
సాక్షి, హైదరాబాద్: బీసీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోం దని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. మెజీషియన్ కోర్సు పూర్తి చేసుకున్న 25 మంది విద్యార్థులకు సచివాలయంలోని డీ బ్లాక్‌లో కిట్లు, సర్టిఫికెట్లను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తు న్నారని, త్వరలో సరికొత్త ప్రణాళికను తీసుకురానున్నట్లు చెప్పారు.
కులవృత్తుల ఆదరణకు ప్రభుత్వం సరికొత్త ప్యాకేజీలు ఇవ్వబోతోందన్నారు. బీసీ యువతను ప్రోత్సహించేందుకు పలురకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. దీనిలో భాగంగా 25 మంది బీసీ విద్యార్థులు మెజీషియన్ కోర్సు పూర్తి చేశారన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. విపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయని, వారి మాటల్ని ప్రజలు నమ్మబోరన్నారు. కార్యక్రమంలో బీసీ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment