
ఎన్నికల వేడిలో రాజకీయ నాయకుల జీవిత చిత్రాలను వెండితెరపై ప్రదర్శించడం కాసింత కష్టమే. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్, ఏపిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, మమతా బెనర్జీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈసీ పలుమార్లు బ్రేకులు వేసింది. ఎట్టకేలకు ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది.
ఇప్పటికే చాలాసార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను మే 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో మోదీ పాత్రలో వివేక్ ఒబేరాయ్ నటించగా.. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment