గుడుంబా బాధితులకు రూ.72.60 కోట్లు | Rs 72.60 crore for Gudumba victims | Sakshi
Sakshi News home page

గుడుంబా బాధితులకు రూ.72.60 కోట్లు

Published Sat, Jun 24 2017 1:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

Rs 72.60 crore for Gudumba victims

మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్‌: గుడుంబా బాధితుల పునరావాసానికి సీఎం కేసీఆర్‌ రూ.72.60 కోట్లు మంజూరు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం సచివాలయంలో శాఖాపరౖ  అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించా రు. 3,600 గుడుంబా బాధిత కుటుంబాల కు అబ్కారీ శాఖ పర్యవేక్షణలో కలెక్టర్లు ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం అందజేస్తారని మంత్రి తెలిపారు.

విదేశాల్లో ఉన్నత చదువుల నిమిత్తం బీసీ విద్యార్థులకు రూ.17కోట్లు విడుదల చేశా మన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే గురు కుల పాఠశాలల నిర్వహణకు మరో విడ తగా రూ.30కోట్లు విడుదల చేస్తామన్నా రు. వచ్చే నెల 15కల్లా బీసీ గురుకుల పాఠ శాలలతోపాటు వసతిగృహాల్లోని విద్యార్థు లకు యూనిఫారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement