
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం కథాంశంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన సినిమా ‘పీఎం నరేంద్ర మోదీ’ ఏప్రిల్ 12వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానుంది. మేరీ కోమ్, సరబ్‌జిత్ వంటి వారి బయోపిక్‌లను రూపొందించిన ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. జనవరిలో గుజరాత్‌లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో తుదిదశలో ఉంది. షూటింగ్‌లో ఎక్కువ భాగం ఉత్తరాఖండ్‌లోనే జరిగింది. కథా నాయకుడు దామోదర్‌దాస్ మోదీ గుజరాత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి, 2014 ఎన్నికల్లో చారిత్రక విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం వరకు కథాంశంగా ఉంటుందని దర్శకుడు ఒమంగ్ కుమార్ వెల్లడించారు.
‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ప్రజలకు తెలియాల్సిన కథాంశం. విశ్వాసానికి సంబంధించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపుతుందని ఆశిస్తున్నాం. 103 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నందుకు ఆసక్తితో, ఆనందంతో ఉన్నాం’ అని చిత్ర నిర్మాత సందీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో నటులు దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరినా వహబ్, బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా తదితరులు ఉన్నారు. జాతీయ పతాకం నేపథ్యం, కాషాయ రంగు కుర్తా ధరించిన ఒబెరాయ్‌తో కూడిన ఈ సినిమా పోస్టర్ జనవరిలో 27 భాషల్లో విడుదలయింది.
Comments
Please login to add a commentAdd a comment