అడవిలో దారితప్పిన అటవీశాఖ మంత్రి!
నర్సాపూర్ రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీశాఖ మంత్రి జోగు రామన్న తదితరులు అడవిలో దారితప్పారు. నర్సాపూర్– హైదరాబాద్ రహదారిలో పందివాగు నుంచి మొక్కలు నాటే స్థలం వరకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ అటవీ ప్రాంతానికి మంత్రి జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణీ మురళీధర్‌యాదవ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ భారతీహోలికేరి కాలినడకన చేరుకున్నారు.
మొక్కలు నాటాక.. నాలుగు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పరుపు బండ వద్ద భోజ నాల కోసం కాలినడకనే బయలుదేరారు. మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఇత రులు కలసి ముచ్చటించుకుంటూ వస్తుండగా దారి తప్పి మరో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లారు. ఇది గమనించిన పోలీసులు వారిని తిరిగి భోజనాల స్థలం వద్దకు క్షేమంగా తీసుకొచ్చారు.