జిల్లాలో 2.30 కోట్ల మొక్కలు నాటాలి | 2.30 crore plants Planting in distic | Sakshi
Sakshi News home page

జిల్లాలో 2.30 కోట్ల మొక్కలు నాటాలి

Published Sun, Jun 12 2016 1:46 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

జిల్లాలో 2.30 కోట్ల మొక్కలు నాటాలి - Sakshi

జిల్లాలో 2.30 కోట్ల మొక్కలు నాటాలి

రాష్ర్ట అటవీశాఖ మంత్రి జోగు రామన్న
హరితహారంపై వికారాబాద్‌లో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం
హాజరైన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు

 వికారాబాద్/వికారాబాద్ రూరల్:  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మహాయజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాలని అటవీశాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. హరితహా రంపై శనివారం వికారాబాద్‌లోని అనంగతిరి హరిత రిసార్‌‌ట్సలో నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో రాష్ర్ట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అంతరక్షణ కమిటీలు ఏర్పా టు చేసి గ్రామానికి 40వేల చొప్పున, నియోజకవర్గానికి 40లక్షలు.. జిల్లా వ్యాప్తంగా 2.30 కోట్ల మొక్కలను నాటాలన్నారు.

గత ఏడాది రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామని, వర్షాభావం వల్ల 15 కోట్ల మొక్కలు మాత్రమే నాటగలిగామన్నారు. ఈసారి వర్షాలు బాగా ఉన్నందున లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకుని కిందిస్థాయి అధికారులు, సిబ్బం దిని సమన్వయం చేసుకుంటూ విరివిగా మొక్కలు నాటించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు.  సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని మంత్రి  రామన్న అన్నారు.

 విద్యార్థులకు బాధ్యతలు అప్పగించాలి
ప్రతి పాఠశాలలో 50 చొప్పున మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత విద్యార్థులకు అప్పగించాలిని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. అందరం కష్టపడితే జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చునని చెప్పారు. ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ హరితహారం ఎంతో మంచి కార్యక్రమాని పేర్కొన్నారు. కానీ, ఏ ప్రదేశాల్లో ఏ మొక్కలు నాటాలి, ఎలాంటి మొక్కలు నాటితే ప్రజలకు లబ్ధి చేకూరుతుందనే విషయమై జిల్లాస్థాయి అధికారులు చర్చించుకోవాలని సూచించారు. అంతకు ముందు మంత్రులు ఫారెస్ట్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన నూతన కాటేజ్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ డిప్యూటీ స్పీకర్ హరిశ్వర్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ శ్రుతిఓజా, అటవీశాఖ చీఫ్ ఆఫీసర్ శ్రీవాస్తవా, అట వీశా ఖ అధికారి శోభ, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరుల పాల్గొన్నారు.

 అధికారుల తీరుపై ఆగ్రహం
జిల్లాస్థాయి సమీక్ష సమావేశానికి జిల్లాస్థాయి అధికారులు హాజరు కాకపోవడం పట్ల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ రాలేని పరిస్థితుల్లో ఉంటే జాయింట్ కలెక్టరైనా రావాలని కాదా అంటూ ప్రశ్నించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ ఎస్‌ఈలు, ఈఈలు, డీపీఓ సైతం హాజరు కాక పోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారాన్ని అశ్రద్ధ చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.

డీఎఫ్‌ఓ, రేంజర్‌లకు మంత్రుల క్లాస్
పరిగి : ఏం తమాషాగా ఉందా...ఎవరు నువ్వు మాట్లాడేది... నువ్వు డీఎఫ్‌ఓనా.. నేను ఇంకెవరో తహసీల్దార్ అనుకుంటు న్నా.. ఇప్పటి వరకు ఒక్కసారైనా కనిపించావా.. మాకే కనిపించకుంటే ఇక ప్రజలకెలా కనిపిస్తారు...అంటూ మంత్రి మహేందర్‌రెడ్డి డీఎఫ్‌ఓ నాగభూషణంపై మండిపడగా దాన్ని కొనసాగింపుగా మంత్రి జోగురామన్న రేంజర్ కవిత పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ హరిత రక్షణ కమిటీలు వేశారా... అంటూ మంత్రి రామన్న రంగాపూర్ గ్రామస్తులను ప్రశ్నించగా అవేంటో తమకు తెలియదన్నారు. ఇంతలో సోషల్ ఫారెస్టు రేంజర్ కవిత కల్పించుకుంటూ ఇంకా వేయలేదు.. త్వరలో వేస్తామంటూ సమాధానం చెప్పారు. దీంతో ఇద్దరు మంత్రులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఇంకా కమిటీలు కూడా వేయకుంటే మొక్కలు నాటే కార్యక్రమంలో సామాజిక భాగస్వామ్యం ఎలా ఉంటుందని మండిపడ్డారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా అధికారులు, యంత్రాంగం కలిసినా కార్యక్రమం సక్సెస్ కాదని పేర్కొన్నారు.

 మీరు నాటరు..మమ్మల్ని నాటనివ్వరా..?
బసిరెడ్డిపల్లి సమీపంలో 90 ఎకరాల వరకు ఫారెస్టు భూములు ఉన్నాయని, అందులో తాము మొక్కలు నాటుతామంటే ఫారెస్టు అధికారులు నాటనివ్వడంలేదని రంగాపూర్, బసిరెడ్డిపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. ఉపాధి హామీలో భాగంగా ఫారెస్టు భూముల్లో మొక్కలు నాటుతామని, దీంతో తమకు ఉపాధి లభిస్తుందని వారు మంత్రులకు వివరించారు. తమకు అవకాశం ఇవ్వాలని వారు మంత్రులకు వినతి పత్రం సమర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement