సినిమా ప్రమోషన్‌లో మాట్లాడుతున్న బాలీవుడ్ వివేక్ ఒబెరాయ్
సాక్షి, వడోదర: ఒకవేళ తాను 2024లోపు తాను రాజకీయ ప్రవేశం చేస్తే, గుజరాత్‌లోని వడోదర స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతానని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నాడు. గత ఎన్నికల్లో ప్రధాని మోదీ వడోదర నుంచి లోక్‌సభ బరిలో ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రజలు చూపింపన ప్రేమ, వాత్సల్యాలు తనను చాలా ఆకట్టుకున్నాయని ఆయన ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మకథ ఆధారంగా తీస్తున్న పీఎం నరేంద్రమోదీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వడోదరలోని పారుల్ విశ్వవిద్యాలయాన్ని వివేక్ ఒబెరాయ్ సందర్శించారు. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శనివారం కొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రజలను ఏమార్చడానికి, మభ్యపెట్టడానికి, ఆకట్టుకోవడానికే ఈ బయోపిక్‌ను తెరకెక్కించారని కాంగ్రెస్ నేత వేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది.
‘పీఎం నరేంద్ర మోదీ చిత్రం చేసే ముందు మోదీ బాడీ లాంగ్వేజ్‌ను చాలా రోజులు గమనించాను. మోదీ లుక్ ఖరారుకు 16 రోజల సమయం తీసుకున్నాం. ఇది అందరిలో స్ఫూర్తినింపే సినిమా. ఎవరి అండదండలు లేకుండా దేశ ప్రధానిగా, ప్రపంచంలోని ముఖ్య నేత స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి అపురూప గాథను ఈ సినిమాలో చూడొచ్చ’ని వివకేక్ ఒబెరాయ్ అన్నారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణ్, బర్ఖా బిష్త్, రాజేంద్ర గుప్తా, జరీనా వాహబ్ ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment