Contraversial Statements
-
రాష్ట్రపతి పై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఫైర్
-
పెళ్లి చేసుకోమని చెప్పలేదు: ఎస్ఏ బాబ్డే
న్యూఢిల్లీ: ‘‘మహిళలు అంటే మాకు చాలా గౌరవం.. వారిని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు’’ అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే. గతవారం ఓ అత్యాచార నిందితుడి బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా కోర్టు.. ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.. లేక జైలుకెళ్తావా’’ అని నిందితుడిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ఈ క్రమంలో అనేక మంది మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రముఖ పౌరులు, మేధావులు, రచయితలు, కళాకారులు చీఫ్ జస్టిస్ బొబ్డేకు క్షమాపణ చెప్పాలని.. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆయన ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి వైదొలగాలని కోరుతూ 5,000 మందికి పైగా ప్రజలు పిటిషన్లో సంతకం చేశారు. ఈ క్రమంలో వీటిపై ఎస్ ఏ బాబ్డే స్పందించారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా మేం నిందితుడిని ‘‘నీవు పెళ్లి చేసుకోబోతున్నావా’’ అని మాత్రమే ప్రశ్నించాము. అంతేతప్ప ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకో.. లేదంటే జైలుకెళ్తావ్’’ అని చెప్పలేదు. అలా ఎన్నిటికి చెప్పం. కోర్టు వ్యాఖ్యలని వక్రీకరించారు. ఈ సంస్థ, ముఖ్యంగా ఈ బెంచ్, స్త్రీత్వం పట్ల అత్యధిక గౌరవం కలిగి ఉంది’’ అని తెలిపారు. చదవండి: పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా?: సుప్రీంకోర్టు వాళ్లిద్దరి మధ్య శృంగారాన్ని రేప్ అంటారా: సుప్రీం -
ట్వీట్ ఎఫెక్ట్ : ట్రాన్స్ఫర్, షోకాజ్ నోటీసులు
ముంబై : మహాత్మా గాంధీపై ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కి జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న నిధి చౌదరిని నీటి సరఫరా, పారిశుద్య శాఖ డిప్యూటి సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇవ్వాల్సిందగా ఆదేశించడమే కాక షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ పదిహేను రోజుల కిందట ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ‘మన కరెన్సీపై గాంధీ ముఖాన్ని తొలగించడం, ప్రపంచవ్యాప్తంగా ఆయన విగ్రహాలను రూపుమాపడం, ఆయన పేరిట నెలకొల్పిన సంస్ధలు, రహదారుల పేర్లు మార్చడం ఇప్పుడు తక్షణం మనం చేయాల్సిన పని.. ఇదే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి.. థ్యాంక్యూ గాడ్సే’ అంటూ ఆమె చేసిన ట్వీట్ కలకలం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో ట్వీట్‌ను ఆమె తొలగించారు. నిధి చౌదరిని ప్రభుత్వ సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘ఆ ట్వీట్‌పై రాద్ధాంతం అవసరమా’) -
భారత సైన్యం ‘మోదీ సేన’..!
ఘజియాబాద్/హౌరా: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేశ సైనిక బలగాలను ఆయన ప్రధాని మోదీ సైన్యంగా పేర్కొనడంపై విపక్షాలు మండిపడ్డాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఘజియాబాద్‌లో కేంద్ర మంత్రి వీకే సింగ్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించారు. ఉగ్రనేత మసూద్ అజార్‌ను జీ(గారు) అంటూ ప్రోత్సహిస్తున్నారు. కానీ, మోదీ సైన్యం (దేశ సైనిక బలగాలు) వారికి బుల్లెట్లు, బాంబులతో బదులిచ్చింది. ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి ముష్కరులతోపాటు పాక్ వెన్ను విరిచింది. కాంగ్రెస్ అసాధ్యమనుకున్నదాన్ని బీజేపీ సాధ్యం చేసి చూపింది. మోదీ ఉంటే అసాధ్యమైంది ప్రతిదీ సాధ్యమే’ అని అన్నారు. భద్రతా బలగాలకు అవమానం: మమతా యోగి తన వ్యాఖ్యలతో భద్రతా బలగాలను అవమానించారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ‘యూపీ సీఎం వ్యాఖ్యలపై షాక్‌కు గురయ్యా. మన సైన్యాన్ని ఏ ఒక్క వ్యక్తికో సొంత అన్నట్లుగా మాట్లాడటం తీవ్ర అవమానకరం. సైన్యం ఏ ఒక్కరిదో కాదు, ప్రజలందరి సొత్తు. యూపీ సీఎం వ్యాఖ్యలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలి’ అని పిలుపునిచ్చారు. ‘యోగి వ్యాఖ్యలు సైన్యాన్ని అవమానించినట్లే. భారత సైన్యం ప్రచార మంత్రి(ప్రధాని) సైన్యం కాదు. యోగి క్షమాపణ చెప్పి తీరాలి’ కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ‘సైనిక బలగాలు ఏ ఒక్కరి ప్రైవేట్ సైన్యం కాదనే ప్రాథమిక అంశాన్ని రాజకీయ నేతలు తెల్సుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకే సైన్యం పనిచేస్తుంది తప్ప, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాదు’ అని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి అన్నారు. యోగిపై ఈసీ చర్య తీసుకోవాలి: సీపీఐ భద్రతా బలగాలను మోదీ సైన్యం అంటూ యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే యోగి అలా మాట్లాడారంది. ‘ప్రజల్లో అభద్రతాభావం పెంచి, వారిని ప్రభావితం చేసేందుకే యోగి అలా మాట్లాడారు. రైతుల సమస్యలను మర్చిపోయిన బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించింది ఏమీ లేదు. అందుకే రాజకీయ ప్రయోజనం పొందేందుకు సైన్యాన్ని వాడుకోవాలని చూస్తోంది’ అని సీపీఐ నేత డి.రాజా పేర్కొన్నారు. నివేదిక కోరిన ఈసీ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఈసీ ఆదేశించింది. ఈ నివేదికను యూపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి సమర్పించాలని కోరింది. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారం సమయంలో సైన్యం ప్రస్తావన తేవడం, భద్రతా బలగాల ఫొటోలను వాడుకోవడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీ మార్చి 17వ తేదీన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
అమ్మా.. ఏ నేరం చేయలేదు: కేసీఆర్
న్యాయమూర్తికి విన్నవించిన కేసీఆర్ వరంగల్, న్యూస్‌లైన్: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వ్యాఖ్య లు చేయలేదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కోర్టుకు విన్నవించారు. 2012 మే 20న పరకాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఆత్మకూరు సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలతో కేసీఆర్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు విచారణ నిమిత్తం ఆయన సోమవారం ఉదయం కోర్టు హాలులో ప్రవేశిం చారు. మీపై ఉన్న అభియోగాలు ఒప్పుకుంటున్నారా..? అని న్యాయమూర్తి శ్రీదేవి ప్రశ్నించగా.. ‘అమ్మా.. అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎలాంటి నేరం చేయలేదు’ అని విన్నవించుకున్నారు. కాగా, న్యాయ మూర్తి తదుపరి విచారణ జూన్9కి వాయిదా వేశారు.