breaking news
Narendra Modi
-
ప్రజాస్వామ్యాన్నీ డీనోటిఫై చేస్తారు
ఛత్రపతి సంభాజీనగర్: ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు కేటాయించిన జంతర్‌మంతర్ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కూడా డీనోటిఫై చేసే ప్రమాదం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం వ్యాఖ్యానించారు. డీనోటిఫికేషన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే దేశమంతా జంతర్‌మంతర్ అవుతుందని హెచ్చరించారు. ‘‘జంతర్ మంతర్‌ను అధికారిక ప్రొటెస్ట్ సైట్ కాదంటున్నారు. నిజమే. పిరికి నియంత దాన్నిప్పుడు యుద్ధభూమిలా మార్చేశాడు. అబ్ పూరా దేశ్ జంతర్‌మంతర్ బనేగా’’అంటూ దీప్కే ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ప్రజాస్వామ్యాన్ని కూడా డీనోటిఫై’చేస్తారని వ్యాఖ్యానించారు. ‘‘నియంత అసలు సమస్య నిరసన ప్రదర్శనల కేంద్రం కాదు. ప్రజలు నిరసనలు చేస్తున్నారన్నదే’’అని విమర్శించారు. ఢిల్లీ పోలీసులు టార్చర్ పెట్టారు... ఢిల్లీ పోలీసులు తనను, కుటుంబ సభ్యులను మానసిక హింసకు గురిచేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. అక్టోబరు పదిన తనను అదుపులోకి తీసుకున్న సందర్భంలో కుటుంబసభ్యులు ఎవరికీ తన ఆచూకీ తెలియనివ్వలేదని చెప్పారు. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉండగానే దీప్కే నానమ్మ మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్తను పోలీసులు తనకు తెలిపినప్పటికీ గ్రామంలో ఉన్న బంధువుకు ఫోన్ చేస్తానంటే అనుమతించలేదని, అతడి నంబరు తీసి ఇచ్చేందుకైనా ఫోన్ ఇవ్వాలన్నా నిరాకరించారని ఆరోపించారు. న్యాయవాదితో మాట్లాడేందుకు తనకున్న హక్కును కూడా తోసిపుచ్చారని ఆరోపించారు. అక్టోబరు పది నాటి నిరసన ప్రదర్శనల కోసం బయలుదేరిన తనను విమానంలోనే అదుపులోకి తీసుకున్నారని, తల్లిదండ్రులకు గానీ, న్యాయవాదికి కానీ తన ఆచూకీ తెలపలేదని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు మాత్రం దీప్కే నానమ్మ మరణవార్తను అతడికి చేరవేశామని, సహాయం ఏదైనా అవసరమని అడిగితే అతడు తిరస్కరించాడని ఆరోపిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. దీనిపై ‘‘నానమ్మ మరణవార్తను పోలీసులు నాకు చెప్పి ఉంటే వాళ్లు మధ్యాహ్నం 3.30 గంటలకు అరెస్ట్ పేపర్లతో ఎందుకు వచ్చారు? దానిపై సంతకం పెట్టాలని బలవంతపెట్టారు’’? అని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. తల్లిదండ్రులతో మాట్లాడమని పోలీసులు చెబితే.. వారి ఆరోగ్యం సరిగా లేనందున తాను నానమ్మతోపాటు ఉండే బంధువుకు కాల్ చేయమని అడిగానని దీప్కే వివరించారు. ఢిల్లీ పోలీసులు ఇందుకు నిరాకరించారని, అన్నారు. నాతో పాటు తల్లిదండ్రులపై కూడా ఒత్తిడి తీసుకురావాలన్నది వారి ఉద్దేశమని విమర్శించారు. నానమ్మ మరణ వార్త చెప్పేందుకు వారు మూడు కెమెరాలతో రావడమే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు ఎడిట్ చేసిన వీడియో ప్రసారం చేస్తున్నారు. దమ్ముంటే మొత్తం వీడియో చూపమనండి. నా ప్రాథమిక హక్కులకు భంగం చేసిన విషయం తెలుస్తుంది’’అని సవాలు విసిరారు. ‘‘మోదీ నియంతృత్వం నశించేంతవరకూ పోరాడతాను’’అని స్పష్టం చేశారు. -
ఓట్ల తొలగింపు కుట్రలో మోదీ, షా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అధికారాన్ని శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పేదలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు, మైనారిటీలు, యువత ఓట్లను లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.దేశంలో ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని, దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం ‘సైమన్ గో బ్యాక్’ఉద్యమం సాగిందని, ఇప్పుడు ఓటు హక్కును కాపాడుకునేందుకు ‘జ్ఞానేశ్ గో బ్యాక్’, ‘ఎస్ఐఆర్ గో బ్యాక్’ నినాదాలతో ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని పిలుపునిచ్చారు. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో సీఎం సమావేశమయ్యారు. రాహుల్ బస్సు యాత్రకు ముందుగా నిర్వహించిన సమావేశంలో రేవంత్ ప్రసంగించారు.బీజేపీ గెలుపు కోసమే దుర్వినియోగం ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా.. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ గెలుపు కోసం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేశారని, ఇది బయటపడుతుందనే భయంతో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను కాపాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని, రాజకీయ ప్రత్యర్థుల ఓటు బలాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు. బిహార్, పశి్చమ బెంగాల్, హరియణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణలు, ఎన్నికల పరిణామాలను ప్రస్తావిస్తూ.. బీజేపీకి లబ్ధి చేకూరేలా వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా, ఆయనపై చర్యలు తీసుకునేందుకు మోదీ, అమిత్ షా ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.20 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు.. 2014లో మోదీ తొలిసారి ప్రధానమంత్రి పదవికి పోటీ చేసిన సమయంలో దేశంలో సుమారు 81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 2019లో ఈ సంఖ్య 91 కోట్లకు, 2024 ఎన్నికల నాటికి 97 కోట్లకు చేరిందని రేవంత్‌రెడ్డి వివరించారు. అయితే 2026లోకి వచ్చేసరికి 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఈ తొలగించే ఓట్ల సంఖ్యను 20 కోట్లకు పెంచే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరారు.రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను రెండు వర్గాలుగా విభజించే పరిస్థితిని సృష్టిస్తోందని సీఎం విమర్శించారు. ఒకవైపు అధికార పారీ్టకి అనుకూలంగా ఉన్న సంపన్నులకు రాజకీయ ప్రాధాన్యం లభిస్తుండగా, మరోవైపు పేదలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు, మైనారిటీల ఓటు హక్కుకే ముప్పు ఏర్పడుతోందని ఆరోపించారు. ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వ పథకాలు, రేషన్ వంటి ప్రయోజనాల విషయంలోనూ పేదలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పేదల పక్షాన కాంగ్రెస్ పోరాటం ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దేశ ప్రజల దృష్టికి తెచి్చన నాయకుడు రాహుల్ గాంధీ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం స్వాతంత్య్ర ఉద్యమం తరహా పోరాటం అవసరమైందంటూ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాల సవరణలపై ఉన్న అభ్యంతరాలను పరిష్కరించకుండా, నిరసనలను అణచివేసే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.గతంలో ఎన్నికల సంఘం ఒక్క కమిషనర్ నేతృత్వంలో పనిచేసేదని, అయితే, ఈ సంస్థలో మరింత పారదర్శకత తెచ్చేందుకు పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ముగ్గురు కమిషనర్ల విధానాన్ని తెచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించే సమయంలోనే రాహుల్‌గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తుచేశారు.ఓటు హక్కు కల్పించేందుకు ఎస్ఐఆర్ 1950లో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో, తర్వాత ఇందిరాగాంధీ, వాజ్‌పేయి ప్రభుత్వాల కాలంలోనూ సర్ ప్రక్రియ జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే, గతంలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వారిని చేర్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టేవారన్నారు. ఇప్పుడు మోదీ, అమిత్ షాల పాలనలో మాత్రం ఇప్పటికే ఓటు హక్కు ఉన్నవారి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. తమ అధికారానికి అడ్డుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, నార్కోటిక్స్ విభాగం వంటి సంస్థలను ఉపయోగించుకుందని, ఇప్పుడు వాటితో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కష్టమవుతోందనే ఉద్దేశంతో ఎస్ఐఆర్ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.బీజేపీ గెలిచేలా ఈసీ అక్రమాలు: భట్టి ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ మాత్రమే గెలిచేలా ఎన్నికల కమిషన్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశ పౌరుల ఓటు హక్కును పరిరక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తోందన్నారు. ఢిల్లీలో నిర్వహించిన సత్యాగ్రహంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాథమిక హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కుకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ కొంతకాలంగా దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఓటర్ల హక్కుల అంశాన్ని రాష్ట్రపతితోపాటు వివిధ రాజ్యాంగ సంస్థల దృష్టికి గతంలోనూ తీసుకెళ్లామని భట్టి తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధేయ మార్గంలో శాంతియుతంగా సత్యాగ్రహం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్త ఉద్యమం: మహేశ్ గౌడ్ ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఓట్ల చోరీపై తమ ఉద్యమం ఆగదని చెప్పారు. ఓట్ల చోరీ ద్వారానే దేశంలో గెలవాలని బీజేపీ ప్రయతి్నస్తోందని, ఇందుకు ఈసీ మద్దతుగా ఉంటోందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయని, ఈ అంశంపై సుప్రీంకోర్టు తమ వాదనలను వినాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరారు.అందరూ ఢిల్లీలోనే ఉండండి‘ఓట్ బచావో’ ఉద్యమం కోసం ఢిల్లీ వచి్చన నేతలు మళ్లీ చెప్పే వరకూ ఢిల్లీ విడిచి వెళ్లొద్దని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ ఉద్యమం ఒక్కరోజుతో అయ్యేది కాదన్నారు. రాహుల్ గాంధీ ఎన్నిరోజులని చెబుతారో తెలియదని, కాబట్టి రిటర్న్ టికెట్స్ ఎవరూ బుక్ చేసుకోవద్దని సూచించారు. ఢిల్లీకి వచి్చన నేతలు అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి వారందరికీ సాయం చేసేందుకు హెల్ప్ డెస్క్ అవసరం అన్నారు. అరెస్టయిన వారిని విడిపించేందుకు ఎవరి స్థాయిలో వాళ్లు పని చేయాలని చెప్పారు. అరెస్ట్ చేసిన మనవాళ్లను ఢిల్లీ, పక్కరాష్ట్రాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని, వారందరికీ ధైర్యం కల్పించేందుకు హెల్ప్ డెస్క్ అవసరం అన్నారు. ఇది 24 గంటలూ పని చేసేలా ఉండాలని ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్రెడ్దిలను రేవంత్ ఆదేశించారు.విచారణకు సిద్ధమా: పొన్నంఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే తామే సిస్టమ్‌లో చేరి్పస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం అధికారాలను తమ జేబు సంస్థగా భావించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఏసీ గదుల్లో కూర్చొని సవాళ్లు విసరడం కాదని, ఏయే బూత్‌లు, వార్డుల్లో ఓట్లు తొలగించబడ్డాయో విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన జగన్ ఓడిపోవడమేంటి? -
జలకండేశ్వర ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. అక్కడ అడుగడుగునా అద్భుతాలే.!
ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై మెట్రో రైలు ప్రారంభోత్సవంలో భాగంలో తమిళనాడులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ఐఐటీ మద్రాస్‌ని సందర్శించడమే గాక అక్కడ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధ జలకండేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. దీంతో సర్వత్రా ఆ ఆలయంపై ఆసక్తి నెలకొనడమే గాక ఆ దేవాలయ విశేషాల గురించి తెగ ఆరా తీయడం ప్రారంభించారు. మరి ఏంటి ఆ ఆలయ విశిష్టత, అక్కడి ప్రత్యేకతలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ప్రధాని నరేంద్ర మోదీ వెల్లూరు కోటలో చరిత్రకు, ముగ్ధమనోహరమైన శిల్పాలకు ఆలవాలమైన ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. శివుని సంబంధించిన ఈ ఆలయంలో విజయనగర యుగం నాటి వాస్తు లక్షణాలు, విస్తృతమైన రాతి నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి..అక్కడి స్థంభాలపై ఉండే డిజైన్లు. తమిళనాడు చూడాలనుకునే యాత్రికులు తప్పక చూడాల్సిన జలకండేశ్వర ఆలయం ఇది. జలకండేశ్వర ఆలయం చారిత్రక వెల్లూరు కోట లోపల ఉంది. ఇది అత్యంత భిన్నమైన ఆలయం. దీని వాస్తుశిల్పం విజయనగర శైలికి చెందింది. భారీ ద్వారాలు, స్థంభాలు, వివరమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ సముదాయంపైన తొమ్మిది అంతస్థుల గోపురం వంద అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. . దానిపై చెక్కిన శిల్పాలు చూపురులను ఎంతగానో ఆకర్షి్తాయి. దగ్గరక చూసేకొద్దీ మరింత అద్భుతంగా అనిపిస్తాయి.నీటితో ముడిపడి ఉన్న ఆలయ చరిత్ర...ఈ ఆలయం అత్యంత విశిష్ట లక్షణాలలో ఒకటి అగళి. అంటే గర్భగుడి చుట్టూ ఉన్న నీటితో నిండిన కందకం. ఈ నీరు రాతి నిర్మాణంతో ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని ఏర్పరుస్తూ, ఈ సముదాయానికి ఒక సాధారణ ఆలయ ప్రాంగణానికి భిన్నమైన వాతావరణాన్ని ఇస్తుంది. నీటితో ఉన్న ఈ సంబంధం ఆలయం పేరులో కూడా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ జలకండేశ్వరుడిని శివుని రూపంగా పూజిస్తారు. ఈ ఆలయ చరిత్ర గర్భగుడి చుట్టూ ఉన్న నీటితో సన్నిహితంగా ముడిపడి ఉంది. ఆలయం లోపల, అభిషేకం కోసం గంగా గౌరీ తీర్థం అనే పురాతన బావి నుంచి నీటిని తోడతారు. ఇది ఆలయ వాస్తుశిల్పాన్ని దాని మతపరమైన సంప్రదాయాలతో అనుసంధానించే మరో అంశం.ఇక్కడ ఉండే కళ్యాణ మండపం, అంటే వివాహ మండపం. ఆలయ వాస్తుశిల్పంలోని ముఖ్యాంశాలలో ఒకటి. దానిపై ఉన్న విస్తృతమైన శిల్పాలు, శిల్ప వివరాలు విజయనగర కాలం నాటి కళాత్మక ఊహాశక్తి నిలువుటద్దం. ముఖ్యంగా ఒక శిల్పాన్ని నిశితంగా పరిశీలిస్తే..దానిని చూసే కోణాన్ని బట్టి అది ఒక ఎద్దుగా లేదా ఏనుగుగా కనిపిస్తుంది. చారిత్రక వాస్తుశిల్పంలో దాగి ఉన్న కథలు సందర్శకులకు, దృశ్యపరమైన చిక్కుముడులను అందిస్తూ..అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి.మండపం స్తంభాలు కూడా గుర్రాలు, డ్రాగన్లు, యాలిలతో సహా క్లిష్టమైన ఆకృతులతో రూపొందించారు శిల్పులు. యాలిలు అంటే దక్షిణ భారత ఆలయ కళలో తరచుగా సింహం వంటి రూపాలతో చిత్రీకరించబడే పౌరాణిక జీవులు.సాధారణంగా వెయ్యి స్తంభాల మండపం అని పిలువబడే ఐరంగల్ మండపం, ఈ ప్రాంగణంలో హడావిడిగా తిరగకుండా, కాసేపు ఆగి చూడటానికి మరో కారణం. విజయనగర వాస్తుశిల్పానికి సంబంధించిన విస్తృతమైన హస్తకళను ప్రదర్శించే, చెక్కిన రాతి స్తంభాలకు ఈ మండపం ప్రసిద్ధి చెందింది.సందర్శించే సమయాలుఆలయం అధికారిక వెబ్సైట్ ప్రకారం సందర్శన సమయాలు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శన వేళలు ఉంటాయి. ఎలా చేరుకోవాలిచెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారుగా 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెల్లూరుకు రైలు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు, ఈ నగరానికి కాట్పాడి జంక్షన్ ఒక ప్రధాన రైల్వే స్టేషన్‌గా పనిచేస్తుంది. -
ఒక్క ట్వీట్ తో భారతీయులను రెచ్చగొట్టిన మస్క్
-
సీఎం విజయ్‌తో చేతులు కలుపుతా..
సాక్షి, చెన్నై: తమిళనాడు అభివృద్ధి ప్రస్థానానికి నాయకత్వం వహించేందుకు సీఎం విజయ్‌తో చేతులు కలుపుతాననని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తమిళనాడులో ప్రభుత్వాలు మారుతూ వచ్చినా, తమిళనాడు అభివృద్ధి, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తాజాగా కూడా అదే సంకల్పంతో సీఎం విజయ్‌తో కలిసి తమిళనాడు అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని ప్రకటించారు. ఐఐటీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ఈ రోజు మన దేశానికి, తమిళనాడుకు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళనాడు యువతకు వివిధ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. పవిత్రమైన నవరాత్రి పండుగ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది’’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ పవిత్రమైన రోజున, శివుని శక్తి పీఠం కొలువై ఉన్న తమిళనాడులో తాను ఉన్నానని, ఈ పుణ్యక్షేత్రమైన తమిళనాడు నుండి, దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రకటించారు. తనకు ఐఐటి మద్రాస్‌లోని బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించే అవకాశం లభించిందని, ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు ప్రజారోగ్య రంగంలో కొత్త అవకాశాలనుసృష్టిస్తాయన్నారు. అలాగే, చెన్నై మెట్రోలో మరో విస్తరణను ప్రారంభించే అవకాశం తనకు లభించిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరుణానిధి, జయలలితలతో చాలాసార్లు సంభాషించే అవకాశం లభించిందన్నారు. ప్రధానమంత్రి అయ్యాక, జయలలిత, ఓపీఎస్, పళనిస్వామి, స్టాలిన్ వంటి వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికిందన్నారు. ప్రభుత్వాలు మారుతూ వచ్చినా, తమిళనాడు అభివృద్ధి, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉన్నాయన్నారు. తాజాగా అదే సంకల్పంతో, సీఎం విజయ్‌తో కలిసి తమిళనాడు అభివృద్ధి యాత్రను ముందుకు తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. ఇదీ చదవండి: జ్ఞానేశ్‌పై మరో అస్త్రంతో ఇండియా కూటమి! -
Gen Z కి PM నరేంద్ర మోదీ కీలక పిలుపు
-
మీ బెదిరింపులకు నేను భయపడను.. అభిజీత్ దీప్కే సంచలనం
-
అసమర్థత వల్లే మోదీ మౌనం
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని నరేంద్ర మోదీ సాధారణంగా ఆన్లైన్లో ఎంతో చురుగ్గా ఉంటారు. గొప్ప కమ్యూనికేటర్. అయితే, ఢిల్లీ నిరసనల నడుమ పది రోజులుగా ఆయన నోటి నుంచి చిన్న శబ్దం కూడా రాలేదు. ఈ మౌనం బలహీనత, అసమర్థత, అనిశ్చితి, అభద్రతా భావాన్ని సూచిస్తోంది’ అని ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ విమర్శించారు. నిరంతరం మాట్లాడే నాయకుడి నుంచి ఇటువంటి మౌనం అసాధారణమని చెప్పారు. ఏమి మాట్లాడాలో తెలియకపోవడంతో ప్రధాని మౌనంగా ఉన్నారనిదుయ్యబట్టారు. కేవలం మాటలు మాత్రమే పరిస్థితిని శాంతపరచలేవని, ఆందోళనల్లో పాల్గొంటున్న కాక్రోచ్ జనతా పార్టీ, సమాజం, విద్యార్థులు, కాంగ్రెస్, ఇతర పార్టీల డిమాండ్లకు స్పందించడానికి ప్రధాని నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మంథన్ ఆధ్వర్యంలో ఆదివారం శిల్పకళా వేదికలో నిర్వహించిన సంవాద్–2026 కార్యక్రమంలో ఆయన నవీకా హర్షేతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఢిల్లీలో ఆందోళనను అణచివేయడానికి 245 రైళ్లను రద్దు చేయడంతోపాటు 47 మెట్రో స్టేషన్లను మూసివేసి మొత్తం నగరాన్ని లాక్డౌన్ చేశారని కరణ్ మండిపడ్డారు.ఆందోళన చేస్తున్న ప్రజల అభిప్రాయాలు, ఆందోళనలపై లోతుగా కవరేజ్ కల్పించాల్సిన టీవీ చానెళ్లు ఉద్దేశపూర్వకంగా విస్మరించాయని తప్పుబట్టారు. కేంద్రానికి ఇబ్బందికరమైన సమాచారాన్ని మీడియా చూపించడం లేదని, కేంద్ర ప్రభుత్వం మారితే ధోరణిలో మార్పు రానుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రధాన స్రవంతి మీడియా అపస్మారక స్థితిలో ఉందని, కోలుకోవడానికి ఎక్కువ సమయమేమీ పట్టదన్నారు. 2004లో తాను మోదీతో నిర్వహించిన ఇంటర్వ్యూ కేవలం 2.30 నిమిషాల్లో ముగిసిందని, గోధ్రా అల్లర్ల నేపథ్యంలో ఆయన్ను మాస్ మర్డరర్‌గా జనం చూస్తున్నారని తాను అడిగిన ఓ ప్రశ్నకు మోదీ కోపగించుకుని ఇంటర్వ్యూ అర్ధాంతరంగా ముగించారని గుర్తు చేసుకున్నారు.అణగారిన వర్గాలపైనే విద్వేషాలు: షారూఖ్ ఆలం, సుప్రీం కోర్టు న్యాయవాదివిద్వేష ప్రసంగాలు, దుర్భాష రెండు వేర్వేరని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది షారుఖ్ ఆలం స్పష్టం చేశారు. అధికారపక్షం అండతో అణగారిన వర్గాలపై విద్వేష ప్రసంగాలు చేసేవారిని, అధికారపక్షాన్ని ప్రశ్నించే అణగారిన వర్గాల ను న్యాయస్థానాలు ఒకేగాట కింద కట్టడం తప్పుడు సమానత్వమేనని అభిప్రాయపడ్డారు. విద్వేష ప్రసంగాలపై సంవాద్‌లో ఆమె మాట్లాడారు. రాజకీయ జనసమీకరణ కోసం విద్వేష ప్రసంగాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.సామూహిక నిఘా రాజ్యాంగ విరుద్ధం: అపార్ గుప్తాఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నికలు.. అని కేంద్రం ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని సుప్రీం కోర్టు న్యాయవాది, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అపార్ గుప్తా విమర్శించారు. ప్రజలపై పాలకులు సామూహిక నిఘా పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. డిజిటలైజేషన్‌తో అజ్ఞానం పెరుగుతోందనే అంశంపై ఆయన ప్రసంగించారు. సీబీఎస్ఈ తీసుకొచి్చన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో అవకతవకలు, దారి పర్యవసానాలను వివరించారు. గ్లోబరీనా సంస్థ వైఫల్యాలతో తెలంగాణలో 20 మంది విద్యార్థులు చనిపోయారని, అదే సంస్థ పేరు మార్చుకుని ఆన్్రస్కీన్ మార్కింగ్ కాంట్రాక్టు పొందిందని ఆరోపించారు.మొఘలుల చరిత్రపై...మొఘలుల చరిత్రను మతపరమైన ఘర్షణలు, పాలకుల వ్యక్తిత్వాల ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోవడం చారిత్రక వాస్తవాలను విస్మరించడమేనని ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఫర్హత్ హసన్ అన్నారు. సంవాద్ కార్యక్రమంలో ‘వై స్టడీ ది మొఘల్ ఎంపైర్? రిఫ్లెక్షన్స్ ఆన్ ఇట్స్ పొలిటికల్ కల్చర్ అండ్ లెగసీ’ అంశంపై ఆయన ప్రసంగించారు. మొఘలుల చరిత్రపై సామాజిక మాధ్యమాలు, సినిమాలు, ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ, పాఠ్యపుస్తకాల్లో వస్తున్న వివరణలను విమర్శనాత్మకంగా పరిశీలించాలని.. చరిత్ర రచనకు ఆధారాలు, శాస్త్రీయ విశ్లేషణ కీలకమన్నారు.ప్రముఖ రచయిత, ఫిల్మ్‌మేకర్ సుబ్రతో ఛటోపాధ్యాయ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఆవిర్భావం వెనుక తొమ్మిది నెలల దౌత్య ప్రయత్నాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, సైనిక సన్నద్ధత, విముక్తి పోరాట యోధుల త్యాగాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అధికారం కోసం నిరాయుధ ప్రజలపై సైనిక బలాన్ని ప్రయోగించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కాగా, మంథన్ సంవాద్‌లో ఏఆర్ రెహమాన్ సంగీత ప్రస్థానాన్ని భారతదేశ సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో అనుసంధానిస్తూ సంగీతకారులు ఎంఆర్ శరణ్, స్వరూప్ మామిడిపూడి, రోహిత్ జరిపిన చర్చ ఆకట్టుకుంది.ఇదీ చదవండి: అదే అలజడి -
ఢిల్లీ నిరసనలు.. జెన్‌జీపై మోదీ కీలక వ్యాఖ్యలు
చెన్నై: ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపించే సామర్థ్యం జెన్-జీ యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత తమ భవిష్యత్తును విశాల దృక్పథంతో చూడాలని, పెద్ద కలలు కనాలని, వినూత్నంగా ఆలోచిస్తూ నిర్భయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చెన్నైలోని నందంబాక్కంలో జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ ‘‘నేడు ప్రపంచం అనేక సమస్యలకు పరిష్కారాల కోసం ఎదురుచూస్తోంది. ఆ పరిష్కారాలను అందించే సామర్థ్యం మీలో ఉంది. ప్రతి యువకుడు తన భవిష్యత్తును విశాలమైన దృక్పథంతో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీ సమయం.. మీకు లభించిన గొప్ప అవకాశం.మీలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఉండేందు్కు మీకు మీరే అవకాశం ఇచ్చుకోండి. మీ ఆలోచనలపై పనిచేయండి. పెద్ద కలలు కనండి. భిన్నంగా ఆలోచించండి. ఎలాంటి భయం లేకుండా ముందుకు సాగండి’ అని అన్నారు.అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి అవసరమైన కొత్త ఆలోచనలు, పరిష్కారాలు కేవలం దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. తాను వారణాసి (కాశీ) ప్రజల ప్రతినిధినని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిర్భయంగా జీవించాలనే స్ఫూర్తిని అందించే మహాకవి సుబ్రహ్మణ్య భారతి రచనలను ప్రస్తావిస్తూ యువతకు కీలక సందేశమిచ్చారు. భారతదేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఢిల్లీ నిరసనలు.. మోదీ వ్యూహంకాగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ ఆధ్యర్యంలో నిన్న (ఆదివారం) ఢిల్లీలో పెద్దఎత్తున నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని జెన్-జీ యువతకు ప్రతినిధి పార్టీగా గుర్తింపు పొందిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, మరో ఇద్దరు నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ముంబయి నుంచి ఢిల్లీకి చేరుకున్న విమానం దిగిన కొద్దిసేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పోటు మాజీ సీఎంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇతరులను అరెస్ట్ చేశారు. మెుత్తంగా 3,000 మందిని కూడా నిర్బంధించినట్లు సమాచారం.సుప్రీం కీలక ఆదేశాలుఢిల్లీలో నిరసనల నేపథ్యంలో విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్ని చోట్లా బారికేడ్లను తొలగించాలని అధికారులను ఆదేశించింది. అలాగే, పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమికూడకుండా నిషేధించే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), 2023లోని సెక్షన్ 163 అమలును ఉపసంహరించుకోవాలని సూచించింది.ఇదీ చదవండి: ఢిల్లీ నిరసనల్లో అమ్మాయిల దాడులు -
నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ
-
మెట్రో ట్రైన్ వేదికగా ప్రధాని మోదీ, సీఎం విజయ్ హైవోల్టేజ్ పాలిటిక్స్!
సాక్షి,చెన్నై: తమిళనాడులో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేతగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సీఎం విజయ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం, కలిసి అధికారికంగా పబ్లిక్ ఈవెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారి. కేవలం సభల్లో పాల్గొనడమే కాకుండా, ఇద్దరు అగ్రనేతలు ఒకే మెట్రో రైలులో పక్కపక్కనే కూర్చుని ప్రయాణించడం, సాధారణ ప్రయాణికులతో ముచ్చటించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై నగర రవాణా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, సీఎం విజయ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. దాదాపు రూ. 4,900 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ మెట్రో ఫేజ్-2 మొదటి విడతలో భాగంగా పూనమల్లి బైపాస్ నుంచి వడపలని వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర విస్తరించిన ఎలివేటెడ్ మార్గంలో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.ఈ తొలి మార్గంలో ప్రారంభంలో 15 రైళ్లను అందుబాటులో ఉంచగా.. రద్దీ వేళల్లో ప్రతి 10 నిమిషాలకు, సాధారణ సమయాల్లో ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. మెట్రో ప్రారంభంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థను, రాష్ట్ర మౌలిక వసతులను బలోపేతం చేసే లక్ష్యంతో రూ. 13వేల కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.జాతీయ రహదారులు, రైల్వేలు, చెన్నై పోర్ట్, వావొ చిదంబరనార్ పోర్ట్‌తో పాటు పెట్రోలియం రంగంలో చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మనాలీ రిఫైనరీలో గ్రూప్ లూబ్ ఆయిల్ బేస్ స్టాక్స్ ప్రాజెక్ట్‌కు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో మారుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో.. విజయ్, మోదీతో కలిసి ఇలా ముఖాముఖిగా మెట్రోలో పర్యటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ప్రసిద్ధ జలకంఠేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఐఐటీ మద్రాస్ వేదికగా జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు#WATCH | Chennai, Tamil Nadu: Prime Minister Narendra Modi undertakes a ride on the Chennai Metro from Porur Bypass Station to Poonamallee Bypass Station and back. CM C. Joseph Vijay also present. (Source: DD News) https://t.co/OBPay5hnYo— ANI (@ANI) October 11, 2026 -
తమిళనాడుకు మోదీ గిఫ్ట్
-
విజయ్ చుట్టూ జాతీయ రాజకీయం.. రాహుల్‌తో భేటీ, మోదీతో ప్రయాణం!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం కావడం.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మెట్రో ప్రయాణానికి సిద్ధం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకే వేదికపై కాకపోయినా.. వరుసగా ఇద్దరు జాతీయ స్థాయి నేతలతో విజయ్ కనిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.అక్టోబర్ 10న చెన్నై వచ్చిన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి విజయ్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఇద్దరూ మధ్యాహ్న భోజనం చేస్తూ చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. విద్య, పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ప్రధానంగా నిలిచాయి. కాంగ్రెస్, టీవీకే మధ్య ఏర్పడిన రాజకీయ అనుబంధం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అదే సమయంలో, తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాల విమర్శలు కూడా రాజకీయ చర్చలో ఉన్నాయి. ఈ అంశంపై రాహుల్ గాంధీ వైఖరిపై డీఎంకే గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్, టీవీకే, డీఎంకే మధ్య సంబంధాలు ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.మరుసటి రోజే మోదీతో మెట్రో ప్రయాణంరాహుల్తో సమావేశమైన మరుసటి రోజే.. అక్టోబర్ 11న ప్రధాని మోదీ చెన్నై పర్యటనలో విజయ్ పాల్గొనాల్సి ఉంది. పూనమల్లి-వడపళని మధ్య చెన్నై మెట్రో రెండో దశలోని సుమారు 14.64 కిలోమీటర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం కూడా ఆయన కార్యక్రమంలో ఉంది. అంతేకాకుండా, రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, విద్య తదితర రంగాలకు సంబంధించి రూ.13 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.NO FILTER Ft. Joseph Vijay & Rahul Gandhi👑 https://t.co/W3PnRZdf6K— Prakash Vijay (@PrakazVijay_Of) October 10, 2026ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొనడం సహజమే. అయినప్పటికీ, రాహుల్‌తో భేటీ జరిగిన వెంటనే మోదీతో కలిసి కనిపించనుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిని కేంద్రంతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నంగా రాజకీయ కోణంలో చూడవచ్చు. మరోవైపు, కాంగ్రెస్‌తో ఏర్పడిన రాజకీయ అనుబంధం నేపథ్యంలో రాహుల్‌తో సమావేశం కూడా ప్రాధాన్యం కలిగి ఉంది. అయితే, ఈ భేటీలు ఏవైనా కొత్త రాజకీయ ఒప్పందాలకు సంకేతమని నిర్ధారించే సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు, కూటముల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కాంగ్రెస్-టీవీకే అనుబంధం మరింత బలపడుతుందా? డీఎంకేతో కాంగ్రెస్ సంబంధాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అంశాల్లో ఎలా వ్యవహరిస్తుంది? వంటి ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.విజయ్ ముందున్న అసలు పరీక్ష ఇదే!రాహుల్ గాంధీతో భేటీ, మోదీతో మెట్రో ప్రయాణం.. ఈ రెండింటినీ విడివిడిగా చూస్తే ఒకటి రాజకీయ సమావేశం కాగా, మరొకటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమం. కానీ వాటి సమయం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా రెండింటికీ అదనపు ప్రాధాన్యం ఏర్పడింది. విజయ్ ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం కొనసాగిస్తూనే, ప్రతిపక్ష కూటమిలో తన రాజకీయ స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటుందన్నది రాబోయే రోజుల్లో కీలకం కానుంది. తమిళనాడులో రాజకీయంగా ఎవరు ఎవరికి దగ్గరవుతున్నారు అన్నదానికంటే.. కూటమి సంబంధాలు, ఓటర్ల జాబితా వివాదం, అభివృద్ధి ప్రాజెక్టులు, యువత సమస్యలపై పార్టీలు తీసుకునే వైఖరే అసలు పరీక్షగా మారనున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్నది ఇద్దరు జాతీయ నేతలతో విజయ్ వరుస కార్యక్రమాలు మాత్రమే. వాటి నుంచి ఎలాంటి రాజకీయ పరిణామాలు వస్తాయో వేచి చూడాలి.TN CM Vijay arrives at Chennai airport to welcome PM Modi. https://t.co/1P7J2BmFYJ— News Arena India (@NewsArenaIndia) October 11, 2026ఇదీ చదవండి: ఢిల్లీలో హైటెన్షన్.. మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ కీలక ప్రెస్‌మీట్ -
పిరికితనమే వారి ప్రధాన లక్షణం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లపై దశాబ్ద కాలంగా సాగిస్తున్న పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల వ్యూహాలు, ఎత్తుగడలు తనకు పూర్తిగా తెలుసని, పిరికితనమే వారి ప్రధాన లక్షణమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాడుతున్న యువతకు అండగా నిలుస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను ఈ కథలో ప్రతినాయకులుగా(విలన్లు) రాహుల్ గాంధీ అభివరి్ణంచారు. వీరందరి చుట్టూ క్రమంగా ఉచ్చు బిగుస్తోందని, ఆ పని తామే చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఒక ప్రత్యరి్థని అర్థం చేసుకున్నట్లుగానే వారి ప్రతి కదలికను తాను లోపలి నుంచి పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోండి పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని భయపెట్టాలని చూస్తే వెనక్కి తగ్గేది లేదని రాహుల్ సవాల్ విసిరారు. ‘‘మోదీజీ.. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. 10 వేలు, 20 వేలు, 50 వేలు.. మీకు ఎంతమంది కావాలంటే అంతమంది పోలీసులను రప్పించుకోండి. విపక్ష నాయకులందరినీ, యువతను, మమ్మల్ని అందరినీ అరెస్టు చేయండి. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోండి. కానీ, మేము మిమ్మల్ని చుట్టుముడుతున్నాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’అని తేల్చిచెప్పారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అవసరమైన సమాచారం ఇప్పటికే తమ వద్ద ఉందని వెల్లడించారు. -
కౌటిల్యమా... కనువిప్పా?!
‘‘సాంకేతిక నైపుణ్యం, మేధస్సు, మంచి ఆలోచనలూ, పెట్టుబడులూ ఉన్నంత మాత్రాన ఒక జాతి అభివృద్ధి పథంలో పయనించదు, సమర్థవంతమైన నాయకత్వం కూడా ఉండాలి’’. ఈ అద్భుతమైన కొటేషన్‌ను ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలువరించారు. అటువంటి సమర్థ నాయకత్వానికి దూరదృష్టి, చిత్తశుద్ధి, విశ్వసనీయతలు కొలమానాలని కూడా ఆయన పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీలో గత పాతికేళ్లుగా ఈ నాయకత్వ సుగుణాలను తాను చూస్తున్నానని బాబు చెప్పుకొచ్చారు. సరిగ్గా పాతికేళ్ల కింద గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ పదమూడేళ్ల పాటు ఆ పదవిలో, మరో పన్నెండేళ్లుగా ప్రధాని పదవిలో నిరంతరాయంగా కొనసాగుతూ దేశాభివృద్ధికి, ప్రజల సాధికారత కోసం పట్టుదలతో పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.ప్రధానమంత్రి సాధించిన ఈ రికార్డు నిజంగానే అసాధారణమైనది. నభూతో నభవిష్యతి అని కూడా అనవచ్చేమో! అరుదైన ఈ ఘనతను సాధించిన ప్రధానిని దేశంలో ఉన్న రాజకీయ ముఖ్యులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా అభినందించారు. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ది హిందూ’ పత్రికలో చంద్రబాబు నాయుడు ఒక వ్యాసాన్ని రాశారు. అందులో మోదీ నాయకత్వ పటిమను ప్రశంసిస్తూ ఆయన సారథ్యంలో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదని సోదాహరణంగా విశదీకరించారు. ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్య భాగస్వామిగా ఉన్న చంద్రబాబు అలా రాయడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. చంద్రబాబు కూడా చిన్న నాయకుడేమీ కాదు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. కరుణానిధి తర్వాత దక్షిణాదిన ఆయనదే ఈ రికార్డు. అటువంటి నాయకుడు వ్యక్తం చేసే అభిప్రాయాల్లో స్థిరత్వం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. పూటకో మాట మాట్లాడితే ఇక విశ్వసనీయత ఎక్కడుంటుంది? విశ్వసనీయత, చిత్త శుద్థిలేని నాయకులు జాతిని ముందుకు నడిపించలేరనే భావన కూడా ఈ వ్యాసంలో కనిపిస్తుంది. నాయకుడు తన అభిప్రాయాలను ఎన్నటికీ మార్చుకోకూడదని ఎవరూ చెప్పరు. అయితే అటువంటి మార్పు ఎందుకువచ్చిందో, కారణాలేమిటో స్పష్టం చేస్తేనే మారిన అభిప్రాయానికీ, మార్చుకున్న నాయకునికీ విశ్వసనీయత పెరుగుతుంది.నరేంద్ర మోదీ పాతికేళ్ల అధికార కాలాన్ని గంపగుత్తగా ‘ది హిందూ’ వ్యాసంలో చంద్రబాబు సమర్థించారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ ఈ పాతికేళ్ల ప్రయాణం సాగిందని బాబు అభినందించారు. మోదీ వ్యక్తిగత ఔన్నత్యం, క్రమశిక్షణ వగైరాలను ప్రస్తావించడంతో పాటు దేశాభివృద్ధికి ఆయన చేపట్టిన పథకాలను ప్రస్తావిస్తూ వాటి గురించి గొప్పగా కితాబులిచ్చారు. ఈ వ్యాసాన్ని చదివిన వారికి చంద్రబాబు తీసుకున్న ఇంత పెద్ద యూ టర్న్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. పాతికేళ్ల వెనక్కు కూడా వెళ్లనవసరం లేదు. ఏడెనిమిదేళ్ల కిందటి చంద్రబాబు మాటలు గుర్తుకు చేసుకున్నా కూడా ఆయన విశ్వసనీయత ఏపాటిదో అర్థమౌతుంది. గతంలో నరేంద్ర మోదీని, ఆయన విధానాలనూ అపార్థం చేసుకున్నాననీ ఇప్పుడు జ్ఞానోదయమైన కారణంగా ప్రశంసిస్తున్నానని ఒక వాక్యం రాసి ఉన్నట్లయితే ‘ది హిందూ’ వ్యాసానికి సార్థకత చేకూరేది. అటువంటి సంజాయిషీ ఏమీ లేదు కనుక ఈ పొగడ్తలన్నీ పబ్బం గడుపుకోవడానికేనని ఎవరైనా భావిస్తే తప్పు పట్టగలమా?ప్రధానమంత్రిపై వ్యక్తిగతంగానూ, విధానాల పరంగానూ ఎవరూ విమర్శించని స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడిన ఘటనలు కేవలం ఏడెనిమిదేళ్లు వెనక్కి వెళ్లినా కనిపిస్తాయి. 2019 ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ‘‘గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ, నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం మోదీకి లేదు, ఆయనకు కుటుంబ బంధాల గురించి తెలియదు. విడాకులివ్వకుండా భార్యను దూరం పెట్టాడు. పెద్ద నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య, ఆయన పాలనలో బ్యాంకులు దివాళా తీశాయి. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడని’’ బాబు విరుచుకుపడ్డారు. నిండుసభలో మాట్లాడిన ఈ మాటలకూ, హిందూ వ్యాసంలో ప్రకటించిన అభిప్రాయాలకూ ఏమైనా సామ్యం ఉన్నదా?‘‘59 వేల కోట్ల రఫేల్ ఒప్పందం దేశరక్షణ రంగంలోనే అతి పెద్ద కుంభకోణం. ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశం ఉన్నది. దేశాన్ని మోసం చేశారు. మోదీజీ... సత్యాన్ని ఎక్కువకాలం దాచలేరు’’ అంటూ 2019 ఫిబ్రవరి 8న బాబు ట్వీట్ చేశారు. అప్పుడు దేశాన్ని మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే పరిణామం ఎలా సంభవించిందో బాబు వివరించాలి కదా! అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ‘‘భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని’’ కూడా మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. నరేంద్ర మోదీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదని ఆ సమయంలోనే టీడీపీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నరేంద్రమోదీ ఓ కేడీ అనీ, దేశం మొత్తం ఆయన్ను చోర్ అని పిలుస్తున్నదనీ కూడా ఆనాటి ఎన్నికల సభల్లో బాబు విమర్శలు చేశారు. మోదీకి దేశభక్తి లేదనీ, రాజకీయ భక్తి మాత్రమే ఉన్నదని దేశంలోని వ్యవస్థలన్నింటినీ ఆయన ధ్వంసం చేస్తున్నారని కూడా బాబు ధ్వజమెత్తారు.ఏడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సందర్భంలో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలన్నీ గుదిగుచ్చితే ఓ పుస్తకం అవుతుంది. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్ చేస్తానని అన్న విషయాన్ని గుర్తు చేయటం అప్రస్తుతం కాకపోవచ్చు. గోథ్రా అల్లర్ల నేపథ్యంలోనే చంద్రబాబు అలా మాట్లాడారు. కానీ, అప్పటినుంచే మోదీ గొప్ప నాయకత్వ లక్షణాలు కలవాడనీ, దేశాభివృద్ధికోసం కష్టపడ్డారని ఇప్పుడు మాట మార్చుతున్నారు. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు మార్చుకోకపోతే పొలిటీషియన్ కానేరడు’ అనే గిరీశం నిర్వచనానికి ఈ పిల్లిమొగ్గలు సరిపోతాయేమో కానీ, చిత్తశుద్ధి, విశ్వసనీయతలే నాయకత్వానికి కొలమానాలని చంద్రబాబు హిందూ వ్యాసంలో చెప్పిన నిర్వచనానికి మాత్రం సరిపోలవు. పోనీ, మోదీపై తీసుకున్న ఈ తాజా వైఖరికి చంద్రబాబు కట్టుబడి ఉంటారా? వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మోదీ ప్రభుత్వం ఓడిపోతే గెలిచిన కూటమిలో దూరకుండా ఉంటారా?2019 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవచ్చనే అంచనాలతోనే ఆయన కూటమి నుంచి వైదొలిగారనే అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయంతోనే విమర్శలతో చెలరేగిపోయారనీ, ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే ప్లేటు మార్చి కాళ్ల బేరానికి దిగడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తారు. అప్పుడు ఎన్డీఏ నుంచి వైదొలగిన సందర్భంగా తిరుపతిలో ‘ధర్మ పోరాటం’ పేరుతో జరిపిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నవాడే నాయకుడని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అంటే తను ఆచరించడానికి గిరీశం ఫిలాసఫీ, నీతులు చెప్పడానికి హిందూలో రాసిన ఫిలాసఫీ అనుకోవాలి. ‘‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..’’ అంటూ హిందూలో రాసిన ప్రేమలేఖలాంటి వ్యాసం పవిత్రమైనదా, కపటంతో కూడినదా అనే సందేహం ఎవరికైనా సహజంగానే తలెత్తుతుంది.కేంద్రంలో మోదీ సర్కార్ గత పన్నెండేళ్లలో ఎన్నడూ ఎరుగనంతటి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. యువతరంలో గూడుకట్టుకున్న అసంతృప్తి ఉద్యమ రూపాలను తీసుకుంటున్నది. బూటకపు ఎన్నికల బండారం బట్టబయలై రాజకీయ పార్టీలు వీధుల్లోకి వస్తున్నాయి. యువతరంతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకలు పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయాస పడుతున్నారు. వారి వీధి పోరాటాలను ఎద్దేవా చేస్తూ ఎన్డీఏలోని బీజేపీ సహా ఇతర పక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. కూటమిలో రెండో ప్రధాన పక్షమైన తెలుగుదేశం అధినేత మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శనాస్త్రాలకు దూరంగా ఉండిపోవడం కూడా పరిశీలకుల దృష్టిని దాటిపోలేదు. ఏమో, గుర్రం ఎగరావచ్చు. రేపు విపక్ష సంకీర్ణమే అధికారంలోకి రావచ్చు. అందుకే ఈ ముందు జాగ్రత్త అనుకోవాలి. అనుమానం రాకుండా జాతీయ పత్రికలో మోదీ భజన. జాతీయ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏలోని టీడీపీ పట్ల ఇదే స్నేహభావాన్ని ప్రదర్శిస్తుండటం కూడా గమనించదగ్గ విషయం. ఓట్చోరీ పైన ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రాహుల్‌గాంధీ ఏపీ ఎన్నికల్లో జరిగిన ఓట్చోరీ పైన ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. శుక్రవారం నాడు ఓట్చోరీ అంశంపై ప్రతిపక్ష బృందం రాష్ట్రపతిని కలిసింది. ఆధారాలుంటే ఇవ్వాలని రాష్ట్రపతి తమతో చెప్పినట్లు రాహుల్‌గాంధీ మీడియాకు వెల్లడించారు.బోగస్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? రాత్రి 8 గంటల తర్వాత 52 లక్షల ఓట్లు పోలైనట్లు ప్రకటించడంలోని ఔచిత్యమేమిటన్న ప్రశ్నకు ఇప్పటిదాకా ఈసీ నుంచి సమాధానం లేదు. నాటి ఎన్నికల ప్రధానాధికారి పదిరోజుల్లోగానే వీవీ ప్యాట్లను ఎందుకు కాల్చేయమన్నారన్న ప్రశ్నకూ సమాధానం లేదు. పోలింగ్ రోజు తగ్గిన ఈవీయమ్ బ్యాటరీ కౌంటింగ్ నాటికి ఎలా పెరిగిందంటే జవాబు చెప్పే దిక్కులేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కేంద్రాల ముందు లక్షలాది మంది బారులు తీరి నిలబడ్డారని చెబుతున్న ఎన్నికల సంఘం ఆ వీడియో ఫుటేజిని ఎందుకు చూపెట్టడంలేదో తెలియదు. కానీ ఏపీలో జరిగిన బూటకపు ఎన్నికల గురించి రాహుల్ మాట్లాడరు. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం అటువంటిది. చంద్రబాబు ‘ది హిందూ’లో రాసిన వ్యాసం కౌటిల్యంతో రాశారా? కనువిప్పు కలిగి రాశారా అన్న అంశాన్ని ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి.- వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.comఇదీ చదవండి: ‘నోబెల్ శాంతి’కి సరైన ఎంపిక -
2K కాదు 50K పోలీసులను తెచ్చుకో... మోదీకి రాహుల్ సవాల్
-
మోదీ, అమిత్ షాలపై ప్రియాంక గాంధీ ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నియంతృత్వ పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలను ఆమె ఖండించారు. 254 మంది ఎంపీలను అక్రమంగా నిర్బంధించి, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించారని ఎక్స్ వేదికగా ఆమె విమర్శించారు."దేశ రాజధానిని దిగ్బంధించి, రైళ్లు, మెట్రో సేవలను అడ్డుకుని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును వినియోగించుకుంటున్న యువతపై దాడులు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘం సహకారంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి" అని ప్రియాంక డిమాండ్ చేశారు.మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన నిరసనల సందర్భంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సహా పలువురిని పోలీసులు నిర్బంధించారు. జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన సుమారు వెయ్యి మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిరసనకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: రాహుల్, విజయ్ భేటీ.. గంటపాటు చర్చలు -
ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ సంచలన హెచ్చరిక
ఢిల్లీ: ‘మిస్టర్ మోదీ.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటారో తెచ్చుకోండి. యువకులందరినీ, నేతలందరినీ అరెస్ట్ చేసుకోండి. మేం మాత్రం వెనక్కి తగ్గం.. మిమ్మల్ని కమ్మేస్తాం’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.‘‘మేం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. 15 ఏళ్లలో దేశానికి ఏం జరిగిందో.. అది మళ్లీ జరగనివ్వం. రాజ్యాంగంపై దాడి చేసిన పాలకులను దించి తీరుతాం. దేశ యువతను చూసి గర్వపడుతున్నా. యువత తమ పోరాటాన్ని ఆపొద్దు.. మీ వెనుక మేం ఉన్నాం’’ అంటూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.కాగా, ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. కనాట్ ప్లేస్‌లో సీజేపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. గుంపులుగా వస్తున్న నిరసనకారులు ఆందోళనలో పాల్గొంటున్నారు. జంతర్ మంతర్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.ఇదీ చదవండి: విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం -
జ్ఞానేశ్ కుమార్ పోతారు.. ఈ ప్రభుత్వం కూడా పోతుంది!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను మరోసారి బలంగా వినిపించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.‘‘జ్ఞానేశ్ కుమార్ పోతారు.. ఈ ప్రభుత్వం కూడా పోతుంది. ఆ తర్వాతే ప్రజాస్వామ్యాన్ని బాగుచేసే ప్రక్రియ మొదలవుతుంది’’ అంటూ పోస్ట్ చేశారాయన. మరోవైపు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) చేపట్టిన ‘జంతర్ మంతర్ 2.0’ నిరసనలకు రాహుల్ దూరంగా ఉన్నారు. ఆయన శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌తో భేటీ కానున్నారు. అనంతరం విద్యార్థులతో జరిగే ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఇవే డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తమ ధర్నాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే అనుమతులు నిరాకరించడం, భద్రతా ఆంక్షల నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే సహా పలువురు నిరసనకారులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.ज्ञानेश कुमार जाएँगे। यह सरकार जाएगी। फिर शुरू होगी लोकतंत्र की मरम्मत। 🇮🇳 https://t.co/spGmBxgXLn— Rahul Gandhi (@RahulGandhi) October 10, 2026ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఈ నిరసనకు కాంగ్రెస్ దూరంగా ఉంది. అయితే గత నాలుగు రోజులుగా ఢిల్లీలో ఇండియా కూటమి ఈసీ వ్యతిరేక ధర్నాలు చేపట్టింది. నిన్న రాత్రి విపక్ష ఎంపీల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. ఇటు ప్రతిపక్షాల మధ్య సమన్వయం కోసం ప్రియాంక గాంధీ వాద్రా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: రైళ్లు, బస్సులు ఆపడమేంటి? కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
భవిష్యత్ అంతా సాంకేతికతదే
న్యూఢిల్లీ: భవిష్యత్ అంతా సాంకేతికతదేనని, యువత నిత్యం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. నెపుణ్యం కలిగిన మానవ వనరులకు దేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడానికి యువత, ప్రభుత్వం, శిక్షణా సంస్థలు సమన్వయంతో ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలోని షాంఘై వేదికగా జరిగిన 48వ వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో దేశం తరఫున పాల్గొన్న బృందంతో ఆయన ప్రత్యేకంగా సంభాషించారు. న్యూఢిల్లీలోని 7–లోక్‌కల్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, దేశ నైపుణ్య శిక్షణా వ్యవస్థలను మెరుగుపరచడానికి దోహదపడాలని ఆయన కోరారు. నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు లక్ష్యం ఇదేనన్నారు. పోటీలో తమ అనుభవాలను యువత ప్రధానితో పంచుకున్నారు. డిగ్రీలతో పాటు ఆచరణాత్మక నైపుణ్యం కూడా ముఖ్యమైనదన్నారు. 48వ వరల్డ్‌స్కిల్స్ పోటీ చైనాలోని షాంఘైలో సెపె్టంబర్ 22 నుంచి 27 వరకు జరిగింది. భారత్ నుంచి 70 మంది యువత పాల్గొన్నారు. ఆరు రజత పతకాలు, 20 ఉత్తమ ప్రతిభ పతకాలను గెలుచుకుని 10వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. -
‘కాక్రోచ్’కి పోటీగా ‘లాల్ హిట్’
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జనపథ్ ప్రాంతం శుక్రవారం భారీ ర్యాలీకి వేదికైంది. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం జంతర్‌మంతర్‌లో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించడం తెల్సిందే. అయితే, బొద్దింకలు వంటి వాటిని చంపే కీటక నాశిని పేరుతో తాజాగా అవతరించిన లాల్ హిట్ జనతా పార్టీ(ఎల్జేపీ) పోలీసులపై దాడులను, ప్రధాని మోదీని కించపరచడాన్ని ఖండించింది. జనపథ్ ప్రాంతానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో చేరుకున్న ఈ పార్టీ సభ్యులు..‘మనవాళ్లెవరైనా సంబంధం లేని బయటి వారిని దూషిస్తున్నా వద్దంటూ వారిస్తుంటాం. అలాంటిది, మన కుటుంబంలోని వ్యక్తి అయిన ప్రధాని మోదీని అనుచిత పదజాలంతో దూషించడం ఏమాత్రం సరికాదు. మన ప్రముఖులను, జవాన్లను, ఢిల్లీ పోలీసులను దూషించడం ఆపేయాలి. ఇలా దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’అని ఆ పార్టీకి చెందిన అయాన్ భట్నాగర్ కోరారు. వ్యవస్థలో మార్పు రావాలంటూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు తప్పుడు మార్గంలో సాగుతున్నాయన్నారు. రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు, చట్ట న్యాయం అమలయ్యేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవాన్ని కాపాడేందుకే నిరసన చేపట్టామని భట్నాగర్ తెలిపారు. సీజేపీ వ్యవహరిస్తున్న తీరు న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాలన వంటి ప్రజాస్యామ్య సంస్థల గౌరవాన్ని దిగజార్చేలా ఉందని ఆరోపించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారిని పోలీసులు నిర్బంధించి, బస్సుల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుచిత చర్యలుగా భావించిన వాటిపై ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా వ్యతిరేకిస్తామని ఎల్జేపీ అనంతరం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నేటి యువత ముఖ్యంగా జెన్ జెడ్ ప్రజాస్వామ్య ప్రక్రియల్లో పాలుపంచుకోవాలని, అభిప్రాయ బేధాలకు వాస్తవ సమాచారం, శాంతియుత నిరసనలు, ప్రజాచైతన్యం, చట్టానికి లోబడి ఉండే పరిష్కారం కనుగొనాలని ఎల్జేపీ పిలుపునిచ్చింది. దేశమే ప్రథమం, రాజ్యాంగానికి గౌరవం, ప్రజాస్వామ్యమే మనకు గుర్తింపు’అనేదే తమ నినాదమని ఎల్జేపీ వివరించింది. -
ఇక నరేంద్ర మోదీ విమానాశ్రయంగా నోయిడా ఎయిర్పోర్ట్
ఉత్తర ప్రదేశ్‌లోని జెవార్‌లో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రకటించారు. సీఎం యోగి మీడియాతో మాట్లాడుతూ.. ‘జేవార్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరప్రదేశ్ మంత్రిమండలి కృతజ్ఞతలు తెలుపుతోంది. ఈ విమానాశ్రయం రానున్న కాలంలో ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద విమానాశ్రయంగా, దేశంలోనే ఇది ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఆవిర్భవించనుందని ఆయన తెలిపారు.కాగా, ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోయిడా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. జూన్ 15న లక్నో నుండి వచ్చిన ఇండిగో విమానంతో ఇక్కడ తొలి విమాన ల్యాండింగ్ జరిగింది. ఈ విమానాశ్రయాన్ని స్విస్ సంస్థ జూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ భారతీయ అనుబంధ సంస్థ యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది.రూ. 11,282 కోట్ల వ్యయంతో నిర్మించిన నోయిడా విమానాశ్రయం మొదటి దశ ప్రారంభంలో సంవత్సరానికి 1.2 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంది. దీనిని రానున్న కొన్ని సంవత్సరాలలోనే 7 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించేలా చేయవచ్చు. ఇందులో పెద్ద విమానాలను నిర్వహించగల 3,900 మీటర్ల రన్‌వేతో పాటు, ఆధునిక నావిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఈ విమానాశ్రయం, వాయు, రోడ్డు, ఇతర రవాణా మార్గాల ద్వారా అనుసంధానంతో ఒక మల్టీమోడల్ రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయబడింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడమే కాకుండా, ప్రయాణికుల మౌలిక సదుపాయాల భద్రతను ప్రపంచ స్థాయిలో నిర్ధారించడానికి ఈ విమానాశ్రయం ఒక హై-టెక్ కోటగా రూపొందించబడింది. -
ఎన్డీయేలో ఉండి ఏం లాభం బాబు?
సాక్షి, ఢిల్లీ/అమరావతి: వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. మాములు పొలిటికల్ డ్రామాలాడలేదు. ‘చెల్లని’ జీవోలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్నారు. అయితే బాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయగా, ఆ తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో నారా పొలిటికల్ డ్రామాపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబు కూడా ఇటీవల రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయినా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలిసినా చంద్రబాబు ఈ దిశగా ఎందుకు ప్రయత్నించలేదని నిలదీస్తున్నాయి. అసలు ప్రధానితో చంద్రబాబు కనీసం దీని గురించి మాటైనా ప్రస్తావించారా? అని అంటున్నాయి. షెడ్యూల్-9 డిమాండ్ ఉందిగా..బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని కేంద్రం ద్వారా పరిష్కరించాలని, ఇందుకోసం సంబంధిత చట్టాన్ని తీసుకొచ్చి షెడ్యూల్-9లో చేర్చాలని బీసీ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై చట్టపరమైన పరిమితులు ఉన్నాయని తెలిసి కూడా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారా? సాధ్యం కాదని తెలిసినా చెల్లని జీవోలతో నాటకమాడారా? అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.గతంలోనూ ఇదే తీరంటూ ఆగ్రహంబీసీల రిజర్వేషన్ల విషయంలో టీడీపీ గతంలోనూ అడ్డంకులు సృష్టించడం.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఆనాడు టీడీపీ నేత ప్రతాప్‌తో పిటిషన్లు వేయించి రిజర్వేషన్లను అడ్డుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చట్టం దిశగా అడుగులేయకుండా చెల్లని జీవోలు ఇచ్చారని మండిపడుతున్నారు.బీసీలను మరోసారి మోసం చేశారని, చంద్రబాబు తీరు వెన్నుపోటు లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో చంద్రబాబు చర్చించారా? కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారా? అని నిలదీస్తున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేకపోతే ఆ కూటమిలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు చేసిన రాజకీయ నాటకమేనని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుబట్టిన సుప్రీం కోర్టు -
సీఈసీపై సమరం.. జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్.. ఢిల్లీలో కీలక పోరు!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై రాజకీయ పోరు మరింత ఉధృతమైంది. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలను కొనసాగిస్తున్నాయి. వరుస ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ రాజకీయంగా వేడెక్కింది. ఇప్పటికే మూడు రోజులుగా నిరసనలు చేపట్టిన విపక్ష ఎంపీలు.. నాలుగో రోజూ తమ ఆందోళనలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. ఎస్ఐఆర్ అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు విపక్ష ఎంపీలు నేడు మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం కానున్నారు. అనంతరం ఇండియా కూటమి నేతల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ అభ్యంతరాలను వివరించనుంది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ఫిర్యాదు చేయడంతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ భేటీకి సంబంధించి పది మంది నేతల బృందం రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నట్లు సమాచారం.రేపు జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనమరోవైపు, సీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) రేపు జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కూడా ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. అయితే, నిరసనకు పోలీసుల అనుమతి విషయంలో స్పష్టత లేకపోయినా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు చెబుతున్నారు. నిరసనకు ముందు తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారని ఆ సంస్థ ఆరోపించగా, ఈ పరిణామాలు ఢిల్లీలో ఉద్రిక్తతలను పెంచాయి.భారీ భద్రతవరుస నిరసనలు, రేపటి ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 20 వేల మంది పోలీసులను మోహరించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. నిరసనకారుల కదలికలపై నిఘా పెంచడంతోపాటు రద్దీ ప్రాంతాల్లో అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు. ఆందోళనల కారణంగా న్యూఢిల్లీ పరిధిలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.మద్యం దుకాణాలు బంద్మరో కీలక పరిణామంగా.. ఢిల్లీలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అన్ని రిటైల్ మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీసుల నుంచి అందిన సమాచారం ఆధారంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎస్ఐఆర్పై భిన్న వాదనలుఎస్ఐఆర్ ద్వారా పశ్చిమ బెంగాల్లో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, ముస్లిం వర్గాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సహా పలువురు విపక్ష నేతలు సీఈసీ రాజీనామాతోపాటు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.అయితే, ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ను ఓటర్ల జాబితాలో నకిలీ, పునరావృత, మరణించిన వారి పేర్లను తొలగించే ప్రక్రియగా సమర్థిస్తోంది. మరోవైపు 42 మంది మాజీ న్యాయమూర్తులు కూడా ఎన్నికల సంఘానికి మద్దతుగా బహిరంగ లేఖ విడుదల చేసి, ఆరోపణలు చేసేవారు ఆధారాలను సమర్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై మొదలైన వివాదం ఇప్పుడు ఎన్నికల సంఘం నాయకత్వంపై రాజకీయ పోరుగా మారింది.ఇదీ చదవండి: దేశం కంటే జ్ఞానేశ్ కుమార్ గొప్ప? -
మోదీ గద్దె దిగు.. లేదా ప్రజలే దింపుతారు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయతి్నస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం రక్షించలేవన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గద్దె దిగాలని, లేకపోతే ప్రజలే గద్దె దించుతారని అన్నారు.ఓట్ బచావో..దేశ్ బచావో ఉద్యమంలో భాగంగా లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రియాంకాగాం«దీ, కేసీ వేణుగోపాల్, ఇతర ఇండియా కూటమి నేతలు గురువారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. వారితో కలిసి అక్కడ నివాళులర్పించిన తర్వాత రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.ఓట్లు లాక్కోవడానికి ప్రధాని, జ్ఞానేశ్ ప్రయత్నం‘ఓట్ బచావో..దేశ్ బచావో ఉద్యమం కాంగ్రెస్ పార్టీ పోరాటం కోసమో, ఇండియా కూటమి కోసమో కాదు. ఇది దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ ఉద్యమం. 2014 ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు చేరింది. 2024 నాటికి 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దేశ జనాభా 140 కోట్లకు చేరుకుంది. ఓటర్ల సంఖ్య మరింతగా పెరగాల్సింది పోయి ఏకంగా 13 కోట్ల ఓట్లు గల్లంతు అయ్యాయి? అవి ఎలా తగ్గిపోయాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చెప్పాలి. ఇప్పటివరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఎన్నిసార్లు జరిగినా పేదల ఓట్లకు ముప్పు కలగలేదు. ఇప్పుడు మాత్రం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను ఎన్నికల సంఘం కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.బీజేపీని వ్యతిరేకించే వారి ఓట్లే లక్ష్యం కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశ ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి వచి్చంది. దేశ ప్రజలను ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లని, రెండు వర్గాలుగా విభజిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్లు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న పేదలు మరోవైపు అన్నట్లుగా మోదీ, జ్ఞానేశ్‌కుమార్ పరిస్థితులను మార్చారు. బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని వాటిని తొలగిçస్తున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు.రాహుల్ వెంటే సీఎం..గురువారం మధ్యాహ్నం మోట్స్ హోటల్లో ఇండియా కూటమి లంచ్ మీటింగ్ నిర్వహించగా, ఆ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఈ సమావేశానికి వచ్చిన రేవంత్‌రెడ్డి సుమారు కిలోమీటరు దూరంలోనే తన కాన్వాయ్ నుంచి దిగారు. రాష్ట్ర ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్ లతో కలిసి నడుచుకుంటూ వచ్చి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంకాగాంధీలతో కలిసి ఒకే బస్సులో రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.ఇదీ చదవండి: సైబర్ మోసాల కట్టడికి గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ -
క్యాన్సర్ రోగులకు భారీ ఊరట
న్యూఢిల్లీ: కేవలం రూ.2,700 ఖర్చయ్యే ఒక క్యాన్సర్ ఔషధాన్ని ఏకంగా రూ.27,000 గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ) ముద్రించి విక్రయిస్తున్న ఉదంతాలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో మోదీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం కల్గేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాన్సర్ ఔషధాల ఎంఆర్పీ ధరలో వ్యాపారుల వాణిజ్య మార్జిన్ 30 శాతం దాటకూడదని ప్రభుత్వం పరిమితి విధించింది. దీంతో బ్రాండెడ్, జనరిక్, దేశీయ, విదేశీ, పేటెండెడ్, నాన్–పేటెంటెడ్ నాన్–షెడ్యూల్డ్ యాంటీ–క్యాన్సర్ డ్రగ్స్ ధరలు భారీగా తగ్గే ఆస్కారముంది. దాదాపు 70 శాతం ధరలు తగ్గే అవకాశం ఉందని వాణిజ్యవర్గాలు అంచనావేస్తున్నాయి. ఈనెలాఖరు నుంచి మార్జిన్ పరిమితి నిర్ణయం అమల్లోకి వచ్చే ఆస్కారముంది. ప్రాణాధారమైన కీలక ఔషధాల ధరలు తగ్గడంతో ఈ డ్రగ్స్ సామాన్యులకు సైతం నిరంతరం అందుబాటులో ఉండనున్నాయి. 35 రకాల పేటెంటెడ్ ఔషధాలు సహా మొత్తంగా 110 యాంటీ–క్యాన్సర్ డ్రగ్స్ ధరలు దిగిరానున్నాయి. ‘‘ఇష్టారీతిగా ధరలను ముద్రించి రోగుల నెత్తిన ధరల బండ పడేసే విధానానికి స్వస్తిపలికి వాణిజ్య మార్జిన్ హేతుబద్ధత(టీఎంఆర్)ను తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశం’’అని ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. ధరలు 70 శాతం దాకా తగ్గే నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సొమ్ము ఏటా రూ.2,500 కోట్లమేర ఆదా అయ్యే ఆస్కారముంది. సెపె్టంబర్ 28వ తేదీన 16 శాతం ఏకరూప మార్జిన్ కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘‘రిటైలర్‌కు రూ.2,700కే లభించే ఒక క్యాన్సర్ డ్రగ్‌ను రోగికి ఏకంగా రూ.27,000కు అమ్మడం ఎంత దారుణం. ఇది పట్టపగలే నిలువెత్తు దోపిడీ’’అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయానికి, ఈ కేసుకు ఎలాంటి సంబంధం, సందర్భం లేదు అని ప్రభుత్వవర్గాలు వివరించాయి. తగ్గిన మార్జిన్ ఖరారయ్యాక ఔషధాల నూతన ధరల వివరాలు సంబంధిత ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ధరల్లో ఎందుకంత తేడా? దేశంలో విక్రయించే ఔషధాలను ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. అత్యావశ్యక మందులతో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్(ఎన్ఎల్ఈఎం)ను రూపొందించింది. వీటి ధరలు ఏటా అంతగా పెరగవు. వాటిపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. కానీ వీటిలో కేవలం 18 శాతం ఔషధాలే ఉన్నాయి. మిగతా 82 శాతం ఔషధాలను నాన్–షెడ్యూల్డ్ జాబితాలో పెట్టారు. వీటి ధరలు ఏటా 10 శాతం అంతకంటే ఎక్కువే పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. వీటిని ఇష్టారీతిగా ఎంఆర్పీ ముద్రించి విక్రయిస్తుండటంతో క్యాన్సర్ రోగుల జేబుకు పెద్ద చిల్లు పడుతోంది. కొన్ని ఖరీదైన మందులపై దిగుమతి సుంకం, జీఎస్టీ మినహాయింపులు ఇచ్చినా సామాన్యులకు ప్రయోజనం పెద్దగా ఉండట్లేదు. భారత్‌లో ప్రతి సంవత్సరం కొత్తగా అన్ని రకాల క్యాన్సర్ రోగులు 15 లక్షల మంది పెరుగుతున్నారు. -
సైబర్ మోసాల కట్టడికి గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్
న్యూఢిల్లీ: నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో సీమాంతర సైబర్ మోసాలు, డీప్‌ఫేక్ ముప్పు నానాటికీ పెరుగుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి మోసాలు, ప్రమాదాలను ఎదుర్కోవడానికి అందరూ చేతులు కలపాలని, గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా ఒక కట్టుదిట్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు, టెక్నాలజీ కంపెనీలు, టెలికం ఆపరేటర్లు, ఆర్థిక సంస్థలు ఏకతాటిపైకి రావాలని సూచించారు. గురువారం ఢిల్లీలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్–2026’లో ప్రధానమంత్రి మాట్లాడారు. సైబర్ మోసాలను దీటుగా ఎదుర్కోవడంలో భారత్ గణనీయమైన అనుభవం గడించిందని, ఈ అనుభవాన్ని ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. సైబర్ మోసాలు, నేరాలకు సరిహద్దులతో సంబంధం ఉండదని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మోసాలు జరగవచ్చని అన్నారు. అవి ఎప్పుడో సరిహద్దులను దాటేశాయని అన్నారు. సాంకేతికత అనేది ప్రజల విశ్వసనీయతను పొందినప్పుడే అది మరింత విస్తృత స్థాయిని సాధిస్తుందని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. సామాన్యుడికి కావాల్సింది అదే ‘‘సైబర్ నేరాలకు సరిహద్దులను అధిగమించే శక్తి ఉంది. ఒక దేశంలో ఉన్న వ్యక్తి మరొక దేశం సహాయంతో మూడో దేశంలో నేరానికి పాల్పడవచ్చు. డీప్‌ఫేక్‌లు ఎంత పెద్ద సవాలుగా మారాయో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కొత్త ముప్పులను నిరోధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే. ఇందుకోసం ప్రపంచస్థాయి విధానాన్ని రూపొందించుకోవాలి. ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, టెలికం ఆపరేటర్లు, ఆర్థిక సంస్థలు ఈ విధానంతో అనుసంధానం కావాలి. పైబర్ మోసాలను అడ్డుకోగల ఒక ప్రపంచ స్థాయి యంత్రాంగాన్ని రూపొందించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలికం నెట్వర్క్ ఆపరేటర్లు ముందుకు రావాలని కోరుతున్నా. టెలికం, డిజిటల్ సాంకేతికతల విస్తరణ మరింత పెరగాలంటే వాటి భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత కీలకం. ముఖ్యంగా మొబైల్, నెట్వర్క్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక సాధారణ పౌరుడు నియమావళి లేదా వ్యవస్థల భాషలో ఆలోచించడు. అతడికి నమ్మకమే సర్వోన్నతం. ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవడం, సందేశం నిజమైనదా లేదా నకిలీదా అని చూడడం, చెల్లింపు సురక్షితమేనా, వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉందా అని చూడడమే సామాన్యుడికి కావాల్సిందని’’ మోదీ అన్నారు. టెలికం రంగంలో ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ ‘‘దేశంలో 2022లో 5జీ సేవలను ప్రారంభించాం. ప్రస్తుతం 5జీ కనెక్టివిటీ ప్రతి జిల్లాకూ చేరింది. 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు 5జీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాయి. 2022తో పోలిస్తే మొబైల్ ఇంటర్నెట్ వేగం 10 రెట్లు పెరిగింది. డిజిటల్ పాలనలో భారత్‌కు అపారమైన అనుభవం ఉంది. డీబీటీ ద్వారా దాదాపు రూ.50 లక్షల కోట్లను లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేశాం. దీంతో దాదాపు రూ.5 లక్షల కోట్లు పక్కదారి పట్టకుండా ఆదా అయ్యాయి. ఆ డబ్బు ఇప్పుడు అర్హులైన లబి్ధదారులకు చేరుతోంది. సరైన ప్రయోజనాల కోసం ఖర్చవుతోంది. టెలికం రంగంలో ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ వేగంగా దూసుకెళ్తోంది’’అని మోదీ వివరించారు. -
శాటిలైట్ ఇంటర్నెట్ పై ముదురుతున్న వివాదం
-
స్టార్ లింక్ పై ఇలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం కౌంటర్
-
నానా పటేకర్.. అందుకే ఆయన ఎంతో ప్రత్యేకం: ప్రధాని మోదీ
ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నానా పటేకర్ మరణం సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ‘ఓం శాంతి’ అంటూ నివాళులర్పించారు.‘‘కొద్దిమంది నటులకే ఉండే తీవ్రత, ప్రత్యేకత, చెరగని ఉనికి నానా పటేకర్గారి సొంతం. ప్రతి పాత్రలోనూ ఆయన అద్భుతమైన వైవిధ్యం, సృజనాత్మకతను ప్రదర్శించారు. తరతరాలు గుర్తుంచుకునే పాత్రలను మనకు అందించారు’’ అని మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన నటనతోనే కాకుండా నిర్మొహమాటమైన, ముక్కుసూటి అభిప్రాయాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని అన్నారు. తాను నమ్మిన విషయాలను చెప్పేందుకు ఆయన ఎప్పుడూ వెనుకాడేవారు కాదని కొనియాడారు.‘హిందీ, మరాఠీ సినిమాకు అపార సేవ’హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలకు నానా పటేకర్ చేసిన సేవలు అపారమని మోదీ పేర్కొన్నారు. ఆయన మరణం సినీ ప్రపంచంలోనూ, ఆయనను అభిమానించే కోట్లాది మందిలోనూ తీరని లోటును మిగిల్చిందన్నారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.Few actors possessed the intensity, individuality and unmistakable presence that Shri Nana Patekar Ji had. He brought remarkable versatility and creativity to every role and gave us characters that will be remembered for generations. He was also admired for his frank and forthright views, never hesitating to express what he believed in. Shri Nana Patekar’s contribution to Hindi and Marathi cinema was immense. His passing leaves a deep void. My condolences to his family, friends and countless admirers. Om Shanti.— Narendra Modi (@narendramodi) October 8, 2026గుండెపోటుతో కన్నుమూతనానా పటేకర్ గురువారం ఉదయం గోవాలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ స్పందించలేదు. ఉదయం 5.20 గంటల సమయంలో ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన వయసు 75 సంవత్సరాలు.రంగస్థలం నుంచి వెండితెర వరకు..విశ్వనాథ్ పటేకర్గా జన్మించిన నానా.. 1978లో వచ్చిన ‘గమన్’ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘అగ్ని సాక్షి’, ‘వెల్కమ్’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేశారు. ‘క్రాంతివీర్’(తెలుగులో మోహన్‌బాబు నటించిన పుణ్యభూమి నా దేశం) చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ‘అగ్ని సాక్షి’కి ఉత్తమ సహాయ నటుడిగా మరో జాతీయ పురస్కారం దక్కింది.నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ నానా పటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు. 1991లో ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. రంగస్థల నటుడిగానూ ఆయనకు విశేష గుర్తింపు ఉంది. కళారంగానికి చేసిన సేవలకు 2013లో పద్మశ్రీ పురస్కారం లభించింది.నానా పటేకర్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా నానా పటేకర్ మృతి కళా ప్రపంచానికి పూడ్చలేని లోటని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తదితరులు ఆయనకు నివాళులర్పిస్తూ.. భారతీయ సినిమా, సామాజిక సేవకు నానా చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.ఇదీ చదవండి: కాస్ట్లీ కారును వద్దనుకుని.. రైతులకు సాయం -
ఓటు హక్కును హరించే కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పౌరుల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం అధికారులు పనిచేస్తున్నా రని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో తప్పు లు చేసిన వారిని వదిలేసి, ఆ తప్పు లను సరిదిద్దాలని డిమాండ్ చేసిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లి కార్జున ఖర్గేలతో పాటు ఇండియా కూటమి నేతలను అరెస్టు చేయడం ప్రజా స్వామ్యాన్ని అపహా స్యం చేయడమేనని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాహుల్, ప్రియాంకలపై పోలీసుల దాడి మోదీ, అమిత్ షాల అసహ నానికి నిదర్శన మని విమర్శించారు. దేశంలో ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దాడులు జరగ డం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అభి వర్ణి ంచారు. బుధవారం ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌చేస్తూ.. జంతర్‌మంతర్ వద్దకు బయలుదేరిన రాహుల్, ప్రియాంక తదితరు లను పోలీసులు అరెస్టు చేసి బారఖంబా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. కేరళ సీఎం వీడీ సతీషన్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలతో కలిసి వారిని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గేల అరెస్టు దారుణమని మండిపడ్డారు. ప్రజలను రెండు వర్గాలుగా విభజించే యత్నందేశ ప్రజలను రెండు వర్గాలుగా విభజించేందుకు కేంద్రం ప్రమాదకర క్రీడకు తెరలేపిందని సీఎం విమర్శించారు. ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు లేని పౌరులుగా దేశాన్ని విడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వ్యవహరి స్తున్నారని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘సైమన్ గో బ్యాక్’ తరహాలోనే నాడు స్వాతంత్య్ర పోరాటంలో ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం ఏవిధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందో, నేడు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ చేస్తున్న ఈ ఆందోళన కూడా భవిష్యత్తులో నరేంద్ర మోదీని అధికారంలో నుంచి దించడానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ను వాడుకుని ఓట్లను తొలగించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ అప్రజాస్వామిక విధా నాలపై దీర్ఘకాలిక కార్యాచరణతో పోరాడతా మని, ప్రజలందరినీ ఏకం చేసి ఈ కుట్ర లను మూకుమ్మడిగా తిప్పికొడతామన్నారు.రఘురాంరెడ్డికి గాయాలురాహుల్గాంధీకి సంఘీభావంగా రాష్ట్ర ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాం రెడ్డి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి జంతర్ మంతర్‌వైపు వస్తున్న ఎంపీలను పోలీసులు అడ్డుకున్నా రు. ఈ సందర్భంగా పోలీసులు ఎంపీలపై లాఠీలు ఝుళిపించారు. దీంతో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డికి గాయాలయ్యాయి. -
మోదీకి రాష్ట్రపతి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కీలకమైన మైలురాయి ప్రజల సంక్షేమం పట్ల మోదీకి ఉన్న అచంచలమైన నిబద్ధతను, భారత్ పురోగతిని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మనం చూసిన పరివర్తన ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఉద్ఘాటించారు. ‘‘గృహవసతి, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, ఇంధనం, ప్రాథమిక సౌకర్యాల లభ్యతను విస్తరించడం నుంచి కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, అవకాశాలను బలోపేతం చేయడం వరకు.. అనేక పరివర్తనాత్మక కార్యక్రమాలు దేశం నలుమూలలా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేశాయి. ప్రధాని మోదీ కృషితో ఎన్నో విజయాలు సాధ్యమయ్యాయి. ఆత్మవిశ్వాసంతో, నూతన ఆశయాలతో ముందుకు సాగుతున్న భారత్ వైపు ప్రపంచం నూతన గౌరవం, విశ్వాసంతో చూస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో మోదీ మార్గదర్శకత్వం, సంకల్పం నుండి భారత ప్రజలు ప్రయోజనం పొందుతూనే ఉండాలి. ప్రజాసేవలో అంకితభావంతో ముందడుగు వేస్తున్న మోదీకి రాబోయే కాలంలో మంచి ఆరోగ్యం, ఆనందం, నిరంతర శక్తి లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రాష్ట్రపతి వెల్లడించారు. మోదీకి ఎల్కే అద్వానీ ఆశీస్సులు ప్రధాని మోదీ బుధవారం మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అద్వానీ నుంచి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘అద్వానీని కలిసి ఆశీస్సులు తీసుకున్నాను. దశాబ్దాల తరబడి వారు అందించిన సేవలు, చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోయే ముద్రను వేశాయి. భారతదేశ పురోగతిని బలోపేతం చేయడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు’’ అని మోదీ కొనియాడారు. ప్రముఖులకు మోదీ కృతజ్ఞతలు అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి అదే కర్తవ్య స్ఫూర్తితో, అంకితభావంతో పని చేస్తూనే ఉంటానని ప్రధాని మోదీ వివరించారు. వికసిత్ భారత్ అనే సామూహిక దార్శనికతను సాకారం చేయడానికి మరింత శక్తితో పనిచేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజల ఆప్యాయత, విశ్వాసం, ఆశీస్సులతో ప్రతి దశలోనూ రూపుదిద్దుకున్న ఈ 25 ఏళ్ల సేవా ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చిందని ఉద్ఘాటించారు. పాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు అభినందనలు తెలియజేసిన ప్రముఖులకు మోదీ బుధవారం ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం, భాగస్వామ్యంతో తన సేవా యాత్ర అడుగడుగునా బలోపేతమైందని పేర్కొన్నారు. ప్రముఖులతోపాటు ప్రజల అభినందనలు తనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని వెల్లడించారు. -
చేసి చూపిద్దాం
ఓటుబ్యాంకు ప్రయోజనాల కోసం రాజకీయంగా విడిపోవడం దేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటి. ఏదైనా ఆపద వస్తే అది వర్గం లేదా కులానికి అతీతంగా అందరిపైనా ప్రభావం చూపుతుంది. రైతు పొలంలో నీటి కొరత ఏర్పడితే.. ఆ సమస్య కేవలం ఒక కులానికే పరిమితం అవుతుందా? సమస్య అందరికీ సంబంధించినదైనప్పుడు పరిష్కారం కూడా అందరికీ వర్తించేలా ఉండాలి. – వికసిత్ భారత్ సంకల్ప్ సభలో ప్రధాని మోదీన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 ఏళ్ల మైలురాయిని అధిగమించింది. 2001 అక్టోబర్ 7న తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ పాలనకు పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మనం అనుకున్నది చేసి చూపిద్దాం(వుయ్ విల్ డూ ఇట్) అనే కొత్త నినాదాన్ని ప్రధానమంత్రి వినిపించారు. ప్రజలందరి ఉమ్మడి కృషితో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాతికేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని బుధవారం ఢిల్లీలో ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’ నిర్వహించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, మోదీ అభిమానులు భారీగా తరలివచ్చారు. మోదీ మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఒకప్పుడు అసాధ్యంగా భావించినవి నేడు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. 2026లో మనం కంటున్న ‘అభివృద్ధి చెందిన భారత్’అనే కల కచ్చితంగా సాకారం అవుతుందని, దేశం ఇప్పుడు ఇక్కడే ఆగిపోవడానికి ఎటువంటి కారణం లేదని ఉద్ఘాటించారు. వందేళ్ల క్రితం మన జనాభా 40 కోట్ల కంటే తక్కువగా ఉండేదని, నేడు 140 కోట్లకు చేరిందని అన్నారు. 140 కోట్ల మంది పౌరులు కలిసి 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను నిర్మిస్తారని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజల శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంది ‘‘ఎన్నికల సమయంలో కులపరమైన విభజనలు ఒక ప్రధాన సవాలుగా మారుతున్నాయి. ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం రాజకీయంగా విడిపోవడం దేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అది వర్గం లేదా కులానికి అతీతంగా అందరిపైనా ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. రైతు పొలంలో నీటి కొరత ఏర్పడినప్పుడు, ఆ సమస్య కేవలం ఒక కులానికే పరిమితమవుతుందా? విద్యుత్ లేనప్పుడు చీకటి కేవలం ఒక వర్గానికే అలుముకుంటుందా? సమస్య అందరికీ సంబంధించినదైనప్పుడు పరిష్కారం కూడా అందరికీ వర్తించేలా ఉండాలి. కేవలం పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడగలరని ఎవరైనా ఉహించారా? కానీ. భారత్ దీనిని సాధ్యం చేసి చూపించింది. అందుకే 140 కోట్ల మంది భారతీయుల శక్తి సామర్థ్యాలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మన దేశం రూపాంతరం చెందడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఫలితాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. సవాళ్లకు 140 కోట్ల పరిష్కారాలున్నాయి 2047 నాటికి వికసిత్ భారత్: మనం చేసి చూపిద్దాం. అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్: మనం చేసి చూపిద్దాం. స్వయం సమృద్ధి: మనం చేసి చూపిద్దాం. ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం: మనం చేసి చూపిద్దాం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం: మనం చేసి చూపిద్దాం. అంతరిక్షంలోకి అడుగుపెట్టడం: మనం చేసి చూపిద్దాం. ఈ శక్తి, ఈ ఉత్సాహం, ఈ ఆత్మవిశ్వాసం అద్భుతమైనవి. దూరదృష్టితో కూడిన విధానాలు, అవిశ్రాంత కృషి ద్వారా ఈ లక్ష్యాలను సాధిస్తాం. భారత్ ముందు సవాళ్లు ఉండొచ్చు గానీ 140 కోట్ల పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఫ్లై దుబాయ్ విమానంలో ప్రయాణికులను రక్షించిన భారతీయ కెపె్టన్ స్మిత్ మచ్ఛార్ గురించి నేడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. మేడ్ ఇన్ ఇండియా విమానాల గురించి కూడా ప్రపంచం మాట్లాడుకునే రోజు వస్తుంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలే నా బలం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ మైలురాయిని చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. ప్రభుత్వ అధినేతగా అవిశ్రాంతంగా సేవలందిస్తూ ఈ రోజుతో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. నాపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలకు ధన్యవాదాలు. నా దృష్టిలో ప్రజలే భగవంతుడు. కష్టపడి పనిచేసే బీజేపీ కార్యకర్తలే నా బలం. దేశ ప్రజల పాదపద్మాలకు భక్తిపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే బీజేపీ, ఎన్డీఏలోని నా సహచరులకు, ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గత 25 ఏళ్లలో అనేక ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలైనా సరే, పార్లమెంటరీ ఎన్నికలైనా సరే ప్రజలు ఎల్లప్పుడూ తమ సేవ కోసం నన్ను ఎన్నుకున్నారు. ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కూడా వందనాలు సమర్పిస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా, ఏ పదవిలో ఉన్నా అందులో ప్రజలదే అత్యంత గొప్ప పాత్ర. నా దృష్టిలో ప్రజలు సాక్షాత్తు దైవస్వరూపులు. కోట్లాది మంది భారతీయుల విశ్వాసం, లెక్కలేనంత మంది పార్టీ కార్యకర్తల కఠోర శ్రమ ఎల్లవేళలా నాకు గొప్ప బలంగా నిలిచాయి. వారికి సర్వదా కృతజ్ఞుడిని నేను గతాన్ని తిరిగి చూసుకున్నప్పుడు కృతజ్ఞతాభావం తప్ప మరేమీ కలగదు. నాకు ఎన్నో విషయాన్ని నేర్పించిన ప్రతి వ్యక్తికీ, ప్రతి అనుభవానికీ సర్వదా కృతజ్ఞుడిని. ఉపాధ్యాయులు నాకు వినయాన్ని నేర్పారు. నన్ను కిందకు లాగినవారు తిరిగి ఎలా పైకి లేవాలో నేర్పారు. నా మద్దతుదారులు నన్ను ప్రోత్సహిస్తే, విమర్శకులు నా అంతరాత్మను పరిశీలించుకోవడం నేర్పారు. నాకు అండగా నిలిచినవారు నమ్మకానికి ఉన్న శక్తిని చూపించారు. ఈ దేశం అపారమైన ఆశీర్వాదాలు అందించింది. అందుకే దేశం పట్ల నా బాధ్యత అత్యంత గొప్పది. దేశంలో ప్రతి పౌరుడికీ నాపై ప్రథమ హక్కు ఉందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. ప్రజల విశ్వాసంతో కూడిన ఈ 25 ఏళ్ల కాలం, ఈ 25 ఏళ్ల అనుభవం ఒక గొప్ప సంపద. ఈ సంపద కేవలం మోదీకి మాత్రమే చెందినది కాదు.. ఇది దేశానికి చెందినది. భరతమాత బిడ్డలందరికీ ఈ సంపదపై హక్కు ఉంది. ఒంటరినని ఎప్పుడూ భావించలేదు నేర్చుకోవాలనే తపన నా జీవితంలో ఒక భాగంగా మారింది. ఇప్పటికీ నన్ను నేను ఒక విద్యార్థిగానే భావిస్తా. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటా. నేను ఎప్పుడూ ఒంటరినని భావించలేదు. భారతదేశ సాంస్కృతిక ఆత్మకు రక్షకులుగా ఉంటూ, భరతమాతకు సేవ చేయడం అనే ఏకైక లక్ష్యంతో పనిచేసే అసంఖ్యాక స్వయంసేవకులు అండగా ఉన్నారు. తాము సేవలకుమని వారు ప్రతిపక్షం గుర్తుచేస్తుంటారు. అదే నాకు స్ఫూర్తి. నిబద్ధత, అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ప్రతి స్వయంసేవకుడికి, కార్యకర్తకు నేను గౌరవపూర్వకంగా అభివందనం చేస్తున్నా. నన్ను వ్యతిరేకించిన వారు ప్రజాస్వామ్య శక్తిని నాకు వివరించారు. ప్రతి సంక్షోభం నా సహనాన్ని పరీక్షించింది. ప్రతి విజయం నా బాధ్యతలను మరింత విస్తరింపజేసింది. ప్రతి సాధన గొప్ప లక్ష్యాల దిశగా ముందుకు సాగడానికి ధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని ఇచ్చింది. కర్తవ్య నిర్వహణే సర్వస్వం.. అదే నా ధర్మం ఈ రోజు కేవలం జ్ఞాపకాలకే పరిమితమైనది కాదు. మన సంకల్పాలకు నూతన ఉత్సాహాన్ని జోడించుకునే రోజు ఇది. ‘మేము దీన్ని సాధించి తీరుతాం’అనే మాటను, ఆ సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటించే రోజు ఇది. కేవలం సంస్థ కోసమే పనిచేసిన వ్యక్తిగా నా రాజకీయ పనితీరు నివేదిక (రిపోర్ట్ కార్డ్) ఉంటుంది. గతంలో ఇతరుల తరపున ఎన్నికల్లో పనిచేశాను కానీ, స్వయంగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయలేదు. ఎన్నికల రాజకీయాల్లో రాణించాలనే కోరిక ఉండి ఉంటే, నేను చాలా ముందే ఆ రంగంలోకి అడుగుపెట్టి ఉండేవాడిని. కానీ, అది నా స్వభావం కాదు. ఎందుకంటే, వ్యక్తిగత ఆశయాల కోసం కాకుండా ఒక నిర్దిష్ట లక్ష్యం(మిషన్) కోసం జీవించే వ్యక్తిగా ఉండాలన్నదే నా ఆశయం. చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను. నాకు లభించిన ఏ బాధ్యతలనైనా సరే, వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా సమర్థవంతంగా నిర్వర్తించాను. నా జీవితానికి ఒకే ఒక్క లక్ష్యం ఉంది.. అది దేశం కోసం నిస్వార్థ సేవ. నా దృష్టిలో కర్తవ్య నిర్వహణే సర్వస్వం. అదే నా ధర్మం. కర్తవ్యాన్ని నిర్వర్తించడం నా హక్కు. పనిని నా బాధ్యతగా భావిస్తాను. నా పూర్తి సామర్థ్యంతో ప్రతి పనిని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాను. ఆ పని ఆగకూడదు, ఆ కృషి ఆగిపోకూడదు. నా దృష్టిలో పని అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దేశం పట్ల నాకున్న అంకితభావం. దేశం కోసం పని చేస్తా, ప్రజల కోసం పని చేస్తా’’అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. -
విష్ణువు అవతారమే మోదీ.. కల్కి: భూటాన్ ప్రధాని
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తనకు అన్నయ్యగా భావిస్తానని, ఆయనను విష్ణువు అవతారంగా చూస్తానని భూటాన్ ప్రధాని త్షెరింగ్ తోబ్గే తెలిపారు. మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ పొరుగు దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చిందని, భూటాన్ అభివృద్ధి ప్రణాళికలకు భారత్ అందిస్తున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు.ఢిల్లీలో 2019లో మోదీని కలిసిన సందర్భాన్ని తోబ్గే గుర్తు చేసుకున్నారు. అప్పటికి తాను భూటాన్ ప్రధానమంత్రి కూడా కాదని, పార్లమెంట్ సభ్యుడిగా కూడా లేనని చెప్పారు. ఆ సమావేశంలో మోదీని తనకు అన్నయ్యగా భావిస్తున్నట్లు చెప్పానని, ఆయన తన పట్ల పెద్ద అన్నయ్య చిన్నవారిపై చూపే ఆప్యాయతను ప్రదర్శించారని తెలిపారు. అదే సందర్భంలో మోదీని విష్ణువు అవతారంగా చూస్తున్నానని చెప్పినట్లు వివరించారు.ఆశ్చర్యపోయా.. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత తాను కూడా ఆశ్చర్యపోయానని తోబ్గే తెలిపారు. తాను భావోద్వేగానికి లోనై అలా అన్నానా? తాను తప్పు చేశానా? అని ఆలోచించినట్లు చెప్పారు. తర్వాత మోదీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలించిన అనంతరం తాను చెప్పింది సరైనదేననే నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు.మోదీ దాదాపు 13 ఏళ్ల పాటు గుజరాత్‌ను పాలించిన తీరును తాను గమనించానని తోబ్గే చెప్పారు. అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడులు, అమలు విషయంలో గుజరాత్‌ను ఒక నమూనాగా నిలిపారని పేర్కొన్నారు. అనంతరం అదే దృష్టిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మోదీ ప్రయత్నించారని, తయారీ, విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సమ్మిళితం, పారిశుద్ధ్యం, సాంకేతికత, మౌలిక వసతులపై దృష్టి పెట్టారని అన్నారు.ఇదీ చదవండి: భూకంపం తర్వాత రాజకీయ భూకంపం.. మోదీ సీఎం ఎలా అయ్యారు?మోదీని మరోసారి కలిసినప్పుడు తన పాత వ్యాఖ్యపై మరింత ఆలోచించినట్లు తోబ్గే తెలిపారు. తాను ఏ అవతారం గురించి మాట్లాడానో అప్పటికి స్పష్టంగా తెలిసిందని, అది విష్ణువు చివరి అవతారంగా భావించే కల్కి అని చెప్పారు. ధర్మాన్ని పునరుద్ధరించడం, పునరుజ్జీవనానికి నాంది పలకడం కల్కి అవతారంతో ముడిపడి ఉన్న లక్షణాలని వివరించారు.To Prime Minister @narendramodi, An avatar of our times https://t.co/84RDOEfELm— Tshering Tobgay (@tsheringtobgay) October 7, 2026 -
భూకంపం తర్వాత రాజకీయ భూకంపం.. మోదీ సీఎం ఎలా అయ్యారు?
ప్రభుత్వ అధినేతగా (ప్రధాని, గతంలో ముఖ్యమంత్రిగా) 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నరేంద్ర మోదీ. ఆయన మొట్టమొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వెనుక 2001లో భారతీయ జనతా పార్టీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కీలకంగా మారాయి. భుజ్ భూకంపం తర్వాత సహాయక చర్యలపై వచ్చిన విమర్శలు, ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయాలు, అప్పటి ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌పై పెరిగిన అసంతృప్తి, పార్టీలోని అంతర్గత విభేదాలు నాయకత్వ మార్పునకు దారితీశాయి.గుజరాత్‌లోని భుజ్‌లో 2001 జనవరిలో సంభవించిన భారీ భూకంపం రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అప్పటికి కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. భూకంపం తర్వాత సహాయక, పునరావాస చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ సహాయం, నిధులు వచ్చినప్పటికీ అవి ప్రజలకు సకాలంలో చేరడం లేదనే అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో కేశూభాయి ఆరోగ్యం కూడా క్షీణించింది.ఈ పరిస్థితుల ప్రభావం ఎన్నికల ఫలితాల్లోనూ కనిపించింది. 2001 సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సబర్మతి అసెంబ్లీ స్థానంతో పాటు ఆనంద్ లోక్‌సభ స్థానాన్ని కోల్పోయింది. అవి కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. సబర్మతి బీజేపీకి బలమైన నియోజకవర్గంగా పరిగణించబడటం ఆ పార్టీ నాయకత్వాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. 2002 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాయకత్వాన్ని మార్చకపోతే గుజరాత్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేంద్ర నాయకత్వం భావించింది.మోదీ వ్యూహాత్మక పాత్ర అప్పటికి నరేంద్ర మోదీ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్లో బీజేపీ సంస్థాగత వ్యవస్థపై కూడా ఆయనకు విస్తృత అవగాహన ఉంది. 1995లో గుజరాత్లో బీజేపీ తొలిసారి సొంతంగా మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మోదీ వ్యూహాత్మక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: భారీ ట్రాఫిక్.. ఆటోలోనే మగబిడ్డకు జన్మతొలుత కేశూభాయి ప్రభుత్వంలో మోదీని ఉప ముఖ్యమంత్రిగా పంపే ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆయన దాన్ని అంగీకరించలేదు. పూర్తి బాధ్యత, పని చేసే స్వేచ్ఛ ఉంటేనే గుజరాత్‌కు వెళ్తానని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీకి స్పష్టం చేశారు. వాజ్‌పేయి ఒకసారి మోదీతో, “ఢిల్లీలో పంజాబీ భోజనం చాలా చేశారు.. ఇప్పుడు గుజరాత్‌కు వెళ్లి అక్కడి బాధ్యతలు చూసుకోండి” అని సరదాగా చెప్పినట్లు కూడా ప్రస్తావించింది.2001 అక్టోబర్ 6న మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. మరుసటి రోజు (అక్టోబర్ 7న) గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయనను తాత్కాలిక ముఖ్యమంత్రిగా, 2002 ఎన్నికల వరకు పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన నాయకుడిగా పలువురు చూశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. అనంతరం రాజ్‌కోట్ ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు.ఆ తాత్కాలిక ఏర్పాటుగా మొదలైన రాజకీయ ప్రయాణం తర్వాత భారత రాజకీయాల్లో కీలక అధ్యాయంగా మారింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన మోదీ రాజకీయ ప్రస్థానం 2026 నాటికి 25 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: భారత ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘ఇది చారిత్రాత్మక మైలురాయి.. గుర్తుండిపోయే సందర్భం. గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ప్రయాణం.. దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతోంది. గత 25 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. భవిష్యత్తులోనూ ఆయనకు అన్ని విధాలా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు.A historic milestone in public service that should not go unnoticed. Heartiest greetings to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji on completing 25 years of continuous public service, first as Chief Minister of Gujarat and then as Prime Minister of India. Wishing you the very best. @narendramodi— YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2026ఇదీ చదవండి: తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదు -
NaMo @ 25: గాంధీనగర్ నుంచి ఢిల్లీ వరకు.. 25 ఏళ్లలో మార్పులివే..
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2001లో భుజ్ భూకంపం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లతో ఉన్న గుజరాత్ నుంచి ప్రారంభమైన ఆయన పాలనా ప్రయాణం.. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ స్థాయికి విస్తరించింది. పాలనను ప్రజాసేవకు సాధనంగా చూడటం తన ప్రయాణంలో ప్రధాన సిద్ధాంతంగా కొనసాగిందని ప్రధాని మోదీ చెబుతుంటారు.గుజరాత్లో అభివృద్ధికి పునాది2001 నుంచి 2012 మధ్య గుజరాత్ ఆర్థిక వ్యవస్థ సగటున దాదాపు 10 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో జాతీయ సగటు 7.6 శాతంగా ఉంది. వ్యవసాయ రంగం కూడా 8 నుంచి 9 శాతం మధ్య వృద్ధి సాధించింది. 2003లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ సదస్సు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా నిలిచింది. దేశంలోని విదేశీ పెట్టుబడుల్లో గుజరాత్ వాటా 5 నుంచి 7 శాతం వరకు ఉంది.దేశ ఆర్థిక ప్రస్థానంలో మార్పు2014లో మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశ పాలనా బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. 2026 మూడో త్రైమాసికంలో దేశ నామమాత్ర జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా. ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. ఐదో స్థానానికి చేరింది.ఆర్థిక భాగస్వామ్యంలో పురోగతినీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచీ ప్రకారం 2013–14లో 29.17 శాతంగా ఉన్న బహుముఖ పేదరికం 2022–23 నాటికి 11.28 శాతానికి తగ్గింది. ఈ కాలంలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా దాదాపు 58 కోట్ల మంది అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు. వీరిలో సగం మంది మహిళలే కావడం విశేషం. యూపీఐ లావాదేవీలు 2016లో నెలకు లక్ష నుంచి 2026లో ఒకే నెలలో 24.5 బిలియన్లకు పైగా పెరిగాయి.మౌలిక వసతుల విస్తరణరైల్వే విద్యుదీకరణ 2014కు ముందు ఉన్న ఐదో వంతు స్థాయి నుంచి ప్రస్తుతం 99.6 శాతానికి చేరింది. నాలుగు లేన్ల జాతీయ రహదారుల పొడవు రెట్టింపుకుపైగా పెరిగింది. 2014–2026 మధ్య నిర్మించిన గ్రామీణ రహదారుల పరిమాణం అంతకుముందు 14 ఏళ్లలో నిర్మించిన రహదారులను మించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా రోజుకు 22 గంటలకు పైగా చేరిందని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పారిశుద్ధ్య కవరేజీ 39 శాతం నుంచి ఐదేళ్లలో పూర్తి స్థాయికి చేరింది.వైద్యం, రక్షణ, అంతరిక్ష రంగాల్లో ముందడుగుఆయుష్మాన్ భారత్ ద్వారా 62 కోట్లకు పైగా అర్హులైన ప్రజలకు రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య కవరేజీ లభిస్తోంది. 70 ఏళ్లు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు కూడా ఈ పథకాన్ని విస్తరించినట్లు తెలిపింది. 2014తో పోలిస్తే వైద్య కళాశాల సీట్లు రెండింతలకు పైగా పెరిగాయి. రక్షణ రంగంలో భారత ఎగుమతులు దశాబ్ద కాలంలో 56 రెట్లకు పైగా పెరిగి 80కి పైగా దేశాలకు చేరాయి. చంద్రయాన్-3 ద్వారా భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగిన తొలి దేశంగా నిలిచింది. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు సాగిన ఈ ప్రయాణం.. దేశ అభివృద్ధి, మౌలిక వసతులు, డిజిటల్ సేవలు, పేదరిక నిర్మూలన, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారించిందని నిపుణులు తెలిపారు.ఇదీ చదవండి: ప్రజాసేవలో 25 ఏళ్లు.. విఘ్నేశునికి ప్రధాని మోదీ పూజలు -
ప్రజలే నాకు భగవంతుడి స్వరూపం.. ‘పాతికేళ్ల పవర్’పై మోదీ
సాక్షి, ఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తాను.. ఇన్నేళ్లుగా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇంత ఉన్నత స్థాయికి చేరుకుంటానని అప్పట్లో ఊహించలేదని చెప్పారు. ప్రతి విజయం తనలో ‘నేను ఏదైనా సాధించగలను’ అనే నమ్మకాన్ని పెంచిందని తెలిపారు.ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నా. రాష్ట్ర ఎన్నికలైనా.. సాధారణ ఎన్నికలైనా ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. ఈ రోజు ఉదయం కూడా దేశ ప్రజలందరి కోసం వినాయకుడిని ప్రార్థించాను. ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకున్నా. నాకు ప్రజలే భగవంతుడి స్వరూపం. దేశం నాకు ఎంతో ఇచ్చింది. అందుకే దేశమే నాకు ప్రథమ ప్రాధాన్యం’’ అని మోదీ పేర్కొన్నారు.ఇప్పటికీ నేర్చుకుంటున్నా..తనను తాను ఇప్పటికీ విద్యార్థిగానే భావిస్తానని మోదీ చెప్పారు. చిన్నప్పుడు వడోదరలో కాకుండా వడ్నగర్లో పాఠశాలకు వెళ్లిన రోజుల్లో తరగతికి తొలుత వచ్చేవారిలో తానూ ఒకడినని గుర్తుచేసుకున్నారు. నేర్చుకోవాలన్న ఆసక్తి అప్పటి నుంచే తనలో భాగమైందన్నారు. ‘‘ఎంత ఎక్కువ నేర్చుకుంటే.. దేశానికి సేవ చేసే సామర్థ్యం అంత పెరుగుతుంది. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా’’ అని చెప్పారు.తన 25 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రతి సంకటం ఒక పాఠం నేర్పిందన్నారు. ప్రతి విజయం బాధ్యతను పెంచిందని, ప్రతి సాధన మరింత పెద్ద లక్ష్యాల వైపు వెళ్లేందుకు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. మద్దతుదారులు తనకు ప్రోత్సాహాన్ని ఇస్తే.. విమర్శకులు తనను తాను పరిశీలించుకునేలా చేశారని పేర్కొన్నారు.భూకంపం నుంచి చంద్రయాన్ వరకు..గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎదురైన భుజ్ భూకంపం పునర్నిర్మాణంలో పట్టుదలగా ఉండటం నేర్పిందని మోదీ గుర్తుచేసుకున్నారు. చంద్రయాన్ వైఫల్యం నుంచి తిరిగి లేవడం నేర్చుకున్నానని తెలిపారు. కరోనా మహమ్మారి దేశ సమష్టి చైతన్యం, ఐక్యత ప్రాధాన్యాన్ని తెలియజేసిందన్నారు. తీపి, చేదు అనుభవాల మధ్య ముందుకు సాగేందుకు మీడియా కూడా తనకు ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు.సేవే ధర్మం.. దేశమే తొలి ప్రాధాన్యంఎన్డీయే మిత్రపక్షాలతో పాటు బీజేపీ, రాజకీయ సహచరులు, తనపై విశ్వాసం ఉంచిన ప్రజలందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సేవే ధర్మం. నేను యాంబిషన్ కోసం కాదు.. మిషన్ కోసం జీవిస్తున్నా’’ అని స్పష్టం చేశారు. వేల ఏళ్ల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న దేశానికి సేవ చేసే అవకాశం తనకు లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.25 ఏళ్ల ప్రస్థానం కేవలం గతాన్ని గుర్తుచేసుకునే సందర్భం కాదని.. భవిష్యత్తు కోసం సంకల్పాన్ని పునరుద్ఘాటించే సమయమని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని, ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మనం సాధిస్తాం.. తప్పకుండా సాధిస్తాం’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.ఇదీ చదవండి: ఎస్ఐఆర్ పేరుతో అసలు ఏం జరుగుతోంది? -
ప్రజాసేవలో 25 ఏళ్లు.. విఘ్నేశునికి ప్రధాని మోదీ పూజలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని సరోజినీ నగర్లో ఉన్న శ్రీ వినాయక ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. ఆ తర్వాత ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా జపాన్ ప్రధాని అభినందనలు తెలిపారు. సామాజిక, జాతీయ అభివృద్ధికి మోదీ తనను తాను అంకితం చేసుకున్నారని పేర్కొన్నారు. 2001 నుంచి మోదీ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. భారత అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు.జపాన్ ప్రధాని జూలైలో తాను భారత్‌లో పర్యటించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ పర్యటన సందర్భంగా తనకు లభించిన స్వాగతానికి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ ఆహారం, సంగీతాన్ని కూడా ప్రశంసించారు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై మోదీతో జరిగిన చర్చలను ఆయన ప్రస్తావించారు. आज नई दिल्ली के श्री विनायक मंदिर में पूजा-अर्चना की। भगवान श्री गणेश से देशभर के अपने परिवारजनों की सुख-समृद्धि और उत्तम स्वास्थ्य की कामना की। विघ्नहर्ता की कृपा से सबका कल्याण हो और देश निरंतर प्रगति के मार्ग पर आगे बढ़ता रहे। https://t.co/ZPADyotAFk— Narendra Modi (@narendramodi) October 7, 2026మరోవైపు మోదీ ప్రజా సేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘సేవా సంకల్ప యాత్ర’లో భాగంగా గుజరాత్‌లోని వడ్నగర్ నుంచి వారణాసి వరకు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రసంగించనున్నారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ యాత్ర కొనసాగుతోంది.ఇదీ చదవండి: Africa: 2,800 ఏళ్ల క్రితమే 20 అంతస్తుల భవనాలా? -
ఎస్ఎంఈలకు గ్రోత్ ఫండ్.. రవాణాకు మాస్టర్‌ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎస్ఎంఈ) వృద్ధికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎంఈల్లో ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.10 వేల కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్(ఎస్జీఎఫ్) ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మంగళవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో సమగ్ర ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ అథారిటీ(ఐటీఎల్‌ఏ) పేరిట ప్రత్యేక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తయారీ, సేవా, సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి మూలధనాన్ని(గ్రోత్ క్యాపిటల్) సమకూర్చడమే లక్ష్యంగా ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ను తీసుకొచ్చారు. 2026–27 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటన మేరకు ఈ నిధికి రూపకల్పన చేశారు. వివిధ రవాణా మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని నివారించి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అపెక్స్ సంస్థగా ’ఐటీఎల్‌ఏ’ను ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ తరహాలో ఏర్పాటు చేయబోతున్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, షిప్పింగ్, పౌర విమానయానం, జలమార్గాలు, కోస్టల్ షిప్పింగ్, పట్టణ రవాణాను కలుపుతూ పదేళ్ల భవిష్యత్ ప్రణాళికతో సమగ్ర ’నేషనల్ ట్రాన్స్పోర్ట్ మాస్టర్ ప్లాన్’ను ఐటీఎల్‌ఏ సంస్థ తయారు చేస్తుంది. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానం ఆమోదం ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రివర్గం అభినందనలు తెలియజేసింది. 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజా నాయకుడిగా ఆయన అందిస్తున్న సేవలను కొనియాడింది. ఈ మేరకు మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ మంగళవారం కేబినెట్ భేటీలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు మోదీ నాయకత్వ పటిమ ఏమాత్రం చెక్కుచెదరలేదని ఉద్ఘాటించారు. -
ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమే మోదీ, అమిత్ షా, ముఖ్యమంత్రులు కూడా..
బెంగళూరు: ప్రస్తుత లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. అందుకే లోక్‌సభ, శాసనసభలను రద్దు చేసి, మళ్లీ బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం చట్టవిరుద్ధమేనని పేర్కొన్నారు. ఖర్గే శనివారం కర్ణాటకలోని కలబురిగిలో మీడియాతో మాట్లాడారు. నేడు దేశమంతా అక్రమ ఎన్నికల ఆధారంగా నడుస్తోందని మండిపడ్డారు. మోదీ అక్రమ ప్రధానమంత్రి, అమిత్ షా అక్రమ మంత్రి, ముఖ్యమంత్రులు కూడా అక్రమమేనని స్పష్టంచేశారు. వారందరినీ పదవుల నుంచి తొలగించి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఉద్ఘాటించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎంలు) దురి్వనియోగం చేస్తున్నారని, అధికారంలో ఉన్న వ్యక్తుల సొంత మనుషులే ఈ విషయం చెబుతున్నారని వెల్లడించారు. అందుకే ఈవీఎంలను పూర్తిగా పక్కనపెట్టి, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తప్పులు చేస్తోందని విమర్శించారు. ఎస్ఐఆర్, ఎన్నికల ప్రక్రియ దురి్వనియోగానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తాయని ప్రకటించారు. అది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నిక అవుతుందా? ఎస్ఐఆర్ సర్వం తప్పులతడక అని ఖర్గే ధ్వజమెత్తారు. ఒక బూత్ నుంచి కుట్రపూరితంగా 500 ఓట్లను తొలగిస్తే అది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నిక ఎలా అవుతుంది?అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపును కోరుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు గ్రామాలకు వెళ్లి దరఖాస్తు పత్రాలు నింపుతున్నారని ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ వంటి నాయకులెవరూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడలేదని గుర్తుచేశారు. ఇప్పుడు తమకు కావాల్సిన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఎస్ఐఆర్లో అక్రమాలు మన యువతను, పేదలను, దళితులను, అణగారిన వర్గాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ధనవంతులు తమ పనిని ఎలాగోలా పూర్తి చేసుకోగలిగినప్పటికీ, ఏదైనా సమస్య తలెత్తితే మాత్రం పేదలు తమ పనులు మానుకొని ఎన్నికల సంఘం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు. ఎస్ఐఆర్పై ప్రజలను చైతన్య పరుస్తాం ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే నిప్పులు చెరిగారు. పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు కల్పించే చట్టాన్ని ప్రస్తావించారు. వారికి మినహాయింపు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యా న్ని దిగజార్చుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో మార్పులు చేయడాన్ని తప్పుపట్టారు. స్వలాభం కోసమే ఈ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్ర మంత్రిని చేర్చారని ఆక్షేపించారు. ఈనెల 6న ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వరకు పాదయాత్ర చేయబోతున్నట్లు ఖర్గే తెలిపారు. ఎస్ఐఆర్లో అక్రమాలపై దేశ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తామన్నారు. ఆ తర్వాత ప్రజలు ‘మోదీ, మోదీ’ అని అంటే మాత్రం వారికి నియంతృత్వమే కావాలని తేటతెల్లం అవుతుందన్నారు. -
పీఎం కానుకల వేలం గడువు నెలాఖరుకు పొడిగింపు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రికి దేశవిదేశాల సందర్శనలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి సంబంధించిన ‘పీఎం మెమెంటోస్’8వ విడత వేలం గడువును ఈనెల 31వ తేదీ వరకూ కేంద్రం పొడిగించింది. ఆన్లైన్ ద్వారా 30 రకాల జ్ఞాపికలు, కానుకల విక్రయానికి జరిగే ఈ–వేలం ప్రక్రియలో ఈసారి కాకతీయ కళాతోరణం వెండి నమూనా కూడా ఉంది. దీనికి ప్రాథమిక ధర రూ.10 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధికంగా జగన్నాథ పరివార రథం ప్రతిమకు రూ.21 లక్షల బేస్ ప్రైస్ ఉంది. తర్వాత కర్ణాటక శ్రీరాముడి వెండి విగ్రహానికి రూ.13.50 లక్షలుగా ఉంది. వివిధ దేవాలయాలు, చరిత్రాత్మక ప్రదేశాల నమూనాలు, సంప్రదాయ చేతివృత్తుల కళారూపాలు, చిత్రాలు, పెయింటింగులు, విగ్రహాలు, శాలువాలు వంటివి 30 రకాల వరకూ ఈ వేలంలో ఉంచారు. వేలం ఆదాయాన్ని గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నవామి గంగే’ప్రాజెక్టుకు విరాళంగా అందించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. -
ప్రధాని మోదీకి చక్కటి ఆలోచనలున్నాయి
మాస్కో: రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణను పరిష్కరించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీకి చాలా చక్కటి ఆలోచనలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ప్రతి సమావేశంలోనూ మోదీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటారని తెలిపారు. గురువారం జరిగిన వాల్డాయ్ ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ వార్షిక సమావేశంలో పుతిన్ మాట్లాడారు. ‘‘యుద్ధాలను ముగించడంపై ప్రధానమంత్రి మోదీ వైఖరి విషయానికి వస్తే.. మా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్ సంఘర్షణను ముగించే అంశాన్ని ఆయన నిరంతరం ప్రస్తావిస్తూ ఉంటారు. రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ గురించి ప్రశ్నలు అడిగే ప్రపంచ నాయకుల్లో మోదీ ఒకరని నేను చెప్పగలను. మేము జరిపే ప్రతి సమావేశంలోనూ మోదీ ఈ అంశాలను ప్రస్తావిస్తారు. ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో మోదీ వద్ద చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి’’అని పుతిన్ స్పష్టంచేశారు. అలాగే బుధవారం ఓ సదస్సులో పుతిన్ ప్రసంగించారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. భారతదేశం తన విస్తృతి, వైవిధ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోందని అన్నారు. ‘‘ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 150 కోట్ల మంది జనాభాలో 60 కోట్ల మంది భారతీయులు తమ మాతృభాష అయిన హిందీని మాట్లాడతారు. మిగిలిన వారు తమ మాతృ భాషలను మాట్లాడతారు. అయినప్పటికీ వారందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని మోదీ నాకు చెప్పారు. ఇది నిజంగా అద్భుతం, ప్రశంసనీయం. వైవిధ్యం, ఐక్యత ఎలా కలిసి ఉండగలవో చెప్పడానికి భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకత ఉంది. అది కచి్చతంగా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. నిజంగానే మనం నేర్చుకోవాల్సిన విషయం’’అని కొనియాడారు. -
ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్ మచ్చార్ తో మోదీ వీడియో కాల్
-
ప్రయాణికులను కాపాడాలన్న సంకల్పమే నడిపించింది
న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్ విమానంలో కో–పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్నా సరే ప్రయాణికులను కాపాడాలన్న సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. తనకు ఏం జరిగినా ఫర్వాలేదు వారు బతికుంటే చాలు అని భావించారు. ఒకవైపు కత్తి దూస్తున్న కో–పైలట్‌తో పెనుగులాడుతూనే మరోవైపు కాక్‌పిట్ తలుపు తెరిచారు. అంతటి విపత్కర పరిస్థితిలో ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే 174 మంది ప్రయాణికులను కాపాడింది. ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రపంచమంతా కొనియాడుతోంది. కష్టాల్లో ఉన్నప్పుడల్లా హనుమాన్ చాలీసాను పఠిస్తానని స్మిత్ చెప్పారు. విమానంలో తనపై దాడి జరిగిన తర్వాత కూడా హనుమాన్ చాలీసాను పఠించడం తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇదే విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పంచుకున్నారు. కో–పైలట్ దాడిలో గాయపడి, యూఏఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్ఛార్తో శుక్రవారం మోదీ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. కెప్టెన్ ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనాన్ని ప్రశంసించారు. ఆయన తీసుకున్న తక్షణ నిర్ణయం ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్మిత్ భావోద్వేగానికి గురయ్యారు. ‘మీరే నాకు స్ఫూర్తి’అని మోదీతో అన్నారు. ప్రధానమంత్రితో స్మిత్ ఏం చెప్పారంటే.. అది అత్యంత క్లిష్టమైన సమయం ‘‘దాడిలో గాయపడి కాక్‌పిట్‌లో నేలపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నప్పటికీ ప్రయాణికులంతా సురక్షితంగా ఉండాలన్న దృఢ సంకల్పంతో నాలో మిగిలి ఉన్న శక్తితోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి విమానాన్ని కాపాడగలిగాను. అప్పుడు నేను నా ప్రాణాల కోసం పోరాడుతున్నాను. కానీ, ఇతరులు చనిపోకూడదని నిర్ణయించుకున్నాను. అది అత్యంత క్లిష్టమైన సమయం. ఏదో ఒకటి చేయకపోతే ప్రమాదం తప్పదని నాకు అనిపించిన క్షణం అది. కాక్‌పిట్‌లో నేను కిందపడి ఉన్నప్పటికీ, విమానం కిందకు పడిపోతోందని గ్రహించగలిగాను. సహ పైలట్ నన్ను కత్తితో పదేపదే పొడిచాడు. చాలా గాయాలయ్యాయి. అయినా సరే లేచి ఏదో ఒకటి చేయాలని నాకు నేను చెప్పుకున్నాను. ఆ సమయంలో నేను సరిగ్గా స్పందించకపోతే పరిస్థితి భయానకంగా మారుతుందని తెలుసు. 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నాను, గత 11 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్నాను. కళ్లు మూసుకున్నా కూడా విమానంలో ఏం జరుగుతుందో గుర్తించగలను. కాక్‌పిట్ తలుపు తెరవడమే తక్షణ మార్గమని ఆ క్షణంలో ఆలోచన వచ్చింది. తలుపు తెరిచిన వెంటనే మిగిలిన వారందరూ లోపలికి వచ్చారు. విమానాన్ని కాపాడడంలో వారందరూ నాతో సమానమైన పాత్ర పోషించారు. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలన్న సంకల్పమే నన్ను ముందుకు నడిపించింది. కళ్లముందే వారు మరణిస్తూ ఉంటే చూస్తూ ఉండలేను కదా!’’అని స్మిత్ పేర్కొన్నారు. మన సంస్కృతికి దూరం కాకూడదు ఈ ఘటన తర్వాత, భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కారని, పైగా ఇతరులను కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడే వీరులుగా దేశం గర్వంగా చెప్పుకోగలదని మచ్ఛార్తో ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆ సమయంలో మీరు ఎన్నో గాయాలకు గురయ్యారు, ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితిలో పోరాడారు. మీ సొంత భద్రతను పక్కన పెట్టి, ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యతనిచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను’’అని పేర్కొన్నారు. మోదీ ప్రశంసలకు మచ్ఛార్ ప్రతిస్పందించారు. హనుమాన్ చాలీసా పఠించడం గురించి మాట్లాడారు. ‘‘నాకు నొప్పి లేదా బాధ కలిగినప్పుడల్లా నా మనసులో మెదిలే విషయం హనుమాన్ చాలీసా పఠనమే. విమానంలో దాడి తర్వాత కూడా హనుమాన్ చాలీసానే పఠిస్తూ ఉన్నాను. ఆ దేవుడే నన్ను కాపాడాడని తెలుసు. మోదీని ఆదర్శప్రాయుడిగా, స్ఫూర్తిప్రదాతగా భావిస్తున్నాను. మీరు చేసిన ఫోన్‌కాల్ నాలో ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపింది. నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. మీ నుంచి ఫోన్‌కాల్ రావడం నాకు గర్వకారణం. మీ ముందు ఇలా భావోద్వేగంతో రోదిస్తున్నందుకు క్షమించండి’’అని మోదీతో చెప్పారు. దీనికి స్పందిస్తూ.. నా ముందు కన్నీళ్లు పెట్టుకోలేకపోతే ఇక ఎవరి ముందు పెట్టుకుంటారని మచ్ఛార్తో అన్నారు. ‘‘అయ్యా, ప్రతిరోజూ ఉదయం నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నా రెండేళ్ల కుమారుడు నా ఒడిలో కూర్చుంటాడు. అప్పుడు నేను అతడికి హనుమాన్ చాలీసా వినిపిస్తాను. ఎందుకంటే చిన్నప్పుడు నాకు కూడా అలాగే నేరి్పంచారు. మనం నేడు మన దేశానికి దూరంగా ఉన్నప్పటికీ, మన సంస్కృతికి మాత్రం దూరంగా ఉండకూడదు’’అని మచ్ఛార్ చెప్పారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తనను ప్రేమ, శ్రద్ధతో బాగా చూసుకుంటున్నారని తెలియజేశారు. కత్తిపోట్లను కేవలం ఒక గాయంగా చూడటం లేదని, అలా చేస్తే కోలుకోవడం మరింత కష్టమవుతుందని అన్నారు. దీనిని నెమ్మదిగా సాగే ఒక ప్రయాణంలా భావిస్తున్నానని వెల్లడించారు. తాను త్వరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యవంతుడిగా మారుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. An unforgettable conversation with Captain Smit, filled with pride and emotions. pic.twitter.com/CCf46PKOWR— Narendra Modi (@narendramodi) October 2, 2026అహింసకు అర్థాన్ని చెప్పారు స్మిత్ మచ్ఛార్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయని, చాలామంది భారతీయులు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘మీరు ధైర్యవంతులు, మీకు స్వాగతం పలికేందుకు భారత్ ఎదురుచూస్తోంది’’అని కెప్టెన్‌తో అన్నారు. భగవద్గీత బోధనలు, విలువలతో తన బిడ్డను పెంచిన మచ్ఛార్ తల్లి గీతా బెన్ గురించి మోదీ ప్రస్తావించారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మచ్ఛార్తో మాట్లాడటానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. దేశ గౌరవాన్ని పెంచారంటూ మచ్ఛార్‌ను ప్రశంసించారు. ఆసుపత్రిలో ఆయనను చక్కగా చూసుకున్నందుకు సౌదీ అరేబియా, యూఏఈ ప్రభుత్వాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ పైలట్ల ప్రతిష్టను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని, ఇకపై ప్రపంచం వారిని కొత్త కోణంలో చూస్తుందని మచ్ఛార్తో అన్నారు. ‘‘ఈ రోజు గాంధీ జయంతి. అహింస నిజమైన అర్థం ఏమిటో మీరు ప్రపంచానికి చాటిచెప్పారు’’అని శ్లాఘించారు. మచ్ఛార్ స్వస్థలం గుజరాత్. ఆయనతో మోదీ కొద్దిసేపు గుజరాతీ భాషలో మాట్లాడడం విశేషం. అనంతరం ఆ వీడియో కాల్ గురించి మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘‘కెప్టెన్ స్మిత్‌తో గర్వం, భావోద్వేగాలతో కూడిన ఒక చిరస్మరణీయ సంభాషణ జరిగింది’’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మీరే నాకు స్ఫూర్తి.. మోదీతో మచ్చార్ -
స్మిట్ మచ్చార్ తో మోదీ వీడియో కాల్.. ఎమోషనల్ అయిన కెప్టెన్
-
ఫ్లైదుబాయ్ హీరోకు ప్రధాని మోదీ వీడియోకాల్
ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని తప్పించిన భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్న ఆయన .. ఘటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఆ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన ఆయన ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించగా.. మచ్చార్ భావోద్వేగానికి లోనయ్యారు.కో-పైలట్ తనపై ఎలా దాడి చేశాడో.. ఆ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన విషయాలేంటో కెప్టెన్ స్మిట్ మచ్చర్ ప్రధాని మోదీకి వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ.. విమానం ఒక్కసారిగా కిందకు దిగడాన్ని గమనించానని చెప్పారు. ఆ సమయంలో ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఉందన్న భయంతో ఎలాగైనా కాక్‌పిట్ తలుపు తెరవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.“ఏదో విధంగా నిలబడి కాక్‌పిట్ తలుపు తెరిచాను. ప్రయాణికులు లోపలికి రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది” అని స్మిట్ వివరించారు. ప్రమాద సమయంలో తనకు ధైర్యం ఇచ్చింది హనుమాన్ చాలీసా అని, దానిని చదువుకుంటూ ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. “ఆ భగవంతుడే నన్ను కాపాడాడు. మీతో మాట్లాడతానని నేను అనుకోలేదు. నాకు మీరే నాకు స్ఫూర్తి” అంటూ మచ్చార్ భావోద్వేగానికి లోనయ్యారు. #WATCH | Flydubai Captain Smit Machchhar turns emotional as he recounts his ordeal before PM Modi; he says, "You are my biggest idol. I feel proud of the way you are encouraging me today. I had so many injuries, but I told myself I have to get up and act. At the time, I told… pic.twitter.com/eqGloeCTSl— ANI (@ANI) October 2, 2026అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ స్మిట్ మచ్చర్ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ.. త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. నేను ఫోన్లో అందుబాటులో ఉంటాను అంటూ మచ్చార్‌కు మోదీ మాటిచ్చారు.బుధవారం ఉదయం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో కో-పైలట్ దాడి చేసిన ఘటనలో కెప్టెన్ స్మిట్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోరడంతో పాటు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు కీలకంగా వ్యవహరించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడటంలో స్మిట్ మచ్చర్ పాత్ర కీలకంగా మారింది. గాయాలతో పోరాడుతూనే ఆయన చూపిన ధైర్యంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఘటన అనంతరం తొలుత సౌదీ అరేబియాలోని తబూక్ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం స్మిట్ మచ్చర్ యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని.. ఆయన మాట్లాడగలుగుతున్నారని.. త్వరలో కోలుకుంటారని వైద్యులు, ఇటు భారత రాయబార కార్యాలయమూ ఒక ప్రకటన చేసింది.కెప్టెన్ స్మిట్ మచ్చార్ సాహసం చూసి దేశం గర్విస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకు ముందు అభినందించారు. మరో 9/11 తరహా దాడి జరగకుండా మచ్చార్ అడ్డుకోగలిగారంటూ పొగిడారు. అంతేకాదు.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన అధైర్య పడొద్దని.. భారత ప్రభుత్వం తరఫున అన్నివిధాల సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటన.. వీడియోలో భయానక దృశ్యాలు -
గాంధీజీ ఆశయాలు నేటి భారతానికి మార్గదర్శకాలు..
మహాత్మా గాంధీ భారత స్వాతంత్య్రోద్య మానికి నాయకత్వం వహించిన మహోన్నత వ్యక్తి మాత్రమే కాదు... సత్యం, అహింస, సామాజిక సమానత్వం, స్వావలంబన, గ్రామీణ స్వరాజ్యం, పారిశుద్ధ్యం వంటి విలువలకు జీవి తాంతం కట్టుబడిన దూరదృష్టిగల నాయకుడు. మానవ చరిత్రలో రాజ్యహింసను, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు అహింసను శక్తిమంతమైన పోరాట సాధనంగా మలిచిన నాయకుడు. సత్యా గ్రహం ద్వారా అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజ లను శాంతియుతంగా సమీకరించారు.సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవం, సమా నత్వం, మానవ హక్కులు ఉండాలన్న భావన ఆయన సామాజిక తత్వంలో కీలకమైనది. చరఖా, ఖాదీ ఆయనకు కేవలం వస్త్ర తయారీ సాధనాలు కాదు; స్వావలంబన, గ్రామీణ ఉపాధి, స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు ప్రతీ కలు. మహిళలు సమాజంలో సమాన హక్కులు, సమాన అవకాశాలు పొందాలని గాంధీజీ కోరు కున్నారు. స్వాతంత్య్రోద్యమంలో మహిళలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడం ద్వారా ప్రజా ఉద్యమాల్లో వారి పాత్రను విస్తరించారు. మహిళా సాధికారత అంటే కేవలం చట్టపరమైన హక్కులు ఇవ్వడం మాత్రమే కాదు; విద్య, ఆర్థిక స్వావలంబన, భద్రత, గౌరవం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం వంటి అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి.గ్రామాలు స్వయం సమృద్ధిగా ఎదగాలనీ, స్థానిక అవసరాలకు స్థానికంగా పరిష్కారాలు లభించా లనీ ఆయన భావించారు. నేటి గ్రామీణ అభివృద్ధి కూడా రోడ్లు నిర్మించడం లేదా భవనాలు ఏర్పాటు చేయడానికే పరిమితం కాదు. రైతులకు మార్కెట్ అనుసంధానం, సాగు నీరు, తాగునీరు, విద్యుత్, గృహాలు, పారిశుద్ధ్యం, డిజిటల్ కనెక్టి విటీ, బ్యాంకింగ్ సేవలు, మహిళలకు ఉపాధి అవ కాశాలు వంటి అనేక అంశాలు గ్రామీణ జీవన ప్రమాణాలను ప్రభా వితం చేస్తున్నాయి.పారిశుద్ధ్యం విషయంలో గాంధీజీకి ప్రత్యే కమైన దృక్పథం ఉంది. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదనీ, ప్రతి వ్యక్తి బాధ్యత కూడా అని నొక్కిచెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల విని యోగం, వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం వంటి అంశాలను ఆయన సామాజిక సంస్కరణలో భాగంగా చూశారు.మోదీ పాలన – గాంధీవాదంగ్రామీణ భారతదేశ అభివృద్ధి గాంధీజీ ఆలో చనల్లో ముఖ్యమైన అంశం. మోదీ పాలనలో ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన’ ద్వారా గ్రామీణ రహదారి అనుసంధానాన్ని విస్తరించారు. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా పేద రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గ్రామీణ కుటుంబాలకు తాగు నీటిని అందించడంలో ‘జల్ జీవన్ మిషన్’ కీలక కార్యక్రమంగా మారింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడంలో ‘ప్రధాన మంత్రి జ¯Œ ధన్ యోజన’ కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం 2014లో ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ప్రారంభించింది.గాంధీజీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం అంటే కేవలం ఒక మహానాయ కుడికి నివాళి అర్పించడం మాత్రమే కాదు; ఆయన నమ్మిన మానవతా విలువలను మన జీవితాల్లో ఎంతవరకు ఆచరిస్తున్నామో ఆత్మపరి శీలన చేసుకోవడం కూడా.- చింతా సాంబమూర్తి, వ్యాసకర్త జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ మాజీ సభ్యులుఇదీ చదవండి: సేవయే సాధనగా: గాంధీజీ ఆధ్యాత్మిక ప్రయాణం -
ప్రజా సేవల్లో వేగం పెరగాల్సిందే
న్యూఢిల్లీ: నేటి ఆధునిక యుగంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వేగవంతమైన, రియల్–టైమ్ సేవలు, పరిష్కారాలను పౌరులు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకు అనుగుణంగా సాంప్రదాయ సేవా పంపిణీ విధానాలు సైతం పరిణామం చెందాలని స్పష్టంచేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో మౌలిక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసం కాకుండా ప్రజాసేవ వైపు ఆకర్షితులయ్యేలా చూడాలని పేర్కొన్నారు. కేవలం విద్యా పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా అభ్యర్థుల్లోని అంతర్లీన ప్రేరణను సైతం సక్రమంగా మూల్యాంకనం చేసేలా ఎంపిక ప్రమాణాలు ఉండాలని తేలి్చచెప్పారు. నియామక పరీక్ష అనేది కేవలం అభ్యర్థికి ఏమి తెలుసో పరీక్షించడానికే పరిమితం కాకూడదని అభిప్రాయపడ్డారు. యువత సివిల్ సరీ్వసెస్‌లో ఎందుకు చేరాలని ఆకాంక్షిస్తుందో కూడా పరిశీలించాలని అన్నారు. గురువారం ఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శతవార్షిక ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. మనదేశం క్రమంగా పట్టణీకరణ చెందుతోందని, అదే సమయంలో యువత ఆకాంక్షలు గణనీయంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. వారి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని అన్నారు. కాబట్టి ఇంకా సాంప్రదాయ పద్ధతుల్లోనే సేవలు అందిస్తే సరిపోదని వ్యాఖ్యానించారు. తక్షణమే సేవలు కోరుకుంటున్న ప్రపంచ వేగానికి అనుగుణంగా ప్రభుత్వ సేవలు సాగుతున్నాయా లేదా అనేది ప్రశ్నించుకోవాలని ఉద్ఘాటించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ సేవల్లోనూ వేగం పెరగాలని స్పష్టంచేశారు. నేడు పౌరులు ప్రభుత్వ సేవల కోసం వారాల తరబడి లేదా నెలల తరబడి వేచి ఉండాలని కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ క్షణాల్లో వేలాది పత్రాలను ప్రాసెస్ చేయగలిగినప్పుడు, ప్రభుత్వాలకు రియల్ టైమ్ డేటా అందుబాటులో ఉన్నప్పుడు పౌరులు వేగవంతమైన పరిష్కారాలను ఆశిస్తారని ప్రధానమంత్రి వెల్లడించారు. మారుతున్న ఈ ఆలోచనా విధానం ప్రకారం మన సివిల్ సర్వీసెస్‌లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఎంపిక ప్రమాణాలను, నియామక ప్రక్రియలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. -
180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ను ప్రశంసించిన మోదీ, ట్రంప్
-
‘భారత్ గర్విస్తోంది’.. స్మిట్ మచ్చార్ ధైర్యానికి మోదీ ఫిదా!
దుబాయ్–టెల్అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని ఎదుర్కొని.. విమానంలోని వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కీలకంగా వ్యవహరించారని అన్నారు.‘‘కెప్టెన్ స్మిట్ మచ్చార్ ఒక హీరో. భారత్ ఆయనను చూసి గర్విస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్మిట్ మచ్చార్ తెగువను కొనియాడుతూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన అపారమైన ధైర్యం, వెనక్కి తగ్గని సంకల్పాన్ని ప్రదర్శించారని అన్నారు. ఆయన చూపిన తెగువ వందలాది మంది ప్రాణాలను కాపాడటంతోపాటు పెను విషాదాన్ని తప్పించిందని పేర్కొన్నారు. స్మిట్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని, మరింత శక్తితో పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.Captain Smit Machchhar is a HERO.In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others. His valour helped save hundreds of lives and avert a great tragedy.India is proud of…— Narendra Modi (@narendramodi) October 1, 2026బుధవారం దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం FZ1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 737 విమానం సుమారు 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. సహ పైలట్ విమానాన్ని ప్రమాదానికి గురిచేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై అతడు దాడి చేసి కత్తితో పొడిచినట్లు సమాచారం.దాడితో మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం భారీ వేగంతో కిందికి దిగడం ప్రారంభించింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. దాదాపు 37 సెకన్లలోనే విమానం 14,300 అడుగుల మేర కిందికి దిగింది. ఒక దశలో నిమిషానికి సుమారు 23 వేల అడుగుల వేగంతో కిందికి దూసుకెళ్లినట్లు సమాచారం. దీంతో విమానంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.కుటుంబానికి మోదీ ధైర్యంకెప్టెన్ స్మిట్ మచ్చార్ కుటుంబంతోనూ గురువారం ఉదయం ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించినట్లు తెలుస్తోంది. మచ్చార్ తల్లిదండ్రులతో పాటు అతని భార్యతోనూ మోదీ మాట్లాడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్మిట్ సాహసాన్ని ప్రస్తావిస్తూ అధైర్య పడొద్దని.. అవసరమైన సాయం అందిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం. గాయాలతోనే ఎదురుదాడి..ఈ సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ వెనక్కి తగ్గలేదు. సహ పైలట్‌ను ప్రతిఘటిస్తూ కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు సమాచారం. దీంతో ముందు వరుసలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు సహకరించారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు రిలీఫ్ పైలట్లు అనంతరం నియంత్రణ బాధ్యతలు చేపట్టారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అనంతరం గాయపడిన స్మిట్ మచ్చార్, సహ పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు కూడా విమానాశ్రయంలో వైద్య సాయం అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.9,750 గంటల ఫ్లయింగ్ అనుభవంస్మిట్ మచ్చార్ భారతీయుడు. ఫ్లై దుబాయ్‌లో చేరకముందు స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లు పనిచేశారు. బోయింగ్ 737 విమానాల్లో 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. దాదాపు 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవంతోపాటు లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా కూడా పనిచేశారు.ట్రంప్, నెతన్యాహు ప్రశంసలుస్మిట్ మచ్చార్ ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసించారు. దాడిలో గాయపడినప్పటికీ విమానాన్ని, ప్రయాణికులను రక్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను కొనియాడారు. ప్రయాణికులు, సిబ్బంది సైతం దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఇటు ట్రంప్ కూడా స్మిట్‌ను హీరో అని, కోపైలట్‌ను టెర్రరిస్ట్ అని అభివర్ణించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు, సహ పైలట్ ఎందుకు దాడికి పాల్పడ్డాడు? విమానాన్ని ఎందుకు కిందికి దించాడు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే తీవ్ర ప్రమాదం ఎదురైన సమయంలో గాయాలను లెక్కచేయకుండా స్మిట్ మచ్చార్ తీసుకున్న చర్యలు ఇప్పుడు ఈ ఘటనలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ప్చ్.. డంకీ ఎంత పని చేసింది? -
ఫోనులో మాట్లాడుకున్న నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్.. దేనిపై?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం ఫోన్ సంభాషణ జరిగింది. భారత్–అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని మరింతగా పెంచేందుకు సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని అంగీకరించారు.ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సాధించిన పురోగతిని మోదీ, ట్రంప్ సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై చర్చించారు.మోదీ కీలక కామెంట్స్ మోదీ కూడా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ సంభాషణపై స్పందించారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్‌తో ఫలప్రదమైన సంభాషణ జరిగింది. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు సహా ఇతర రంగాల్లో మన ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించాం. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని అంగీకరించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రపంచ శాంతి, భద్రతను ముందుకు తీసుకెళ్లేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపైనా అభిప్రాయాలు పంచుకున్నాం’’ అని మోదీ పేర్కొన్నారు.భారత్, అమెరికా పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయి. అమెరికా పర్యటనలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. ఇరు దేశాలు అవగాహనకు మరింత చేరువయ్యాయని తెలిపారు. అయితే అమెరికా సుంకాల నిబంధనల్లో మార్పులు, సెక్షన్ 301 ప్రక్రియ కీలక అంశాలుగా ఉన్నాయని చెప్పారు. 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం.. అన్యాయంగా భావించే వాణిజ్య పద్ధతులపై అమెరికా దర్యాప్తు చేసి, అదనపు సుంకాలు సహా చర్యలు తీసుకోవచ్చు. ఈ దర్యాప్తులను అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం నిర్వహిస్తుంది.ఇదిలా ఉండగా, ఈ నెల ప్రారంభంలో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టంపైనా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం ప్రకారం రష్యాతో పాటు భారత్, చైనా వంటి ప్రధాన ఇంధన కొనుగోలుదారులపై అమెరికా ప్రభుత్వం సుంకాలు విధించే అవకాశం ఉంది. భారత్ 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. -
కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ITMS) అమలుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని 42 ప్రధాన ట్రాఫిక్ కారిడార్లను మూడు దశల్లో 24 నెలల్లో ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్, రియల్‌టైమ్ ట్రాఫిక్ సమాచారం, ఆటోమేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ అందుబాటులోకి తెస్తారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు గ్రీన్ కారిడార్ సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలను రియల్‌టైమ్‌లో గుర్తించి వేగంగా స్పందించేలా వ్యవస్థను రూపొందించనున్నారు. రాంగ్ రూట్, స్పీడింగ్, రెడ్‌లైట్ జంపింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఉల్లంఘనలను టెక్నాలజీతో గుర్తించనున్నారు.కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలురబీ సీజన్ కు పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందికుసుమకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.675, ఆవాలు-రాప్సీడ్కు రూ.413 చొప్పున పెంచిందిమసూర్ పప్పుకు రూ.390, బార్లీకి రూ.136, శనగకు రూ.83, గోధుమకు రూ.25 పెంపు లభించిందిపెరిగిన ధరలతో గోధుమ MSP రూ.2,610, శనగ రూ.5,958, మసూర్ రూ.7,390, ఆవాలు రూ.6,613, కుసుమ రూ.7,215, బార్లీ రూ.2,286కు చేరిందిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యమని కేంద్రం వెల్లడిగ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు కేంద్ర కేబినెట్ ఆమోదంరూ.1,86,405 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌లోకి అనుసంధానం50 గిగావాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏర్పాటు 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంకేంద్ర ఆర్థిక సాయం రూ.54,082 కోట్లువిద్యుత్ ప్రసార ఖర్చులను తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగం పెంచేందుకు ఈ పథకం దోహదం -
గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?
రాజకీయ ప్రయోజనాలకోసం ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీయడం విచారకరం.. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్య.2019లో చంద్రబాబే చేసిన ఇంకో వ్యాఖ్యను గమనించండి. మోదీ దేశంలోని ప్రతిష్టాత్మక వ్యవస్థలను ధ్వంసం చేశారు. బీజేపీ పాలనలో వ్యవస్థల స్వతంత్రత, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయి. సీబీఐ మొదలు ఆర్బీఐ వరకు... ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను కూడా వదలిపెట్టడం లేదు.ఈ రెండు వ్యాఖ్యలను చదివితే ఏమనిపిస్తుంది? చంద్రబాబు వంటి అవకాశవాద రాజకీయ నేతల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటోందా? లేక బలపడుతోందా? అన్న భావన కలగదా! తాను అధికారంలో ఉంటే అంతా సజావుగా ఉన్నట్లు, అధికారంలో లేకపోతే వ్యవస్థలన్నీ పాడైనట్లు జనం అనుకోవాలన్నమాట. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌కుమార్ నియమితులైనప్పటి నుంచి వివాదాలు మరీ తీవ్రమైనట్లు అనిపిస్తుంది. గతంలో కూడా కొందరు సీఈసీలపై విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి వచ్చినవి తీవ్రమైన అభియోగాలు.గతంలో టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు దేశం మొత్తాన్ని గడగడలాడించారంటే అతిశయోక్తి కాదు. కాస్త దుందుడుకు అన్న విమర్శ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడాలంటే, అదికారులు రాజకీయ నేతలకు సహకరించాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. చివరికి గోడలపై ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకునేవారు. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విబేధాలు రావడంతో, ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య కమిషన్‌గా మార్చారు. ఆయన తనకు సన్నిహితుడైన జీవీజీ కృష్ణమూర్తిని నియమించారని అంటారు. శేషన్‌కు చెక్ పెట్టడానికి ఈ ఏర్పాటు జరిగిందన్న భావన అప్పట్లో ఉండేది. ఆనాటి నుంచి త్రిసభ్య కమిషనే కొనసాగుతోంది. కొన్నిసార్లు విమర్శలు వచ్చేవి.కేంద్రంలో శక్తిమంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కొందరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేసి వెళ్లిపోయిన ఘట్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానిగా, బీజేపీ అదికారంలోకి వచ్చాక కొన్ని ఇలాంటివి జరిగాయి. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఒకరి కుటుంబ సభ్యులపై ఈడీని ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఎంపిక కమిటీలో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బదులుగా కేంద్ర మంత్రిని ఒకరిని నామినేట్ చేసే పద్దతిని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. లోక్‌సభలో విపక్ష నేతకు ఇందులో స్థానం ఉన్నా ఆ పాత్రను నామమాత్రం చేశారన్నమాట.గత 2024 ఎన్నికలకు ముందు జ్ఞానేశ్‌కుమార్‌ను ఎంపిక చేసుకున్న వైనం, అంతకుముందు కేంద్రంలో ఈయన కీలక పాత్ర పోషించిన తీరు, గతంలో కేరళలో పనిచేసినప్పుడు వచ్చిన విమర్శలు, ప్రధాని, హోం మంత్రులకు ఈయన సన్నిహితుడన్న ప్రచార నేపథ్యం వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే సహజంగానే ఆయా వర్గాలకు అనుమానాలు కలుగుతాయి. దానికి తోడు పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో 2024 ఎన్నికలు జరిగిన తీరుతెన్నులపై ఎన్నో సంశయాలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షల ఓట్ల తొలగింపు, లేదా పెండింగులో పెట్టడం, పోలింగ్ జరిగేనాటికి కూడా ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించకపోవడం, ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు, అర్ధరాత్రి దాటిన తర్వాత లక్షల ఓట్లు పోలైనట్లు చూపించడం, వీటిపై ఆధార సహితంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వంటివి ఎన్నికల సంఘంలో పారదర్శత లేదన్న అభిప్రాయం కలిగించింది.కొన్ని ఉదాహరణలు చూడండి.. పశ్చిమబెంగాల్లో 27 లక్షల ఓట్లను పెండింగ్‌లో ఉంచారట. వాటి సంగతి తేల్చకుండా ఎన్నికలు పూర్తి చేయడంలో ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వాటిని పరిశీలిస్తుంటే 97 శాతం ఓట్లు నిజమైనవేనని తేలుతోందట. ఏపిలో సాయంత్రం ఆరు తర్వాత ఏభై లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? అందులోను అర్దరాత్రి 12 గంటల నుంచి రెండుగంటల వరకు 17 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఎన్నికల సంఘం మౌనముద్ర దాల్చింది. వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేసినా కిమ్మనలేదు. పరకాల ప్రభాకర్ వంటి వారు పరిశోధన చేసి సదస్సులు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నా, జవాబు ఇవ్వడం లేదు. ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేస్తారా అని కూడా అడగలేకపోయింది.ఇదీ చదవండి: బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?విశేషం ఏమిటంటే 2009లో కాని, 2019లో కాని ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ పైన, ఈవీఎంల పైన తీవ్ర విమర్శలు చేసి, అవి మానిప్యులేషన్‌కు గురి అవుతున్నాయని ఆరోపించారు. నిజానికి అప్పట్లో ఈవీఎంలపై ఈ స్థాయిలో సందేహాలు రాలేదు. అయినా వాటి ద్వారా అక్రమాలు చేయవచ్చని ఆయన అనేవారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడేమో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లేలా విమర్శలు చేయరాదని సుద్దులు చెబుతున్నారు. 2019లో ఆనాటి ప్రధాని మోదీపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది ఆయన ట్వీట్లే తెలియచేస్తాయి. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను ధ్వంసం చేశారని కూడా ఆనాడు ఆరోపించారు. ఇప్పుడేమో ఇలా అమాయకంగా మాట్లాడుతున్నారు. అవే ఆయన తెలివితేటలు.చంద్రబాబు వ్యూహాత్మకంగా, ఎలాగొలా బతిమలాడి 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల కమిషన్ పూర్తిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆనాటి బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమకు ఏ ఏ అధికారి కావాలో చెబుతూ జాబితాను సమర్పిస్తే, చాలావరకు ఎన్నికల సంఘం అమలు చేసిందని చెబుతారు. సీసీ టీవీ ఫుటేజీ ఒకసారి లీక్ అయింది. దానిని టీడీపీ ప్రచారం చేసింది. అయినా అదెలా జరిగిందని ఈసీ అడగలేదు. ఎన్నికలయ్యాక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్దిష్ట గడువుతో సంబందం లేకుండా వివిపాట్ స్లిప్‌లను దగ్దం చేసేయడం పలు సందేహాలకు అవకాశం ఇచ్చింది.కొందరు వైఎస్సార్సీపీ నేతలు కొన్ని బూత్‌లలో ఓట్లను తిరిగి లెక్క వేయాలని కోరుతూ దరఖాస్తు చేసినా అందుకు ఎన్నికల కమిషన్ అధికారులు సిద్దపడలేదు. దీనిపై న్యాయవ్యవస్థ వద్దకు వెళ్లినా ప్రయోజనం కలగకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన వ్యవస్థలు ఇలా వ్యవహరిస్తున్నాయేమిటా అని చాలామంది బాధపడ్డారు. కాని జరగవలసిన డామేజీ జరిగిపోయింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నికల కమిషన్‌లో జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం చెప్పిన విధానం.. అన్నిటిని జర్నలిస్టు రితిక చోప్రా వెలుగులోకి తీసుకువచ్చిన కథనం సంచలనం అయింది. ఇందుకు ఆమె చేసిన కృషిని అంతా అభినందించాలి. ఎన్నికల కమిషన్‌లోని డొల్లతనం అంతా వెలుగులోకి వచ్చింది. అసలు ఇలా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు చట్టంలో ఎక్కడా అవకాశం లేదని, మాజీ ఎన్నికల ముఖ్య కమిషన్ ఖురేషి వెల్లడించారు. అయినా జ్ఞానేశ్‌కుమార్ ఎలా చేశారంటే ఏమి చెబుతాం. కేవలం బీజేపీ, దానికి మద్దతు ఇచ్చే పార్టీల కోసమే పనిచేస్తున్నారని, విపక్ష పార్టీల వాదనలను పెడచెవిన పెడుతున్నారన్న భావన కలిగితే వ్యవస్థకు ఎంత నష్టం. ఎవరు ఫిర్యాదు చేసినా అందులోని వాస్తవాలను విచారించి న్యాయం ఏమిటో తేల్చవలసిన ఎన్నికల వ్యవస్థే ఏకపక్షంగా మారితే ఎన్నికలు జరిగి ఏమి ఉపయోగం? ఇదంతా నియంతృత్వానికి దారితీయదా? అందువల్లే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలవరం సృష్టిస్తోంది.జ్ఞానేశ్ రాజీనామాకు విపక్షంలోని కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, సమాజవాది, తదితర పార్టీలతో పాటు యువతకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామక విధానంపై పునఃసమీక్ష జరగాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. గతంలో తాము మద్దతు ఇచ్చినప్పటికీ, జరిగిన పరిణామాల రీత్యా దీనిలో మార్పు రావాలని ఆయన కోరారు. ఈ అంశంపై కొన్ని బీజేపీ మిత్రపక్షాలు కూడా జాగ్రత్తగా స్పందించాయి. వాటిలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈసీ వివరణ ఇవ్వాలని తొలుత సూచించారు. దానికి టీడీపీ అధినాయకత్వం కంగారుపడినట్లు ఉంది. తదుపరి ఈసి ఇచ్చిన వివరణ అంత సంతృప్లిగా లేనప్పటికీ, చంద్రబాబు నాయుడు బీజేపీకి కోపం రాకుండా వెంటనే స్పందించారు.ఇంతకాలం ఏపిలో జరిగిన ఎన్నికల ప్రహసనంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా మాట్లాడని చంద్రబాబు దీనిపై మాట్లాడుతూ వ్యవస్థల విశ్వసనీయత గురించి ధర్మోపదేశం చేశారు. ఏపిలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అవకతవకలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం జరగలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివి లేకుండా ఓటర్ల జాబితాలను తయారు చేయాలన్న చిత్తశుద్ది ఉంటే, ఆధార్ కార్డుకు లింక్ పెట్టి ఓట్లను ఖరారు చేస్తే సరిపోతుందని ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. అది చేయకుండా ఎన్నో విన్యాసాలను ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ చేస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఎలా కుదురుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఈసీని తక్షణమే తొలగించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశంలో పారదర్శకతకు తూట్లు పొడిచి, ఓటర్ల ప్రాథమిక హక్కును హరించేలా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని, సీఈసీపై తీవ్రమైన ఒత్తిడి తెచి్చనందుకు, ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు సైతం రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానించింది. పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని, ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన 13.30 కోట్ల ఓటర్ల పేర్లను మళ్లీ చేర్చాలని డిమాండ్ చేసింది. తమ అర్హతను తామే నిరూపించుకోవాల్సిన భారాన్ని పౌరులపై మోపుతూ, పారదర్శకమైన రక్షణలు లేకుండా హడావిడిగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను సీడబ్ల్యూసీ తీవ్రంగా ఆక్షేపించింది. ఎన్నికల సంఘం పనితీరుతోపాటు ఎస్ఐఆర్ వివాదంపై చర్చించడానికి సీడబ్ల్యూసీ మంగళవారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు, ముఖ్యమంత్రులతోపాటు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు.త్రిముఖ వ్యూహంతో ముందుకు.. దేశంలో ఎన్నికల ప్రక్రియను ఓ క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తున్నారని సీడబ్ల్యూసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. బీజేపీ పాలనలో జరుగుతున్న ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని ప్రజల వద్దకు, అందుబాటులో ఉన్న ప్రతి వేదికకూ తీసుకెళ్లినట్లు గుర్తు చేసింది. బిహార్‌లో ఓటరు అధికార్ యాత్ర, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాలో ఓటర్ల జాబితాల్లో అవకతవకలను బహిర్గతం చేస్తూ రాహుల్ గాంధీ నిర్వహించిన మీడియా సమావేశాల గురించి ప్రస్తావించింది. ఎస్ఐఆర్లో అక్రమాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో విపక్ష ‘ఇండియా’కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమాలను సీడబ్ల్యూసీ ప్రశంసించింది. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటం సాగించేందుకు త్రిముఖ వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు ఖరారు చేశారు. రాజకీయ కార్యాచరణలో భాగంగా ఎస్ఐఆర్లో అవకతవకలపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం, ప్రజలతో సమావేశాలు, ఆందోళనలు, ఓటర్లకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఇతర పార్టీలతో సమన్వయం చేసుకోవాలని, దీంతోపాటే పార్లమెంటరీ, న్యాయపరమైన వ్యూహాలను అనుసరించాలని నిర్ణయానికొచ్చారు. త్వరలో జరగబోయే ‘ఇండియా’కూటమి భేటీ తర్వాత దీనిపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించబోతున్నారు. ‘ఓట్–బందీ’తో ప్రజాస్వామ్యం అంతంకేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. సీడబ్ల్యూసీ భేటీలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. దశాబ్దం క్రితం నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ‘ఓట్–బందీ’కుట్రతో బలమైన ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, మోదీ ప్రభుత్వపు కనుసన్నల్లో అధికారులు ఇష్టానుసారంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. రెండు రకాలుగా మ్యాచ్–ఫిక్సింగ్దేశంలో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, ఓటర్ల జాబితాల విషయంలో ‘మ్యాచ్–ఫిక్సింగ్’జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా విరోధ్ (వ్యతిరేకత), ప్రతిరో«ద్(ప్రతిఘటన) మార్గం నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాల గురించి తాము ప్రస్తావించినప్పుడు చాలామంది దీనిపై సందేహం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ అంశంపై ఇప్పుడు మీడియాలోనూ, సంపాదకీయాల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. మ్యాచ్–ఫిక్సింగ్ రెండు రకాలుగా సాగుతోందని, ఒకటి ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించినది కాగా, మరొకటి ఓటర్ల జాబితాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేయడం అని విమర్శించారు.సీడబ్ల్యూసీ ప్రధాన డిమాండ్లు ⇒ ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి. నైతిక, వ్యవస్థాగతమైన అధికారాన్ని, గౌరవాన్ని కోల్పోయినందున ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. ⇒ ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత, విధివిధానాలు, సమగ్రత, రాజ్యాంగబద్ధతపై తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నందున ‘ఎస్ఐఆర్’ప్రకియను తక్షణమే నిలిపివేయాలి.⇒ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.30 కోట్ల మంది పేర్లను వెంటనే పునరుద్ధరించాలి. తొలగింపునకు గురైన ఓటర్లకు పూర్తి సమాచారం ఇచ్చి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలి. ⇒ ఓటర్ల జాబితాలో జరిగే ప్రతి పెద్ద మార్పునకు సంబంధించిన పూర్తి డేటాను బహిర్గతం చేయాలి ⇒ ఓటర్ల జాబితా డేటాను రాజకీయ పార్టీలకు సులభమైన ఫార్మాట్లో సకాలంలో అందించాలి. తీవ్రమైన వ్యత్యాసాలు, లోపాలు ఉన్నచోట స్వతంత్ర విచారణ జరపాలి. ⇒ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన డేటాలో ఎలాంటి సమాచారం దాచిపెట్టకుండా పూర్తి పారదర్శకత పాటించాలి. -
నాడు నోట్ల రద్దు.. నేడు ఓట్ల రద్దు: ఖర్గే ఫైర్
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీధి పోరాటాల నుంచి పార్లమెంట్ వరకు పోరాడతామని స్పష్టం చేశారు.గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కును విస్తరించారని పేర్కొన్న ఖర్గే.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ‘ఓటు రద్దు’ కుట్రలతో ప్రజల హక్కును లాక్కుంటోందని ఆరోపించారు. పదేళ్ల క్రితం ‘నోట్ల రద్దు’తో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, ఇప్పుడు ‘ఓట్ల రద్దు’తో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఫారమ్-6 నిబంధనలను అక్రమంగా మార్చడం ద్వారా ‘జెన్ జీ’ యువతను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని కూడా ఖర్గే ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.News Alert! Political parties must be provided with electoral rolls, relevant data in simple format, in a timely manner: Kharge.News Alert! Independent, time-bound inquiry must be conducted wherever evidence of serious discrepancies emerge: Kharge.News Alert! Kharge seeks… pic.twitter.com/m9kMBUFpyf— Press Trust of India (@PTI_News) September 29, 2026ఓటర్ల జాబితాపై ఐదు డిమాండ్లు..ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ CWC సమావేశంలో ఐదు కీలక డిమాండ్లతో తీర్మానం ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఓటర్ల జాబితాలో చేపట్టే మార్పులకు సంబంధించిన డేటాను తక్షణమే బహిరంగపరచాలని డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించే ముందు సంబంధిత ఓటర్లకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు.. అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. ఎన్నికల నిర్వహణలో తీవ్ర అక్రమాలు వెలుగుచూసిన ప్రాంతాల్లో స్వతంత్ర విచారణ జరిపించాలని సూచనలు చేసింది.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్ ఎపిసోడ్.. ఇండియా కూటమి సంచలన నిర్ణయం -
ఉగ్రవాదాన్ని ఉపేక్షించం
న్యూఢిల్లీ: ఉగ్రవాద భూతాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని, ఉగ్రవాదానికి మద్దతిచ్చే శక్తులను కఠినంగా అణచివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. టెర్రరిజంపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే సహించడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఉగ్రవాద దాడుల వల్ల కలిగిన వేదనకు భారత్ ఇచ్చిన నిర్ణయాత్మక సమాధానమే ‘2016 నాటి సర్జికల్ దాడులు’ అని పునరుద్ఘాటించారు. భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానానికి అవి ఒక కొత్త ఉదాహరణగా నిలిచాయని, నూతన ప్రమాణాన్ని(బెంచ్‌మార్క్) నెలకొల్పాయని అన్నారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మన లక్ష్యం ‘డ్రగ్స్ రహిత భారత్’ ‘‘మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. నషా ముక్త్ యువ అభియాన్‌లో భాగంగా ఇటీవల లక్షలాది మంది యువత డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, ఈ సందేశాన్ని ఇతరులకు చేరవేస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో యువత చురుగ్గా పాలుపంచుకోవాలి. అక్టోబర్ 2న గాం«దీజీ జయంతిని నిర్వహించుకోబోతున్నాం. అనేక మార్గదర్శక సూత్రాలను గాం«దీజీ అందించారు. నేను ఇటీవల అనేక స్ఫూర్తిదాయకమైన పరిశుభ్రతా కార్యక్రమాలను చూశా. మధ్యప్రదేశ్‌లో యువకులు నదిని శుభ్రం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో యువత వారసత్వ సంపదను పునరుద్ధరిండానికి సాయం అందిస్తున్నారు. పాత మెట్ల బావులను శుభ్రం చేస్తున్నారు’’ అని చెప్పారు. అలాంటి వారు కనుమరుగైపోయారు ‘‘ఈ ఏడాది సోమ్‌నాథ్ స్వాభిమాన్ పర్వ్‌ను ఘనంగా నిర్వహించుకున్నాం. 1,000 ఏళ్ల క్రితం మహ్మద్ గజనీ సోమ్‌నాథ్ ఆలయాన్ని మొదటిసారిగా ధ్వంసం చేశాడు. సోమనాథ్‌ను నాశనం చేసి, భారతదేశ అస్థిత్వాన్ని తుడిచిపెట్టడానికి వచ్చిన వారు ఇప్పుడు కనుమరుగైపోయారు. కానీ, సోమ్‌నాథ్ ఆలయం మాత్రం సముద్ర తీరాన ఇప్పటికీ వైభవంగా నిలిచి ఉంది. విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులరి్పస్తున్నా. ఆయన తన జీవితంలో తగినంత గుర్తింపునకు నోచుకోలేదు. రామమందిర ఉద్యమంతో పాటు సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. లక్షలాది మంది ఆయన అభిమానుల తరఫున అశోక్ సింఘాల్‌కు నమస్కరిస్తున్నా’’ అని అన్నారు. -
‘భారత్‌పై కన్నేస్తే గట్టి జవాబే’..‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 138వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం జరిగిన సర్జికల్ స్ట్రైక్‌ను గుర్తుచేసుకుంటూ.. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న విధానాన్ని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన, మాజీ వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ సేవలు, గుజరాత్‌లోని మోఢేరా సూర్య దేవాలయ చరిత్ర, సుందర్బన్లో మహిళల జీవనోపాధి వంటి అంశాలపై మాట్లాడారు.సర్జికల్ స్ట్రైక్‌కు పదేళ్లు2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం నియంత్రణ రేఖ (LoC) దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదంపై భారత సైనికుల చర్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశామని పేర్కొన్నారు.ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు భారత్ తన వైఖరిని పదేపదే స్పష్టం చేసిందని మోదీ అన్నారు. భారత్‌పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నిస్తే గట్టి సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు సాగుతోందని తెలిపారు.జనగణనపై ప్రధాని సందేశందేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనగణన తొలి దశ దాదాపు పూర్తయిందని మోదీ చెప్పారు. ఇప్పటివరకు 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని మాణా గ్రామం నుంచి జనగణన ప్రారంభమైందని, జనగణన ప్రతి ఒక్కరి జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు.అశోక్ సింఘాల్‌కు నివాళివిశ్వహిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్ సింఘాల్ 100వ జయంతిని కూడా మోదీ గుర్తుచేశారు. సంస్కృతి, సమాజం, దేశం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. రామజన్మభూమి ఉద్యమానికి సింఘాల్ అందించిన దిశ, శక్తిని మోదీ ప్రస్తావించారు.మోఢేరా సూర్య దేవాలయానికి వెయ్యేళ్లు1026లో గజనీ సోమనాథ ఆలయంపై దాడి చేసిన సమయంలోనే గుజరాత్‌లోని మోఢేరా సూర్య దేవాలయంపై కూడా దాడి జరిగిందని మోదీ పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణం రాజా భీమదేవుడి కాలంలో 1025లో జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం మోఢేరా దేశంలో తొలి సౌర గ్రామంగా కూడా గుర్తింపు పొందిందన్నారు.మహిళలకు అండగా మాంగ్రూవ్ అడవులుసుందర్బన్లోని ఝార్ఖాలీ ప్రాంత మహిళలు మాంగ్రూవ్ అడవులను అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు. వీరిలో పలువురు పులుల దాడుల్లో భర్తలను కోల్పోయిన మహిళలు ఉన్నారని తెలిపారు. మాంగ్రూవ్ మొక్కలు గ్రామాలకు సహజ రక్షణ కవచంగా మారడంతో పాటు, వాటి ద్వారా మహిళలకు ఆదాయం కూడా లభిస్తోందని వివరించారు.ఇదీ చదవండి: నోయిడా నిరసనలు: చదువులు, ఉద్యోగాలకు దూరమైన ‘జెన్ జీ’ -
భజన క్లబ్బింగ్‌లో మోదీ.. యువతతో కలిసి జోష్
యువతను ఆకట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త తరహా ప్రయత్నం చేశారు. సాధారణ రాజకీయ కార్యక్రమాలకు భిన్నంగా.. యువత ఎక్కువగా పాల్గొనే ఆధునిక భజన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని సందడి చేశారు. భజనలు వింటూ చప్పట్లు కొట్టడంతోపాటు.. చేతిలో వాయిద్యం పట్టుకుని తాళం వేస్తూ కనిపించారు.పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ పార్క్‌లో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందువరుసలో కూర్చున్న మోదీ.. భజనలను ఆస్వాదిస్తూ కళాకారులతో కలిసి చప్పట్లు కొట్టారు. శ్రీరాముడిపై ఆలపించిన భజనకు ఖంజరీ తరహా వాయిద్యాన్ని వాయిస్తూ తాళం వేశారు. అనంతరం అక్కడికి వచ్చిన వారివైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఢిల్లీలో భజన్ క్లబ్బింగ్.. అద్భుతం! అంటూ ఈ ఈవెంట్‌పై ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. Bhajan Clubbing in Delhi. Spectacular! pic.twitter.com/BujBa4lzk7— Narendra Modi (@narendramodi) September 25, 2026ఏంటీ భజన క్లబ్బింగ్..?సంప్రదాయ భజనలను ఆధునిక సంగీత కచేరీ తరహాలో నిర్వహించే విధానమే ‘భజన క్లబ్బింగ్’. ఇందులో పెద్ద సంఖ్యలో యువత ఒకచోట చేరి భజనలు, ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ.. చప్పట్లు కొడుతూ, సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ భక్తి గీతాలకు ఆధునిక సంగీతం, హై ఎనర్జీ ప్రదర్శన శైలిని జోడించడం ఈ కార్యక్రమాల ప్రత్యేకత.మద్యం, ఇతర క్లబ్ సంస్కృతికి భిన్నంగా.. భక్తి, ఆధ్యాత్మికత కేంద్రంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ‘భజన క్లబ్బింగ్’కు ఆదరణ పెరుగుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా జెన్-జెడ్ యువతను సంప్రదాయ భజనలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు.‘మన్ కీ బాత్’లోనూ ప్రస్తావనఈ ఏడాది జనవరిలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ మోదీ ‘భజన క్లబ్బింగ్’ గురించి ప్రస్తావించారు. యువత భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ పెద్ద సంఖ్యలో ఒకచోట చేరడం తనను ఆకట్టుకుందని చెప్పారు. భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించే ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్లోబల్ కచేరీలకు ఏమాత్రం తీసిపోవని పేర్కొన్నారు.దీనదయాళ్ జయంతి సందర్భంగా..భారతీయ జనసంఘ్ కీలక నేతల్లో ఒకరైన దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ‘అంత్యోదయ’ సిద్ధాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సందర్భంగా మోదీ దీనదయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించారు. ఆయన ఆలోచనలు, ప్రజా సంక్షేమంపై ఆయన చూపిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిగ్గింగ్ జరిగితే పోటీ చేయడమెందుకు? -
సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: ఓటు బ్యాంకు రాజకీయాలకు బదులుగా సామాజిక సంస్కరణలు, సమాజంలో సానుకూల మార్పులపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి గుజరాత్‌లోని వాద్నగర్ వరకు సాగుతున్న ‘సేవా యాత్ర’మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటున్నవారితో మోదీ శుక్రవారం వర్చువల్‌గా సంభాషించారు. గత 12 ఏళ్లలో దేశం సాధించిన అభివృద్ధిని ప్రస్తావించారు. దేశంలో నగరాలు, గ్రామాల మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని, అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. మహిళల్లో స్వయం సమృద్ధి కూడా పెరిగిందని అన్నారు. మహాత్మా గాంధీ జీవితాన్ని మనం పరిశీలిస్తే.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటం, స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించడమే కాకుండా ఆయన ఒక గొప్ప సాంఘిక సంస్కర్త అని తెలుస్తుందని చెప్పారు. సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా గాంధీజీ పోరాటం చేశారని తెలిపారు. అందువల్ల, రాజకీయ కార్యకర్తలమైన మనం కూడా ఓటు బ్యాంకులను చూడకుండా, సామాజిక సంస్కరణలు, సానుకూల మార్పు కోసం కృషి చేస్తూనే ఉండాలని సూచించారు. ‘‘సమాజానికి సేవ చేసేవారు తగిన గౌరవం పొందడానికి అర్హులు’’అని ఉద్ఘాటించారు. పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగి.. ప్రయాగ్‌రాజ్‌లో పారిశుధ్య పనులు చేపట్టిన కార్మికులను ప్రధానమంత్రి ప్రశంసించారు. వారి కృషి ‘కుంభమేళా’కు పారిశుధ్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచి్చపెట్టిందని, భారతదేశ గౌరవాన్ని పెంచిందని పేర్కొన్నారు. దేశ గౌరవాన్ని ఎంతో పెంచిన వారి పాదాలను కడిగి, వారి ఆశీస్సులు పొందాలని తనకు అనిపించిందని వ్యాఖ్యానించారు. తన సొంత జీవితంలో ‘సేవా యాత్ర’ఎంతో కీలక పాత్ర పోషించిందని, దేశంలో తాను సందర్శించని జిల్లా దాదాపుగా ఏదీ లేదని వెల్లడించారు. ఎన్నో జిల్లాల్లో రాత్రివేళ బస చేశానని, ప్రతి ప్రయాణం, ఆ క్రమంలో లభించిన ప్రతి అనుభవం నేటికీ గురువులా మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ఉద్ఘాటించారు. ఈ ప్రయాణాలు తనకు ఎంతో నేర్పించాయని మోదీ తెలిపారు. -
భజన్ క్లబ్బింగ్‌లో మోదీ
న్యూఢిల్లీ: భక్తి గీతాలు ఆలపించడానికి, నృత్యం చేయడానికి ‘భజన్ క్లబ్బింగ్’అనే కొత్త ట్రెండ్ మొదలైంది. యువత ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఆధ్యాత్మిక భావనన అలవర్చుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం భజన్ క్లబ్సింగ్లో భాగస్వాములయ్యారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఒక పార్కులో సంఘ్ పరివార్ సిద్ధాంతకర్త దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ 110వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ముందు వరుసలో కూర్చున్నారు. శ్రీరామునిపై పాడిన భజన పాటలకు చప్పట్లు కొడుతూ, తంబూరీన్ వాయిస్తూ కనిపించారు. ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జెన్ జెడ్ తరానికి చెందినవారు చాలామంది ఉన్నారు. వీరంతా ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు. నృత్యాలు చేశారు. మద్యం, మత్తు పదార్థాలు లేకుండా క్లబ్ లాంటి వాతావరణంలో సంగీత కచేరీ నిర్వహించబడే భజన్ క్లబ్బింగ్. ఇది ఇప్పుడిప్పుడే దేశ విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. -
చైనా డబుల్‌గేమ్.. భారత్‌కు కొత్త టెన్షన్?
ఢిల్లీలో ప్రధాని మోదీతో కరచాలనం చేసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ఇప్పుడు వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక చర్చలు జరిపారు. సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ-జిన్‌పింగ్ భేటీ జరగగా.. సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్-జిన్‌పింగ్ సమావేశమయ్యారు. రెండు పర్యటనల మధ్య కేవలం 12 రోజుల వ్యవధి ఉండటం ప్రపంచ దౌత్య వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. వీరిద్దరి మధ్య చర్చల్లో వాణిజ్యం, తైవాన్, AI, టెక్నాలజీ, అరుదైన ఖనిజాలు, ఇరాన్ వంటి అంశాలు కీలకంగా మారాయి. అమెరికా-చైనా వాణిజ్య సంధిని మరో రెండు నెలలు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.మోదీతో భేటీ తర్వాతే ట్రంప్‌తో సమావేశంబ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, జిన్‌పింగ్ ఇరుదేశాల సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. సరిహద్దుల్లో శాంతి, ద్వైపాక్షిక సంబంధాల స్థిరీకరణ, వాణిజ్య అసమతుల్యత, సరఫరా చైన్, వ్యాపార సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చ జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ఇరుదేశాల ఒప్పందాలను పాటించడం ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి కీలకమని మోదీ స్పష్టం చేశారు. చైనా కూడా భారత్‌తో సంబంధాలను దీర్ఘకాలిక వ్యూహాత్మక దృష్టితో అభివృద్ధి చేయాలని చెబుతోంది. జిన్‌పింగ్-మోదీ భేటీ తర్వాత చైనా ప్రకటనలో ఇరుదేశాలు భాగస్వాములుగా ఉండాలనే అంశాన్ని ప్రస్తావించింది.అసలు టెన్షన్ ఇదేఇప్పటివరకు అమెరికా-చైనా పోటీ కారణంగా చైనా నుంచి దూరమయ్యే కంపెనీలకు భారత్ ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశం వచ్చింది. ‘China+1’ వ్యూహం ద్వారా పెట్టుబడులు, సరఫరా గొలుసులు భారత్ వైపు మళ్లే అవకాశం ఏర్పడింది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గి.. చైనా మళ్లీ అమెరికా మార్కెట్‌తో స్థిరమైన సంబంధాలు ఏర్పరచుకుంటే, ఈ అవకాశాల్లో కొంత భాగం తగ్గే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. తైవాన్, AI, టెక్నాలజీ నియంత్రణలు, వాణిజ్య సుంకాలు, ఇరాన్ యుద్ధంపై ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రేర్ ఎర్త్స్ సరఫరాలో చైనాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఈ రంగంలో కుదిరే ఏదైనా అమెరికా-చైనా అవగాహన ప్రపంచ సరఫరా గొలుసులపై ప్రభావం చూపవచ్చు. దాని ప్రభావం భారత్ తయారీ, టెక్నాలజీ రంగాలపై కూడా పరోక్షంగా పడే అవకాశం ఉంది.చైనా లెక్కల్లో భారత్ ఎందుకు?ఇక్కడే భారత్ అంశం ఆసక్తికరంగా మారుతోంది. అమెరికా ఇప్పటికే ఇండో-పసిఫిక్‌లో భారత్‌ను కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. మరోవైపు భారత్ చైనాతో సంబంధాలను పూర్తిగా తెంచుకోకుండా.. సరిహద్దు సమస్యలు, వాణిజ్య అంశాలను పరిష్కరించుకుంటూ సంబంధాలను స్థిరీకరించే ప్రయత్నం చేస్తోంది. అంటే.. అమెరికాతో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది.. చైనాతో భారత్‌కు ఆర్థిక, భౌగోళిక సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు సమీకరణాల మధ్య న్యూఢిల్లీ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోంది.రష్యా అంశం కూడా కీలకమే..రష్యా చమురు, ఇరాన్ అంశాల్లో భారత్, చైనాలపై అమెరికా విధానం కూడా న్యూఢిల్లీకి ముఖ్యమే. అమెరికా-చైనా చర్చల్లో బీజింగ్‌కు రష్యా, ఇరాన్ విషయంలో ఏదైనా ప్రత్యేక వెసులుబాటు లభిస్తే.. ప్రాంతీయ శక్తి సమీకరణాలపై దాని ప్రభావం భారత్ లెక్కలను కూడా మార్చవచ్చు. అందుకే ఢిల్లీ తర్వాత వాషింగ్టన్లో జిన్‌పింగ్ భేటీపై భారత్ నిశితంగా గమనిస్తోంది. అమెరికా-చైనా సంబంధాలు పూర్తిగా తెగిపోవడం భారత్‌కు ఒక రకమైన అవకాశాలను తెస్తే.. ఇరుదేశాల మధ్య అవగాహన పెరగడం మరో రకమైన అవకాశాలను, సవాళ్లను తీసుకురావచ్చు. ఇదీ చదవండి: హార్ముజ్ కోసం ట్రంప్-ఇరాన్ కీలక భేరం! -
ఆ ముగ్గురు దేశద్రోహులు
న్యూఢిల్లీ: ప్రజల ఓటు హక్కును కాలరాసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ముమ్మాటికీ దేశద్రోహులేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటు హక్కుపై దాడి చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను మూలాల నుంచే ధ్వంసం చేసేవారు దేశద్రోహులే అవుతారని పేర్కొన్నారు. సీఈసీ పదవికి జ్ఞానేశ్ కుమార్వెంటనే రాజీనామా చేయాలని, అప్రూవర్‌గా మారాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ జరుగుతోందన్న విషయాన్ని అంగీకరించడం ద్వారా ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ మంచి పని చేశారని ప్రశంసించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఎన్నికలు పూర్తిగా బూటకం అంటూ ధ్వజమెత్తారు. అంతకు ముందు జరిగిన ఎన్నికలు కూడా బూటకమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగిందని అన్నారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. మోదీ, అమిత్ షాలు విచారణ ఎదుర్కోక తప్పదని తేల్చిచెప్పారు. సీఈసీ చేసిన పని కచ్చితంగా దేశ వ్యతిరేక చర్య అని స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఓట్లను తొలగించడం రాజ్యాంగంపై, చట్టపరమైన వ్యవస్థపై జరిగిన దాడిగా అభివరి్ణంచారు. వారు కుట్రదారులు.. వీరు పావులు ‘కుట్రదారులు’అనే శీర్షికతో మోదీ, అమిత్ షా, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా, జ్ఞానేష్ కుమార్ చిత్రాలను తెరపై రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ‘పావులు’అనే శీర్షిక కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ చిత్రాలను ప్రదర్శించారు. అలాగే, కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించారు. మోదీ, అమిత్ షాల మాటల ధోరణిని గమనించాలని ప్రజలను కోరారు. బీజేపీ 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా చెప్పడం, ‘అబ్ కీ బార్ 400 పార్’అనే నినాదాన్ని ప్రధానమంత్రి వినిపించడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వాతావరణంలో పనిచేసే ఏ రాజకీయ నాయకుడూ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేరని రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ నుంచి కానూన్ చోరీఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలు పార్లమెంట్లో చేసిన చట్టాల చట్టబద్ధతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీ నుంచి కానూన్(చట్టం) చోరీ, ఆ తర్వాత సంస్థల చోరీ పుట్టుకొస్తాయని అన్నారు. ఈ రోజు ఓటు పోయిందంటే చట్టాలు చేసే వ్యవస్థ కూడా పోయినట్లేనని తెలిపారు. ‘‘కుట్రదారులు ఓట్లను దొంగిలించారు, ఆ ఓట్ల దొంగతనం ద్వారా చట్టాలను దొంగిలించారు, దేశంలోని వ్యవస్థలను దొంగిలించారు. అంతేకాదు, ఓట్ల దొంగతనం తర్వాత చేసిన చట్టాలు చట్టవిరుద్ధమైనవి’’అని స్పష్టంచేశారు. ఓట్ల చోరీ ద్వారా పార్లమెంట్‌కు ఎన్నికైన చట్టసభ సభ్యులు చేసిన ఏ చట్టమైనా, ఏ సంస్థాగత మార్పు అయినా చట్టవిరుద్ధమే అవుతుందన్నారు. ఓటు అనేది మన దేశానికి పునాది అని తెలిపారు. ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాల గురించి ప్రస్తావించారు. ఓటు వ్యవస్థ దెబ్బతింటోందని అన్నారు. ఇది కేవలం ఓటుపై దాడి మాత్రమే కాదని, ప్రతి భారతీయుడి భావ వ్యక్తీకరణపై జరిగిన దాడి అని స్పష్టంచేశారు. -
మాది ఎప్పటికీ సేవా మార్గమే
దేవాస్: సేవ అనేది బీజేపీ పాలనకు, విలువలకు మూలస్తంభమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తాము ఎంత రాజకీయ అధికారాన్ని పొందినప్పటికీ సేవా మార్గం నుంచి ఎన్నటికీ వైదొలగబోమని స్పష్టం చేశారు. రాజకీయాలు, ఎన్నికల కంటే దేశ నిర్మాణం, దేశాభివృద్ధిపైనే తమ పార్టీ అధికంగా దృష్టి సారిస్తోందని పునరుద్ఘాటించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వరకు జరుగుతున్న ‘సేవా సంకల్ప యాత్ర’లో పాల్గొన్నవారితో ప్రధాని మోదీ గురువారం వర్చువల్‌గా సంభాషించారు. రాజకీయాలు, ఎన్నికలు, పరిపాలనకు వాటి స్థానం వాటికి ఉందన్నారు. కానీ, దేశాన్ని అభివృద్ధి చేయాలన్న బలమైన సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నామని తెలిపారు. ‘సేవా సంకల్ప యాత్ర’ లో పాల్గొంటున్నవారు ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చేరుకున్నారు. సేవే అత్యున్నత ధర్మం ప్రజలకు సేవ చేయడమే యువత ప్రాథమిక లక్ష్యం కావాలని మోదీ అన్నారు. సేవ చేస్తూనే సేవా సందేశాన్ని ఇవ్వాలన్నారు. సేవ గురించి ప్రత్యేకంగా ఉపదేశించాల్సిన అవసరం లేదని వివరించారు. మనం సేవా సందేశాన్ని మాటలతో కాకుండా సేవ ద్వారానే అందిస్తామని పేర్కొన్నారు. సేవే అత్యున్నత ధర్మం అనే స్ఫూర్తితో ముందడుగు వేయాలన్నారు. గ్రామస్థుల వద్ద ఉన్న అపారమైన సాంప్రదాయ జ్ఞానాన్ని వారి నుంచి నేర్చుకోవాలని యువతకు మోదీ సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సందేశా న్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని కోరారు. యాత్ర సమయంలో ‘శక్తి కీ సప్త ధార’(ఏడు శక్తి ప్రవాహాలు) గురించి ప్రజలతో మాట్లాడాలని చెప్పారు. ఆగస్టు 15న ప్రధాని సప్త ధార అనే ఏడు సూత్రాల సంస్కరణల చట్రాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సేవా సంకల్ప యాత్రలో పాల్గొన్నవారు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. ఓ యువ కుడు మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి స్ఫూర్తితో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఒక గ్రామానికి మోదీ ఫాలియా అని పేరు పెట్టారు’’అని చెప్పారు. జెన్–జెడ్ తరం మోదీకి మద్దతు ఇస్తోందని చెప్పారు. జీవితమంతా ప్రజల ఆశీర్వాదాలతోనే నడిచింది వారణాసి, వాద్నగర్ ప్రాచీన నగరాలని, అవి ఇప్పటికీ చైతన్యవంతంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. వాటిలో ఒకటి తన జన్మస్థలమని, మరొకటి తన ‘కర్మభూమి’అని వ్యాఖ్యానించారు. పరిపాలనకు ప్రజాసేవే కేంద్రంగా ఉన్నప్పుడు, ప్రతి విధానానికి నాగరిక్ దేవో భవ(పౌరుడే దేవుడు) అనే సంకల్పం మూలంగా ఉంటుందని వివరించారు. ఎంతటి అధికారం దక్కినా మనది సేవా మార్గమేనన్న సంగతిని మన ప్రవర్తన ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా సేవామార్గం వీడకూడదని పిలుపునిచ్చారు. సేవా స్ఫూర్తితో చేసిన పనులను ప్రజలు గుర్తుంచుకుంటారని, సేవ చేసే వారిని ఆశీర్వదిస్తారని వెల్లడించారు. తన జీవితమంతా ప్రజల ఆశీర్వాదాలతోనే నడిచిందని, అవే తన జీవితానికి గొప్ప శక్తిగా నిలిచాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేస్తే దేశానికి చేసినట్లేనని ఉద్బోధించారు. అదే జీవితపు గొప్ప మంత్రమని అన్నారు. పేదలు, మహిళలు, బాలికలు, రోగులు, గిరిజనులతో సహా సమాజంలోని వివిధ వర్గాల ప్రయోజనం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సేవా స్ఫూర్తియే పునాది అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. సేవా స్ఫూర్తిని దేశ విధానాలకు అన్వయించినప్పుడు, సేవయే దేశ ప్రగతికి అతిపెద్ద చోదక శక్తిగా మారుతుందన్నారు. ‘వికసిత్ భారత్’సంకల్పంతో యువత మమేకం కావాలన్నారు. నేటి యువతరం అభివృద్ధి చెందిన భారతదేశానికి సృష్టికర్తలే కాకుండా, ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత ప్రధాన లబి్ధదారులు కూడా అవుతారని స్పష్టంచేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో యాత్రలకు నాయకత్వం వహించానని చెప్పారు. యాత్ర అంటే కేవలం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడం మాత్రమే కాదని, ప్రజలను కలవడం, సమాజాలను అర్థం చేసుకోవడం, సేవా స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావడం కూడా అని వివరించారు. -
త్వరలో మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో ద్వైపాక్షిక భేటీ?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్లోరిడాలో డిసెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొననున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రధాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక భేటీ జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫ్లోరిడాలోని ట్రంప్ నేషనల్ డోరల్ మియామి రిసార్ట్‌లో జీ20 సమావేశం జరగనుంది. అయితే మోదీ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి పర్యటనల వివరాలను ప్రభుత్వం పర్యటన ఖరారయ్యాక అధికారికంగా వెల్లడిస్తుంది.ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సాంకేతికత తదితర రంగాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మోదీ-ట్రంప్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్ ఇటీవల మాట్లాడుతూ.. జీ20 సందర్భంగా ట్రంప్ కలవాలనుకునే ముఖ్య నేతల్లో మోదీ కూడా ఉంటారని అన్నారు. గత జూన్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్ చివరిసారిగా సమావేశమయ్యారు. ఆ సమయంలో వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు.భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం సుమారు 240 బిలియన్ డాలర్లుగా ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో దీనిని 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఇరు దేశాలు పనిచేస్తున్నాయి. విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే జీ20 సదస్సు సందర్భంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ దేశాల నేతల సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, విపత్తు సహాయం వంటి అంశాలపై క్వాడ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అమెరికా పర్యటన అనంతరం మోదీ కెనడాలో కూడా ద్వైపాక్షిక పర్యటన చేసే అవకాశం ఉందని దౌత్య వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: షాకిస్తున్న దాల్ సరస్సు.. ఏవీ నాటి అందాలు? -
PF ఉద్యోగులకు డబుల్ ధమాకా! ₹10.50 లక్షల Insurance?
-
జెన్‌జీతో కలిసి డ్యాన్స్.. దుమ్మురేపిన జడేజా భార్య
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ మంత్రి రివాబా జడేజా జెన్‌జీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని జామ్‌నగర్‌లోని డీకేవీ కళాశాలలో 'ఆశీర్వాద్ నో దివ్డో' పేరుతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రివాబా జడేజా శ్రీకృష్ణుని భక్తిలో లీనమయ్యారు. రివాబాతో కలిసి జెన్ జెడ్ యువత కూడా కృష్ణ తన్మయత్వంలో మునిగిపోయి భజన చేస్తూ డ్యాన్సులు చేయడం ఆకట్టుకుంది. ఎప్పుడూ హుందాగా నడుచుకునే రివాబా భక్తి పారవశ్యంలో మునిగిపోయి నృత్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్యక్రమంలో భాగంగా రివాబా గాయకుడితో కలిసి వేదికపైకి వచ్చారు. గాయకుడితో కలిస పాట పాడుతూ అడుగులు కలిపారు. ఆమె భక్తి ప్రదర్శన ఆ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. దీంతో కార్యక్రమానికి వచ్చిన యువత కూడా రివాబాతో కలిసి చిందేస్తూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కృష్ణ తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి ధన్సుఖ్ భండేరి, మేయర్ మోనికాబెన్ వ్యాస్, బీజేపీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక రవీంద్ర జడేజా ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. ఆ టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లో జడేజా రెండు మ్యాచ్‌లు కలిపి 8 వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తో మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 65 పరుగులు చేశాడు.🔥 RIVABA JADEJA — ROYAL GRACE, CLASS & CONFIDENCE! 👑🇮🇳She can have 100 Mahua Moitras and Priyanka Vadras for breakfast! 😎🔥Gujarat’s Education Minister, Rivaba Jadeja @Rivaba4BJP , comes from a royal family and carries herself with elegance, humility, and dignity.✅ No…— Akshay Kumar (@akshay_vicky) September 21, 2026ఇదీ చదవండి: జపాన్‌తో చారిత్రక మ్యాచ్.. చిక్కుల్లో భారత క్రికెటర్ -
‘హూ ఈజ్ మోదీ’ నుంచి గ్రేట్ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా?
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమిటి? ఆయన ఏ లక్ష్యంతో బీజేపీ పట్ల, ప్రధాని మోదీ పట్ల అంత విధేయత చూపుతున్నారు? ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీగా తెలుగుదేశం గుర్తింపు పొందింది. అదంతా ఏమైందో కాని, ప్రస్తుతం ఆత్మాభిమానంతో సంబంధం లేకుండా టీడీపీ ముఖ్యనేతలు ప్రవర్తిస్తున్నారేమిటా అని పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా వారణాసికి వెళ్లి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ కాదనరు. కాని వారణాసి వెళ్లి బీజేపీ కేంద్ర మంత్రులతో కలిసి పూజలు చేసి హారతి ఇచ్చిన వైనంపైనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పనే వైఎస్ జగన్ వంటి నేతలు ఎవరైనా చేసి ఉంటే, చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి ఉంటే, ఇక ఇల్లెక్కి గోలచేసినంత పని చేసేవారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిందని ఎల్లో మీడియాలో హోరెత్తించేవారు. కేసుల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించేవారు.రాజకీయాలలో ప్రధాని మోదీ కన్నా చంద్రబాబు నాయుడు చాలా సీనియర్. ఈ విషయాన్ని ఆయనే గతంలో చెప్పుకునేవారు. ఆ సీనియారిటీని పక్కనబెట్టి మోదీ కోసం చంద్రబాబు పూజలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయ అవసరాలా? లేక తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తగు సహకారం పొందడానికా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది చర్చగా ఉంది.చంద్రబాబు 1978లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అదే టరమ్‌లో మంత్రి అయ్యారు. ఆయన మామ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ నుంచి జంప్ చేసి పెత్తనం సాగించారు. కర్షకపరిషత్ ఛైర్మన్‌గా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మెడలు వంచి అధికారం సాధించామని ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. అలాంటి నేత బీజేపీ విషయంలో పలుమార్లు పిల్లిమొగ్గలు వేశారు.1996లో వామపక్షాలతో కలిసి పోటీచేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు. 1998 నాటికి ఎన్డీఏలోకి వచ్చి, 1999 ఎన్నికలలో కలిసి పోటీచేశారు. 2001 ప్రాంతంలో గుజరాత్ మత కలహాల నేపథ్యంలో మోదీని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోబోనని ప్రతిజ్ఞ చేశారు. కాని 2014 నాటికి ప్రధాని అభ్యర్ది అయిన మోదీని కలవడానికి లాబీయింగ్ చేసుకుని సఫలం అయ్యారు. ఆ తర్వాత 2018లో మళ్లీ బీజేపీకి దూరం అయి కాంగ్రెస్‌తో కలిశారు. 2019లో ఓటమి తర్వాత మళ్లీ బీజేపీవైపు వెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసి 2024లో పొత్తు పెట్టుకోగలిగారు. రాజకీయాలలో పొత్తులు మార్చుకోవడం జరుగుతూనే ఉంటుంది. కాని విమర్శలు, ఆరోపణల విషయంలో పెద్ద నేతలు సంయమనంగా ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం ఆ విషయంలో హద్దులు పాటించలేదు. ప్రధానిని ఏవైతే అనగూడదో ఆ మాటలన్నీ అన్నారు. దేశానికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా, ముస్లింలను బతకనివ్వని మనిషిగా, భార్యను ఏలుకోవడం లేదని అంటూ హూ ఈజ్ మోదీ అనేంతవరకు వెళ్లారు. 2019 ఎన్నికల సమయంలో మోదీ కూడా చంద్రబాబును అవినీతిపరుడని ధ్వజమెత్తారు. అయినా ఇరు పార్టీలు, ఇద్దరు నేతలు మళ్లీ కలవడం ద్వారా ఇవా రాజకీయాలు.. ఔరా అనిపించారు.తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీతో పొత్తుకోసం డిల్లీలో మూడు రోజులు పడిగాపులు కాచారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. టీడీపీతో పొత్తుకు బీజేపీ ఇష్టపడలేదని, తాను ఈ విషయంలో తిట్లు కూడా తిన్నానని పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్‌లో వెల్లడించారు. కూటమి ఎన్నికల ప్రచారానికి మోదీ వచ్చినా చంద్రబాబుతో అంతంతమాత్రంగానే మాట్లాడారని అంటారు. ఆయా సందర్భాలలో మొక్కుబడిగానే వీరిమధ్య సంబంధాలు సాగాయి. ఈ లోక్ సభ ఎన్నికలలో 16 సీట్లు రావడం టీడీపీకి కలిసి వచ్చింది. బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో టీడీపీ, జేడీయూ సీట్లు కీలకం అయ్యాయి. ఆ తర్వాత మోదీ, చంద్రబాబుల మధ్య సంబంధాలు మెరుగుపడడం ఆరంభం అయిందని చెప్పాలి.ఇదీ చదవండి: రేవంత్ వర్సెస్ కేసీఆర్.. భూముల లెక్కల్లో అసలు ట్విస్ట్ ఇదేనా?అయినా చంద్రబాబును బీజేపీ పెద్దలు నమ్మడం అంతంత మాత్రమేనని చెబుతారు. చంద్రబాబు పలుమార్లు డోకా చేశారని, కాంగ్రెస్‌తో కూడా కలిసి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో వ్యతిరేక ప్రచారం చేశారన్న అసంతృప్తి బీజేపీలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనపై బీజేపీలో నమ్మకం పెరగడానికి గాను 2024 నుంచి తెగ పాట్లు పడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. మోదీని అవసరం ఉన్నా, లేకపోయినా పొగడడం, అది కూడా బీజేపీవారికే ఎబ్బెట్టుగా ఉండేంతగా చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.ఉదాహరణకు ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తీసుకుంటే భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మోదీని ఆకాశానికి ఎత్తేశారు. మోదీ, మోదీ అంటూ సభికులతో నినాదాలు ఇప్పించారు. మోదీ ప్రపంచానికే నాయకుడని మెచ్చుకుంటున్నారు. మోదీ కోసం ప్రత్యేకంగా యోగా దినోత్సవం నాడు కోట్లు వెచ్చించి ఒక రోజు కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు కూడా వైఎస్సార్సీపీ, మరికొన్ని పక్షాలు చేశాయి. కేంద్రం బాగా సహకరిస్తోందని ఒకటికి రెండుసార్లు ప్రకటనలు చేస్తున్నారు.జగన్ టైమ్‌లో రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు తదితర స్కీములకు భారీగానే నిధులు వచ్చాయి. ఆనాటితో పోల్చితే ఈ రెండేళ్లో అమరావతి అప్పు మినహా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించింది అంతంత మాత్రమే. అయినా ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. వారణాసిలో సైతం మోదీని కొనియాడుతూ సరైన సమయంలో సరైన నాయకుడు అని అభివర్ణించారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చారని చెప్పారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్‌లు కూడా మోదీని పొగిడే పనిలో ఉంటున్నారు.గతంలో గుజరాత్‌కే అన్ని చేస్తున్నారని, ఏపీ అంటే మోదీకి అసూయ అని, అమరావతికి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చారని చంద్రబాబు ఆరోపించేవారు. కాని జత కలిసిన తర్వాత మాట మార్చారు. అది వేరే సంగతి. ఇటీవలికాలంలో ఎందుకు ఇంతగా తగ్గి వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఒత్తిడి ఆయనపై అధికంగా ఉందని అంటారు. జనసేన, బీజేపీల నుంచి దానిపై ఒక క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన అభిప్రాయం వెల్లడించలేదు. మోదీ ఒప్పుకుంటే ఆ విషయం ఒక కొలిక్కి రావచ్చు.అంతేకాదు... అది జరిగితే తను జాతీయ స్థాయిలో ఏదైనా పదవికి వెళ్లడానికి చంద్రబాబు టార్గెట్ పెట్టుకుని ఉండవచ్చు. అది సాధించాలంటే బీజేపీ ఓకే చేయవలసి ఉంటుంది. కేంద్ర స్థాయిలోకాని, ఇతరత్రా ఏమైనా కేసులు ఉంటే వాటిని పరిష్కరించుకునే పనిలో కూడా ఉండి ఉండవచ్చన్నది కొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనా మోదీ జన్మదినోత్సవ పూజలకు వెళ్లడం ద్వారా చంద్రబాబు తన సీనియారిటీని తానే తగ్గించుకున్నట్లు అయిందా అన్న భావన టీడీపీతో సహా ఆయా వర్గాలలో ఏర్పడింది. ఆత్మగౌరవం వంటివాటితో సంబంధం లేకుండా, ఇలాంటి రాజకీయ వ్యూహాలలో ఆయన దిట్టే అన్న అభిప్రాయం కూడా ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జెన్‌జీలకు కొత్త గాలం! రాహుల్ గాంధీకు కౌంటర్‌గా..
దేశ రాజకీయాల్లో జెన్‌జీ చుట్టూ కొత్త ఫోకస్ కనిపిస్తోంది. విద్యార్థులు, యువత సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ‘చత్రోన్ కీ గూంజ్’ వేదికగా విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. దీంతో యువతను చేరుకోవడంపై అధికార, ప్రతిపక్ష శిబిరాల్లోనూ కసరత్తు మొదలైంది.ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా యువతతో మరింతగా మమేకం కావాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కేబినెట్ భేటీలతో పాటు తరచూ జరుగుతున్న పార్టీ సమావేశాల్లోనూ ఎంపీలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవడంతో పాటు.. ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటి డిజిటల్ వేదికల ద్వారా జెన్‌జీకి దగ్గర కావాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. రాహుల్ గాంధీకి మోదీ ‘తురుపుముక్క’గా భావిస్తున్న చిరాగ్ పాస్వాన్ నుంచి కౌంటర్‌కు రంగం సిద్ధమైంది.ఎన్డీయే మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తాజా జెన్‌జీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్ యూత్ బోలె తో(Youth Bole To) పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ యువత కార్యక్రమాలకు కౌంటర్ అనే చర్చ జోరందుకుంది.తొలి కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే..పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ‘Youth Bole To’ తొలి కార్యక్రమం జరగనుంది. ఇందులో చిరాగ్ పాస్వాన్ బిహార్ యువతతో, ముఖ్యంగా జెన్‌జీ ప్రతినిధులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్య, ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ, డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సవాళ్లపై యువతతో చర్చించనున్నారు.యువత తమ ప్రశ్నలు, అభిప్రాయాలు, సూచనలను నేరుగా చిరాగ్ ముందుంచేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పార్టీ బిహార్ అధ్యక్షుడు సురేంద్ర వివేక్ మాట్లాడుతూ.. యువతను ఓటుబ్యాంకుగా చూడటం లేదని, వారి సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిపై చర్చించడమే తమ ఉద్దేశమని తెలిపారు.రాహుల్ ఫోకస్.. ఎన్డీయేలో కదలికఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ విద్యార్థులు, యువతతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘చత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాల్లో విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, యువత భవిష్యత్తు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ.. యువత సమస్యలను రాజకీయ చర్చలోకి తీసుకొస్తున్నారు. ఒకానొక దశలో ఇవి విమర్శలకు దారి తీస్తున్నప్పటికీ.. యువతను ఆకర్షిస్తున్నాయనే చర్చా నడుస్తోంది. దీంతో జెన్‌జీని ఎవరు ఎలా చేరుకుంటారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అటు రాహుల్ గాంధీ ప్రత్యక్ష కార్యక్రమాలతో యువతను కలుస్తుండగా.. ఇటు మోదీ ప్రభుత్వం డిజిటల్ వేదికలపై దృష్టి పెడుతోంది. ఇప్పుడు ఎన్డీయే తరఫున చిరాగ్ పాశ్వాన్ ప్రత్యక్షంగా జెన్‌జీతో సంభాషించేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు.బిహార్ నుంచి యూపీకి..చిరాగ్ వ్యూహం బిహార్‌తోనే ఆగడం లేదు. సెప్టెంబర్ 24న పాట్నా.. ఆ తర్వాత సెప్టెంబర్ 27న ప్రయాగ్‌రాజ్‌లో తదుపరి ‘Youth Bole To’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత యూపీలోని ఇతర నగరాల్లోనూ యువతను కలిసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక్కడే ఎన్నికల లెక్కలు కూడా తెరపైకి వస్తున్నాయి. బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో చిరాగ్ తన సొంత పార్టీకి యువతలో మరింత కనెక్ట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా యువతను చేరుకునే కార్యక్రమాలు పార్టీ విస్తరణకు ఉపయోగపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఎన్నికలు జరగబోయే ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా కౌంటర్ కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ, మిత్రపక్షాలకు ఢిల్లీ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.యువతే టార్గెట్.. కొత్త వ్యూహంబిహార్లో మొదలై యూపీకి విస్తరించనున్న ఈ కార్యక్రమం ద్వారా చిరాగ్ లాంటి యువనేతతో.. యువతతో నేరుగా మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, టెక్నాలజీ వంటి అంశాలపై జెన్‌జీతో చర్చించనున్నారు. మరోవైపు ఎన్డీయే కూడా యువతను చేరుకునే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తోంది.రాహుల్ గాంధీ జెన్‌జీతో మమేకమవుతూ యువత సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సమయంలో.. అధికార పక్షం కూడా యువతను చేరుకునేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరాగ్ పాస్వాన్ ‘Youth Bole To’ కార్యక్రమంతో రంగంలోకి దిగుతున్నారు.మోదీ తురుపుముక్కగా చిరాగ్ పాస్వాన్‌ను రాజకీయ వర్గాల్లో కొందరు అభివర్ణిస్తున్న నేపథ్యంలో.. ఆయన చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బిహార్ నుంచి యూపీ వరకు జెన్‌జీని ఆకట్టుకునేలా ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించడం.. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే వ్యూహంలో భాగంగానే రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. -
రాహుల్ సమక్షంలో మోదీ మిమిక్రీ.. రగిలిపోతున్న బీజేపీ!
భోపాల్ : పేపర్ లీకేజీలతో పాటు ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం రాజకీయ దుమారానికి దారితీసింది.మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ మిమిక్రీ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండించారు.కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కమెడియన్లు, జోకర్ల పార్టీగా మారిపోయిందని, వారు శాశ్వతంగా రాజకీయాల నుంచి కనుమరుగయ్యారని ఆర్ఐపీ వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నైతిక దివాలాకోరుతనానికి అట్టడుగు స్థాయికి దిగజారాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ధ్వజమెత్తారు. విద్యార్థుల సంభాషణ వేదికను ఉపయోగించుకుని ప్రధానిని అపహాస్యం చేయడం వారిలో మానవతా దృక్పథం లోపించడాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. బీజేపీ నాయకుడు సీఆర్ కేశవన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇలాంటి వ్యక్తులతో వేదికను పంచుకోవడమే కాక, ఆ వ్యాఖ్యలకు నవ్వుతూ మద్దతు తెలిపారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ చవకబారు సంస్కృతిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ఈ వివాదానికి కారణం ఏమిటి?ఇండోర్‌లో విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి రాహుల్ గాంధీతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన మిమిక్రీ ప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై, ముఖ్యంగా పేపర్ లీక్‌లు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులు విద్యా వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. అయితే, ఇదే వేదికపై కమెడియన్ పుల్కిత్ మణి చేసిన ప్రదర్శన ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన పుల్కిత్ మణి ఒక ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్.ఆయన 2021 నుంచి ప్రొఫెషనల్‌గా స్టాండప్ కామెడీ ప్రదర్శనలు ఇస్తున్నారు. లైవ్ షోలు, కామెడీ క్లిప్‌లు, ప్రముఖుల మిమిక్రీ , పొలిటికల్ సెటైర్లతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుత కాలంలో యువతను ఆకట్టుకునేలా సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై కామెడీ స్కిట్లు చేయడం ఆయన శైలి. #WATCH | Indore, Madhya Pradesh: At the 'Chhatron Ki Goonj' programme in Indore, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "...The 'andhbhakt' says development is not needed. Modi ji is an incarnation of Vishnu. But the andhbhakt never asks questions. An andhbhakt will… pic.twitter.com/0Xa5b70O8h— ANI (@ANI) September 19, 2026 -
మోదీ జన్మదిన వేడుకలకు డుమ్మా.. విద్యార్థులకు నోటీసులు
శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) జమ్మూ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమానికి గైర్హాజరైన పలువురు విద్యార్థులకు ఐఐఎం స్టూడెంట్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 17న క్యాంపస్‌లోని అకడమిక్ బ్లాక్‌లో నిర్వహించిన ‘జ్యోతి ప్రజ్వలన’ కార్యక్రమానికి విద్యార్థుల హాజరు తప్పనిసరి అని, ఎందుకు రాలేకపోయారో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.వైద్య కారణాలు మినహా ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకోబోమని, గైర్హాజరైన వారికి రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మొదట సుమారు 65 మంది విద్యార్థులకు ఈ నోటీసులు పంపినప్పటికీ, ప్లేస్మెంట్లు, అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయిన వారి నోటీసులను ఉపసంహరించుకున్నామని, ఇప్పటివరకు ఎవరికీ జరిమానా విధించలేదని స్టూడెంట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అకుల్ శర్మ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే యుధ్వీర్ సేథీ, ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ సహాయ్ పాల్గొన్న ఈ వేడుకకు హాజరును తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.విద్యాసంస్థల్లో స్వతంత్ర ఆలోచనలను పెంపొందించాల్సింది పోయి, రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలకు విద్యార్థులను బలవంతంగా రప్పించడం, జరిమానాలు విధిస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ జే అండ్ కే ఇన్చార్జ్ సయ్యద్ నసీర్ హుస్సేన్ ప్రశ్నించారు. అయితే, విద్యార్థులు క్యాంపస్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఎవరిపైనా జరిమానా వేయలేదని, ఈ అంశాన్ని అనవసరంగా రాజకీయ కోణంలో చూస్తున్నారని ఐఐఎం అధికార ప్రతినిధి తెలిపారు. ఇదీ చదవండి: Air India Crash: బోయింగ్ 787పై కొత్త సందేహాలు -
భారత యువశక్తిపై గొప్ప అంచనాలు
న్యూఢిల్లీ: దేశంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం బహుముఖంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకోసం విదేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏలు) కుదుర్చుకున్నామని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రెండు కోట్ల మంది యువతకు లబ్ధి చేకూర్చడానికి రూ.లక్ష కోట్ల విలువైన ఉపాధి ప్రోత్సాహక కార్యక్రమాన్ని తీసుకొచి్చనట్లు వెల్లడించారు. శనివారం 20వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో నూతనంగా ఎంపికైన యువతకు వర్చువల్ విధానంలో 51,000కు పైగా నియామక పత్రాలను అందజేశారు. భారతీయ యువత ప్రతిభ, నైపుణ్యాలు ప్రపంచం మొత్తానికీ విశ్వాసాన్ని కలిగించాయని పేర్కొన్నారు. భారతీయ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ యువశక్తిపై ప్రపంచానికి గొప్ప అంచనాలు ఉన్నాయని స్పష్టంచేశారు. 40 ఎఫ్‌టీఏలపై మనదేశం సంతకాలు చేసిందని, ఇవి మన యువతకు కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తున్నాయని వివరించారు. ఈ ఒప్పందాలు మన పారిశ్రామికవేత్తలకు కొత్త భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేస్తాయని, కొత్త మార్కెట్లకు దారులు తెరుస్తాయని, మన యువతకు కెరీర్ పరంగా కొత్త అవకాశాలను సృష్టిస్తాయని తెలియజేశారు. -
కర్బన ఉద్గారాల పాపం అభివృద్ధి చెందిన దేశాలదే!
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువ తలసరి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని, అయినప్పటికీ వాతావరణ మార్పుల దుష్పరిణామాలకు గాను అభివృద్ధి చెందుతున్న దేశాలను అన్యాయంగా నిందిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. పర్యావరణం, వాతావరణంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అణు శక్తి ఉత్పత్తి దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. అయితే, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే కొందరు వ్యక్తులు ప్రభుత్వ అణు కార్యక్రమాలను అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేస్తున్నారని, స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను వ్యతిరేకిస్తున్నారని తప్పుపట్టారు. కర్బన ఉద్గారాలకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాలపై నిందలు వేయడం సరైంది కాదన్నారు. వాస్తవానికి తలసరి కర్బన ఉద్గారాల విషయంలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగానే ఉందని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలు అధికంగా కర్బన ఉద్గారాలకు, తద్వారా పర్యావరణ మార్పులకు కారణమవుతున్నాయని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ప్రపంచమంతటా గట్టిగా చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘అణుశక్తి’ పనులను అడ్డుకోవద్దు భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోందని, పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ప్రధాని వివరించారు. భారతదేశ అభివృద్ధి వేగవంతమైనది, సుస్థిరమైనది అని వ్యాఖ్యానించారు. పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, నిర్ణీత గడువు కంటే ముందే పారిస్(కాప్–21) ఒప్పందాల ప్రకారం తన బాధ్యతలను నెరవేర్చిన ఏకైక జీ20 దేశం భారత్ అని పేర్కొన్నారు. నవ భారతం శక్తి ఇదేనని అన్నారు. శిలాజేతర ఇంధనాలు, సౌరశక్తి సామర్థ్యం, కర్బన ఉద్గారాల నియంత్రణ వంటి కీలక అంశాల్లో భారతదేశ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలియజేశారు. గత 12 ఏళ్లలో ఇండియాలో పవన విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, జల విద్యుత్ సామర్థ్యంలోనూ గణనీయమైన వృద్ధి నమోదైందని, ప్రస్తుతం అణు విద్యుత్ ఉత్పత్తి దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని మోదీ స్పష్టంచేశారు. అణుశక్తికి సంబంధించిన పనులను ముందుకు తీసుకెళ్తున్నామని, వీటిని దయచేసి ఎవరూ అడ్డుకోవద్దని కోరారు. అణుశక్తి రంగంలోకి ప్రైవేట్ సంస్థలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. తమ ప్రయత్నాల ఫలితంగా భారతదేశపు శిలాజేతర ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు. 160 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యం గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ, ప్రతి విభాగంలోనూ భారత్ అసాధారణ పురోగతిని సాధించిందని ప్రధాని వివరించారు. 12 ఏళ్ల క్రితం దేశంలో సౌరశక్తి సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు ఉండేదని, నేడు అది 160 గిగావాట్లను దాటిందని గుర్తుచేశారు. ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా ఇళ్లను సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ పథకం కింద 50 లక్షలకు పైగా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది అనేక దేశాల్లోని మొత్తం ఇళ్ల సంఖ్య కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. 2014కు ముందు దేశంలో ఏటా 3,000 ఎల్రక్టానిక్–వాహనాలు(ఈవీ) మాత్రమే అమ్ముడయ్యేవని వెల్లడించారు. గత ఏడాది 25 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని, ఇది నమ్మశక్యంకాని వృద్ధి అని ఉద్ఘాటించారు. ఇది మన పర్యావరణానికి మేలు చేస్తోందన్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌ల వల్ల టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం, ఇంధన వృథా గణనీయంగా తగ్గాయని ప్రధాని తేల్చిచెప్పారు. పర్యావరణానికి ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక ప్రధాన సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే సింగిల్–యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు చెప్పారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకల్’ అనే విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
గల్ఫ్‌లో కొత్త యువరాజు ఎంట్రీ.. మోదీ, పుతిన్‌తో భేటీపై కొత్త చర్చ
గల్ఫ్ రాజకీయాల్లో మరో యువరాజు పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆయనే అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. 44 ఏళ్ల ఖలీద్.. కేవలం యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (MBZ) కుమారుడిగా మాత్రమే కాకుండా.. అబుదాబి ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, దౌత్య వ్యవహారాల్లో కీలక బాధ్యతలు చేపడుతున్న నాయకుడిగా ఎదుగుతున్నారు.ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ (BRICS) సదస్సులో ఖలీద్ ప్రాధాన్యం మరింత స్పష్టమైంది. యూఏఈ తరఫున సదస్సుకు నాయకత్వం వహించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తోనూ కీలక సమావేశం నిర్వహించారు. ఇరాన్, యూఏఈ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించి, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని అంగీకరించినట్లు అబుదాబి అధికారిక వర్గాలు తెలిపాయి. పెజెష్కియాన్ కూడా సమావేశం అనంతరం.. గతాన్ని పక్కనపెట్టి భవిష్యత్తు వైపు చూడాలని ఇరుపక్షాలు అంగీకరించినట్లు చెప్పారు. నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల తర్వాత ఇరాన్-యూఏఈ మధ్య అత్యున్నత స్థాయి సంప్రదింపుల్లో ఇదొకటిగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది.ఇదంతా ఎందుకు కీలకం?ఖలీద్ ఎదుగుదల కేవలం దౌత్య భేటీలకే పరిమితం కావడం లేదు. 2023లో ఆయనను అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌గా నియమించిన తర్వాత.. అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా, ADNOCకు సంబంధించిన కీలక బాధ్యతల్లోనూ ఆయన పాత్ర పెరిగింది. అంటే.. అబుదాబి రాజకీయ వ్యవస్థతో పాటు దాని చమురు, పెట్టుబడులు, ఆర్థిక శక్తి వ్యవస్థల్లోనూ ఖలీద్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.ఇదే సమయంలో గల్ఫ్‌లో మరో యువరాజు ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. ఆయనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS). సౌదీ అరేబియా భారీ జనాభా, పెద్ద ఆర్థిక వ్యవస్థ, విస్తారమైన చమురు వనరులతో ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన శక్తిగా ఉంది. మరోవైపు అబుదాబి పరిమాణంలో చిన్నదైనా.. భారీ సంపద, పెట్టుబడులు, ఫైనాన్స్, లాజిస్టిక్స్, అంతర్జాతీయ వ్యాపార సంబంధాల ద్వారా తన ప్రభావాన్ని పెంచుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో సౌదీ అరేబియా కూడా పెట్టుబడులు, టూరిజం, వ్యాపార రంగాల్లో భారీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. దీంతో గల్ఫ్‌లో అబుదాబి, రియాద్ మధ్య ఆర్థిక పోటీ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. యెమెన్, ఇరాన్, సూడాన్ వంటి ప్రాంతీయ అంశాలపై కూడా సౌదీ, యూఏఈ విధానాల్లో భేదాలు నమోదయ్యాయి.తండ్రి నిర్మించిన వ్యవస్థ.. కొడుకు చేతుల్లోకియూఏఈ అధ్యక్షుడు MBZ దశాబ్దాలుగా నిర్మించిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఖలీద్ తదుపరి దశకు తీసుకెళ్లాల్సి ఉంది. అందులో భాగంగానే అంతర్జాతీయ నాయకులతో వరుస భేటీలు, భారీ పెట్టుబడి సంస్థల పర్యవేక్షణ, అబుదాబి ఆర్థిక వ్యవస్థలో కీలక బాధ్యతలు ఆయనకు అప్పగిస్తున్నట్లు కనిపిస్తోంది. బ్రిక్స్ వేదికపై ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి నేతలతో ఖలీద్ భేటీలు.. ఆయనకు అప్పగిస్తున్న అంతర్జాతీయ దౌత్య బాధ్యతలకు మరో ఉదాహరణగా నిలిచాయి. యూఏఈ అధికారిక ప్రకారం, న్యూఢిల్లీలో మోదీతో జరిగిన సమావేశంలో ఇరు దేశాల దీర్ఘకాలిక సంబంధాలు, ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చ జరిగింది.అయితే ఖలీద్ ఎదుగుతున్న సమయంలో ఆయన కుటుంబంలోని ఇతర కీలక వ్యక్తులకూ అబుదాబి వ్యవస్థలో గణనీయమైన బాధ్యతలు ఉన్నాయి. అందువల్ల ఇది ఒక్క వ్యక్తి వారసత్వ కథ మాత్రమే కాకుండా.. అబుదాబి పాలనా వ్యవస్థలో తదుపరి తరం అధికార పంపిణీ ఎలా ఉండబోతోందన్న ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. దీంతో, రియాద్‌లో MBS తన ప్రభావాన్ని విస్తరిస్తున్న వేళ.. అబుదాబి నుంచి ఖలీద్ కూడా అంతర్జాతీయ దౌత్యం, పెట్టుబడులు, ఆర్థిక శక్తి ద్వారా తన పాత్రను విస్తరిస్తున్నారు. ఇరాన్‌తో తాజా చర్చలు, మోదీతో భేటీ, బ్రిక్స్ వేదికపై ఆయన ప్రదర్శించిన దౌత్య చురుకుదనం.. గల్ఫ్ తదుపరి తరం నాయకత్వంలో ఖలీద్ పాత్ర పెరుగుతోందన్న సంకేతాలను ఇచ్చాయి. -
పారిస్ ఒప్పందాన్ని నిలబెట్టాం : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. పర్యావరణం, వాతావరణ మార్పులపై శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన ఆయన.. భారత్‌లో తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉన్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కార్బన్ ఉద్గారాలు భారత్ కంటే సుమారు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని మోదీ తెలిపారు. ముఖ్యంగా సౌర విద్యుత్ సామర్థ్యం 2 గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు పైగా పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో పునరుత్పాదక ఇంధనం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.పారిస్ వాతావరణ ఒప్పందంలో భారత్ చేసిన కట్టుబాట్లను నిర్ణీత గడువుకు ముందుగానే సాధించిందని ప్రధాని తెలిపారు. జీ20 దేశాల్లో ఈ లక్ష్యాలను ముందుగానే పూర్తి చేసిన దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు. నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యం, సౌర విద్యుత్ విస్తరణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి అంశాల్లో భారత్ సాధించిన పురోగతిని ఆయన ప్రస్తావించారు. ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ’ పథకం ద్వారా ఇళ్లనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని మోదీ చెప్పారు. ఇప్పటివరకు 50 లక్షలకు పైగా ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ.80 వేల వరకు ప్రభుత్వ సహాయం అందుతున్నట్లు వివరించారు.కుసుమ్ పథకం కింద సుమారు 30 లక్షల మంది రైతుల పొలాల్లో సౌర విద్యుత్ పంపులను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. అలాగే ‘వన్ నేషన్ వన్ గ్రిడ్’ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో ఎల్ఈడీ బల్బుల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ ఆదాతో పాటు ఉద్గారాల తగ్గింపునకు కూడా సహకారం అందిందన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్ అంతర్జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని మోదీ తెలిపారు. వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. భారతదేశంలోని ప్రాచీన పర్యావరణ ఆలోచనలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. పవన విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, జల విద్యుత్ సామర్థ్యం కూడా గణనీయంగా విస్తరించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘జెన్ జీ’లో స్లో లివింగ్ క్రేజ్ ఎందుకు పెరుగుతోంది? -
మోదీ టీచర్ వయసు.. ఇదిగో క్లారిటీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పాఠాలు చెప్పిన మాజీ ఉపాధ్యాయుడు హెచ్‌సీ పటేల్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ చిన్ననాటి జ్ఞాపకాలను పటేల్ గుర్తుచేసుకోవడం ఒకవైపు ఆసక్తికరంగా మారితే.. మరోవైపు ఆయన ప్రస్తుత వయసుపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇద్దరికీ ఒకే వయసు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ల విషయంలోనూ పొంతన కుదరకపోవడమూ.. చర్చకు దారి తీసింది.హెచ్‌సీ పటేల్ గుజరాత్‌లోని వడ్నగర్లో మోదీ చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారట. 1965 జూన్ నుంచి 1967 మే వరకు మోదీకి మ్యాథ్స్, సైన్స్ బోధించినట్లు పటేల్ స్వయంగా గుర్తుచేసుకున్నారు. అయితే ఎన్డీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పటేల్ 10, 11 తరగతులకు మ్యాథ్స్, సైన్స్ బోధించారని పేర్కొన్నారు. పీటీఐ ఆధారంగా వచ్చిన మరో కథనంలో 11, 12 తరగతుల సైన్స్ టీచర్‌గా పేర్కొన్నారు. ఇక్కడే అసలు కథ ఆరంభమైంది.మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అంటే 1965లో ఆయన వయసు సుమారు 14–15 ఏళ్లు. 1967లో స్కూల్ విద్య పూర్తిచేసే సమయానికి ఆయన వయసు 16–17 ఏళ్ల మధ్య ఉంటుంది. అందువల్ల పటేల్ ఆ సమయంలో ఉపాధ్యాయుడిగా ఉన్న విషయం మాత్రం ఆయన చెప్పిన వివరాలతో స్పష్టంగా ఉంది. మరి టీచర్ వయసెంత? అంటూ ట్రోలింగ్ మొదలైంది.Ahmedabad, Gujarat: Teacher of Prime Minister Narendra Modi, H.C. Patel says, "I taught Narendra Modi for two years, from June 1965 to 1967 May, when he was in Classes 10 and 11. In Class 11, he would sometimes come to my house for tuition-not every day, but occasionally. There… pic.twitter.com/d7L7wCqk9N— IANS (@ians_india) September 17, 2026మోదీకి 14–16 ఏళ్ల వయసులో పాఠాలు చెప్పిన టీచర్.. ఇప్పుడు 76 ఏళ్ల మోదీతో పోలిస్తే మరింత వయసులో ఉండాలని కొందరు నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సాధారణంగా టీచర్, విద్యార్థి మధ్య ఉండే వయసు తేడాను ప్రస్తుత వయసులతో పోల్చుతూ.. పటేల్ 80 లేదంటే 90లలో ఉండాల్సి ఉంటుందని కొందరు పోస్టులు చేస్తున్నారు.‘మోదీ.. చాలా షార్ప్’ఓవైపు ఈ చర్చ నడుస్తుండగా.. పటేల్ మాత్రం మోదీ విద్యార్థిగా ఉన్న రోజుల గురించి ఎన్నో విషయాలు గుర్తుచేసుకున్నారు. మోదీ చాలా చురుకైన విద్యార్థి అని, స్కూల్లో జరిగే దాదాపు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని చెప్పారు. ఒకసారి పాఠశాల భవనం ప్రహరీ నిర్మాణానికి నిధులు సేకరించేందుకు నిర్వహించిన నాటకంలో మోదీ జోగీదాస్ ఖుమాన్ పాత్ర పోషించారని తెలిపారు. కత్తితో నటిస్తూ కాఠియావాడీ భాషలో సంభాషణలు చెప్పిన ఆయనకు ప్రేక్షకుల నుంచి దాదాపు పది నిమిషాల పాటు చప్పట్లు(స్టాండింగ్ ఒవేషన్) లభించాయని పటేల్ గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచే మోదీకి ఈత అంటే ఆసక్తి ఉండేదని కూడా పటేల్ చెప్పారు. వడ్నగర్లోని శర్మిష్ఠ చెరువులో ఈత కొట్టే సమయంలో ఓసారి పిల్ల మొసలిని ఇంటికి తీసుకొచ్చారని.. తల్లి హీరాబెన్ దానిని తిరిగి చెరువులో వదిలేయాలని చెప్పడంతో మరుసటి రోజు మళ్లీ చెరువులో వదిలేశారని వివరించారు.రాజకీయాల్లోకి వచ్చినా.. టీచర్‌ను మర్చిపోలేదుమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను గుర్తించారని పటేల్ తెలిపారు. 2001లో మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు.. జన సందోహం మధ్య తనను గుర్తించిన మోదీ వచ్చి పాదాలకు నమస్కరించారని చెప్పారు. తర్వాత 2005లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన పాత ఉపాధ్యాయులను సత్కరించిన కార్యక్రమాన్ని కూడా గుర్తు చేశారు.సోషల్ మీడియాలో ప్రశ్న.. అసలు క్లారిటీ ఇదేఅయితే మోదీ, ఆయన టీచర్ పటేల్ వయసు 76 అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఓ జాతీయ మీడియా క్లారిటీ ఇచ్చింది. పటేల్ వయసు 90–91 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొంది. దీంతో ఆయన వయసుపై సోషల్ మీడియాలో వచ్చిన అనుమానాలకు తెరపడినట్టయింది. ఇక ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ల విషయంలో ఎన్డీటీవీ, పీటీఐ కథనాల్లో కనిపించిన తేడా మాత్రం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.Age of PM modi - 76Age of Teacher - 75 pic.twitter.com/kVODe4xyd7 https://t.co/e0mimnacaU— AIN (@Tejusurya_) September 17, 2026ఇదీ చదవండి: ఆ స్టార్ హీరోలు చట్టాన్ని ఉల్లంఘించారని తెలుసా? -
దేశ సేవకు అంకితమైన స్ఫూర్తిదాత మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని, అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలనలో ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. ‘దేశ సేవకు అంకితమైన కర్మయోగి, స్ఫూర్తిదాత నరేంద్ర మోదీ’అని కొనియాడారు. మోదీని అవిశ్రాంత కృషి, త్యాగం, దూరదృష్టికి ప్రతీకగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. దేశ సేవనే లక్ష్యంగా మార్చుకున్న మోదీ జీవితం తపస్సు, త్యాగం, అచంచలమైన సంకల్పాల అద్భుత గాథ అని పేర్కొన్నారు. సేవాభావం, అంకితభావంతో కూడిన ఆయన ప్రస్థానం కోట్లాది మంది దేశప్రజలకు స్ఫూర్తిదాయకమని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి, స్వయం సమృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేర్కొన్నారు. దేశమే ప్రథమం అనే సంకల్పంతో సాగిన మోదీ ప్రయాణం సేవ, సుపరిపాలన, ప్రజా సంక్షేమంతో కూడిన ఒక స్ఫూర్తిదాయకమైన గాథ అని తెలిపారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన ప్రయాణం మాత్రమే కాదని, దేశ ప్రజల సామూహిక స్వప్నం అని ఉద్ఘాటించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ కనెక్టివిటీ, సంక్షేమం, ఆవిష్కరణల వంటి రంగాల్లో పురోగతి సాధిస్తూ, ‘వికసిత్ భారత్’లక్ష్యం దిశగా దేశం పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. మోదీని దేశ సేవ, ప్రజా సంక్షేమం కోసం జీవితంలోని ప్రతి క్షణాన్నీ అంకితం చేసిన కర్మయోగిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, సి.ఆర్.పాటిల్, శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ, పార్టీ ఎంపీలు అనిల్ బలూనీ, సంబిత్ పాత్ర, సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్, తరుణ్ చుగ్, రాఘవ్ చద్ధా, గౌరవ్ భాటియా తదితరులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్గున ఖర్గే సైతం మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో మోదీ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రధానమంత్రికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లోనూ మోదీ పుట్టిన రోజు కార్యక్రమాల్లో అభిమానులు పాల్గొన్నారు.ఈ ఘనత మోదీకే చెందుతుంది: ముర్ము సుపరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడంతోపాటు సమ్మిళిత అభివృద్ధికి అపూర్వమైన వేగాన్ని, కొత్త దిశను అందించిన ఘనత ప్రధాని మోదీకి చెందుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి సినీ ప్రముఖుల శుభాకాంక్షలు ప్రధాని మోదీకి పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో ప్రముఖ నటులు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, కమల్ హాసన్, మోహన్ లాల్, చిరంజీవి, రామ్‌చరణ్ తేజ, నాగార్జున, జాకీ ష్రాఫ్, కాజోల్, అజయ్ దేవగన్, కంగనా రనౌత్, శత్రుఘ్న సిన్హా ఉన్నారు. ప్రపంచ దేశాల అధినేతలు రష్యా అధినేత పుతిన్ సహా పలువురు ప్రపంచ దేశాల అధినేతలు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరఫున భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మోదీకి శుభాకాంక్షలు తెలిపింది.33.27 లక్షల దీప కాంతులతో ప్రపంచ రికార్డుఉజ్జయిని: ప్రధాని మోదీ 76వ జన్మదినం ప్రపంచ రికార్డుకెక్కింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గురువారం సాయంత్రం క్షిప్రా నదీ తీరంలో 33.27 లక్షల మట్టి ప్రమిదలను ఏకకాలంలో వెలిగించారు. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. రాత్రి 7 గంటలకు సైరన్ మోగగానే ‘ఆశీర్వాద్ కా దియా’కార్యక్రమంలో భాగంగా మూడు నిమిషాల్లోనే 33.27 లక్షల దీపాలు వెలిగించారని చెప్పారు. మధ్యప్రదేశ్ అంతటా ఒకేసారి మొత్తం 3.55 కోట్ల దీపాలను వెలిగించినట్లు పేర్కొన్నారు. ఒడిశాలో కోటి దీపోత్సవం భువనేశ్వర్: మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం ఒడిశా అంతటా సుమారు కోటి దీపాలను వెలిగించారు. రాజధాని భువనేశ్వర్‌లోని ముక్తేశ్వర్ ఆలయంలో జరిగిన ‘ఆశీర్వాద్ కా దియా’లో సీఎం మోహన్ చరణ్ మాఝీ పాల్గొన్నారు.కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌లోని కాశీ క్షేత్రంలో పూజలు, యాగాలు నిర్వహించారు. కాశీ విశ్వనాథుడి మందిరంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, పంకజ్ చౌదరి తదితరులు పూజలు నిర్వహించారు. అలాగే వారణాసి నుంచి గుజరాత్‌లోని వాద్నగర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీని రాజ్‌నాథ్ ప్రారంభించారు.‘ఆశీర్వాద్ కా దియా’నా హృదయాన్ని తాకింది: మోదీ ‘ఆశీర్వాద్ కా దియా’అనే పాట నేపథ్యంతో, వివిధ సందర్భాల్లో పౌరులతో తాను గడిపిన క్షణాలను చూపించే వీడియోను రూపొందించిన వారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత గృహవసతి, వైద్య సేవలు, విద్యుత్, వంట గ్యాస్‌తో సహా మోదీ ప్రభుత్వంలోని వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన పౌరుల స్పందనలు ఈ వీడియోలో ఉన్నాయి. దీనిపై మోదీ స్పందిస్తూ గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కొన్ని అంశాలు ఎంతో ప్రత్యేకమైనవని, అలాంటి ఆప్యాయతకు నిదర్శనమైన ‘ఆశీర్వాద్ కా దియా’తన హృదయాన్ని గాఢంగా తాకిందని పేర్కొన్నారు. ప్రజలు అందించే ప్రతి ఆశీర్వాదం మన దేశానికి మరింత భక్తిశ్రద్ధలతో సేవ చేయాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని వివరించారు. -
చిప్ పరిశ్రమకు దన్ను
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తయారీకి విశ్వసనీయ ప్రత్యామ్నాయ హబ్‌గా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సెమీకండక్టర్ల పరిశ్రమకు పూర్తి మద్దతునిస్తూ, చిప్‌ల తయారీకి భారత్‌ను కీలక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. ఎల్రక్టానిక్స్ శాఖతో కలిసి పరిశ్రమ సంఘం సెమీ నిర్వహిస్తున్న సెమీకాన్ ఇండియా అయిదో సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఎకోసిస్టమ్‘ పేరిట సెపె్టంబర్ 17న ప్రారంభమైన సదస్సు 19 వరకు జరుగుతుంది. సెమీకండక్టర్ కంపెనీలు, విధాన నిర్ణేతలు, ఇన్వెస్టర్లు, విద్యావేత్తలు, అంకుర సంస్థలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు. అలాగే 243 అంతర్జాతీయ సంస్థలతో పాటు 500 పైచిలుకు ఎగ్జిబిటర్లు, 40 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. పరిశ్రమల భాగస్వామ్యం భేష్.. ‘ప్రపంచం తయారీకి సంబంధించి సరికొత్త, విశ్వసనీయమైన కేంద్రాల కోసం అన్వేషిస్తోంది. ఇందుకోసం భారత్ సర్వసన్నద్ధమవుతోంది‘ అని మోదీ తెలిపారు. భారత్‌లో తయారైన చిప్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. అలాగే భారత్‌పై ప్రపంచానికి నమ్మకం కూడా పెరుగుతోంది‘ అన్నారు. 2022లో సెమీకండక్టర్ల మిషన్‌పై మరింతగా దృష్టి పెట్టినప్పటి నుంచి భారత్ సాధిస్తున్న విజయాల్లో పరిశ్రమ దిగ్గజాలు కీలక మూలస్తంభాలుగా, భాగస్వాములుగా నిలుస్తున్నారని కితాబిచ్చారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆయన సూచించారు. అలాగే దేశంలో అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని విదేశాల్లో పని చేస్తున్న భారతీయ పరిశోధకులను కోరారు. సెమీకండక్టర్ కంపెనీలు భారతీయ విద్యాసంస్థలతో పరిశోధనలకు సంబంధించిన భాగస్వామ్యాలు విస్తరించాలని పేర్కొన్నారు. గ్లోబల్ కంపెనీలు, అంకుర సంస్థలు, డిజైన్ సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించేలా ప్రభుత్వం నియంత్రణలపరమైన మార్పులు, చేర్పులు చేసినట్లు ప్రధాని చెప్పారు. చిప్ డిజైనింగ్‌లో లక్ష విద్యార్థులకు శిక్షణ .. సెమీకండక్టర్ వేల్యూ చెయిన్‌వ్యాప్తంగా పూర్తి వ్యవస్థను నిర్మించుకునేందుకు భారత్‌కు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ప్రధాని తెలిపారు. సెమీకండక్టర్ యంత్రపరికరాలు, రసాయనాలు మొదలైనవి ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని ఆయన సూచించారు. చిప్ డిజైన్‌తో పాటు అనుబంధ విభాగాలకు ఉపయోగపడేలా 1,00,000 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణనివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 70,000 మందికి శిక్షణ కల్పించినట్లు వివరించారు. కేంద్రం రూ. 1.275 లక్షల కోట్లతో రెండో విడత సెమీకాన్ ఇండియా ప్రోగ్రాంను జూలైలో ప్రకటించింది. దీనితో 1,50,000 నుంచి 2,00,000 వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. 2.0 స్కీము మార్గదర్శకాలు విడుదల సెమీకాన్ 2.0 ప్రోగ్రాంనకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం గురువారం విడుదల చేసింది. వీటి ప్రకారం ఈ ప్రోగ్రాం కింద ఆమోదం పొందిన చిప్ ప్లాంట్లలో వ్యాపారపరమైన ఉత్పత్తిని ప్రకటించే వరకు, ఆ ప్రాజెక్టుల్లో ఏ భాగాన్నీ అమ్మడానికి గానీ తనఖా పెట్టడానికి గానీ వీల్లేదు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా చేయాల్సి వస్తే ముందస్తుగా నోడల్ ఏజెన్సీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమునకు డిజైన్, మెషిన్స్–మెటీరియల్స్, మరిన్ని ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ఏటీఎంపీ–ఓఎస్ఏటీ పరిశ్రమ, పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను పటిష్టం చేయడం, నిపుణులను తయారు చేసుకోవడం అనే ఆరు అంశాలు కీలకమైన పునాదిరాళ్లుగా ఉంటాయి. ఇందులో మెషిన్లు–మెటీరియల్స్, మరిన్ని ఫ్యాబ్‌ల ఏర్పాటు, ఏటీఎంపీ–ఓఎస్ఏటీ పరిశ్రమను బలోపేతం చేయడానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. మెషిన్స్–మెటీరియల్స్ కింద దరఖాస్తు చేసుకునే సంస్థలు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలుంటుంది. స్కీము ద్వారా ఆర్థిక తోడ్పాటు అందుకునే ప్లాంట్లు, మొత్తం ప్రాజెక్టులో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుంచి కనీసం మూడేళ్ల పాటు ఉత్పత్తిని కొనసాగించాల్సి ఉంటుంది. స్థల సమీకరణ, అభివృద్ధి, ప్రాజెక్టు సైటులో తాత్కాలిక నిర్మాణాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులను మూలధన వ్యయాలు లేదా పెట్టుబడి కింద పరిగణించరు. -
‘నరేంద్ర మోదీ’ ఒక్కరు కాదు.. మొత్తం ఆరుగురు
భోపాల్: మనల్ని మనం పరిచయం చేసుకోవాలంటే ముందుగా పేరు చెబుతాం. మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురు ఇలాగే పరిచయం చేసుకునే సమయంలో తమ పేరు చెబుతారు. అయితే, వారి పేరు చెప్పగానే మనం ‘‘నువ్వు చెబుతున్నది నిజమేనా? జోక్ చేస్తున్నావా’’ అంటాం. ఎందుకంటే వారి ఐదుగురి పేర్లు నరేంద్ర మోదీ.దేశ ప్రధాని పేరు కూడా నరేంద్ర మోదీనే కావడంతో మధ్యప్రదేశ్‌లోని మిగతా ఐదుగురు నరేంద్ర మోదీలు పేరు విషయంలో తిప్పలు పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని అధికారిక జనన రికార్డులను పరిశీలించగా ఇలాంటి పేరుతో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.బుర్హాన్పూర్లో 67 ఏళ్ల నరేంద్ర మోదీ వారిలో అత్యంత పెద్దవారు బుర్హాన్‌పూర్‌కు చెందిన 67 ఏళ్ల నరేంద్ర మోదీ. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన.. రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్‌గా కూడా ఉన్నారు. పేరు కారణంగా ఎదురయ్యే గందరగోళానికి ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది.ఢిల్లీలో జరిగిన ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో తొలిసారి గుర్తుండిపోయే ఘటన ఎదురైంది. తన పేరు చెప్పగానే అక్కడి క్లర్క్ అనుమానంగా చూస్తూ.. “జోక్ చేస్తున్నారా?” అని అడిగారు. గుర్తింపు కార్డు చూపించినా ఆయన నమ్మలేదు. కొంతసేపు వివరించిన తర్వాత “సారీ, సారీ” అంటూ వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి గుర్తింపు కార్డును ఎప్పుడూ చేతికి అందుబాటులో ఉంచుకోవడం ఆయనకు అలవాటైంది.ప్రధాని నరేంద్ర మోదీ 2015లో బ్యాంకులకు ఆకస్మిక ఫోన్ కాల్స్ చేసి జన్‌ధన్ ఖాతాల పురోగతిని సమీక్షిస్తున్న సమయంలోనూ పేరు కారణంగా సరదా ఘటన ఎదురైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విద్యార్థుల స్కాలర్షిప్ పనుల కోసం బ్యాంకు మేనేజర్లకు ఫోన్ చేసేవారు. ఒకసారి స్థానిక ఎంపీకి ఫోన్ చేసినప్పుడు, అనుకూలమైన సమయంలో తిరిగి కాల్ చేస్తానని చెప్పగా.. ఎంపీ సరదాగా, “నా మొబైల్లో నరేంద్ర మోదీ పేరు కనిపించడం నాకు గౌరవంగా ఉంటుంది. నా చుట్టూ ఉన్నవాళ్లు అది ప్రధాని నుంచి వచ్చిన కాల్ అనుకుంటారు” అని అన్నారు.మథురలోని కృష్ణ జన్మభూమి వద్ద భారీ రద్దీ సమయంలో భద్రతా సిబ్బంది ఆయనను ఆపారు. “నేను నరేంద్ర మోదీని” అని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. అయితే గుర్తింపు కార్డు చూపించగానే నవ్వుకున్నారు.టీ అందించే వారి పేరు నరేంద్ర మోదీదేవాస్లోని కార్యాలయ క్యాంటీన్లో టీ అందించే మరో నరేంద్ర మోదీకి కూడా ఇదే అనుభవం. “నా పేరు నరేంద్ర మోదీ అని చెప్పగానే ప్రజలు ఆశ్చర్యపడతారు. కాసేపు ఆగి నవ్వుతారు. కస్టమర్లు నవ్వుతూ జోకులు వేస్తారు. అయితే నా పేరును మాత్రం ఎవరూ మర్చిపోరు” అని ఆయన తెలిపారు.పితాంపూర్‌లో మరో నరేంద్ర మోదీ ఎన్నో ఏళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన సుమారు 15 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. తన పేరుతోనే ‘మోదీ టీ స్టాల్’ పెట్టుకున్నారు. ప్రధాని పేరుతో దుకాణానికి ఆ పేరు పెట్టారా అని కస్టమర్లు అడిగితే.. అది పుట్టుకతో వచ్చిన పేరు, తాను ఎంచుకున్నది కాదని వివరిస్తారు. యూపీఐ చెల్లింపుల సమయంలో ఫోన్ తెరపై ప్రధాని ముఖం కనిపించడంతో కస్టమర్ల స్పందన మరింత ఆసక్తికరంగా మారుతుంది.దేవాస్‌లోని బాల్గఢ్కు చెందిన 50 ఏళ్ల మరో నరేంద్ర మోదీ 17 ఏళ్ల పాటు టీ దుకాణం నడిపారు. ఆ తర్వాత ఆటోమొబైల్ సంస్థలో చేరారు. పేరు కారణంగా వచ్చే సరదా వ్యాఖ్యలు ఆయనకూ కొత్తేమీ కాదు. మధ్యప్రదేశ్‌లోని అధికారిక జనన రికార్డులను పరిశీలించగా మరో వ్యక్తి పేరు కూడా నరేంద్ర మోదీ అని ఉంది. -
‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్ విషెస్
-
మోదీ జన్మదినోత్సవం.. ముస్లింల ప్రార్థనలు, దీపోత్సవం
ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా దేశంలోని ముస్లిం సమాజానికి చెందిన పలు వర్గాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మసీదులు, మదర్సా ప్రాంగణాలు, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖురాన్ పఠనం, ప్రార్థనలు నిర్వహించగా.. సాయంత్రం ప్రముఖ సూఫీ దర్గాల్లో దీపాలు వెలిగించే కార్యక్రమాలు చేపట్టనున్నారు.మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మైనారిటీ మోర్చాతో అనుబంధం ఉన్న ముస్లిం వర్గాలు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ‘అందరి సహకారం, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం’ అనే నినాదంతో సూఫీ సంస్థలు, ఖాన్కాహ్లు, ఉలేమాలు ఈ రోజును ఆధ్యాత్మిక ప్రార్థనలు, సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ముస్లిం మహిళలు ఒకచోట చేరి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఖురాన్ పఠించి మోదీ దీర్ఘాయుష్షు కోసం ప్రార్థనలు చేశారు. వారి పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పాల్గొన్న ఓ వ్యక్తి.. మోదీ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తుండడంతో ఆయన దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.మీరట్‌లో బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అన్వర్ ఖురేషీ ఇంట్లోనూ కార్యక్రమం జరిగింది. ముస్లిం సమాజానికి చెందినవారు, బీజేపీ కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ, లక్నో, వారణాసి, భోపాల్, ముంబై తదితర నగరాల్లోనూ మోదీ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, దేశ శాంతి, అభివృద్ధి కోసం ఖురాన్ పఠనం నిర్వహించారు.సాయంత్రం అజ్మీర్ షరీఫ్, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా, దేవా షరీఫ్, కచౌఛా షరీఫ్ దర్గాల్లో వేలాది దీపాలు వెలిగించనున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాలో ప్రస్తుతం 723వ ఉర్సు జరుగుతుండడంతో 723 దీపాలు వెలిగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.వారణాసిలో ముస్లిం మహిళలు, స్థానిక సంస్థలు ప్రత్యేక దీపోత్సవంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. బస్తీల్లో భోజనం, పండ్ల పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తాయి.ఇదీ చదవండి: 15 ఏళ్ల తర్వాత గోడను కూలగొడితే లైబ్రరీ బయటపడింది.. -
PM Modi: బెంగాల్ మహిళలకు గుడ్ న్యూస్
-
సీజేపీ సరికొత్త ఉద్యమం.. మోదీ పుట్టినరోజే ఎందుకు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం రోజే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల పరిస్థితి, విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో’ పేరుతో ఈ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. గురువారం తన స్వరాష్ట్రం మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ పోరాటాన్ని ప్రారంభించారు.ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో (Adivasi School Thik Karo)లో భాగంగా.. గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లలో మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, వసతి పరిస్థితులను సీజేపీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ఉద్దేశమని దీప్కే తెలిపారు. ఇప్పటికే CJP దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో (School Thik Karo) పేరుతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి కొనసాగింపుగానే గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపింది.వందల మంది మృతి!గిరిజన విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ దీప్కే.. సంచలన ఆరోపణలకు దిగారు. మహారాష్ట్రలో గత రెండేళ్లలో 590 మందికి పైగా గిరిజన విద్యార్థులు మరణించారని ఆయన పేర్కొన్నారు. పాముకాట్లు వంటి నివారించగల ప్రమాదాలతోనూ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లోనూ ఇటీవల గిరిజన విద్యార్థుల మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపారు.ఏకలవ్య పాఠశాలలపైనా ప్రశ్నలుఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితిపైనా సీజేపీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశవ్యాప్తంగా మంజూరైన 720 పాఠశాలల్లో 477 పనిచేయడం లేదని దీప్కే ఆరోపించారు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యలో ప్రవేశాలపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.‘అన్ని ప్రభుత్వాలూ నిర్లక్ష్యం చేశాయి’గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను గత 80 ఏళ్లుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని దీప్కే ఆరోపించారు. పెద్ద నగరాల్లోని విద్యార్థులకు లభించే విద్యా సదుపాయాలు, భద్రత, నాణ్యమైన విద్య గిరిజన ప్రాంతాల పిల్లలకూ అందాలని అన్నారు. కేవలం ఆర్థిక వృద్ధి గణాంకాలు చెప్పడం సరిపోదని.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వాలను కోరారు.మోదీ బర్త్‌డే రోజే ఎందుకు?మోదీ జన్మదినం సెప్టెంబర్ 17నే సీజేపీ ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జెన్ జీ పోరాట వేదిక కావాలనే ఇలా చేసిందా? అని నెట్టింట చర్చ నడిచింది. అయితే ఇదేం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని దీప్కే స్పష్టత ఇచ్చారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే తాము ఉద్యమం మొదలుపెట్టామని అంటున్నారు.అంతకు ముందు.. ఆశుతోష్ రాంకా చేసిన ఓ పోస్ట్ మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఈ ఉదయం ‘ఆశీర్వాద్ కా దియా’ పేరుతో దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు ఇచ్చింది. అయితే ఇలా ఎందుకు అంటూ రాంకా ఓ ట్వీట్ చేశాడు. “గాయిస్.. చెప్పండి, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఆశీర్వాద దీపం వెలిగించమని ఎందుకు చెప్పారు? ఎవరి పుట్టినరోజో చెప్పండి?” అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు.बताओ कल देशभर के कॉलेज को सुबह सुबह आशीर्वाद का दीया जलाने के लिए क्यो बोला गया है guys?बताओ कल सारे काम छोड़कर देशभर के टीचर्स को किसकी भक्ति करने के लिए कहा गया है guys?बताओ कल किसका जन्मदिन है guys? pic.twitter.com/ZkLdESTaQt— Ashutosh Ranka (@AshutoshRanka) September 16, 2026ఇదీ చదవండి: మోదీ గుండె ధైర్యానికి ఇదే ఎగ్జాంపుల్ -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
-
రాజకీయ ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా మోదీ..! చివరికి అది కాస్తా..
ఒక రాజకీయ నాయకుడి ప్రసంగాలకు మించి అతని వార్డోరోబ్ ఉండటం అత్యంత అరుదు. కానీ ప్రనరేంద్ర మోదీ ఆ విషయంలో విజయం సాధించారు. కార్యక్రమానికి అనుగుణమైన వేషధారణ, అది కూడా నిలకడతో తనదైన శైలితో కనిపించే తీరు..అందర్నీ ఆకట్టుకుంటుంది. చెప్పాలంటే అది మోదీ మార్క్‌గా స్థిరపడిపోయింది. పండుగలాంటి కార్యక్రమానికి వేడుక వాతావరణం ఉట్టిపడేలా ఆయన ఆహార్యం ఉంటుంది. దశాబ్దాల నాటి ఫ్యాషన్‌ని ట్రెండీగా మార్చి..తన పేరుతో గుర్తింపు తెచ్చుకునేలా ఫ్యాఫన్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఇన్నాళ్లు రాజకీయ వేషధారణలో చిన్నారులు తీర్చిదిద్దడానికి నెహ్రు జాకెట్లు ఉపయోగించేవారు. అంతెందుకు పెద్దవాళ్లు సైతం ఆ స్టైల్‌నే అనుకరించేవారు. అలాంటిది ఇవాళ మార్కెట్లో ఎటు చూసినా.. మోదీ స్టైల్‌తో కూడిన జాకెట్లే దర్శనమిస్తున్నాయి. పైగా మోదీ జాకెట్ పేరుతో బ్రాండ్‌గా ప్రసిద్దిగాంచడం విశేషం. ఇవాళ ప్రధాని మోదీ 76వ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన ధరించే జాకెట్ విశేషాలు, ఆ స్టైల్ ఎలా బ్రాండ్‌గా మారింది తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!. మోదీ దశాబ్దాల నాటి స్లీవ్‌లెస్ జాకెట్‌ని తనదైన శైలిలో ట్రెండీ ఫ్యాషన్వేర్గా మార్చేశారు. ఆఖరికి దాని పేరు కూడా ఆయన పేరుతో మేళవించే డిజైన్‌గా మారిపోయింది. మెన్స్ వేర్ షాపుల్లో హుందాగా స్టైలిష్‌గా కనిపించాలని ఓ 50-60 మధ్య వయస్కులు అడగగానే మోదీ జాకెట్లు ఇవ్వమంటరా అని ఠక్కున అడుగుతుండటం విశేషం. పార్లెమెంట్ నుంచి ప్రపంచ సదస్సుల వరకు దాదాపు ప్రతి ప్రధాన బహిరంగ కార్యక్రమంలో మోదీ దీన్ని ధరించారు. దాంతో రిటైలర్లు అంతా ఆ సాధారణ జాకెట్‌ని మోదీ జాకెట్ పేరుతో విక్రయించడం మొదలుపెట్టారు పెళ్లిళ్లు, పండుగలు, మరేదైన ప్రత్యేక కార్యక్రమంలో పురుషుల కలెక్షన్లో ఇది తప్పనిసరి అనేలా ప్రత్యేకతను దక్కించుకుంది. నిజానికి నెహ్రూ మృదువైన బ్లేజ్, గ్రే రంగులు ఇష్టపడితే..మోదీ జాకెట్లను కాషాయం, మెరూన్, రాయల్ బ్లూ, మస్టర్డ్ జ్యువెల్ టోన్స్ వంటి ప్రస్ఫుటమైన రంగులను ఎంచుకుంటారు. మోదీ కుర్తాకు జతగా ఈ జాకెట్లను ధరించడం విశేషం. ఈ లుక్ ఆధునికంగా కనిపించేలా చేయడమే గాక గ్రాండ్‌గా కనిపించేలా చేస్తుంది. వాటిలో బాగా ఫేమస్ అయ్యినవి..ప్రచార సమయంలో తరుచుగా ధరించే ప్రకాశవంతమైన వెస్ట్కోట్తో కూడిన సగం చేతుల కుర్తా ప్రారంభంలోనే ట్రేడ్‌మార్క్‌గా మారింది. ఆ తర్వాత మ్యాండరిన్ కాలర్‌తో చక్కగా కుట్టిన బంద్‌గాలా సూట్లు వచ్చాయి. వీటిని మోదీ బ్రిక్స్ సమావేశం వంటి శిఖరాగ్ర సమావేశాలలోనూ, అమెరికా పర్యాటనల సందర్భంగా ధరించి తన రూపానికి అంతర్జాతీయ రేంజ్ లుక్‌ని అందించేలా తీర్చిదిద్దుకుంటారు. అంతేగాదు ఒక ఇంటర్వ్యూలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ సీసాలతో తయారు చేసిన జాకెట్ స్టైలింగ్ సుస్థిరతపై ఒక ప్రకటనగా మార్చింది. ఆ తర్వాత 2018లో దక్షిణ కొరియా అప్పటి అధ్యక్షుడు మూనే జే ఇన్‌కు ఇచ్చి ఒక ప్రత్యేకమైన బహుమతి చర్చనీయాంశంగా మారింది. అందులో ఆయన ప్రత్యేకంగా కుట్టించిన జాక్లెట్లు ఉన్నాయి. వాటిని ‘మోదీ వెస్ట్’లుగా పిలుస్తూ బహిరంగంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మోదీ జాకెట్లను అందరు ఇష్టపడతారు, ఎందుకంటే భారతీయ హస్తకళ, ఖాదీకి మూలం అవి. కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుంది, అలాగే పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంతేగాదు నిలకడ అనేది ధరించే దుస్తుల్లో కూడా పాటిస్తే..అదే మనకు గర్తింపు తెచ్చిపెడుతుందనే విషయాన్ని హెలెట్ చేస్తోంది మోదీ ఫ్యాషన్ శైలి. ఆయన ఏమీ ఆ శైలిని ఆవిష్కరించకపోయినా..ఆ పురాత భారతీయ శైలి మోదీ కారణంగా వెలుగులోకి రావడమే గాక యావత్తు ప్రపంచం భారత సంప్రదాయ ఫ్యాషన్‌కి ఆకర్షితులయ్యేలా చేసేందుకు దారితీయడం విశేషం.ఇదీ చదవండి: Japan: గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు! -
ప్రదాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘భగవంతుడు మోదీకి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో పాటు.. దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు.Wishing Hon’ble PM Shri @narendramodi ji a very happy birthday. May God bless him with good health, long life and the strength to serve the nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2026ఇదీ చదవండి: ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్.. కూటమి సర్కార్ అరాచకం -
మోదీ గుండె ధైర్యానికి ఇదిగో సాక్ష్యం!
నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న భారత ప్రధాని. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకంటూ భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే మోదీ చిన్ననాటి జీవితం గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో ఓ ఘటన తెలిస్తే మాత్రం.. ఆయన ‘గుండె ధైర్యం’ ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది. మోదీకి చిన్నతనంలో ఈత అంటే చాలా ఇష్టం ఉండేదట. ఉదయం కుటుంబ టీ దుకాణంలో పని చేసిన తర్వాత మోదీ వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సుకు వెళ్లేవారు. సరస్సు మధ్యలో ఉన్న ఆలయం వరకు ఈత కొట్టి, అక్కడి జెండాను తాకి తిరిగి ఒడ్డుకు వచ్చేవారు. ఇలా రోజుకు మూడుసార్లు చేసేవారు. అయితే ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఆయనకు ఓ భయానక అనుభవం ఎదురైంది. ఈత కొడుతుండగా ఓ మొసలి ఆయన కాలిని బలంగా తాకింది. దీంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో వారం రోజులు ఆయన మంచానికే పరిమితం అయ్యారు. అయితే నెల తిరగకుండానే ఆయన మళ్లీ అదే సరస్సులో ఈతకు వెళ్లారట. ఈ విషయాన్ని మోదీ జీవితంపై వచ్చిన నరేంద్ర మోదీ: ది గేమ్ చేంజర్ అనే పుస్తకంలో జర్నలిస్ట్ సురేశ్ కే వర్మ ప్రస్తావించారు. అదే తొలిసారి కాదు!మోదీ చిన్ననాటికి సంబంధించిన మరో మొసలి కథ కూడా ప్రచారంలో ఉంది. ఓసారి సరస్సు ఒడ్డున ఓ మొసలి పిల్ల కనిపించడంతో దాన్ని ఆయన భుజాన వేసుకుని ఇంటికి తీసుకెళ్లారట. అది అడుగుకుపైగా పొడవు ఉందట. దాన్ని ఇంట్లోనే పెంచుకోవాలని మోదీ అనుకున్నప్పటికీ.. తల్లి హీరాబెన్ మాత్రం వద్దని చెప్పారట. వెంటనే దాన్ని ఆయన తిరిగి సరస్సులో వదిలేశారట. ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని మోదీ స్వయంగా కూడా 2019లో బేర్ గ్రిల్స్‌తో కలిసి పాల్గొన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. సాధారణ కుటుంబంలో, చిన్న ఇంటి నుంచి మొదలైన ఈ ప్రయాణం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి మళ్లింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ జీవితంలోనూ ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బాల్యంలో మొసలిని ఎదుర్కొన్న ఘటన కావొచ్చు.. తర్వాత పాలనలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కావొచ్చు.. మోదీ జీవిత ప్రయాణంలో ధైర్యం, నిర్ణయాత్మకతకు సంబంధించిన అధ్యాయాలు చాలానే కనిపిస్తాయి. అయితే వాటన్నింటికీ చాలా ముందే.. వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సు దగ్గర ఓ బాలుడిగా ఎదుర్కొన్న ఆ మొసలి ఘటన మాత్రం ఆయన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: మోదీని శ్రీ కృష్ణుడితో పోల్చేశాడే! -
మోదీ 76వ పుట్టినరోజు: వారణాసిలో భారీ ఎత్తున సంబరాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) సీనియర్ నేతలు, ముఖ్యమంత్రులు గురువారం వారణాసిలో సమావేశం కానున్నారు. మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసితో పాటు ఆయన జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్నగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట నెల రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగనుంది.వారణాసి కార్యక్రమాలువారణాసిలో జరిగే కార్యక్రమంలో ‘సేవా సంకల్ప్ బైక్ యాత్ర’ ప్రధానంగా ఉంటుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ యాత్రను వారణాసి నుంచి గుజరాత్‌లోని వడ్నగర్ వరకు ప్రారంభించనున్నారు. అదే సమయంలో వడ్నగర్ నుంచి వారణాసి వైపు మరో యాత్ర ప్రారంభమవుతుంది. ఎన్డీయేకు చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వారణాసి సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. చిరాగ్ పాశ్వాన్, అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్ తదితరులు వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.సేవా కార్యక్రమాలు‘సేవా మేరా యోగదాన్’ కింద రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు సహా 25 సేవా కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది. ప్రజలు కనీసం ఒక కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది. దేశవ్యాప్తంగా యువత, సేవా యాత్రికులతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.అభినందనలు.. విమర్శలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీ పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాధనాన్ని వినియోగించడంపై ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ప్రశ్నలు లేవనెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లో 1.5 కోట్లకు పైగా దీపాలను వెలిగించేందుకు ప్రణాళిక ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మధ్యప్రదేశ్‌లో అంగన్వాడీ కార్యకర్తలకు మోదీపై ప్రశంసా వీడియోలు రికార్డు చేయాలని ఆదేశించారన్న ఆరోపణలను సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ ఆరోపణలను హెచ్‌టీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.ఇదీ చదవండి: గణేశ మండపంలో అవయవదాన సందేశం -
అయిపాయె.. ఇక భారత్, చైనాకు బిగ్ టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. ఇందులో భాగంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే గత నెలలో సెనెట్ 86–11 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది. తాను బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.రష్యాపై మరింత ఒత్తిడి‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’గా పిలుస్తున్న ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలపై కఠిన ఆంక్షలకు మార్గం సుగమం చేయనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర కీలక అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే వీలు కల్పిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన అదనపు ఆంక్షలకు కూడా బిల్లులో అవకాశం ఉంది.అంతేకాకుండా రష్యాతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలపై కూడా చర్యలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఇస్తోంది.భారత్, చైనాలే ఎందుకు?ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. భారత్, చైనా సహా పలు దేశాలు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ద్వితీయ టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా ఉపయోగించవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో భారత్, చైనాలను ప్రధాన కొనుగోలుదారులుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. బిల్లు ఆమోదమైనంత మాత్రాన భారత్‌పై 100 శాతం టారిఫ్ తక్షణమే అమల్లోకి రాదు. ఏ క్షణమైనా అలాంటి టారిఫ్ విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్నది ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.అమెరికా మార్కెట్‌పై ప్రభావం?భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి దేశీయ అవసరాలకు వినియోగించడంతోపాటు కొన్ని ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం వాణిజ్య రంగంలో కొత్త అనిశ్చితికి దారితీస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌పై కొత్త 100 శాతం టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రకటించలేదు.ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలుబిల్లుకు కాంగ్రెస్‌లో విస్తృత మద్దతు లభించినప్పటికీ.. ట్రంప్‌కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున సీనియర్ సభ్యుడైన గ్రెగరీ మీక్స్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. రష్యాపై ఆంక్షలకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు విస్తృతంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమొక్రాట్లు తెలిపారు. ఇక సెకండరీ టారిఫ్‌లకు సంబంధించిన నిబంధనలను తొలగించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది.ట్రంప్ నిర్ణయంపైనే ఉత్కంఠరష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా పుతిన్‌ను చర్చల వైపు తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యమని బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ స్వయంగా టారిఫ్‌లు, ఆంక్షలను తన విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.ఇప్పుడు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం పొందిన బిల్లు ట్రంప్ సంతకానికి వెళ్లనుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులపై ట్రంప్ ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: అక్కడ రూల్స్ పాటించకుంటే ఫైన్లు వేసేస్తారు! -
నేడే ప్రధాని మోదీ 76వ జన్మదినం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు, ఆయన 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి బీజేపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వరకు సాగే బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తారు. వారణాసి నుంచి వాద్నగర్ వరకు సాగే బైక్ ర్యాలీని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు సైతం హాజరుకాబోతున్నారు. వాద్నగర్ ప్రధానమంత్రి మోదీ జన్మస్థలం కాగా, ఆయన వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ జన్మదినాన్ని సేవా దినంగా నిర్వహించుకుంటున్న గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఉజ్జయినిలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దేశవ్యాప్త స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రధానమంత్రి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం గురువారం సాయంత్రం వేళ దేశవ్యాప్తంగా 700కు పైగా ప్రాంతాల్లో ఆశీర్వాదం దీపం వెలిగించబోతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ‘సేవా సంకల్ప్ అభియాన్’ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా నెల రోజులపాటు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
నూతన సాంకేతికతల్లో భారత్ అగ్రస్థానానికి చేరాలి
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతల విషయంలో భారత్ అగ్రస్థానానికి చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బుధవారం ఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో జరిగిన సెమీకండక్టర్ రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్ పరిశ్రమ మధ్య సన్నిహిత సహకారం అవసరమని తేల్చిచెప్పారు. దేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తుచేశారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ సాధించిన గణనీయమైన పురోగతిని ప్రస్తావించారు. ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల దశ నుంచి విస్తృత స్థాయి, గొప్ప అవకాశాలు కలిగిన దశకు మారుతోందని అన్నారు. సాంకేతిక పురోగతులు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మన విధానాలు అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. విధానపరమైన, పరిపాలనాపరమైన చర్యలపై సూచనలు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలను మోదీ ఆహ్వానించారు. సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. భారతదేశ సెమీకండక్టర్ రంగం వృద్ధికి చొరవ తీసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికతల్లో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని మోదీ పిలుపునిచి్చనట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి సెమీ, మైక్రాన్, ఇని్ఫనియోన్, అప్లైడ్ మెటీరియల్స్, ఏఎస్ఎంఎల్, మెర్సెక్, టోక్యో ఎల్రక్టాన్ లిమిటెడ్, ఫుజిఫిలిం, ఇంటెల్, టాటా ఎల్రక్టానిక్స్, సెలెస్టా క్యాపిటల్, ఫాక్స్‌కాన్, ఐబీఎం రీసెర్స్ తదితర కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ‘‘సెమీకండక్టర్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. దేశంలో పెట్టుబడులకు, వ్యాపార వృద్ధికి అనుకూల వాతావరణం ఉంది. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల ఉన్నతీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మనమంతా నిరంతరం కృషి చేయాలి’’అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. -
అంచులే కేంద్రంగా మారుతున్న కాలం
మోదీ శకంలో చిరకాలం నిలిచిపోయే గొప్ప విజయం ఏదైనా ఒక రహదారి, పథకం, సంస్కరణ లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో కనిపించకపోవచ్చు. అంతకంటే లోతైన అంశంలో అది ఉంది. భారత ప్రధాన స్రవంతి విస్తరించటమే ఆ విజయం. నేను భారత రాష్ట్రపతిగా ఉన్న కాలంలో 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు ఆయనను ప్రధానమంత్రిగా దగ్గరగా గమనించాను. ఆ అనుభవంతో పాటు ప్రజా జీవితంలో ఆయనతో నాకున్న అనుబంధం ఆధారంగా, ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలై, 2014 నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు ఎన్నికైన ప్రభుత్వానికి 25 ఏళ్లపాటు నాయకత్వం వహించిన ప్రధాని మోదీ... ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే సరళమైన, పరివర్తనాత్మక ఆలోచనను నిరంతరం ముందుకు తీసుకెళ్లారు. ఆయన సమ్మిళిత రాజకీయాలకు నిర్వచనంగా మారిన మరో భావన దీనికి కేంద్రం: ‘జిస్కో కిసీ నే నహీ పూఛా, ఉస్కో మోదీ నే పూజా’. అంటే ఎవరూ పట్టించుకోని వారికి మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. చివరి అంచె వరకు అభివృద్ధిని తీసుకెళ్లటమే కాకుండా, ఆ అంచుల్లో ఉన్నవారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావటం మోదీ శకంలో అత్యంత ప్రభావవంతమైన మార్పు కావచ్చు.మారిన ఈశాన్య కథస్వాతంత్య్రం తర్వాత దశాబ్దాలపాటు భారత అభివృద్ధి ఆలోచనలో ఒక కేంద్రం, దానికి వెలుపల పరిధి ఉన్నట్లు భావించేవారు. కొన్ని ఆకాంక్షలకు జాతీయ చర్చలో అసలు చోటే దక్కలేదు. ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందా అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. దాని ప్రయోజనం పొందే అవకాశం చివరి వ్యక్తికి నిజంగా చేరిందా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఈ మార్పును ఈశాన్య ప్రాంతం కంటే మెరుగ్గా వివరించే ఉదాహరణలు చాలా తక్కువ. దశాబ్దాలపాటు ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశానికి దూరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంగానే ఎక్కువగా భావించారు. మోదీ నాయకత్వంలో అది భారత్ ముఖంగా, ఆగ్నేయాసియాకు ప్రవేశ ద్వారంగా క్రమంగా గుర్తింపు పొందింది. 2014 నవంబర్ నుంచి ప్రధాని మోదీ 83 సార్లకు పైగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో 12 ప్రధాన శాంతి ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు దశాబ్దంలో దాదాపు రూ.1.4 లక్షల కోట్లు కేటాయించగా, 2014–15 నుంచి 2025–26 మధ్య అభివృద్ధికి రూ. 7 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. బోగీబీల్ వంతెన, సెలా సొరంగం... కఠినమైన భౌగోళిక అడ్డంకులను అధిగమించాయి. బైరాబీ–సైరాంగ్ రైలు మార్గం ప్రారంభంతో మిజోరాంకు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో తొలిసారి నేరుగా రైలు అనుసంధానం లభించింది. స్వాతంత్య్రం తర్వాత నాగాలాండ్‌కు తొలి రైల్వే స్టేషన్ వచ్చింది. గువాహటి ఎయిమ్స్ ఈశాన్య ప్రాంతంలో తొలి ఎయిమ్స్‌గా నిలిచింది. అసోంలోని సెమీకండక్టర్ కేంద్రం పూర్తిగా భిన్నమైన ఆకాంక్షకు ప్రతీక. ఒకప్పుడు ప్రధానంగా భౌగోళికంగా మారుమూల ప్రాంతంగా భావించిన చోట భారత్‌లోని అత్యాధునిక సాంకేతిక పరిశ్రమల్లో ఒకటి ఆవిర్భవించగలదన్న ఆలోచనకు ఇది రూపమిస్తోంది.‘చివరి గ్రామాల’ నుంచి ‘తొలి గ్రామాల’ వరకుఇదే మార్పు భారత సరిహద్దుల వెంబడి కూడా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి మారుమూల జనావాసాలను సాధారణంగా దేశంలోని ‘చివరి గ్రామాలు’గా పేర్కొన్నారు. కానీ వైబ్రెంట్ విలేజెస్ కార్య క్రమం మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, అనుసంధానం, పర్యాటకం, జీవనోపాధి, అత్యవసర సేవల ద్వారా ఈ ఆలోచనకు సంస్థాగత రూపం ఇస్తోంది. ఆకాంక్షిత జిల్లాల కార్య క్రమం ద్వారా ఇదే సూత్రం దేశ అంతర్భాగానికీ విస్తరించింది. చరిత్రాత్మకంగా వెనుకబడిన 112 జిల్లాలు శాశ్వతంగా వెనుకంజ లోనే ఉంటాయని అంగీకరించకుండా... ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, జీవనోపాధిలో పురోగతిని వేగవంతం చేసేందుకు స్పష్టమైన ఫలితాలు, పథకాల సమన్వయం, పోటీతత్వ అభివృద్ధిని ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది. 2023లో 329 జిల్లాల్లోని 500 బ్లాకు లను ‘ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం’ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఈ విధానాన్ని మరింత లోతుగా తీసుకెళ్లారు. గత దశాబ్దంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ 243 శాతం పెరిగింది. మొత్తం 75 ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాలను పీఎం–జన్ మన్ పరిధిలోకి తీసుకొచ్చారు. గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలు, పీవీటీజీ ఆవాసాల్లో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను సమన్వయ ప్రభుత్వ చర్యల ద్వారా పరిష్కరిస్తూ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. 59 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు గతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న కుటుంబాలను అందులో భాగం చేశాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రభుత్వ సాయం లబ్ధిదారులకు నేరుగా చేరుతోంది. లీకేజీలను అరికట్టడం ద్వారా రూ. 5.14 లక్షల కోట్లకు పైగా మొత్తం ఆదాకు ఇది దోహదం చేసింది. సౌభాగ్య పథకం గ్రామీణ విద్యుదీకరణలో 100 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఉజ్వల పథకం 10 కోట్లకు పైగా కుటుంబా లకు స్వచ్ఛ వంట ఇంధనాన్ని అందించింది. జల్ జీవన్ మిషన్ 13 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను విస్తరించింది.‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అంటే...మహిళల గౌరవం, భద్రత, ఆరోగ్యంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న అంశాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ పరిష్కరించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో పాల్గొనేందుకు ‘ముద్ర’ పథకం వీలు కల్పించింది. మొత్తం ముద్ర రుణాల్లో మహిళల వాటా 68 శాతం. పీఎం స్వనిధి లబ్ధిదారుల్లోనూ మహిళలు 46 శాతం ఉన్నారు. గ్రామీణ పరివర్తనలో మహిళల ఆర్థిక సాధికారతకు లఖ్పతి దీదీ కార్యక్రమం కేంద్ర స్థానం కల్పిస్తోంది. విడివిడిగా చూస్తే ఈశాన్య ప్రాంతం, గిరిజన సమాజాలు, సరిహద్దు గ్రామాలు, మహిళలు, గ్రామీణ కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న పౌరులు వేర్వేరు సవాళ్లుగా కనిపిస్తారు. అన్నింటినీ కలిపి చూస్తే మోదీ ప్రభుత్వ పాలనా తత్వంలోని విస్తృత నిర్మాణం స్పష్టమవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తున్న వేళ కేవలం పెద్ద ఆర్థిక వ్యవస్థ, బలమైన మౌలిక సదుపాయాల నెట్వర్క్ లేదా మరింత సమర్థమైన ప్రభుత్వ వ్యవస్థను నిర్మించటమే ఆకాంక్ష కాదు. భారత అభివృద్ధి గాథలో ఒకప్పుడు అతి తక్కువగా కనిపించిన వారికి కూడా సమాన భాగస్వామ్యం ఉండేలా చూడటం లక్ష్యం.రామ్‌నాథ్ కోవింద్వ్యాసకర్త భారత మాజీ రాష్ట్రపతి -
మోదీ ‘శ్రీకృష్ణుడు’, నేను సుధామ.. ప్రధాని ఫ్రెండ్ భావోద్వేగ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన బాల్యమిత్రుడు శామళ్దాస్ మోదీ ప్రత్యేక లేఖ రాశారు. గుజరాత్‌లోని మెహసాణా జిల్లా వడనగర్కు చెందిన శామళ్దాస్.. చిన్ననాటి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ మోదీని ‘శ్రీకృష్ణుడు’గా, తనను ‘సుదాముడు’గా పేర్కొన్నారు. ప్రధాని జన్మదినం సెప్టెంబర్ 17న జరగనున్న నేపథ్యంలో ఈ లేఖ రాశారు.చిన్ననాటి నుంచి కొనసాగుతున్న తమ స్నేహాన్ని గుర్తుచేసుకున్న శామళ్దాస్.. నరేంద్ర మోదీ జీవితంలో ఏది సాధించాలని నిర్ణయించుకున్నా దాన్ని పూర్తి చేసి చూపించారని లేఖలో పేర్కొన్నారు. తన మిత్రుడి విజయాన్ని చూసి గర్వంగా ఉందని తెలిపారు. మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితం, వడనగర్ అభివృద్ధి, ఆ నగర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేందుకు జరిగిన పనులను కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు.‘మీరు శ్రీకృష్ణుడు.. నేను మీ సుదాముడిని’లేఖలో శామళ్దాస్ ప్రత్యేకంగా తమ బాల్య స్నేహాన్ని ప్రస్తావించారు. వడనగర్లో కలిసి గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ.. నరేంద్ర మోదీని తన ‘శ్రీకృష్ణుడు’గా, తనను ‘సుదాముడు’గా అభివర్ణించారు. కాలం మారినా చిన్ననాటి స్నేహం తనకు ఇప్పటికీ అంతే ప్రత్యేకమని పేర్కొన్నారు.‘ఏది అనుకుంటే అది పూర్తి చేస్తారు’మోదీ పని తీరును కూడా శామళ్దాస్ ప్రశంసించారు. ఆయన ఏదైనా సంకల్పిస్తే దాన్ని పూర్తి చేసి చూపిస్తారని లేఖలో రాశారు. 25 ఏళ్ల ప్రజాజీవితాన్ని ప్రస్తావిస్తూ మోదీని ‘నూతన భారత శిల్పి’గా అభివర్ణించారు. ఒకప్పుడు తనతో కలిసి ఉన్న బాల్యమిత్రుడు ఇప్పుడు దేశ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొంటూ.. ఆయన ప్రయాణాన్ని చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.వడనగర్ అభివృద్ధితో పాటు నగర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించి ప్రపంచానికి పరిచయం చేయడంపై కూడా లేఖలో ప్రస్తావన ఉంది. వడనగర్ గుజరాత్‌లోని మెహసాణా జిల్లాలో ఉంది. మోదీ బాల్యం అక్కడే గడిచింది.భారత్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని కూడా శామళ్దాస్ తన లేఖలో పేర్కొన్నారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భారత్, నరేంద్ర మోదీ గురించి చర్చ జరుగుతోందని రాశారు. చివరగా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. -
బీజేపీకి కొత్త చిక్కులు.. యూపీ‘ఐ’ ఫైట్ తప్పదా?
జేబుల్లో, పర్సుల్లో క్యాష్ పెట్టడం జనాలకు అరుదుగా మారిపోయింది. చిల్లర నుంచి పెద్ద పెద్ద పేమెంట్ల దాకా ఫోన్‌తోనే జరిగిపోతోంది. అలాంటిది యూపీఐ (UPI)తో చెల్లింపుల విషయంలో కొత్త రూల్స్ జనాలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, ఆపై డిజిటల్ చెల్లింపులంటూ క్యాష్‌లెస్ విధానం అలవాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పుడు ఛార్జీల ద్వారా పరోక్షంగా సామాన్యుడిపై భారం వేసే ప్రయత్నమూ చేస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఇదే బీజేపీ పాలిట గుదిబండగా మారుతుందా?..2016 నవంబర్ 8.. రూ.500, రూ.1,000 నోట్ల చెల్లుబాటును రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పునకు దారితీసింది. నగదు లావాదేవీలపై ఆధారపడిన ప్రజలకు ఒక్కసారిగా ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాల అవసరం ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ప్రారంభించింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయని.. ఇకపై నగదు ఆధారిత వ్యవస్థను తగ్గించి ‘క్యాష్ లెస్ ఎకానమీ’ వైపు వెళ్లాలని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడితోనే ఆగకుండా.. డిజిటల్ పేమెంట్లు చేసే వినియోగదారులు, వ్యాపారులను ప్రోత్సహించేందుకు ‘లక్కీ గ్రాహక్ యోజన’, ‘డిజి-ధన్ వ్యాపార్ యోజన’ వంటి ప్రోత్సాహక పథకాలను తీసుకొచ్చింది. అలా క్రమంగా డిజిటల్ చెల్లింపులు వ్యవస్థ.. అర్బన్ నుంచి రూరల్ ప్రాంతాలకు విస్తరించగలిగింది.ఇప్పుడు అదే UPIపై ఛార్జీల చర్చ!ఇప్పుడు UPI లావాదేవీలపై MDR చర్చకు దారితీస్తోంది. తాజా నిబంధనల ప్రకారం.. ఒకరి నుంచి ఒకరు యూపీఐ(ఫోన్‌పే, గూగుల్‌పే ఇలా.. ) చేసుకునే చెల్లింపులు పూర్తిగా ఉచితం. కానీ, రూ.2,000 దాటి ఏదైనా బయట షాపింగ్, కొనుగోలు చేస్తే మాత్రం MDR పడుతుంది. అలాగే.. చిన్న వ్యాపారులకు కూడా జీరో-MDR రక్షణ కొనసాగుతుందని కేంద్రం చెబుతోంది. దాదాపు 96 శాతం మర్చంట్ UPI లావాదేవీలు ప్రభావితం కావని ప్రభుత్వం వెల్లడించింది. కానీ, ఆర్థిక నిపుణులు మాత్రం మరోలా చెబుతున్నారు. ఇది సామాన్యుడిపై భారం పడే స్థితికి కచ్చితంగా తెస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ‘UPIపై ఛార్జీలు’ అనే అంశం రాజకీయ చర్చలోకి వచ్చింది.రాహుల్ గాంధీ ఎంట్రీ.. రాజకీయ వేడి.. ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయంగా ప్రశ్నిస్తున్నారు. 2,000కు మించిన లావాదేవీలు మొత్తం UPI లావాదేవీల్లో సంఖ్య పరంగా సుమారు 5 శాతమే అయినప్పటికీ.. వాటి విలువ మొత్తం UPI లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మర్చంట్‌పై MDR విధించినా.. వ్యాపారులు ఆ ఖర్చును చివరకు వస్తువులు, సేవల ధరల్లో కలిపి వినియోగదారుడిపై మోపే అవకాశం ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. భారత్‌లోని జీరో-MDR విధానాన్ని అమెరికా చెల్లింపుల సంస్థలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయని, తాజా మార్పు అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమంటూ రాహుల్ ఆరోపించారు. ఈ అంశాన్ని అమెరికా ట్రేడ్ డీల్ చర్చలతోనూ ముడిపెట్టారు. అయితే, కేంద్రం వాదన మరోలా ఉంది. UPI వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, మోసాల నిరోధం, టెక్నాలజీ, మౌలిక వసతులపై నిరంతరం పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఆ వ్యవస్థ దీర్ఘకాలికంగా కొనసాగేందుకు పరిమిత MDR అవసరమని వివరిస్తోంది.యూపీ ఎన్నికల్లో ఎందుకు కీలకం?యూపీఐ అంటే కేవలం యాప్‌లో డబ్బు పంపడం కాదు. కూరగాయల బండి, టీ దుకాణం, మెడికల్ షాప్, చిన్న హోటల్, ఆటో.. ఇలా రోజువారీ లావాదేవీల్లోకి అది వెళ్లిపోయింది. అందుకే ఛార్జీల అంశం కేవలం బ్యాంకింగో లేదంటే ఫిన్‌టెక్ పాలసీగా కాకుండా చిన్న వ్యాపారి, వినియోగదారుడి జేబుకు సంబంధించిన అంశంగా రాజకీయ పార్టీలు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదే పాయింట్‌ను కాంగ్రెస్ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించారు.. ఇప్పుడు పెద్ద మొత్తంలోని మర్చంట్ లావాదేవీలకు MDR ఎందుకు?’ అనే ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాలనుకుంటోంది. వచ్చే ఏడాదిలో ఏడు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని పలు సమస్యలతో పాటు యూపీఐని కూడా ఎన్నికల ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.క్యూఆర్ కోడ్ టూ రాజకీయ కోడ్.. ఇప్పటికే రైతులు, యువత, ఉద్యోగాలు, ధరలు, సంక్షేమ పథకాలు వంటి అంశాల చుట్టూ సాగుతున్న యూపీ రాజకీయంలో.. UP‘I’ ఛార్జీల అంశం కొత్త చర్చకు దారి తీస్తుందా? రోజూ ఫోన్లో కనిపించే QR కోడ్.. ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ కోడ్‌గా మారుతుందా? లేక ఇది కేవలం కేంద్ర విధానంపై కాంగ్రెస్ చేస్తున్న మరో విమర్శగానే మిగిలిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మోదీని కలిసిన వారం రోజుల్లోనే.. -
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య. పైగా ఆ వెనక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణ. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బాల్య స్నేహితుడ్ని కలిసి.. సీబీఐ విచారణ జరిపించాలని ఆ పెద్దాయన కోరారు. అవతలి ఉంది మాములు వ్యక్తి కాదు.. అందుకే వారం తిరగ్గ ముందే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.ప్రధాని నరేంద్ర మోదీతో పాఠశాలలో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా.. మహారాష్ట్రలోని భయందర్‌లో తన భూమి వివాదంపై సెప్టెంబర్ 8న మోదీని కలిశారు. ఇది జరిగిన.. వారం రోజుల్లోనే వివాదాస్పద స్థలంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు. భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు, అక్కడ నిర్మాణానికి తీసుకున్న అనుమతులను కూడా సరెండర్ చేశారు. వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.నాకేం తెలియదు: వోరామోదీతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వోరా.. ప్రస్తుతం ముంబై సమీపంలోని మీరా రోడ్లో నివసిస్తున్నారు. భయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్‌లో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేశారు. తాను ఆ భూమిని ఎప్పుడూ విక్రయించలేదని, మరెవరికీ బదలాయించలేదని పేర్కొన్నారు.అయితే 2011లో తనకు తెలియకుండా భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్తిని రెండు భాగాలుగా విభజించినట్లు వోరా ఆరోపించారు. ఒక భాగాన్ని స్వయం బిల్డర్స్ పేరుతో, మరో భాగాన్ని నరేంద్ర మెహతాకు సంబంధించిన సెవెన్ ఎలెవన్ కన్స్ట్రక్షన్స్ పేరుతో చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. తన భూమిపై నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపైనా అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కూడా ఆయన కోరారు.15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా..ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు దాదాపు 15 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ విభాగాలను ఆశ్రయిస్తున్నానని వోరా తెలిపారు. 2015లో నకిలీ పత్రాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని, అయితే దర్యాప్తు నివేదిక చాలా ఆలస్యంగా వచ్చిందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని వోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిసి తన సమస్యను వివరించారు. ఈ భేటీ అనంతరం మహారాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.మోదీ ఎఫెక్ట్.. సచివాలయంలో కీలక సమావేశంసెప్టెంబర్ 15న మహారాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీకర్ పరదేశి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అస్గర్ అలీ వోరాతో పాటు ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, మీరా-భయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా బినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తమ్ షిండే పాల్గొన్నారు.ఈ సమావేశంలో నరేంద్ర మెహతా టౌన్ ప్లానింగ్ విభాగానికి లేఖ ఇచ్చారు. వివాదాస్పద భూమిపై తాను కలిగి ఉన్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు, ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతిని కూడా సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఈ భూమిని తాను 2019లో మెర్విన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు మెహతా తన లేఖలో తెలిపారు.ఫిర్యాదు కూడా ఉపసంహరణఇదే సమయంలో వోరాపై గతంలో తాను చేసిన పోలీస్ ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు మెహతా పోలీస్ కమిషనర్‌కు మరో లేఖ రాశారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినందున ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూవివాదానికి ఓ ఎండ్ కార్డ్ పడినట్లైంది.ఇదీ చదవండి: ఆ హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊరట -
భారత్‌కు బిగ్ షాక్.. వంద శాతం టారిఫ్‌లకు అమెరికా గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ‘లిండ్సేఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’పై ఓటింగ్‌లో భాగంగా 214–211 ఓట్ల తేడాతో కీలక ప్రొసీజరల్ ఆమోదం పొందింది. ఈ బిల్లులో భారత్, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దాదాపు 10 దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, హౌస్‌లో ఈ దశలో జరిగిన ఓటింగ్ తుది ఆమోదం కాదు. బిల్లుపై తుది ఓటింగ్ బుధవారం జరగాల్సి ఉంది. అది ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించింది. ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే దేశాలపై అదనపు టారిఫ్‌లకు మార్గం ఏర్పడుతుంది. బిల్లులో 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంటే చట్టం ఆమోదం పొందినంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. టారిఫ్ విధించాలా? ఎంత విధించాలి? అనే నిర్ణయం అధ్యక్షుడి వద్దే ఉంటుంది.రష్యాపైనే ప్రధాన గురిఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లకు మాత్రమే పరిమితం కాదు. రష్యా నాయకత్వం, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు అమెరికా భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. రష్యా చమురు ఆదాయం ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి నిధులుగా ఉపయోగపడుతోందన్నది అమెరికా చట్టసభ సభ్యుల వాదన. అలాగే ఇరాన్‌పై ఇప్పటికే ఉన్న ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.సెనేట్‌లో భారీ మెజార్టీతో ఆమోదంఈ బిల్లుకు అమెరికా సెనేట్‌లో ఇప్పటికే భారీ మద్దతు లభించింది. ఆగస్టు 7న సెనేట్ 86–11 ఓట్లతో బిల్లును ఆమోదించింది. అనంతరం ఇది ప్రతినిధుల సభకు చేరింది. సెనేట్‌లో ఆమోదమైన రూపంలో రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లకు అవకాశం కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ సహా పలు నివేదికలు పేర్కొన్నాయి.ఇక, బిల్లుకు మద్దతు ఉన్నప్పటికీ.. అమెరికా ప్రతినిధుల సభలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడికి టారిఫ్‌ల విషయంలో అత్యధిక అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రటిక్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.Breaking || US House to vote on Russia sanctions bill, which could give Trump authority to impose tariffs of up to 100% on countries buying Russian energy.➤ India may face possible 100% tariff➤ India among 10 nations named for tariffs➤ Russia oil buyers: U.S. tariff… pic.twitter.com/4gyjSS8Gi6— TIMES NOW (@TimesNow) September 16, 2026ఇక ఏం జరుగుతుంది?హౌస్‌లో తుది ఓటింగ్ కీలకం. బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందితే అధ్యక్షుడి సంతకం కోసం వెళ్తుంది. ఆ తర్వాతే చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రస్తుతం భారత్‌పై 100 శాతం టారిఫ్ విధించినట్లు కాదు.. అయితే అలాంటి చర్య తీసుకునే చట్టపరమైన అధికారాన్ని ట్రంప్‌కు కల్పించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు, భారత్ కొనసాగిస్తున్న రష్యా చమురు కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్! -
బ్రిక్స్ సూపర్ సక్సెస్!
చేరుకోవాల్సిన లక్ష్యంపై స్పష్టత, అందుకు అనుసరించాల్సిన మార్గంపై ఏకాభిప్రాయం సాధించగలిగితే శిఖరాగ్ర సమావేశాలు విజయవంతమవుతాయి. ఆ రెండూ లేకుంటే ఉత్త లాంఛనప్రాయ సమావేశాలుగా మిగులుతాయి. ఆ కోణంలో శని, ఆదివారాల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఘన విజయం సాధించినట్టు లెక్క. అలాగని ఈ సమావేశాలు సమీప భవిష్యత్తులో బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని నిర్ణయించలేదు. అలాగే ఎడాపెడా సుంకాలు విధిస్తున్న అమెరికాను నిలదీయలేదు. పశ్చిమాసియా కల్లోలానికి నువ్వే కారణమని వేలెత్తి చూపలేదు. ఈ అంశాల్లో లౌక్యం ప్రదర్శిస్తూనే చేయదల్చుకున్నది చేయటంలో బ్రిక్స్ సఫలీకృతమైంది. ఇవి మాత్రమే కాదు... పరస్పరం కలహించుకుంటున్న ఇరాన్, దాని ప్రత్యర్థులు యూఏఈ, సౌదీలను సమావేశాలకు రప్పించగలిగింది. పైగా ఇరాన్, యూఏఈ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. దక్షిణ చైనా సముద్రం విషయంలో విభేదాలున్న చైనా, ఫిలిప్పీన్స్ కూడా సదస్సుకు హాజరయ్యాయి. భారత్, చైనాల వివాదం సరేసరి. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు గల దేశాలన్నీ ఒక ఉమ్మడి డిక్లరేషన్ ప్రకటించటం చిన్న విషయం కాదు. అతిథేయ దేశంగా భారత్ ప్రత్యేక కృషి ఇందులో కనబడుతుంది. సభ్య దేశాలతో ఓపిగ్గా చర్చించాలి. ఒప్పించాలి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన టీమ్ ఆ పని చేయగలిగినందుకు అభినందించాలి.ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో దక్షిణార్ధ గోళ దేశాల స్వరం వినిపించటంలో ఏదోమేరకు కృషి చేసిన అలీనోద్యమ సంస్థతో బ్రిక్స్‌కు పోలికలున్నాయి. కానీ వాటిమధ్య వ్యత్యాసం కూడా ఉంది. అప్పటి ద్విధ్రువ ప్రపంచంలో స్వతంత్రంగా మనగలగటానికి అవసరమైన ఆర్థిక సంపత్తి అలీనోద్యమానికి లేదు. బ్రిక్స్ అలా కాదు. అందులో పూర్తి స్థాయి సభ్యత్వంగల 11 దేశాలను చూసినా వాటి ఉమ్మడి దేశీయోత్పత్తి (జీడీపీ) వాటా ప్రపంచ జీడీపీలో 40 శాతం. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉంది. ప్రపంచంలో చైనా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ. రష్యావద్ద అపారమైన చమురు నిక్షేపాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయి. మనతోసహా బ్రిక్స్ దేశాలన్నీ ఆర్థికంగా చురుగ్గా ఎదుగుతున్న దేశాలు. బ్రెజిల్ అయితే దక్షిణమెరికా ఆర్థిక వ్యవస్థల్లో అతి పెద్దది. ఇవన్నీ సమష్టిగా దక్షిణార్ధ గోళ దేశాలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నాయి. ఇన్ని అనుకూలాంశాలున్నా అమెరికాపై నేరుగా ధిక్కార స్వరం వినిపించనప్పుడు ప్రయోజనమేమిటన్న సందేహం వస్తుంది. ఆ ప్రక్రియ క్రమబద్ధంగా సాగాలి. భద్రతా మండలి, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర సంస్థల్లో వర్ధమాన దేశాలకు మరింత మెరుగైన చోటీయాలని బ్రిక్స్ కోరుతోంది. కానీ అది అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే డిమాండ్‌గా మారకుండా సదస్సు జాగ్రత్తపడింది. డాలర్ వాడకాన్ని క్రమేపీ తగ్గించుకునే ప్రక్రియలోనూ అదే ఎత్తుగడ పాటించింది. ఆ దిశగా అడుగులేస్తే బ్రిక్స్ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయటానికి ముందే 2024 డిసెంబర్లో డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ బెదిరింపుల్ని ఆయన అడపా దడపా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ఉనికిలో లేకుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది మరి! అందుకే కావొచ్చు... ఆ విషయంలో బ్రిక్స్ సంయమనం పాటించింది. అది వేరే రూపంలో ఇప్పటికే అమలవుతోంది. చైనా, రష్యా 90 శాతం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమ తమ కరెన్సీల్లో జరుపుకొంటున్నాయి. రష్యా చమురు విక్రయాలకు మన దేశం రూపా యిల్లో చెల్లించింది. డాలర్ రద్దు చేయకుండానే దాని వాడకాన్ని తగ్గించటం బ్రిక్స్ దేశాలు ఎంచుకున్న పద్ధతి. ఐఎంఎఫ్ డేటా ప్రకారం ఇప్పటికీ ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా 56.77 శాతం. యూరో కరెన్సీ వాటా 20.25 శాతం. చైనా కరెన్సీ రెన్మిన్బి(ఆర్ఎంబీ) వాటా కేవలం 1.95 శాతం. డాలర్ నిల్వలు పుష్కలంగా ఉన్న చైనా మరో కరెన్సీని వినియోగించాలనుకున్నా దానికే నష్టం. మనకూ ఆ సమస్యవున్నా, అమెరికా ఆధిపత్యం స్థానంలో చైనాను అంగీకరించటానికి సిద్ధపడలేం. ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో ఎవరి జాగ్రత్తలు వారివి. ఈ దశలో అస్పష్టతతోనైనా బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన వెలువరించటం దానికదే ఘన విజయం. -
'అత్యధిక ప్రపంచానికి' అసలైన ప్రాతినిధ్యం
ఢిల్లీలో జరిగిన ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు ఏ విధంగా చూసినా ఘన విజయమే. ఈ మాట అనేందుకు గల కారణాన్ని ఒకే ఒక మాటలో చెప్పాలంటే, 20 ఏళ్ల క్రితం స్థాపితమై ఈసారితో కలిపి 18 శిఖరాగ్ర సమావేశాలు జరుపుకొన్న ఈ సంస్థ, తన ప్రకటిత లక్ష్యాల దిశగా ఇంతవరకెన్నడూ లేనంత పట్టుదలగా, ధైర్యంగా ముందడుగులు వేసింది. అందుకు కారణాలు రెండు: ఒకటి, వర్ధమాన దేశాలలో చైతన్యాలు, ఆత్మవిశ్వాసాలు, ఐక్యతలు పెరుగుతుండటం. రెండు, ప్రపంచంపై దశాబ్దాల పాటు ఆధిపత్యం సాగించిన అమెరికా నాయకత్వపు పాశ్చాత్య కూటమి క్రమంగా బలహీనపడుతుండటం.ముఖ్యమైన ముందడుగులు‘బ్రిక్స్’ వ్యవహరణలో ఈ మార్పు కనిపించటం రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన 16వ సమావేశాల (2024)లోనే మొదలై, బ్రెజిల్‌లోని రియో డి జనేరో (2025)లో కొనసాగింది. ఈ రెండింటికి మధ్య అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తిరిగి బాధ్యతలు చేపట్టారు. తన కన్న ముందు జో బైడెన్ హయాంలోనే ఎదురవుతుండిన సమస్యల దృష్ట్యా ‘బ్రిక్స్’ నాయకులు కజాన్‌లో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానమైనవి బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలోపేతం చేయబూనటం, ఐక్యరాజ్య సమితిని, ప్రపంచ బ్యాంకును, ఐఎంఎఫ్‌ను ప్రజాస్వామీకరించా లనే డిమాండ్, ‘బ్రిక్స్’ దేశాల మధ్య వాణిజ్యం డాలర్లకు బదులు స్థానిక కరెన్సీలలో జరగాలనే ప్రతిపాదన. వీటిలో ముఖ్యంగా చివరి అంశం అపుడు పాశ్చాత్య లోకంలో ఆర్థికంగా, రాజకీయంగా కూడా పెద్ద కలకలాన్ని సృష్టించింది. అమెరికా ఆధిపత్యానికి ఆయువుపట్లలో ఒకటైన డాలర్ రాజ్యం దెబ్బ తింటే మొదటికే మోసం రాగలదనుకున్న ట్రంప్, ‘బ్రిక్స్’ దేశాలు అటువంటి పని చేసినా, ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించినా అందరిపై 100 శాతం సుంకాలంటూ హెచ్చరించారు. నిజానికి డీ– డాలరైజేషన్, ప్రత్యామ్నాయ కరెన్సీ ఆలోచనలు అపుడెంత మాత్రం లేవు. అది తేలికైన పని కాదు కూడా. అదే సమయంలో ఒక స్పష్టత అవసరం. డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలు అంతర్జాతీయ చెల్లింపుల కోసం అమెరికా నియంత్రణంలో గల ‘స్విఫ్ట్’ వ్యవస్థకు బదులు మరొకటి ఏర్పాటు చేసే యోచన, రిజర్వ్ కరెన్సీగా డాలర్‌కు బదులు చైనీస్ యువాన్‌ను ముందుకు తెచ్చే ప్రయత్నాలు మొద లైనవి క్రమంగా ముందుకు సాగిన కొద్దీ డాలర్ బలహీన పడుతుంది. వీటిలో స్థానిక కరెన్సీల ఉపయోగం ఇప్పటికే విస్తరిస్తూ డాలర్‌పై ప్రభావాన్ని చూపుతున్నది కూడా. అనగా, క్రమంగా డాలర్ బలహీనపడటమే పరోక్ష రీతిలో డీడాలరైజేషన్ జరగడ మన్నమాట. తక్కిన వాటిలో అదీ ఒక కరెన్సీగా మిగులుతుంది.ఆకాశంలో సగంఢిల్లీ ‘బ్రిక్స్’ సందర్భంగా ఈ నేపథ్యాన్నంతా రాయటం ఎందు కంటే, కజాన్ నుంచే ఆరంభించి అమెరికా వైపు నుంచి ఎన్నెన్ని ఒత్తిడులు వచ్చినా, సంస్థ నాయకత్వం ఎంత మాత్రం జంకలేదు. సరికదా, స్థానిక కరెన్సీల చెల్లింపులను మరింత విస్తరించాలని ఢిల్లీ డిక్లరేషన్‌లో స్పష్టంగా తీర్మానించింది. బహుళ ధ్రువ ప్రపంచానికి తప్పనిసరి అవసరాలు మరికొన్ని కూడా ఉన్నాయిగాని, ధనం మూలం మిదం జగత్ అన్నట్లు బండికి ఆర్థికమే ఇరుసు గనుక, ‘బ్రిక్స్’ వైఖరిలోని ఈ కీలకాన్ని అర్థం చేసుకోవాలి. వార్తలకు అంతగా ఎక్కలేదు గానీ, ఢిల్లీ సమావేశాలకు ముందు రోజున ‘బ్రిక్స్’ దేశాల ఆర్థిక మంత్రులు, రిజర్వ్ బ్యాంకుల గవర్నర్లు ముంబైలో సమావేశమై, స్థానిక కరెన్సీలతో పాటు పలు ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిలో దేశాల మధ్య చెల్లింపులకు ప్రత్యేక వ్యవస్థ (స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయమనాలి) ఒకటి. అదిగాక, విచ్చలవిడి ట్యారిఫ్లను, డబ్ల్యూటీవోకు విరుద్ధమైన వాణిజ్య ఒప్పంద ధోరణులను, ధనిక దేశాల ప్రొటెక్షనిజాన్ని, ప్రపంచ బ్యాంకుపైన, ఐఎంఎఫ్పైన ఏకపక్ష నియంత్రణను తీవ్రంగా వ్యతిరే కించారు. తాము ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవాలనుకున్నారు.చివరగా ఢిల్లీ డిక్లరేషన్ సరేసరి. సమావేశాలలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని గణాంకాలను పేర్కొనటాన్ని కూడా ఈ ఆర్థిక సందర్భంలో గమనించాలి. బ్రిక్స్ దేశాల జనాభా ఇపుడు ప్రపంచ జనాభాలో సగమనీ, ప్రపంచ జీడీపీలో పాశ్చాత్య కూటమి జీ–7 వాటా 29 శాతం కాగా, ‘బ్రిక్స్’ది 40 శాతం అనీ, ‘బ్రిక్స్’ ఏర్పడిన గత రెండు దశాబ్దాలలో ఆ సంస్థ సభ్యుల జీడీపీ 4.5 రెట్లు పెరగగా, ప్రపంచానిది 2 రెట్లు మాత్రమేననీ చెప్పారు. అట్లా గుర్తు చేయటం పాశ్చాత్య దేశాలకేనని వేరే చెప్పనక్కర లేదు. గుర్తు చేయటం ఎందుకో కూడా అర్థం చేసుకోగలదే. సినిమా పరిభాషలో చెప్పాలంటే, ‘వస్తున్నాం కాస్కో, ఇకనైనా దారికి రా’ అనడమన్న మాట!అందరితో కలిసి నడుస్తూ...యథాతథంగానే ఒక స్థాయికి అభివృద్ధి చెందిన బ్రిక్స్ దేశాలకు, పాశ్చాత్య కూటమికి ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పరిణామాలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. దీనికి తగినట్లు, కజాన్, రియో, ఢిల్లీ డిక్లరేషన్లలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండా లతో పాటు విశాల సముద్రాలలో గల చిన్న దేశాలు, పేద దేశాల సమస్యలు, అవసరాలు, ప్రాతినిధ్యాల గురించిన ప్రస్తావనలు అనేకం ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అత్యధిక దేశాలు, అత్యధిక జనాభాతో కూడిన లోకానికి ‘బ్రిక్స్’ ప్రజాస్వామికమైన రీతిలో ప్రాతినిధ్యం వహించనున్నదని చెప్పడమన్నమాట. ఈ రహస్యం ఆ యా దేశాలకు ఇప్పటికే చేరిపోయింది. కనుకనే ‘బ్రిక్స్’ పట్ల ఆసక్తి, అందులో చేరాలనే కోరిక, కజాన్ నుంచి పెరగగా, ఇపుడు ఢిల్లీ తర్వాత ఊపందుకోగలవని భావించవచ్చు.ఇతర అంశాలలో వివిధ అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, బహుళ ధ్రువ ప్రపంచ లక్ష్యాల కోసం ‘బ్రిక్స్’ డిమాండ్లు కజాన్ కన్న ఢిల్లీలో పదునెక్కాయి. ఆర్థిక, వాణిజ్య, రాజకీయ, సైనిక రంగాలలో అంతర్జాతీయ నియమ నిబంధనల ఉల్లంఘనను మరింత తీవ్రంగా ఆక్షేపించారు. ఇరాన్, పాలస్తీనా, సిరియా, క్యూబా, జెరూసలేం స్వయంప్రతిపత్తి, శాంతియుత అణుపరిశోధనలకు మరింతగా మద్దతు ప్రకటించారు. మొదట అనుకున్నట్లు, బ్రిక్స్ శక్తిమంతమవుతుండటానికి గల రెండు కారణాలలో, ట్రంప్, ఆయనతోపాటు పాశ్చాత్య ప్రపంచం బలహీనపడుతుండటం ఒకటి. ఇంతకాలం లోకాన్ని ఏలినవారు, తిరుగు లేదన్నట్లు వీస్తున్న కొత్త గాలులను ఇప్పటికైనా గుర్తించి తమ ధోరణిని మార్చుకుంటూ తక్కిన ప్రపంచంతో సమానులుగా, సఖ్యతతో జీవించటం అందరికీ మేలు చేస్తుంది. లేని పక్షంలో, బ్రిక్స్ సమావేశాలు జరుగుతూ పోయినకొద్దీ అనివార్యపు మార్పులు తప్పవనాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రూ. 2 వేలు దాటితే వడ్డింపు, కస్టమర్లపైనే భారం : రాహుల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం యూపీఐ (UPI) విధానాలపై తీసుకున్న తాజా నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అమెరికన్ ఒత్తిడికి తలొగ్గి, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాహుల్ ఆరోపించారు. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైనమర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జ్ ఉండవచ్చు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి జారీ చేసిన జారీ చేసిన సరికొత్త గెజిట్ నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.రాహుల్ గాంధీ మండిపాటుయూపీఐపై ఛార్జీలు విధించేందుకు మోదీ ప్రభుత్వం రహస్యంగా గేట్లు తెరిచిందని మండిపడ్డారు. ఇప్పుడు రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate - MDR) విధింపుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇవి కేవలం 5శాతం వాల్యూమ్ మాత్రమే అయినప్పటికీ, మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దాదాపు 65శాతంగా ఉంటాయని రాహుల్ ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. అంతిమంది కస్టమర్లపై భారం పడుతుందని ఆయన విమర్శించారు.కస్టమర్లకు ఎలాంటి ఫీజులు ఉండవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దుకాణదారులపై విధించే ఫీజులు చివరకు ఎక్కడి నుంచి వస్తాయి? నేరుగా సామాన్యుడి జేబు నుంచే వస్తువుల ధరల రూపంలో వసూలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా జీరో-ఎండీఆర్ (Zero-MDR) విధానాన్ని అమెరికా పేమెంట్ కంపెనీలు ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నాయని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం అదే దిశగా విధానాన్ని మార్చేందుకు మార్గం సుగమం చేసిందని రాహుల్ ఆరోపించారు.కాగా రూ. 2,000 వరకు చేసే యూపీఐ లావాదేవీలు లేదా రుపే డెబిట్ కార్డ్ (RuPay) చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు విధించ కూడదని బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. అయితే, రూ. 2,000 కంటే ఎక్కువ లావాదేవీలపై వర్తకులకు ఛార్జీలు వర్తిస్తాయా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఆమోదం పొందిన పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007 సవరణ ప్రకారం ఈ మార్పులు వచ్చాయి.ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుమల్లికార్జున ఖర్గే స్పందనఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిందిపోయి, వారి జేబులు గుల్ల చేసేందుకు ప్రభుత్వం రోజూ కొత్త మార్గాలను వెతుకుతోందని విమర్శించారు. "యూపీఐపై ఎలాంటి ఫీజులు లేవు" అన్న నిబంధనను "రూ. 2,000 వరకు మాత్రమే" అని మార్చేశారని ఎద్దేవా చేశారు. విపరీతమైన ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం దాదాపు 10% వద్ద ఉన్న తరుణంలో, బీజేపీ ప్రభుత్వం ప్రజలపై 'డిజిటల్ పేమెంట్స్ ట్యాక్స్' భారం మోపేందుకు ప్లాన్ చేసిందని ఖర్గే ఆరోపించారు.ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలుప్రభుత్వం వాదన ఇలా ఉందిలావాదేవీల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, మోసాల నిరోధక చర్యలు, మౌలిక వసతుల నిరంతర అభివృద్ధి కోసం సిస్టమ్‌కు నిధులు అవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. మార్కెట్ విస్తరణ, స్వయం సమృద్ధి, మెరుగైన పోటీతత్వం కోసం ఒక సమతుల్య విధానం అవసరమని, కేవలం సబ్సిడీలపై ఆధారపడటం సాధ్యం కాదని పేర్కొంది.ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ -
కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
సోమవారం వినాయక చవితి పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీలోని పీయూష్ గోయల్ ఇంటికి వెళ్లిన మోదీ గణపతి బప్పాను దర్శించుకున్నారు. అనంతరం హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ గణేశుడి కృప అందరిపై ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అనంతరం గణపతి బొప్ప మోరియా అని మోదీ తన నోటి వెంట పలికారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఇంట్లో గణేషుడికి చేసిన పూజ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ స్వయంగా తన ‘ఎక్స్’లో పంచుకున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రధాని మోదీ స్పందిస్తూ..‘‘నా తోటి పౌరులందరికీ హృదయపూర్వక గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. విఘ్న నివారకుని దర్శన పూజలకు సంబంధించిన ఈ పవిత్ర పండుగ ప్రతిఒక్కరి జీవితాల్లోకి నూతన శక్తిని, తాజా ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ఆయన దివ్య ఆశీస్సులతో అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ ముగించారు.VIDEO | Delhi: Prime Minister Narendra Modi participates in Ganesh Utsav at Union Minister Piyush Goyal’s residence.(Source: PM Modi's YT)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/l1kLZzNxBg— Press Trust of India (@PTI_News) September 14, 2026ఇదీ చదవండి: గురుగ్రామ్ ఘటన.. సియా కుటుంబం చెప్పిన మరో కోణం! -
బ్రిక్స్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా ఆ యువకుడు..!
భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు దిగ్విజయంగా ముగిసింది. అందుకు సంబంధించిన ఒక ఫోటోను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది షేర్ చేసిన గంట వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఆ ఫోటోల భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు చేతులు కలిపి ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ఆ నాయకుల మధ్య ప్రశాంతంగా నిలబడి ఉన్న ఒక యువకుడు అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాడు. ఎవరీ సిద్ధార్థ్ బాబు..?కేరళలో కొచ్చికి చెందిన 36 ఏళ్ల ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. 2017 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని తూర్పు ఆసియా విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొన్ని నివేదికలలో ఆయన పేరు సిద్ధార్థ్గా కనిపిస్తుంది. ఆయన చాలామందికి తెలియని అత్యంత కీలకలమైన గదిలో ఏళ్ల తరబడి పనిచేసిన దౌత్యవేత్త. మెకానికల్ ఇంజనీర్ అయిన ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 15వ ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు. ఆయన ఫారిన్ సర్వీస్‌ని ఎంచుకున్నారు. అలా ఆయన దేశంలోని అత్యంత సున్నితమైన సంభాషణల నేపథ్యంలో సాగే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారు. అక్కడ కనిపించడం కంటే సన్నద్ధతకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఆ నాయకుల మధ్య ఉండటానికి రీజన్..అతను మాండరిన్ అనువాదకుడు. శిఖరాగ్ర సమావేశంలో షీ జిన్‌పింగ్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను మోదీ అర్థం చేసుకునేలా సహాయం చేయడమే అతని పని. ఇది కనిపించే దానికంటే చాలా కష్టం. ఒక దౌత్య అనువాదకుడు కేవలం భాషనే కాకుండా, ప్రతి పదబంధంలో రాజకీయ ప్రాముఖ్యతను కూడా గ్రహించి, అర్థాన్ని కచ్చితంగా తక్షణమే తెలియజేయాలి. ఎందుకంటే వాణిజ్యం, భద్రత లేదా సరిహద్దుల విషయంలో పలికే ఒక్క తప్పు పదం మొత్తం సంబంధం స్వరూపాన్నే మార్చేయగలదు.ఆ బ్రిక్స్ ఫోటోని బట్టి అతడికి అదే అతిపెద్ద వేదిక అరంగేట్రం అనుకుంటే పొరపాటే..ఎందుకంటే ఈ ఏడాది జరిగిన గణతంత్ర వేడుకల్లో కూడా కనిపించారు. మోదీ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్పులా వాన్ డెర్ లేయన్తో సంభాషించేటప్పుడు సిద్ధార్థ్ అర్థమయ్యేలా వివరించడంలో సహాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక రకంగా ఈ ఘట్టం..భారతదేశం నిర్వహించే దాదాపు ప్రతి ప్రధాన దౌత్య సమావేశంలో కొంతమంది ప్రతిభావంతులైన భాషావేత్తలు అంతర్భాగంగా ఉంటారనే నగ్న సత్యాన్ని ఇది తెలియజేస్తోంది. అలాగే అత్యంత శక్తిమంతమైన వ్యక్తులతో సంభాషించేటప్పుడే వారి మాటాలు సునాయాసంగా అర్థం చేసుకుని సమాచారాన్ని చేరవేసే ఈ భాషావేత్తలదే అత్యంత కీలకమైన పాత్ర అని ప్రస్ఫుటమవుతోంది.(చదవండి: మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ) -
BRICS సదస్సు సూపర్ సక్సెస్
-
శాకాహారం మంట!
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాధినేతలతోపాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్దసంఖ్యలో దౌత్యాధికారులకు ప్రధాని మోదీ శనివారం ఇచ్చిన విందులో కేవలం శాకాహార భోజనం వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. అత్యధికశాతం భారతీయులు మాంసాహారులని తెల్సి కూడా మోదీ సర్కార్ కేవలం శాకాహారం వడ్డించడంలో ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గణాంకాలను మీకు గుర్తుచేస్తున్నా. 80 శాతం మంది భారతీయులు మాంసాహారులే. మరీ ముఖ్యంగా భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. నా చెల్లి చేసిన శాకాహార చిరుతిండి ఛోలే భటూరేలా మాంసాహారం ఎంతో పసందుగా ఉంటుంది. అలాంటప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ సంబంధిత విందులో మాంసాహారాన్ని విస్మరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ’’అని రాహుల్ మోదీ సర్కార్‌కు సూటి ప్రశ్న వేశారు. పోస్ట్‌తోపాటు తన సోదరి చేసిన చిరుతిండి ఫొటోను పోస్ట్‌చేశారు. నచ్చిన ఆహారం వడ్డించరా?: కాంగ్రెస్ భారత్‌తోపాటు విదేశాల్లోనూ మాంసాహార ప్రియులే అత్యధికమని, అలాంటి బ్రిక్స్ దేశాల నుంచి వచ్చిన విదేశీ అతిథులకు శాకాహారం బలవంతంగా వడ్డించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టింది. ‘‘బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచదేశాల అతిథులు ఈ కార్యక్రమానికి వచ్చి విందు ఆరగించారు. వీళ్లు ఏ ఆహారం తినాలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇప్పటికే భారతీయులు ఏం తినాలో బీజేపీ ఆదేశిస్తోంది. ఇక విదేశీయులకు శాకాహారాన్ని బలవంతంగా తినిపించడం ఎంతవరకు సబబు?’’అని కాంగ్రెస్ మీడియా విభాగ చీఫ్ పవన్ ఖేడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చవులూరించే ఎంతో మాంసాహార వంటకాలకు భారత్ పెట్టిందిపేరు. వాటిని విదేశీ అతిథులు రుచి చూడకుండా చేసి భారతీయ ఆహార సంప్రదాయాలను దాచాలని చూస్తారా?’’అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విందు మెనూను పోస్ట్చేసింది. సక్సెస్‌ను కాంగ్రెస్ సహించట్లేదు: బీజేపీ సదస్సు విజయవంతంకావడంతో కాంగ్రెస్ సహించట్లేదని, అందుకే అర్థంపర్థంలేకుండా ఆహారం గురించి విమర్శలుచేస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ‘‘సదస్సు గురించి వంకలుపెట్టడానికి ఏమీ లేదు. డిక్లరేషన్‌లో ఏకాభిప్రాయం సాధించి మోదీ సర్కార్ తన దక్షతను చాటింది. సదస్సు ఇలా విజయవంతంకావడం కాంగ్రెస్ సహించలేకపోతోంది. అందుకే విమర్శించడానికి మరే విషయాలు లేక చివరకు ఆహారం గురించి విమర్శలు చేస్తోంది’’అని భండారీ అన్నారు. ‘‘డిక్లరేషన్‌తో విజయం సాధించిన మోదీని రాహుల్ అభినందించాల్సిందిపోయి ఈ శాకాహారం, మాంసాహారం గోల ఏంటి?’’అని మరో బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ సిన్హా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పోస్ట్ చేసిన మెనూ (అన్నీ శాకాహారాలే) స్టార్టర్స్.. 1. ఖండ్వీ మిలే–ఫియులే(శనగపిండితో ఆవిరిపై ఉడికించి పలుచగా చేసిన రోల్స్) 2. మష్రూమ్ కబాబ్‌లు, షీర్మాల్ రొట్టెతో కలిపి ఖుంబ్ గలౌతీ మెయిన్ కోర్స్ 1. పనీర్ లబాబ్దార్ 2. హిమాలయాల్లో లభించే అరుదైన మోరెల్ మష్రూమ్‌లు, ఆస్పరాగస్, కుంకుమపువ్వు, ఎండుద్రాక్ష, బాదంతో చేసిన గుచ్చీ మారి్మక్ 3. క్యారెట్, గ్రీన్ బీన్స్ కూర 4. కందిపప్పు, టమాటాలతో చేసినకర్ణాటక తక్కలి బెల్లే చారు 5. చిరు ధాన్యాల పులావ్6. బీట్రూట్ రైతా 7. వివిధ రకాల భారతీయ బ్రెడ్లు తీపి పదార్థాలు1. పాత ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్ 2. జిలేబీ 3. పాలు, బియ్యం, మల్బెర్రీ పండ్లు కలిపిన షాహ్తూత్ పాయసం -
మోదీ థ్యాంక్స్
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖ రాగ్ర సదస్సును ఫలప్రదంగా, ఫలితాల ఆధారితంగా మార్చినందుకు కూటమిలోని సభ్య దేశాల అధినేతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు సంబంధించిన కీలక ఘట్టాలను ప్రతిబింబించే ఒక వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదస్సు విజయవంతమైందని హర్షం వ్యక్తంచేశారు.శిఖరాగ్ర సమావేశంలో మోదీ చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని కూడా ఇందులో చేర్చారు. బ్రిక్స్ సదస్సు ద్వారా భారత్ అన్ని రంగాల్లోనూ స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించుకుందని ఆయన పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్, ఇతర దేశాధినేతలు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును ముగించుకొని తమ స్వదేశానికి పయనమయ్యారు. జిన్‌పింగ్ అధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. రెండు రోజలపాటు తీరిక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, చైనా మధ్య వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే పుతిన్ శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. -
సాంకేతికతను ఖనిజాలను అస్త్రాలుగా వాడుకోవద్దు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సవాళ్లను ఎదుర్కొని మానవాళి కోసం బ్రిక్స్ కూటమి ఉమ్మడిగా కృషి చేయాలని, సహకారం, సమ్మిళిత వృద్ధి ద్వారా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను, అరుదైన ఖనిజాలను కొన్ని దేశాలు స్వలాభం కోసం అస్త్రాలుగా మార్చుకోవడంపై∙ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచదేశాల ఉమ్మడి పురోగతికి, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుందన్నారు. గ్లోబల్ సౌత్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకను వినడం, వారి అనుభవాలకు విలువ ఇవ్వడం, భాగస్వామ్యం ఏర్పర్చుకోవడం వల్ల అవి బ్రిక్స్‌ను ఎక్కువగా విశ్వసిస్తున్నాయని చెప్పారు. మన వైవిధ్యమే మన గుర్తింపు, మన సహకారమే మన స్ఫూర్తి, మన పురోగతి సకల మానవాళికి సేవగా మారాలని బ్రిక్స్ సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. సమ్మిళిత ప్రపంచ వృద్ధిని ఆకాంక్షిస్తున్నాం అస్థిరమైన భౌగోళిక–రాజకీయ వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారం బలోపేతం కావడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. కూటమికి భారత్ అధ్యక్షత వహించడం నిబ్బరం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఈ నాలుగు మూలస్తంభాల ఆధారంగా బ్రిక్స్ ద్వారా సమ్మిళిత ప్రపంచ వృద్ధిని భారత్ ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే కూటమిలో అభివృద్ధి చేసిన పరిష్కారాల ప్రయోజనాలు కేవలం భారత్‌కే పరిమితం కాకూడదని, గ్లోబల్ సౌత్ దేశాలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పష్టంచేశారు. కూటమిలో అందరి సహకారం, మద్దతుతో మన ఉమ్మడి దృక్పథాన్ని పరస్పర ప్రయోజనకరమైన సహకారంగా మార్చగలగడం సంతోషాన్నిస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి కాదు నేడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణలు, ఉద్రిక్తతల కారణంగా సామాన్య ప్రజలే అధికంగా నష్టపోతున్నారని మోదీ గుర్తుచేశారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాల వంటివి నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని నిరూపించాయని తెలియజేశారు. అందుకే బ్రిక్స్ కూటమిలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం, తక్షణ చర్యలు చేపట్టడం ముఖ్యమని వివరించారు. అంటువ్యాధుల నివారణ, వాటిపై స్పందించేందుకు ‘బ్రిక్స్ సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ను ఏర్పాటు చేయడానికి అంగీకరించామని అన్నారు. అలాగే విపత్తు నిర్వహణ కోసం ‘ముందస్తు హెచ్చరిక సమాచార అనుసంధాన మార్గదర్శకాలు’రూపొందించినట్లు తెలిపారు. సప్లై చైన్లను మరింత విశ్వసనీయంగా, దృఢంగా మార్చడానికి ‘బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేసన్ ఫ్రేమ్‌వర్క్’ తోడ్పడుతుందని అన్నారు. ఆవిష్కరణల విభాగంలో బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్ మన స్టార్టప్‌లను, ఇంక్యుబేటర్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుందని వెల్లడించారు. ‘బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్’ను ప్రతిపాదించినట్లు స్పష్టంచేశారు. సాంకేతికతను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం మన ఉమ్మడి పురోగతికి ఆటంకం కలిగిస్తుందన్నారు. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో సమ్మిళితత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. ‘బ్రిక్స్ కనెక్ట్’తో ఉపాధి అవకాశాలు బ్రిక్స్ కూటమిలోని వివిధ వేదికల ద్వారా స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించినట్లు ప్రధాని వివరించారు. బ్రిక్స్ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కావడం సరైంది కాదన్నారు. పారిశ్రామికవేత్తలు, రైతులు, పరిశోధకులు, మహిళలు, యువత, సామాన్య పౌరులను ఇందులో క్రియాశీల భాగస్వాములుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘బ్రిక్స్ కనెక్ట్’ద్వారా నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, పనిలో మహిళల భాగస్వామ్యం, సామాజిక భద్రత, సామర్థ్య పెంపుదల వంటి అంశాలను ప్రోత్సహించామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను పరిజ్ఞానం, ఆర్థిక వనరులు, కొత్త మార్కెట్లతో అనుసంధానించేందుకు ‘బ్రిక్స్ ఎంఎస్ఎంఈ కోఆపరేషన్ పోర్టల్’ను ప్రారంభించామని వెల్లడించారు. మన నగరాల మధ్య ఉత్తమ విధానాల పరస్పర బదిలీని సులభతరం చేసేందుకు ‘బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్’ను ఏర్పాటు చేశామన్నారు. భావి తరాల పట్ల అది మన బాధ్యత భారతీయ నాగరికతలో ప్రకృతికి కన్నతల్లి స్థానం ఉందని గుర్తుచేశారు. అభివృద్ధి, పర్యావరణం అనేవి ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కాదని, అవి పరస్పర పూరకాలని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నామని ఉద్ఘాటించారు. మానవాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పట్ల కచ్చితంగా సమతుల్యత పాటించాలని తేల్చిచెప్పారు. భావి తరాల పట్ల అది మన బాధ్యత అని సూచించారు. ఆ దిశగా పలు అంశాల్లో తాము పురోగతి సాధించామన్నారు. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ కోసం ‘బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, సమర్థవంతంగా మార్చడానికి, అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ప్రధాని చెప్పారు. -
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఢిల్లీ : తన 37 ఏళ్ల క్రితం నాటి భూవివాదాన్ని పరిష్కరించాలని అస్గర్ అలీ వోహ్రా (81) తన బాల్య మిత్రుడు ప్రధాని మోదీని కోరారు. అందుకు ప్రధాని మోదీ అభయమిచ్చారు.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్‌లోని వద్‌నగర్‌లో ప్రధాని మోదీతో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోహ్రా తన భూ వివాదంపై జోక్యం చేసుకోవాలని ప్రధానిని అభ్యర్థించారు. మహారాష్ట్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.మహారాష్ట్రలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన అస్గర్ అలీ వోహ్రా (81) ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నేరుగా కలిశారు. 1989లో ముంబై భాయందర్ ఈస్ట్ పరిధిలోని నవ్ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని తాను రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.అయితే 2011లో ‘స్వయం బిల్డర్స్’, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందిన ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’ సంస్థలు తన భూమిని కబ్జా చేశాయని వోహ్రా ఆరోపించారు. అసలు యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని రెండు భాగాలుగా విభజించి ఆ రెండు సంస్థల పేరిట ఆక్రమించుకున్నారని ఆయన వాపోయారు.ఈ భూ వివాదానికి సంబంధించి 2015లోనే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ, కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. దశాబ్దాలుగా రెవెన్యూ శాఖ, మున్సిపల్ అధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో చివరికి ఆయన ప్రధాని మోదీని ఆశ్రయించారు. తన గోడు వెళ్లబోసుకున్న వోహ్రాకు ప్రధాని సానుకూలంగా స్పందించి అభయమిచ్చారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ విడుదల చేయగా, ప్రధాని తన బాల్య స్నేహితుడికి తగిన న్యాయం అందేలా చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రధాని కార్యాలయ జోక్యంతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం ఈ ఉదంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక విచారణకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’, ‘స్వయం బిల్డర్స్’ ప్రతినిధులకు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. -
మోదీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. ఏం జరిగింది?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల సందర్భంగా షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక విందుకు మాత్రం హాజరుకాలేదు. శనివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించిన జిన్‌పింగ్.. రాత్రి జరిగిన గాలా డిన్నర్‌కు దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.కాగా, ప్రధాని మోదీ శనివారం బ్రిక్స్ దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే జిన్‌పింగ్ మాత్రం విందుకు రాలేదు. ఆయన ఎందుకు హాజరుకాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు. అయితే ఓ వర్గం సమాచారం ప్రకారం.. సదస్సు కార్యక్రమాల తర్వాత జిన్‌పింగ్ హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ కూడా విందుకు హాజరుకాలేదు. అయితే ఆయన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళ్లారు. జిన్‌పింగ్ గైర్హాజరుపై కారణం స్పష్టత లేకపోవడంతో ఆయన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్.. మోదీతో డిన్నర్‌కు దూరంగా ఉండటం ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది కేవలం విశ్రాంతి కోసమేనా.. లేక మరేదైనా కారణమా అన్నది మాత్రం అధికారికంగా తేలాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న (సెప్టెంబర్ 12) మోదీ-జిన్‌పింగ్ మధ్య సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా సరిహద్దు వివాదం, వాణిజ్య లోటు, మార్కెట్ యాక్సెస్, సరఫరా చైన్, రవాణా-ప్రజల మధ్య సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు విషయంలో న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పనిచేయాలని ఇద్దరూ అంగీకరించారు. మోదీ ఇప్పటికే ఉన్న సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలను గౌరవించాలని స్పష్టం చేశారు. ఇక ఆర్థిక అంశాల్లో భారత్-చైనా మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, సప్లై చెయిన్ సమస్యలను పరిష్కరించడంపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య విమానాలు, వీసాలు, కైలాస్ మానసరోవర్ యాత్ర వంటి సంబంధాలు కూడా క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ! -
సభ్య దేశాల సహకారంతో ఉమ్మడి ప్రయోజనం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండో రోజుకు చేరుకుంది. దీనిలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘బ్రిక్స్’లో గ్లోబల్ సౌత్ దేశాల స్వరం గట్టిగా వినిపిస్తోందని అన్నారు. భారత అధ్యక్షతన నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. సత్సీలత, నవకల్పన, సహకారం, సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కృషి చేశామని చెప్పారు. సభ్య దేశాల సహకారం, మద్దతుతో ఉమ్మడి ఆలోచనలను అందరికీ ప్రయోజనం చేకూర్చే సహకారంగా మార్చగలిగామని పేర్కొన్నారు.సరఫరా గొలుసులను మరింత విశ్వసనీయంగా, బలోపేతంగా మార్చేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ సహకార ఫ్రేమ్‌వర్క్ దోహదపడుతుందని మోదీ తెలిపారు. బ్రిక్స్ ఇన్క్యుబేటర్ నెట్వర్క్ ద్వారా స్టార్టప్‌లు, ఇన్క్యుబేటర్లను అనుసంధానించనున్నట్లు చెప్పారు. విస్తృతంగా అమలు చేయగల కొత్త పరిష్కారాలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi receives President of Kazakhstan, Kassym-Jomart Tokayev, at Bharat Mandapam on Day 2 of the BRICS Summit 2026. (Source: DD News) https://t.co/NRkO6pDWBM— ANI (@ANI) September 13, 2026డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని మోదీ అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా అనుసంధానించనున్నట్లు తెలిపారు. సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా ఉపయోగించడం ఉమ్మడి అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని హెచ్చరించారు. సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో అందరినీ భాగస్వాములను చేసే విధానానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.తొలి రోజు సమావేశాల్లో సభ్య దేశాల నేతలు ‘న్యూఢిల్లీ ప్రకటన-2026’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్‌కు మరింత పెద్ద పాత్ర కల్పించాలన్న ఆకాంక్షలకు మద్దతు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతోపాటు ఏకపక్ష ఆంక్షలు, సుంకాలు, వాణిజ్య పరిమితులపై ఆందోళన వ్యక్తం చేశారు.రెండో రోజు సమావేశాల్లో భారత్ 2026 అధ్యక్షతన నిర్దేశించిన స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పాలనలో సంస్కరణలకు సంబంధించి పది ప్రతిపాదనలు చేశారు. ప్రపంచ దక్షిణాది దేశాలు కేవలం నిబంధనలు అనుసరించే స్థాయి నుంచి వాటి రూపకల్పనలో భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ సాంకేతికతలు, వాటికి సంబంధించిన నియమాల రూపకల్పనలో సమాన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. సముద్ర రవాణా సిబ్బంది అత్యవసర సహాయానికి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin and other world leaders at Bharat Mandapam PM Modi has hosted gala dinner for global leaders and delegates here (Source: DD) https://t.co/lOlKp0W7Df— ANI (@ANI) September 12, 2026బ్రిక్స్ ప్రకటనలో పశ్చిమాసియా సంక్షోభంపై ఆందోళన వ్యక్తమైంది. పౌరులు, పౌర మౌలిక వసతుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రవాహం సజావుగా కొనసాగేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పేర్కొంది. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారమే మార్గమని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. భారత్-చైనా సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు. మరోవైపు, బ్రిక్స్ దేశాలు కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికత, డిజిటల్ మౌలిక వసతులు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించి, మూల దేశాలకు పురాతన వస్తువులు, ఆధ్యాత్మిక, చారిత్రక వస్తువులను తిరిగి అప్పగించేందుకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. -
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
-
జిన్‌పింగ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సుకు హాజరైన అగ్రనేతల గౌరవార్థం ప్రధాని మోదీ శనివారం రాత్రి ఇచ్చిన విందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకాలేదు. విందులో జిన్‌పింగ్ ఎందుకు హాజరుకాలేదనే విషయంలో అధికారికంగా ఎలాంటి కారణాలు వెల్లడికాలేదు. కానీ శిఖరాగ్ర సదస్సులో సుదీర్ఘంగా పాల్గొని అలసిపోయిన ఆయన తన హోటల్ గదికి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రధాన సమావేశానికి హాజరైన అబూదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ సైతం వెంటనే స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. దీంతో ఈయన సైతం బ్రిక్స్ గాలా డిన్నర్‌కు గైర్హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇతర బ్రిక్స్ దేశాల అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విందులో పాల్గొన్నారు. విందులో అత్యంత రుచికరమైన గుజరాతీ చిరుతిండి అయిన ఖండ్వీ మిలే ఫియులే, కుంభ్ గలౌతీ కబాబ్, పనీర్ లబాబ్దార్, గుచ్చీ మారి్మక్, క్యారెట్–బీన్ పొరియల్, చిరుధాన్యాల పులావ్‌లను వడ్డించారు. పాత ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్, జిలేబీ, షతూత్ ఫిర్నీలనూ అందించారు. -
విభేదాలు వివాదాలుగా మారొద్దు
న్యూఢిల్లీ: భారత్–చైనా సంబంధాలు మరింత బలోపేతం కావాలంటే ఇరుదేశాల సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణం నెలకొనడం అత్యవసరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత ఒప్పందాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానంగా భారత్, చైనా సంబంధాలపై చర్చించారు. వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం, బహుపాక్షిక వేదికలపై న్యాయమైన, పారదర్శక వాణిజ్యం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరువురు నేతలు పునరుద్ఘాటించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని వారు పేర్కొన్నట్లు వెల్లడించింది. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం వాణిజ్య అసమతుల్యత, సప్లై చైన్లు, మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేయడం వంటి అంశాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ, జిన్‌పింగ్ నిర్ణయానికి వచ్చారు. సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలు, ఇరుపక్షాల దీర్ఘకాలిక ప్రయోజనాల ఆధారంగా సరిహద్దు సమస్యకు న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పరస్పర సంబంధాల విషయంలో భారత్, చైనాలు పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం అనే మూడు అంశాల ఆధారంగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్ శనివారం ఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల తర్వాత ఈ సమావేశం జరిగింది. జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఉమ్మడి కార్యాచరణ మరింత విస్తృతం గత ఏడాది ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన తమ చివరి సమావేశం తర్వాత భారత్–చైనా సంబంధాల్లో సాధిస్తున్న స్థిరమైన పురోగతిని మోదీ, జిన్‌పింగ్ స్వాగతించారని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. రెండు దేశాలు తమ సంబంధాల పట్ల వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలని వారు పునరుద్ఘాటించినట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులే ప్రాతిపదికగా నిలుస్తాయని ప్రధాని మోదీ తేల్చిచెప్పారని ఉద్ఘాటించింది. సరిహద్దు సంబంధిత అంశాలపై ప్రస్తుతం అమల్లో ఒప్పందాలు, అవగాహనలను ఇరుపక్షాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారని పేర్కొంది. ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని ఇద్దరు నేతలు గుర్తించారని, రెండు దేశాల మధ్య సాంస్కృతిక మారి్పడి, వాణిజ్య సంబంధాలు, రాకపోకలను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చారని తెలిపింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో ఉమ్మడి కార్యాచరణను మరింత విస్తృతం చేయాలని మోదీ, జిన్‌పింగ్ నిర్ణయించినట్లు సమాచారం. భారత్ చేపట్టిన బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలకు చైనా అందించిన మద్దతును, కూటమి శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావడంలో చైనా చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు.భారత్, చైనాలపై పెద్ద బాధ్యత: జిన్‌పింగ్ భారత్–చైనా సంబంధాల అభివృద్ధిని బీజింగ్ ఎల్లప్పుడూ వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతోనే చూస్తోందని జిన్‌పింగ్ స్పష్టంచేశారు. మన రెండు దేశాల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నప్పటికీ మనం ఒకరికొకరు అండగా నిలుస్తూ ఉమ్మడి అభివృద్ధి మార్గంలో పయనించవచ్చని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో కీలక సభ్యులుగా భారత్, చైనాలు పెద్ద బాధ్యతలను కలిగి ఉన్నాయని వివరించారు. ఇరుపక్షాలు మానవాళి భవిష్యత్తును, తమ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సహకారాన్ని పెంపొందించుకోవడానికి, సమ్మిళిత ఆర్థిక భవిష్యత్తు దిశగా మనం కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ భారత్‌కు పిలుపునిచ్చారు. -
స్నేహగీతం..!
