Omang Kumar
-
12న ‘పీఎం నరేంద్ర మోదీ’ రిలీజ్
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం కథాంశంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన సినిమా ‘పీఎం నరేంద్ర మోదీ’ ఏప్రిల్ 12వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానుంది. మేరీ కోమ్, సరబ్జిత్ వంటి వారి బయోపిక్‌లను రూపొందించిన ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. జనవరిలో గుజరాత్లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో తుదిదశలో ఉంది. షూటింగ్లో ఎక్కువ భాగం ఉత్తరాఖండ్‌లోనే జరిగింది. కథా నాయకుడు దామోదర్‌దాస్ మోదీ గుజరాత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి, 2014 ఎన్నికల్లో చారిత్రక విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం వరకు కథాంశంగా ఉంటుందని దర్శకుడు ఒమంగ్ కుమార్ వెల్లడించారు. ‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ప్రజలకు తెలియాల్సిన కథాంశం. విశ్వాసానికి సంబంధించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపుతుందని ఆశిస్తున్నాం. 103 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నందుకు ఆసక్తితో, ఆనందంతో ఉన్నాం’ అని చిత్ర నిర్మాత సందీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో నటులు దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరినా వహబ్, బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా తదితరులు ఉన్నారు. జాతీయ పతాకం నేపథ్యం, కాషాయ రంగు కుర్తా ధరించిన ఒబెరాయ్‌తో కూడిన ఈ సినిమా పోస్టర్ జనవరిలో 27 భాషల్లో విడుదలయింది. -
ప్రధానమంత్రిగా...
బాలీవుడ్లో బయోపిక్స్ గాలి బాగా వీస్తోంది. ఇప్పటికే అరడజను బయోపిక్‌లు సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోది బయోపిక్ బాలీవుడ్లో చర్చకు వచ్చింది. టైటిల్ రోల్లో బాలీవుడ్ నటుడు నటిస్తారని టాక్. బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ బయోపిక్‌ను తెరకెక్కించి, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఒమంగ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని బీటౌన్ ఖబర్. ఆల్రెడీ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో లొకేషన్స్‌ని అన్వేషిస్తున్నారట టీమ్. ఈ సంగతి ఇలా ఉంచితే... మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ బయోపిక్ రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోది బయోపిక్ తెరపైకి రావడం విశేషం. ఇదిలా ఉంటే.. ‘రక్తచరిత్ర, వివేగమ్’ వంటి దక్షిణాది చిత్రాల్లో నటించిన వివేక్ ఒబెరాయ్ ‘వినయ విధేయ రామ’లో విలన్ పాత్ర చేశారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
సంజయ్ 'ద గుడ్ మహారాజా' కాదట
ఇటీవల భూమి సినిమాతో ఆకట్టుకున్న బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ద గుడ్ మహారాజా అనే సినిమాలో నటిస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ లీడ్ రోల్ లో భూమి చిత్రాన్ని రూపొందించిన ఒమంగ్ కుమార్ దర్శకత్వంలోనే ద గుడ్ మహారాజా తెరకెక్కనుంది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ సినిమాలో సంజయ్ దత్, నవానగర్ మహారాజా సాహిబ్ దిగ్విజయ్ సింగ్జీ రజింత్ సింగ్జీ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వందలాది చిన్నారలకు ఆశ్రయం కల్పించిన సాహిబ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఈ ఆసక్తికర కథతో ఒమాంగ్ కుమార్ తెరకెక్కించబోయే సినిమాను పోలిష్ ఇంగ్లీష్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తాయన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ద గుడ్ మహరాజా సినిమాలో సంజయ్ దత్ నటించటంలేదట. ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోలు విజువల్ రిప్రజెంటేషన్ కోసం ఫొటోషాప్ ద్వారా తయారు చేసినవి మాత్రమే అని చిత్రయూనిట్ తెలిపారు. ప్రస్తుతం సంజయ్ సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ 3 సినిమాతో పాటు మరో రెండు సినిమాలో బిజీగా ఉన్నాడు. -
స్టార్ హీరోకు ఛాన్స్ ఇవ్వలేదు..
పాకిస్తాన్ లో ఖైదు అయ్యి, చివరికి అక్కడి జైలులో చనిపోయిన భారతీయుడు సరబ్జిత్. అతని జీవితాన్నే కథాంశంగా చేసుకుని 'సరబ్జిత్' చిత్రం రూపొందిస్తున్నారు. ఒమంగ్ కుమార్ చిత్రానికి గౌరవ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నటిస్తున్నారు. ఈ గెటప్‌లో ఐష్‌ని గుర్తు పట్టడం కాస్త కష్టంగానే ఉంటున్న వార్తలు వినిపించాయి. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ మూవీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాత్ర ఉండొచ్చునని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ స్పందిస్తూ.. సల్మాన్ ను ఈ మూవీ కోసం తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సరబ్జిత్ ను విడుదల చేయాలంటూ 2012లో కండలవీరుడు ట్విట్టర్లో పోస్టులు చేస్తూ చాలా మందికి ప్రేరణగా నిలిచి చైతన్యాన్ని తీసుకొచ్చాడు. గుఢచర్యం ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న భారతీయుడు సరబ్జిత్ విడుదల కోసం సల్మాన్ తనవంతుగా కార్యక్రమాలు నిర్వహించినందున స్టార్ హీరో కూడా ఈ మూవీలో భాగమవుతాడని తాజాగా కథనాలొస్తున్నాయి. తమ స్క్రిప్టులో సల్మాన్ ప్రస్తావనే లేదని, అసలు ఆయనను మూవీ టీమ్ సంప్రదించనేలేదని వివరించారు. -
ప్లీజ్! షూటింగ్ చేసుకోనివ్వండి...
అది ముంబయ్ నగరానికి దూరంగా ఉన్న ప్రాంతం. ముంబయ్ నుంచి అక్కడికి వెళ్లాలంటే మూడు గంటలు పడుతుంది. పెద్దగా జనాలు ఉండరు. షూటింగ్‌కి అనువుగా ఉంటుందని ‘సరబ్జిత్’ చిత్రం షూటింగ్‌ని అక్కడ ప్లాన్ చేశారు చిత్రదర్శకుడు ఒమంగ్ కుమార్. పాకిస్తాన్లో ఖైదు అయ్యి, అక్కడే చనిపోయిన సరబ్జిత్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా నటిస్తున్నారు ఐష్. ఇది డీ-గ్లామరైజ్డ్ రోల్. ఈ గెటప్‌లో ఐష్‌ని గుర్తు పట్టడం కాస్త కష్టంగానే ఉంటుందట. అందేకని, పబ్లిక్ ప్లేసెస్‌లో షూటింగ్ చేసినా ఇబ్బంది లేదనుకున్నారట ఒమంగ్ కుమార్. కానీ, అభిమానులు గుర్తుపట్టకుండా ఉంటారా? ఐష్ షూటింగ్ చేస్తున్నారని విని, దాదాపు నాలుగు వందల మంది అభిమానులు గుమిగూడిపోయారట. దానివల్ల షూటింగ్‌కి ఆటంకం ఏర్పడిందని సమాచారం. చివరికి ఐష్ జోక్యం చేసుకుని, ‘మమ్మల్ని షూటింగ్ చేసుకోనివ్వండి.. ప్లీజ్’ అని అభ్యర్ధించారట. అభిమాన తార అంతలా అడిగితే.. అభిమానుల మనసు కరిగిపోదూ! షూటింగ్‌కి ఆటంకం కలగజేయకుండా అక్కణ్ణుంచి వెళ్లిపోయారట. -
వీరనారిగా
విభిన్న పాత్రలు పోషించాలని తపించే ప్రియాంకా చోప్రా... త్వరలో మరో కొత్త పాత్ర చేయనున్నారట. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కూడిన కథాంశంతో రూపొందే ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రియాంక ప్రధాన భూమిక పోషించనున్నారని సమాచారం. వివరాల్లోకెళ్తే- ‘మేరీకోమ్’ దర్శకుడు ఒమాంగ్ కుమార్ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్ కథాంశం కావడంతో, ‘మేరీకోమ్’లో అద్భుత నటన కనబరిచిన ప్రియాంకతోనే ఈ సినిమా కూడా చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ప్రియాంకతో ఈ విషయం చెప్పగానే, ఆమె కూడా సానుకూలంగా స్పందించారని వినికిడి. ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన కథాంశం కావడం వల్ల ప్రీ ప్రొడక్షన్‌కే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే... వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌కి తీసుకెళ్లడానికి ఒమాంగ్ కుమార్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక పాత్ర అత్యంత శక్తిమంతంగా వీరనారి తరహాలో ఉంటుందని సమాచారం.