బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ పీఎం నరేంద్ర మోదీ. ఈ సినిమాకు మేరీ కోమ్, సరబ్జిత్ లాంటి బయోపిక్ లను తెరకెక్కించిన ఒమాంగ్ కుమార్ దర్శకుడు. లెజెండ్ గ్లోబల్ స్టూడియో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తే కమర్షియల్ సినిమాకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ బయోపిక్ తెరకెక్కినట్టుగా అనిపిస్తోంది. మోదీ బాల్యంతో పాటు దేశ పర్యటన, ఆర్‌ఎస్‌ఎస్ లాంటి అంశాలతో పాటు గోద్రా అల్లర్లు, ప్రధానిగా తీసుకున్న నిర్ణయాలు లాంటి అంశాలను సినిమాలో ప్రధానంగా తెరకెక్కించారు. దాదాపు భారతీయ భాషలన్నింటిల రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహబ్, సేన్ గుప్తాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జనవరి 27న లాంచనంగా ప్రారంభమైన మోదీ బయోపిక్ ఫిబ్రవరి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు 60 రోజుల్లోనే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయాలని భావించారు. కానీ ముందే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తవుతుండటంతో ఏప్రిల్ 5నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అదే రోజు రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment