
భారత ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీయం నరేంద్ర మోది’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది మే 24న విడుదలయింది. అయితే మరోసారి ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. లాక్‌డౌన్ తర్వాత ఈ నెల 15 నుంచి థియేటర్స్ మళ్లీ ప్రారంభం కానున్నాయి అనే విషయం తెలిసిందే. దాంతో ‘పీయం నరేంద్ర మోది’ని 15న రీ–రిలీజ్ చేయనున్నారు. ‘‘కొందరి పొలిటికల్ అజెండాల వల్ల ఈ సినిమా విడుదలైనప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరలేదు. ఈ రీ–రిలీజ్‌లో అందరికీ ఈ సినిమా చేరువ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సందీప్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment