ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర నేపథ్యంలో వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘నరేంద్ర మోదీ’. ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందకు రానుంది. ఆక్టోబర్ 15న థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. కాగా కరోనా కారణంగా గత ఆరు నెలల నుంచి సినిమా థియేటర్లు అన్ని మూత పడిన విషయం తెలిసిందే. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15నే తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో థియేటర్ల పునఃప్రారంభం తరువాత థియేటర్లలో విడుదల అవతున్న మొదటి సినిమా ఇదే. ఈ విషయాన్ని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్‌లో వెల్లడించారు. చదవండి: స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి
కాగా జాతీయ అవార్డు విజేత ఓముంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘నరేంద్ర మోదీ’ చిత్రం గత ఏడాది మే 24 న విడుదలైంది. విడుదలైన మొదటి రోజునే రూ .2.88 కోట్లు సంపాదించింది. మోదీ పాత్రంలో వివేక్ ఒబెరాయ్ తొమ్మిది విభిన్న లుక్‌లో కనిపించారు. ఇందులో మోదీ పేదరికంలో ఉన్న సమయంలో రైల్వే స్టేషన్‌లో టీ అమ్మడం నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నాయకుడిగా ఎదిగిన విధానాన్ని చూపించారరు. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, బర్ఖా బిష్ట్, రాజేంద్ర గుప్తా, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చదవండి: కోవిడ్‌పై పోరుకు ప్రజాచైతన్య కార్యక్రమం
Comments
Please login to add a commentAdd a comment