4 వేల ఏళ్ల నాటి ఎద్దు చిత్రం  | 4000 year old bull image | Sakshi
Sakshi News home page

4 వేల ఏళ్ల నాటి ఎద్దు చిత్రం 

Published Mon, Aug 21 2023 1:45 AM | Last Updated on Mon, Aug 21 2023 9:55 AM

4000 year old bull image - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అడ్డాకుల: దాదాపు నాలుగు వందల అడుగుల ఎత్తులోని ఓ గుట్ట చిటారు గుండుపై రాయితో చెక్కిన ఎద్దు బొమ్మ ఇది. 4 వేల ఏళ్ల క్రితంనాటి చిత్రమిది. మహబూబ్‌నగర్‌కు చేరువలో ఉన్న మూసాపేట శివారులోని రామస్వామి గుట్టపైనున్న ఈ బొమ్మను ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు.

స్థానిక రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసే పనిలో భాగంగా ఆదివారం ఆయన స్థానికులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న 400 అడుగుల ఎత్తున్న గుట్ట పైభాగానికి చేరుకోగా, అక్కడున్న గుండుపై ఈ చిత్రం కనిపించింది. 10 సెం.మీ. పొడవు, 8 సెం.మీ.ఎత్తుతో ఉన్న ఈ బొమ్మ దిగువన మరికొన్ని జంతువులు, మనుషుల చిత్రాలు కూడా ఉన్నాయి.

వాతావరణ ప్రభావానికి గురై అవి కొంతమేర మసకబారిపోయాయని ఆయన తెలిపారు. గుట్టపై నాటి మానవుల్లో ఓ సమూహం నివాసంగా ఉండి ఉంటుందని, ఆ క్రమంలోనే నిత్యం కలిసి ఉండే పశువులను చూసి ఈ చిత్రాలు చిత్రించి ఉంటారని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement