అమ్మా.. ఏ నేరం చేయలేదు: కేసీఆర్
-
న్యాయమూర్తికి విన్నవించిన కేసీఆర్
వరంగల్, న్యూస్‌లైన్: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వ్యాఖ్య లు చేయలేదని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కోర్టుకు విన్నవించారు. 2012 మే 20న పరకాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఆత్మకూరు సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలతో కేసీఆర్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు విచారణ నిమిత్తం ఆయన సోమవారం ఉదయం కోర్టు హాలులో ప్రవేశిం చారు. మీపై ఉన్న అభియోగాలు ఒప్పుకుంటున్నారా..? అని న్యాయమూర్తి శ్రీదేవి ప్రశ్నించగా.. ‘అమ్మా.. అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎలాంటి నేరం చేయలేదు’ అని విన్నవించుకున్నారు. కాగా, న్యాయ మూర్తి తదుపరి విచారణ జూన్9కి వాయిదా వేశారు.