సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభ అనర్హత వేటు పడిన నేపథ్యంలో అనుహ్యంగా విపక్షాలన్నీ ఏకమై నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్‌పై వాగ్దాడిని పెంచింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై విరుచుకపడ్డారు. రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే అది అంత ఈజీ కాదని, ఎందుకంటే మోదీ బలం భారతదేశ ప్రజలేనని నొక్కి చెప్పారు.
ఆయన 2019లో ఒక పత్రిక ఇంటర్యూలో మోదీకి బలం తన ఇమేజేనని దాన్ని దెబ్బతీస్తానని చెప్పారన్నారు. దీంతో రాహుల్‌లో దాగి ఉన్న పొలిటకల్ సైకో బహిర్గతమైందని విమర్శించారు. అలాగే మోదీని పార్లమెంట్‌లో దుర్భాషలాడి, నిందించాడే తప్ప తన ధోరణి సరైనదేనా అని ఒక్కసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోలేపోయడన్నారు. తను అనుకున్నది జరగకపోవడంతో రాజకీయంగా నిరాశ చెంది ఇలా మోదీపై విరుచకుపడుతున్నారని అన్నారు.
అలాగే మంత్రి స్మృతి ఇరానీ.. రాహుల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలి శిక్ష పడటం గురించి ప్రస్తావిస్తూ.. మన దేశంలోని ఓబీసీ వర్గాన్ని క్షమించమని చెప్పే ఔదార్యాన్ని పెంపొందించు కోలేకపోయారన్నారు. ఇది గాంధీ కుటుంబాల దురహంకారానికి నిలువెత్తు నిదర్శంన అని మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.
Comments
Please login to add a commentAdd a comment