మోదీపై రాహుల్ సెటైర్.. వెంటనే స్మృతి కౌంటర్
సోషల్ మీడియాను సొంత డబ్బా కొట్టుకోడానికి ఉపయోగించుకోవద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్లకు చెప్పిన ఒక్క రోజు తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయన మీద సెటైర్ వేశారు. ప్రధానమంత్రి చెబుతారు గానీ దాన్ని పాటించరంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే దానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీటుగా స్పందించారు. ప్రధానమంత్రిని విమర్శించేంత స్థాయి రాహుల్ గాంధీకి లేదంటూ చురక అంటించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉంటారు. ఆయనకు ట్విట్టర్‌లో దాదాపు 3 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. దేశంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే నాయకుడు ఆయనే. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయనకు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉన్నతాధికారులకు అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, చాలామంది అధికారులు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారని చెప్పారు. పల్స్ పోలియో వ్యాక్సిన్లు ఏ రోజు వేస్తున్నారో తెలిపేందుకు సోషల్ మీడియాను వాడుకుంటే అది చాలా మంచిదని, అయితే రెండు చుక్కల పోలియో మందు వేసి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం మాత్రం మంచిది కాదని సున్నితంగా చెప్పారు. జిల్లా అధికారులు చాలామంది ఎక్కువ సేపు సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారని, అందుకే తాను తన సమావేశాల్లోకి స్మార్ట్ ఫోన్లు తేవొద్దని కూడా చెబుతున్నానని అన్నారు. అందుకోసం ఆయన స్మార్ట్ ఫోన్‌లో వేగంగా టైప్ చేస్తున్నట్లుగా నటించి కూడా చూపించారు.
Leading by example is clearly overrated https://t.co/EZa4cjp04n
— Office of RG (@OfficeOfRG) 22 April 2017
Look who is talking about being over rated :-) https://t.co/5bOpFHTMj0
— Smriti Z Irani (@smritiirani) 22 April 2017