిం ద విడిది చేస్తారు. గత ఏడాది హరితహారంలో భాగంగా సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో మేడారం రోడ్ల వెంట మొక్కలు నాటారు. వేసవి కాలంలో వాటి సంరక్షణను పట్టించుకోకపోవడంతో ఎండల తీవ్రతకు నాటి మొ క్కల్లో సగానికిపైగా మొక్కలు ఎండిపోయా యి. సమ్మక్క తల్లి చిలకల గుట్టకు రక్షణ కవచం కోసం గుట్ట చుట్టూ 3 వేల మీటర్ల వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా మూడేళ్ల క్రితం ప్రభుత్వం రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో 1500 మీటర్ల వరకు గుట్ట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కానీ మిగిలిన 1500 మీట ర్లు ఫెన్సింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని పూజారులు ఫిబ్రవరిలో జరిగిన జాతర సందర్భంగా ప్రభుత్వ పాలకుల దృష్టి కి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం మేడారంలో అటవీశాఖ మంత్రి జోగురామన్న పర్యటించనున్న నేపథ్యంలో అంతరించిపోయిన అడవిని పూర్వవైభవం తీసుకువచ్చేలా మేడారాన్ని హరితవనంలా తీర్చిద్దిదేలా చూడాల్సిన ఉంది. -
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే
మాదారం (బీబీనగర్) : మండలంలోని మాదారం గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన సందెల కుమార్, ముత్యాల అనిల్ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాదారం గ్రామంలోని మృతుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా ట్రాన్స్‌కో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గొల్లగూడెం, నీలంబావిలో జరుగుతున్న సీసీరోడ్ల పనులను పరిశీ లించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్, బొక్క జైపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, ప్రధాన కార్యదర్శి పంజాల సత్తీష్గౌడ్, సర్పంచ్‌లు ఒగ్గు పాండు, శ్రీరాం పద్మజంగయ్య, జిట్ట అలివేలమల్లారెడ్డి పాల్గొన్నారు. -
అమ్మా.. ఏ నేరం చేయలేదు: కేసీఆర్
న్యాయమూర్తికి విన్నవించిన కేసీఆర్ వరంగల్, న్యూస్‌లైన్: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వ్యాఖ్య లు చేయలేదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కోర్టుకు విన్నవించారు. 2012 మే 20న పరకాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఆత్మకూరు సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలతో కేసీఆర్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు విచారణ నిమిత్తం ఆయన సోమవారం ఉదయం కోర్టు హాలులో ప్రవేశిం చారు. మీపై ఉన్న అభియోగాలు ఒప్పుకుంటున్నారా..? అని న్యాయమూర్తి శ్రీదేవి ప్రశ్నించగా.. ‘అమ్మా.. అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎలాంటి నేరం చేయలేదు’ అని విన్నవించుకున్నారు. కాగా, న్యాయ మూర్తి తదుపరి విచారణ జూన్9కి వాయిదా వేశారు.