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో అత్యంత విశేషమైన ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన కుడివైపున రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో, ఎడమ వైపున చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చేతులు కలిపి చిరునవ్వులు చిందించారు. ముగ్గురు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తామంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నామని ప్రపంచానికి చాటిచెప్పారు. సరిహద్దు వివాదాలు, విభేదాలు ఉన్నప్పటికీ భారత్, చైనా మధ్య అనుబంధం చెక్కుచెదరలేదని మోదీ సంకేతాలిచ్చారు. శనివారం బ్రిక్స్ సదస్సు జరిగిన భారత్ మండపం వద్ద తీసిన ఈ చిత్రాన్ని ప్రధానమంత్రి ఇన్‌స్టా్రగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు ‘కింగ్డమ్ బీజీఎం’అనే పాట నేపథ్య సంగీతంగా వినిపిస్తోంది. ముగ్గురు దేశాధినేతల స్నేహగీతం సదస్సు వేదిక వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఆప్యాయతతో కూడిన ఈ క్షణం ప్రత్యేకంగా నిలిచింది. మోదీ సోషల్ మీడియాలో మరికొన్ని ఫొటోలను సైతం మోదీ పోస్ట్ చేశారు. పుతిన్, షీ జిన్‌పింగ్‌లతోపాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో దిగిన చిత్రాలున్నాయి. మరొక చిత్రంలో పుతిన్, షీ జిన్‌పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోలతో మోదీ ఉత్సాహంగా చర్చిస్తూ కనిపించారు. -
చర్చలే శరణ్యం!
న్యూఢిల్లీ: సంఘర్షణలు, సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల్లోనే శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న భారతదేశం పిలుపును బ్రిక్స్ కూటమి దేశాల అధినేతలు సమరి్థంచారు. ఈ మేరకు శనివారం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇరాన్‌తోపాటు సౌదీ అరేబియా, యూఏఈ సైతం ఆమోదం తెలిపాయి. పశ్చిమాసియా యుద్ధంపై నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి ఇరాన్, యూఏఈలు ఈ డిక్లరేషన్ విషయంలో ఒక్కటి కావడం విశేషం. భారతదేశానికి ఇది ముఖ్యమైన దౌత్యవిజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ ప్రకటనలో ఇరాన్‌పై అమెరికా దాడుల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కూడా తప్పుపట్టలేదు. గాజాలో హింసాకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తేల్చిచెప్పారు. ‘వర్తించే’అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్యం, సప్లై చైన్లు, ఇంధన సరఫరా సజావుగా కొనసాగానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని కూటమి నేతలు నొక్కిచెప్పారు. తొలుత ఇరాన్, యూఏఈలు తమ కఠిన వైఖరిని ప్రదర్శించడంతో ఈ డిక్లరేషన్ పాఠంపై చర్చలు చివరి నిమిషం వరకు కొనసాగాయి. బ్రిక్స్ అనేది ఏకాభిప్రాయం ఆధారంగా పనిచేసే కూటమి. ఏ ఒక్క సభ్య దేశం వ్యతిరేకించినా డిక్లరేషన్ ఆమోదం పొందదు. ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలు వద్దు విచక్షణారహిత సుంకాలు, నాన్–టారిఫ్ చర్యలు, సంరక్షణవాదం వంటి వాణిజ్య నిరోధక చర్యలపై బ్రిక్స్ దేశాలు తమ డిక్లరేషన్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి ప్రపంచ వాణిజ్యాన్ని మరింత తగ్గించి, సప్లై చైన్లకు అంతరాయం కలిగించి, ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను పరోక్షంగా తప్పుపట్టాయి. అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమైన ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి. బ్రిక్స్ సదస్సులో తొలి రోజు చర్చల ముగింపు సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించినట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని డిక్లరేషన్ పేర్కొంది. గరిష్ట సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేసింది. ఇతర దేశాల సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని తెలిపింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా పౌరులు, పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాలని వెల్లడించింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, భద్రత, స్థిరత్వానికి దోహదపడే దీర్ఘకాలిక అవగాహన కోసం చర్చలు, దౌత్యం ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నామని స్పష్టంచేసింది. ఉగ్రవాదులను కోర్టు ముందు నిలబెట్టాల్సిందే గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడిని బ్రిక్స్ కూటమి అత్యంత తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే సహించడానికి వీల్లేదని, ఈ ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలన్న భారత్ పిలుపునకు పూర్తి మద్దతు తెలిపింది. ఉగ్రవాద సవాలును ఎదుర్కోవడంలో సమష్టి విధానాన్ని అవలంబించడానికి కూటమి నేతలు అంగీకరించారు. ‘‘సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఆశ్రయం కల్పించడం సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం’’అని డిక్లరేషన్‌లో తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత, జాతి సమూహంతో ముడిపెట్టకూడదని ఉద్ఘాటించారు. -
రూల్స్ మనమే రూపొందించాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాలు ‘నియమాలను రూపొందించేవిగా’మారాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ప్రపంచ పాలనలో ప్రస్తుతం ఉన్న ‘విశేషాధికారాల పిరమిడ్’స్థానంలో ‘భాగస్వామ్య వేదిక’కావాలని తేల్చిచెప్పారు. రెండు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా మొదలైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బ్రిక్స్ చట్రం కింద ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 పాయింట్ల రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించారు. ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభాల వల్ల అధిక ముప్పును ఎదుర్కొంటున్న నావికుల రక్షణ కోసం ‘సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్’ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో, అబూదాబీ యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బ్రిక్స్‌కు భారత్ నేతృత్వం వహిస్తోంది. కీలకమైన ప్రపంచ సంస్థగా బ్రిక్స్ బ్రిక్స్ కూటమి ఒక కీలకమైన ప్రపంచ సంస్థగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. తీవ్రమైన ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాబోయే 20 ఏళ్లలో కూటమికి ఒక నూతన, ప్రతిష్టాత్మక ఎజెండా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్‌ను పోలి ఉందని చెప్పారు. అధికారం, నిర్ణయాధికారం పైస్థాయిలో కేంద్రీకృతమై ఉండగా, కింది స్థాయిలోని దేశాలు ఆ నిర్ణయాల ప్రభావానికి లోనవుతున్నాయి తప్ప వాటిని ప్రభావితం చేయలేకపోతున్నాయని వెల్లడించారు. నేడు ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ‘గ్లోబల్ సౌత్’ముందు వరుసలో ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉందన్నారు. అందుకే విశేషాధికారాల పిరమిడ్ స్థానంలో అన్ని దేశాలతో కూడిన భాగస్వామ్య వేదికను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికీ గళం వినిపించే అవకాశం ఉండాలన్నారు. ప్రతి ప్రయత్నానికీ మానవాళి అభివృద్ధే కేంద్ర బిందువుగా ఉండేలా చూడాలని తెలిపారు. ఉమ్మడిగా రోడ్‌మ్యాప్ మానవాళి సంక్షేమం కోసం బ్రిక్స్ కూటమి సంస్కరణ ప్రణాళికా చట్రం పరిధిలోనే ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 అంశాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను ఉమ్మడిగా రూపొందించాలని మోదీ ప్రతిపాదించారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం నాటికి ఈ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మనం మూడు కీలక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘ప్రాతినిధ్యం, స్పందించే గుణం, నియమావళి రూపకల్పన’అవసరమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని, దీనికి సంబంధించిన చర్చలను ఒక నిర్దిష్ట కాలపరిమితితో స్పష్టమైన ఫలితాల దిశగా ముందుకు తీసుకెళ్లాలని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆర్థిక సంస్థల్లో ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానాలు, విధానపరమైన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే దేశాలు ప్రపంచ ఆర్థిక పాలనను తీర్చిదిద్దడంలోనూ తగిన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రపంచ నియమాలను నిర్ణయించడంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం అత్యంత కీలకమని తేల్చిచెప్పారు. కృత్రిమ మేధస్సు, సైబర్ స్పేస్, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కీలక సాంకేతికతల వంటి రంగాలు భవిష్యత్తు అవకాశాలను తీర్చిదిద్దడమే కాకుండా, భవిష్యత్తు నియమాలను కూడా నిర్దేశిస్తున్నాయన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఇక కేవలం నియమాలను పాటించేవారి స్థాయిలో ఉండడానికి వీల్లేదన్నారు. నియమాలను రూపొందించే స్థాయికి ఎదగాలని స్పష్టంచేశారు. ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఏడాది బ్రిక్స్ 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మానవ జీవితంలో 20 ఏళ్ల వయస్సు అనేది పరిపక్వత, బాధ్యతతో కూడిన ఒక కొత్త దశకు ఆరంభమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ కూడా పరిపక్వత సాధించే దశకు చేరుకుందని, ప్రపంచ వేదికపై క ప్రత్యేక గుర్తింపును సాధించిందని అన్నారు. తాము ఇతరుల ఆకాంక్షలను గౌరవిస్తామని, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని వివరించారు. ఎవరినో వ్యతిరేకించడం ద్వారా కాకుండా అందరినీ కలుపుకొని వెళ్లడం ద్వారా పురోగతి సాధించడానికి కృషి చేస్తామన్నారు. కూటమిలో మనకున్న ఐక్యతను, ఏకాభిప్రాయాన్ని ప్రపంచ వేదికపై ప్రత్యక్ష ఫలితాలుగా మార్చుకోవాలని సూచించారు. రాబోయే 20 ఏళ్లకు సంబంధించిన బలమైన ఎజెండాపై మనం కృషి చేయాలన్నారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ అది మన సంస్థాగత పురోగతికి ఆటంకం కలిగించకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’మన ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ తీర్మానాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడం మన బాధ్యత అని ఉద్బోధించారు. 10 పాయింట్ల రోడ్‌మ్యాప్ 1. నియమాలను పాటించేవారి నుంచి నియమాలను రూపొందించేవారిగా బ్రిక్స్ ఎదగడం 2. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు 3. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం బలోపేతం 4. కూటమి అధ్యక్షులు మారినప్పటికీ నిర్ణయాలు కొనసాగింపు 5. కూటమి నిర్ణయాల అమలుపై దృష్టి 6. వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం 7. సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవడం 8. అభివృద్ధి భాగస్వామ్యాలను బలోపేతం చేయడం 9. గ్లోబల్ సౌత్‌కు మరింత ప్రాధాన్యత ఇవ్వడం 10. ప్రపంచ వేదికపై బ్రిక్స్‌ను మరింత సమర్థవంతంగా మార్చడం -
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ
ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమన్నారు. అభివృద్ధి అంశాలపైన కలిసి పని చేయాలని.. తరచుగా సమావేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాల బలోపేతం అవసరం. ఇండియా, చైనా దీర్ఘకాలిక సంబంధాలపైన దృష్టి సారించాలి. ప్రపంచశాంతికి భారత్- చైనా సంబంధాల బలోపేతం అవసరం. మన దేశాల బలబలలు అందరికీ తెలుసునని జిన్‌పింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమన్నారు. విస్తృతమైన అంశాల పైన ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న మోదీ.. బ్రిక్స్ అధ్యక్షతకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.తొలి రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఢిల్లీ డిక్లరేషన్‌ను “బ్రిక్స్” శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది. శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటన చేశాయి. యుద్ధాలు, ఘర్షణలు, సమస్యల మూలాలను పరిష్కరించాలన్న బ్రిక్స్ దేశాలు.. ఏకపక్షంగా సుంకాల విధింపు పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని బ్రిక్స్ దేశాల కూటమి పిలుపునిచ్చాయి.ఇదీ చదవండి: భారత్‌కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
బ్రిక్స్ ప్రారంభోపన్యాసంలో మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో తీసుకునే నిర్ణయాల అమలు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్నే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో భరతమండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వచ్చే 20ఏళ్ల కాలానికి అవసరమైన ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణీత గడువులోగా నిర్ణయాల అమలు కోసం వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.మోదీ మాట్లాడుతూ.. "ప్రస్తుతం గ్లోబల్ సౌత్ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ప్రజల మేలు కోసం దేశాలన్నీ కలిసి పని చేయాల్సి ఉంది ప్రపంచ పరిపాలన మరింత మెరుగుపడాల్సి ఉంది. పరస్పరం గౌరవం, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం" అని మోదీ అన్నారు. అయితే అంతకుముందు ప్రధాని మోదీ అబూదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయద్ అలీ నహియాన్‌తో హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతలు మలేషియా, ఇథీయోపియా దేశాధినేతలతో రక్షణ రంగంలో సహకారం అంశంపై చర్చలు జరిపారు.కాగా మరికోద్దిసేపట్లో సాయంత్రం 5:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా జిన్‌పింగ్ భారత్ లో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడితో ఆ దేశానికి చెందిన వ్యాపార ,అధికార ప్రతినిధి బృందంతో ఢిల్లీకి చేరుకుంది. గతంతో పోలిస్తే ఈ సారి పెద్ద మెుత్తంలో అధికార బృందం జిన్‌పింగ్‌తో ఉంది. భారత్‌తో ఆర్థిక వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని చైనా భావిస్తోన్నట్లు సమాచారం. -
ప్రపంచంలో అత్యధిక జీతం.. ఈ ప్రధానిదే!
సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్ వార్షిక వేతన ప్యాకేజీ భారీగా పెరగనుంది. జీతం, బోనస్‌లతో కలిపి ప్రస్తుతం ఉన్న 2.2 మిలియన్ సింగపూర్ డాలర్ల వార్షిక ప్యాకేజీ 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరనుంది. సవరించిన వేతన విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ప్రభుత్వాధినేతగా వాంగ్ స్థానమూ మరింత బలపడనుంది.ప్రజా సేవల వేతనాలపై స్వతంత్ర సమీక్ష కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరించినట్లు వాంగ్ తెలిపారు. అయితే రాజకీయ నాయకుల జీతాలను పెంచడం సింగపూర్‌లో సున్నితమైన అంశంగా కొనసాగుతోంది. అధిక వేతనాలపై దేశంలో చాలాకాలంగా చర్చ, విమర్శలు ఉన్నాయి.తనకు పెరగనున్న వేతనంలో అదనపు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు. తాను ప్రధాన మంత్రిగా కొనసాగినంతకాలం, రానున్న ఐదేళ్లలో వేతన పెంపు ద్వారా లభించే అదనపు మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు అందజేస్తానని చెప్పారు.పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడిన వాంగ్.. రాజకీయంగా క్లిష్టమైన అంశం అయినప్పటికీ దీనిని విస్మరించలేమన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన నాణ్యమైన రాజకీయ నాయకత్వాన్ని కొనసాగించడమే అసలు లక్ష్యమని పేర్కొన్నారు.మంత్రులు, ఉప ప్రధానికీ భారీ పెంపుకొత్త వేతన విధానంతో సింగపూర్ ఉప ప్రధాని, మంత్రుల జీతాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ఉప ప్రధాని వార్షిక వేతన ప్యాకేజీ 1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి దాదాపు 3 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరనుంది. క్యాబినెట్ మంత్రులకు వారి సీనియారిటీ, బాధ్యతలను బట్టి 1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 2.8 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు వార్షిక ప్యాకేజీ లభించనుంది. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వారికి కూడా వేతనం సుమారు 1.1 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 1.2 మిలియన్ సింగపూర్ డాలర్లకు పెరగవచ్చు.రాజకీయ నాయకుల వేతనాలను నిర్ణయించేందుకు సింగపూర్ ప్రభుత్వం దేశంలోని అత్యధికంగా సంపాదించే 1,000 మంది వ్యక్తుల ఆదాయ స్థాయిలను ఒక బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తుంది. ప్రైవేట్ రంగం, సివిల్ సర్వీసుల్లో వేతనాలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకుల వేతనాలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని వాంగ్ తెలిపారు.ప్రతిభను ఆకర్షించడమే లక్ష్యంరాజకీయ నాయకులకు అధిక వేతనాలు చెల్లించడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడం, అవినీతి ప్రమాదాన్ని తగ్గించడం అని సింగపూర్ ప్రభుత్వం చెబుతోంది. అయితే అధిక వేతనాల వల్ల ప్రజలు–రాజకీయ నాయకుల మధ్య ఆదాయ వ్యత్యాసం పెరుగుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి.సింగపూర్ 2012లో మంత్రివర్గ వేతనాలను భారీగా సవరించింది. అప్పట్లో ప్రజల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో రాజకీయ నాయకుల వేతనాలను 36 శాతం వరకు తగ్గించారు. 2017లో మరోసారి సమీక్ష చేపట్టినప్పటికీ అప్పట్లో వేతనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు.ఇతర దేశాల నేతలతో పోలిస్తే..వాంగ్ కొత్త వార్షిక వేతన ప్యాకేజీ ప్రపంచంలోని పలువురు దేశాధినేతలతో పోలిస్తే చాలా ఎక్కువ. అమెరికా అధ్యక్షుడి వార్షిక అధికారిక వేతనం 4 లక్షల డాలర్లు కాగా, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వేతనం కూడా సింగపూర్ ప్రధాని ప్యాకేజీతో పోలిస్తే చాలా తక్కువ. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ వార్షిక వేతన ప్యాకేజీ సుమారు 7.19 లక్షల డాలర్లుగా ఉంది.భారత ప్రధాని మోదీ వేతనం ఎంతంటే?సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కొత్త వార్షిక వేతన ప్యాకేజీతో పోలిస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీకి లభించే వేతనం చాలా తక్కువ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం భారత ప్రధానికి నెలకు సుమారు రూ.1.66 లక్షల వేతనం, అలవెన్సులు లభిస్తాయి. ఇందులో ప్రాథమిక వేతనం, నియోజకవర్గ భత్యం, రోజువారీ భత్యం, సమ్ప్చువరీ అలవెన్స్ వంటి అంశాలు ఉంటాయి. ఈ లెక్కన నగదు వేతనం, అలవెన్సులు కలిపి ఏడాదికి సుమారు రూ.19.2 లక్షలు అవుతాయి. అయితే ప్రధాని అధికారిక నివాసం, భద్రత, అధికారిక ప్రయాణం, సిబ్బంది వంటి ప్రభుత్వ సౌకర్యాలు వేరుగా ఉంటాయి.ఇదీ చదవండి: భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే! -
అడ్డంకులు అధిగమించి ముందడుగు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం అంతరాయాలు లేకుండా కొనసాగాలంటే నౌకాయాన స్వేచ్ఛ, సురక్షిత సముద్ర మార్గాలు, నావికుల భద్రత అత్యవసరమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పెరుగుతున్న ఆర్థిక బలాన్ని భారీ పెట్టుబడులుగా, నూతన వ్యాపార సంబంధాలుగా మార్చుకోవాలని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. 10 ప్రధాన వాణిజ్య అవరోధాలను గుర్తించి తొలగించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం 100 బ్రిక్స్ స్టార్టప్‌లను ఇతర సభ్య దేశాల మార్కెట్లలోకి విస్తరించాలని, అలాగే ఏటా 1,000 కొత్త వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై మన పురోగతిని ప్రతి ఏటా సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన అడ్డంకులు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తూ మన ఆర్థిక శక్తిని నూతన వ్యాపార అవకాశాలుగా మార్చుకోవాలని స్పష్టంచేశారు. నౌకాయాన స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారత్ మద్దతిస్తోందని తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో 40 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు వృద్ధి చెందగా, బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ మాత్రం నాలుగున్నర రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ప్రపంచ వ్యాపారాలకు భారతదేశం చేసే ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సాంకేతికతలను ప్రధానాంశంగా మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాల వేగవంతమైన విస్తరణతోపాటు నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ రంగాల్లో నూతన సామర్థ్యాలను ప్రస్తావించారు. ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ వరల్డ్’అన్నారు. ప్రపంచ మార్కెట్లకు భారత్ ఒక తయారీ కేంద్రంగా, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత లోతైన సహకారం కోసం భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. బ్రిక్స్ దేశాలు తమ సొంత మార్కెట్లకు అనువైన డిజిటల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశ అనుభవాన్ని వాడుకోవచ్చని అన్నారు. ఇండియాలో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు, 120కి పైగా యూనికార్న్‌లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సహాయపడాలని కోరారు. వాణిజ్య అనుసంధానం అనేది మరో ప్రధాన అంశమని చెప్పారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, వ్యాపార అవకాశాలను విస్తరించడంపై బ్రిక్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి చెప్పారు. -
ఐరాస చీఫ్ గుటేరస్‌తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్‌తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, నౌకాయాన స్వేచ్ఛ, సుస్థిరాభివృద్ధి, మానవ కేంద్రీకృత కృత్రిమ మేధ(ఏఐ), ప్రపంచ ఆహార భద్రత వంటి పలు అంశాలపై చర్చించారు. బహుళ ధ్రువత్వం ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారు. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ నాలుగోసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆంటోనియా గుటేరస్ అభినందనలు తెలియజేశారు. గుటేరస్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని మోదీ ఎక్స్‌లో పోస్టుచేశారు. భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ కార్యకలాపాలు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలపై చర్చించానని పేర్కొన్నారు. -
దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోండి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభాన్ని చర్చలు, దౌత్య మార్గాల్లో ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు సూచించారు. శుక్రవారం ఇరువురు నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, ఇరాన్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొడానికి పెజెష్కియాన్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే ఈ భేటీ జరగింది. పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపైమోదీ, పెజెష్కియాన్ చర్చించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారతదేశ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడం, నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్య కార్యకలాపాలు, నావికుల భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించడం కోసం కృషి అవసరమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్ప టికీ బ్రిక్స్ సమావేశాల్లో ఇరాన్ భాగస్వామ్యం వహిస్తున్నందుకు పెజెష్కియాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఘర్షణను నివారించడానికి సహకరించాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు కోరారు. -
2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా సంఘర్షణను ముగించడానికి చేపట్టే ఏ శాంతి ప్రయత్నానికైనా మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నల్ల సముద్రంలోని భారతీయ నావికుల తగిన భద్రతకు కల్పింంచాలని రష్యా అధినేత పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అస్థిరత నేపథ్యంలో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం భారత్ మండపంలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. 45 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. భారత్, రష్యా సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను సైతం సమీక్షించారు. ప్రస్తుతం 65 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఈ సందర్భంగా భారత్, రష్యాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్–రష్యా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో వేగం పెంచాలని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించింది. రెండు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర చర్చల కోసం రష్యాలో పర్యటించాలన్న పుతిన్ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారని తెలియజేసింది. చర్చలు, దౌత్యమే సరైన మార్గం రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, పౌర అణు శక్తి, ఎరువుల సరఫరా, ప్రజల మధ్య పరస్పర సంబంధాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలో సముద్ర వాణిజ్యం, భారతీయ నావికుల భద్రత సహా ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్య బదిలీ సహా ప్రజల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణ త్వరగా ముగిసిపోవాలని మోదీ ఆకాంక్షించినట్లు సమాచారం. సంఘర్షణల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని పుతిన్ దృష్టికి మరోసారి తీసుకెళ్లినట్లు తెలిసింది. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా సహకరిస్తుందని మోదీ అన్నారు. రష్యా మార్కెట్లో అవకాశాలు ఇప్పటికే బలంగా ఉన్న తమ రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడంపైనా ఇరుపక్షాలు లోతుగా చర్చించాయి. ఇంధన రంగంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకరించాయి. అంతేకాకుండా పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడం, రైలు, సొరంగ మార్గాల నిర్మాణాల్లో కలిసి పనిచేయడం, ఉక్కు సప్లై చైన్లను అభివృద్ధి చేయడం, భారతీయ ఎగుమతిదారులకు రష్యా మార్కెట్లో అవకాశాలను పెంచడం వంటి అంశాలు కూడా ఈ చర్చల్లో చోటుచేసుకున్నాయి. మోదీ, పుతిన్ కలుసుకోవడం 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత్ మండపంలో బిజినెస్ ఫోరమ్ వేదిక వద్దకు చేరుకోవడానికి మోదీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. అంతకుముందు వారిద్దరూ భారత్ మండపంలో ‘ఇన్నోప్రోమ్ ఇండియా’ప్రదర్శనను సందర్శించారు. అందులో పాల్గొన్న వారితో సంభాషించారు. పరస్పర సహకారంపై చర్చించా: మోదీ మౌలిక సదుపాయాలు, ఇంధనం, సాంకేతికత, రక్షణ, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పర సహకారంపై పుతిన్‌తో చర్చించానని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘ఆర్థిక సహకార కార్యక్రమం–2030’అమలు సహా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తాము చర్చించినట్లు పేర్కొన్నారు. పుతిన్‌కు ‘తిరుక్కురళ్’బహూకరణ ప్రఖ్యాత తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన ప్రాచీన తమిళ కావ్య సంకలనం ‘తిరుక్కురళ్’రష్యన్ అనువాద గ్రంథాన్ని ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్‌కు బహూకరించారు. అనేక అంశాలపై జ్ఞానోపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. భాషలు, సరిహద్దులకు అతీతంగా శాశ్వత జ్ఞానాన్ని అందించే తిరుక్కురళ్ రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు అందజేశానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పుతిన్‌తో ఆప్యాయంగా కరచాలనం చేసిన దృశ్యాలతో కూడిన ఒక చిన్న వీడియో క్లిప్‌ను కూడా షేర్చేశారు. -
సమష్టి స్వరం సాధ్యమేనా!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా లడాయి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలు వగైరాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని ఊపిరాడకుండా చేస్తున్న తరుణంలో న్యూఢిల్లీలో శని, ఆదివారాల్లో బ్రిక్స్ దేశాల 18వ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాగా... చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్ శనివారం చేరుకుంటారు. ఆయన ఏడేళ్ల తర్వాత మన దేశం వస్తున్నారు. ఇక ఇరాన్ అధ్యక్షుడొకరు భారత్‌కొచ్చి ఎనిమిదేళ్లవుతుండగా, పెజెష్కియాన్ అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ ద్వైపాక్షిక సమావేశం జరగటం,ఆ వెంటనే పెజెష్కియాన్ కూడా ఆయనతో ద్వైపాక్షిక భేటీ కావటంతో పాటు, తదనంతరం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశంలో కూడా పాలుపంచుకోవటంతో దౌత్య సందడి ముందే మొదలైనట్టయింది. ఆవిర్భవించిననాడు బ్రిక్స్వి బుడి బుడి అడుగులే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాల విదేశాంగమంత్రులు 2006లో తొలిసారి సమావేశమై కూటమిగా ఏర్పడాలని నిర్ణయించారు. 2009లో తొలి శిఖరాగ్ర సమావేశం జరిగింది. దక్షిణాఫ్రికా 2011లో చేరాక చివరిలో ‘ఎస్’ చేరి బ్రిక్స్ అయింది. అటుపై వరసగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండొనేసియాలు వేర్వేరు సంవత్సరాల్లో చేతులు కలిపాయి. మొత్తంగా ఇది 20 దేశాల కూటమిగా రూపొందింది. ప్రపంచ జనాభాలో బ్రిక్స్ దేశాల వాటా 49.5 శాతం. ప్రపంచంలోని నాలుగోవంతు భూభాగం దీని సొంతం. ప్రపంచ జీడీపీలో దాదాపు 30 శాతం వాటా. వాణిజ్య ఎగుమతుల్లో 21.6 శాతం, దిగుమతుల్లో 17.3 శాతం వాటా ఈ దేశాలదే. ప్రపంచ ఇంధన ఉత్పత్తిలో బ్రిక్స్ వాటా 40 శాతం. కొనుగోలు శక్తిలో జీ7 దేశాలకన్నా బ్రిక్స్ దేశాలదే అధికం. ప్రపంచ బ్యాంకుకు ప్రత్యా మ్నాయంగా పేద దేశాలకు తోడ్పడే సుస్థిర పట్టణాభివృద్ధి ప్రణాళిక, మౌలిక సదుపాయా లపై సూచనలివ్వటం, వాటి వ్యయానికి నిధులు సమకూర్చటం తదితరాలను చైనాలోని షాంఘైలో ప్రధాన కార్యాలయం ఉన్న బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవెలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) చూస్తోంది. సభ్యదేశాల జాతీయ కరెన్సీల్లో వాణిజ్యం నెరపుతూ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం, చెల్లింపులకోసం స్విఫ్ట్ వంటి పేమెంట్ విధానంలోకాక ‘బ్రిక్స్ పే’ ద్వారా లావాదేవీలు జరపటం ఇప్పటికే మొదలయ్యాయి. ఇన్నివిధాల సహాయ సహకారాలు కొనసాగే బ్రిక్స్ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా అనే సంశయం చాలా మందికి ఉంది. ఎందుకంటే ఈ కూటమిలోని దేశాలే వేరే కూటముల్లో ఉన్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ అమెరికా కనుసన్నల్లో నడుస్తాయి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు సహకరిస్తూ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు సరేసరి. అయితే ఆగిపోవటం కన్నా అడుగు ముందుకేయటమే అందరికీ ప్రయోజనకరం. కలిసి పనిచేసే సంస్కృతి పెంపొందటంవల్ల అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. దగ్గరయ్యేందుకు వీలుంటుంది. సమష్టి కార్యా చరణ అవసరమైన రంగాలు చాలానే ఉన్నాయి. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఐక్యరాజ్యసమితిని బహుళ ప్రాతినిధ్య సంస్థగా చేయాలన్న డిమాండ్ వగైరాల్లో ఈ దేశాలు సమష్టిగా పనిచేయొచ్చు. వాతావరణం, విద్య, ఇంధనం, డిజిటల్ పేమెంట్ వేదికలు వగైరాల్లో సహకరించుకోవచ్చు. అలాగని కల్లోల కాలంలో కూటములు మనుగడ అంత సులభమేమీ కాదు. తమపై అమెరికా ప్రకటించిన దురాక్రమణ యుద్ధాన్ని బ్రిక్స్ ఖండించాలని ఇరాన్ బలంగా కోరుకుంటోంది. అదే సమయంలో తమపై ఇరాన్ సాగిస్తున్న దాడుల్ని కూడా వ్యతిరేకించాలని సౌదీ, యూఏఈ ఆశిస్తాయి. అందుకే బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన అంత సులభమేమీ కాదు. ఇటీవల బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేరుగా అమెరికానూ, ఇజ్రాయెల్‌నూ ప్రస్తావించకుండా ఇరాన్‌పై దాడిని ఖండించింది. అక్కడైతే సౌదీ, యూఏఈ సభ్యదేశాలు కాదు. ఇక్కడ పరిస్థితి వేరు. ఈ సమస్యను బ్రిక్స్ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాల్సివుంది. ఆ దేశాలకూ, ఇరాన్‌కూ మధ్య ఏదోమేర సామరస్యం సాధించగలిగితే, సమష్టి స్వరం వినిపించగలిగితే బ్రిక్స్ బలం మరింత పెరుగుతుంది. -
ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదే: మోదీ
ఢిల్లీ: ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ఆయన ప్రసంగిస్తూ.. బ్రిక్స్ 4 దేశాలతో మొదలై 21 దేశాలకు చేరిందన్నారు. ప్రపంచ జనాభాలో 50 శాతం బ్రిక్స్ దేశాలదే. బ్రిక్స్ కూటమి ప్రపంచంలో సగం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కారం చూపిస్తుందన్నారు.బ్రిక్స్ జీడీపీ 4.5 శాతం పెరిగింది. సుస్థిరాభివృద్ధి, సహకారం, ఇన్నోవేషన్స్‌కి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. రోడ్డు, రైళ్లు, ఎయిర్‌పోర్టుల వంటి మౌలిక సదుపాయాల్లో భారత్ వేగంగా విస్తరిస్తోందని మోదీ అన్నారు. -
‘ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపండి’.. పుతిన్‌తో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధాన్ని తక్షణమే ఆపి, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ తన వంతు సహాయసహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా ఇరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యన్ భాషలోకి అనువదించిన ప్రముఖ తమిళ ప్రాచీన కావ్యమైన ‘తిరుక్కురళ్’ ప్రతిని పుతిన్‌కు ప్రత్యేక బహుమతిగా అందజేశారు. దాదాపు రెండు వేల ఏళ్ల నాటి ఈ గ్రంథంలోని మానవతా విలువలను మోదీ ఈ సందర్భంగా పుతిన్‌కు వివరించారు.రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాల బలోపేతంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.రష్యాలో జరగబోయే 24వ ఇండో-రష్యా వార్షిక శిఖరాగ్ర సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ఆహ్వానించగా.. ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన తుది తేదీలను దౌత్య అధికారులు త్వరలోనే ఖరారు చేయనున్నారు.👉ఇదీ చదవండి: ప్రధాని మోదీతో పుతిన్ భేటీ -
ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. భారత్ మండపంలో ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ భేటీ అయ్యారు. భారత్, రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిపారు. కీలక రక్షణ ఒప్పందాలు, వ్యాపారం, వాణిజ్యం, భద్రత, ఎల్ఎన్జీ దిగుమతి, అధునాతన యుద్ధ విమానాల తయారీ సాంకేతికత బదిలీ తదితర అంశాలపై చర్చించారు. రెండు నెలల్లోనే రెండోసారి ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్‌కు మోదీ కానుకద్వైపాక్షిక భేటీలో పుతిన్‌కు రష్యన్ భాషలో అనువదించిన ఓ పుస్తకాన్ని ప్రధాని మోదీ కానుకగా అందించారు. తమిళ కవి తిరువళ్లువరు రచించిన ‘తిరుక్కురళ్’ పుస్తకాన్ని అందజేశారు. పుతిన్ మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. కాగా, బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ నిర్ధారించింది.జిన్‌పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్‌ను సైతం షేర్ చేశారు.ఇదీ చదవండి:బ్రిక్స్‌తో మనకు లాభాలున్నాయండోయ్..! -
జిన్‌పింగ్ భారత్ పర్యటనపై సస్పెన్స్.. చైనా వ్యూహం ఇదేనా?
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు బీజింగ్ చివరి నిమిషంలో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ మోదీ-జిన్‌పింగ్ భేటీపై పడింది. అసలు ఇంత కీలకమైన పర్యటనను చైనా చివరి వరకు ఎందుకు సస్పెన్స్‌లో పెట్టింది? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.2019లో మహాబలిపురం అనధికారిక సమావేశం తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. గాల్వాన్ ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు ఇటీవల క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, జిన్‌పింగ్ పర్యటనకు కేవలం 48 గంటల ముందే అధికారిక ప్రకటన రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.చివరి నిమిషం వరకు ఎందుకు?జిన్‌పింగ్ పర్యటనను ఆలస్యంగా ప్రకటించడం వెనుక ఎలాంటి అనిశ్చితి లేదని.. ఇది చైనా అనుసరించే దౌత్య వ్యూహంలో భాగమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సదస్సుకు ముందు జరిగే చర్చల్లో తనకు గరిష్ఠ స్థాయి వెసులుబాటు ఉండేలా బీజింగ్ వ్యవహరించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్, సదస్సు అజెండా, మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ వంటి కీలక అంశాలపై చివరి వరకు చర్చలు కొనసాగించేందుకు ఈ సస్పెన్స్ చైనాకు ఉపయోగపడిందనే విశ్లేషణలు ఉన్నాయి.NOW:🇨🇳🤝🇮🇳 Chinese President Xi Jinping is coming to India for the first time post Covid for BRICS summit. pic.twitter.com/8CkwJ8MeLu— RealWestern (@RealWestern2003) September 11, 2026భేటీలో ఏం జరుగుతుంది?అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మోదీ-జిన్‌పింగ్ భేటీలో సరిహద్దు పరిస్థితి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గాల్వాన్ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోలేదు. దీంతో ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఇచ్చే సంకేతాలు అత్యంత కీలకం కానున్నాయి.బ్రిక్స్ వేదికగా చైనా మరో వ్యూహంబ్రిక్స్లో ఇప్పుడు 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్‌లో తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా కీలక దేశాల నేతలు పాల్గొంటున్న నేపథ్యంలో జిన్‌పింగ్ హాజరు చైనా దౌత్యానికి కూడా కీలకమే. అందుకే చివరి నిమిషం వరకు సస్పెన్స్.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది. జిన్‌పింగ్ భారత్ పర్యటన వెనుక అసలు ఫోకస్ బ్రిక్స్ సదస్సేనా? లేక మోదీతో కీలక ద్వైపాక్షిక డీల్‌కు రంగం సిద్ధమైందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్ -
#80sTrend: హద్దులు దాటిన మీమ్ వార్
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. కానీ ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘మీమ్ వార్’ మరో స్థాయికి చేరింది. తాజాగా రెట్రో ట్రెండ్ ఏఐ ద్వారా దేశాన్ని ఊపేస్తోంది. తమ ఫొటోలను 70, 80 కాలం నాటి ఫొటోల్లా మార్చేసుకుని మురిసిపోతున్నారు చాలామంది. అయితే ఈ ట్రెండ్ వెనుక సైబర్ నేరాలకు అవకాశం ఉందనే హెచ్చరికలూ జారీ చేస్తున్నారు నిపుణులు. ఆ సంగతి పక్కన పెడితే.. పొలిటికల్‌గా ఇది మరో టర్న్ తీసుకుంది. ఒక పార్టీ పాతకాలం నాటి ఫొటోతో సెటైర్ వేస్తే.. మరో పార్టీ దానికి అంతకుమించిన వ్యంగ్య చిత్రంతో కౌంటర్ ఇచ్చింది. చివరకు ఈ పోస్టుల వ్యవహారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ టార్గెట్ చేసే వరకు వెళ్లింది. దీంతో ఇరు పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.కాంగ్రెస్ పోస్టుతో మొదలు..ఈ వివాదానికి కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చేసిన ఓ పోస్టు కారణమైంది. ‘1980ల నాటి గుజరాత్ వీధి’ అంటూ ఓ చిత్రాన్ని పోస్టు చేసింది. దీన్ని బీజేపీ తెలంగాణ కౌంటర్ చేసింది. 1970ల నాటి తరహాలో ఉన్న ఓ మహిళ బార్ కౌంటర్‌పై డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ‘లుసియానా, ఇటలీ’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసింది. ఇక్కడితో ఆగని బీజేపీ కేరళ విభాగం మరో బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. పాతకాలం నాటి రాజకీయ పార్టీ కార్యాలయాన్ని తలపించేలా ఉన్న ఈ చిత్రంతో కాంగ్రెస్‌పై సెటైర్ వేసింది.అయితే ‘లుసియానా’ ప్రస్తావనతో పాటు వరుస పోస్టులను పరిశీలించిన పలువురు.. ఈ వ్యంగ్యానికి అసలు లక్ష్యం సోనియా గాంధీనేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఇటలీలోని లుసియానాలో జన్మించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ గుజరాత్ ఖాతా నుంచి చేసిన ఓ పోస్టును తర్వాత తొలగించినట్లు సమాచారం. దీంతో వివాదం మరింత ముదిరింది.దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ పేజీలు గుజరాత్ గజదొంగ, చాయ్ పేరిట రైల్వే స్టేషన్లో చోరుడు, మొసలిని పట్టుకున్న మొనగాడు అంటూ రెట్రో స్టైల్లోనే పలు పోస్టులు చేసింది. దీంతో ఇది నరేంద్ర మోదీని ఉద్దేశించేనంటూ బీజేపీ భగ్గుమంది. ఇలా ఇరు పార్టీలు ఈ ట్రెండ్‌ను తమ మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు వేదికగా మార్చేశాయి.రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంపోస్టులపై ఇరు పార్టీల మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు. బీజేపీ పోస్టుల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిని వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వాన్ని కించపర్చడంగా అభివర్ణించాయి. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సైతం ఈ విషయంలో బీజేపీపై మండిపడ్డారు. అయితే బీజేపీ మద్దతుదారులు తమ పోస్టులను రాజకీయ వ్యంగ్యంగా సమర్థిస్తూ.. ప్రత్యర్థి పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో కొందరు మాత్రం ‘రెండు పార్టీలు బురదలో కొట్టుకుంటున్నట్లుగా ఉంది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రాజకీయ అంశాలపై చర్చించాల్సిన సోషల్ మీడియా వేదికలు.. ఇలా పాత ఫొటోలు, మీమ్స్, వ్యక్తిగత విమర్శలకు వేదికలుగా మారడంపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.వైరల్ ట్రెండ్.. రాజకీయ పోరుకు ఆయుధంఇటీవల సోషల్ మీడియాలో పాతకాలం నాటి ఫొటోలు, మీమ్స్‌ను కొత్త క్యాప్షన్లతో వైరల్ చేయడం ట్రెండ్‌గా మారింది. రాజకీయ పార్టీలు కూడా ఇదే ట్రెండ్‌ను తమ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. ఈ ఘటనలోనూ ఓ పార్టీ పోస్టుకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడంతో మొదలైన వ్యవహారం.. చివరకు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. దీంతో రాజకీయాల్లో సోషల్ మీడియా మీమ్ సంస్కృతి ఎంతగా ప్రభావం చూపుతోందన్న చర్చ మరోసారి మొదలైంది.ఇదీ చదవండి: కోతులు అలా చేయడానికి మనమే కారణమా? -
భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలుపుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.President Putin arrives in New Delhi:Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.(3:54 am, Delhi time)NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్‌కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్‌లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్పింగ్పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్‌కు సవాల్ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్‌గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యంబ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.రెండు రోజులపాటు కీలక భేటీలుభారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్‌తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్ -
‘ఇస్రో’తో ప్రపంచానికి లబ్ధి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండే సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పారదర్శకత, సమగ్రతతో కూడిన శాస్త్రీయ సమాచారం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలని స్పష్టంచేశారు. గురువారం ఫ్రాన్స్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాంకేతికతలు, భాగస్వామ్యాలు భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నాయని వెల్లడించారు. సువిశాల అంతరిక్షం శతాబ్దాలుగా ప్రజల ఊహాశక్తిని ప్రేరేపిస్తూనే ఉందని తెలిపారు. వాతావరణం, పంటల నుంచి సముద్రాలు, సమాజాల వరకు భూమిపై జీవనాన్ని అంతరిక్షమే నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. అంతరిక్షం ఇవ్వగల శక్తి అనంతమైనదని వ్యాఖ్యానించారు. అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఘర్షణకు బదులుగా సహకారం, స్వల్పకాలిక లాభానికి బదులుగా సుస్థిరత అవసరమని అన్నారు. భారతదేశ విధానం వసుధైక కుటుంబం(ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు) అనే భావనలో ఇమిడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూగోళం దాటి విస్తరించాలని మోదీ ఆకాంక్షించారు. అంతరిక్షంలోకి 34 దేశాల ఉపగ్రహాలు భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఇస్రో’తన అత్యుత్తమ పనితీరు, తక్కువ వ్యయంతో కూడిన ప్రయోగాల ద్వారా ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇస్రో సామర్థ్యాలు రైతులకు, మత్స్యకారులకు, వాతావరణ అంచనాకు, విపత్తు నిర్వహణకు, నౌకాయానానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలు భారతీయ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లాయని తెలిపారు. ఇస్రోతో ఎన్నో దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని వివరించారు. ఈ విజయం వెనుక భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు తరాల తరబడి సాగించిన అంకితభావం, కృషి ఉన్నాయని ఉద్ఘాటించారు. వారు పగలు రాత్రి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఇస్రోకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టారని కొనియాడారు. అంతరిక్షయాన దేశాల సరసన భారతదేశానికి గరి్వంచదగిన స్థానాన్ని కల్పించారని ప్రశంసించారు. 2040 నాటికిచంద్రుడిపైకి భారతీయుడు చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఆదిత్య–ఎల్1 మిషన్ సూర్యుడి రహస్యాలను వెలికితీస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చాడని గుర్తుచేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. వీటి ప్రయోజనాలు మొత్తం మానవాళికి అందాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టంచేశారు. భారత్‌లో ఇస్రోతోపాటు ప్రైవేట్ అంతరిక్ష రంగం కూడా పురోగమిస్తోందని అన్నారు. ఇస్రో సాధించిన అత్యుత్తమ నైపుణ్యానికి పారిశ్రామిక ఉత్సాహం తోడవుతోందని తెలియజేశారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో ఫ్రాన్స్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతోందని తెలిపారు. భారతదేశపు తదుపరి అంతరిక్ష ప్రస్థానంలో భాగస్వాములుగా చేరాలని ఫ్రాన్స్‌ను, ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సుకు తనను ఆహ్వానించినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్త మానవాళి కోసం, భావి తరాల కోసం మనమంతా కలిసి అంతరిక్షాన్ని అన్వేషిద్దామని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు చేద్దామని, అంతరిక్షాన్ని పరిరక్షించుకుందామని సూచించారు. -
ప్రధాని మోదీతో ప్రిన్స్ ఆగా ఖాన్ భేటీ
న్యూఢిల్లీ: ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్ ప్రిన్స్ రహీం ఆగా ఖాన్–5 గురువారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్(ఏకేడీఎన్)తో భారత్ భాగస్వామ్యంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మోదీ ఎక్స్‌లో.. ప్రిన్స్ రహీం ఆగా ఖాన్‌ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన తండ్రి, దివంగత ఆగా ఖాన్–4 జ్ఞాపకాలను, భారత్ అభివృద్ధి కోసం ఆయన అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నాం. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారిత వంటి రంగాల్లో ఏకేడీఎన్‌తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు గల మార్గాలపై చర్చించాం’అని పేర్కొన్నారు. భారత్ సమ్మిళిత వృద్ధి, సామాజిక పురోగతికి ఏకేడీఎన్ కట్టుబడి ఉందని ఆగా ఖాన్ పునరుద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానంపై పర్యటనకు వచ్చిన ఆగాఖాన్ ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు భారత్‌లో ఉంటారు. ఏకేడీఎన్ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను ఆగా ఖాన్ సందర్శించనున్నారు. ఇస్మాయిలీ వర్గం 50వ ఇమామ్‌గా గతేడాది బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. -
స్పేస్ పరిశోధనల్లో భారత్‌తో చేతులు కలపండి.. ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ : అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్ పరిశోధనల్లో భారత్‌కు సహ ప్రయాణికులుగా మారాలని ఫ్రాన్స్,ఇతర దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును (ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్) ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భూమిపై మానవ జీవితానికి అంతరిక్షం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాలుగా అంతరిక్షం మానవ ఊహాశక్తిని ప్రేరేపిస్తోందని, నేడు అది వాతావరణం, వ్యవసాయం, సముద్రాలు, సమాజాల అభివృద్ధిని ప్రభావితం చేస్తోందని తెలిపారు.అంతరిక్ష కక్ష్యలు రద్దీగా మారుతున్న తరుణంలో.. ఘర్షణల కంటే సహకారానికి, స్వల్పకాలిక లాభాల కంటే సుస్థిరతకు, మినహాయింపుల కంటే సమ్మిళిత విధానానికి మన ఎంపికలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని స్పష్టం చేశారు. 1960ల నుంచి భారత్, ఫ్రాన్స్‌లు అంతరిక్ష రంగంలో నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతికతను అందించడంలో ఇస్రో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ప్రశంసించారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలను భారతీయ రాకెట్లు అంతరిక్షంలోకి విజయవంతంగా చేరవేశాయని తెలిపారు.రైతులు, మత్స్యకారులకు సహాయం చేయడం నుంచి వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ, నావిగేషన్ వరకు ఇస్రో సాంకేతికతలు కేవలం భారత్‌కే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలు, చర్చలు, సహకారంతో సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగాన్ని రూపొందించడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. -
12న మోదీ-జిన్‌పింగ్ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సెప్టెంబరు 12న న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా భేటీ జరిగే అవకాశముంది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖిగా ద్వైపాక్షిక చర్చలు జరపడం ఇదే తొలిసారి కానుంది. అయితే ఈ భేటీపై భారత్, చైనా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబరు 12, 13 తేదీల్లో భారత్ ఆతిథ్యంలో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు జిన్‌పింగ్ శనివారం న్యూఢిల్లీకి రానున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవల కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో మోదీ, జిన్‌పింగ్ కలుసుకుని కరచాలనం చేసినప్పటికీ, అధికారిక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించలేదు.జిన్‌పింగ్ పర్యటనకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం కూడా జరిగింది. అనంతరం సరిహద్దు అంశంపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు చర్చించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పలు ఘర్షణ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణతో సంబంధాల్లో క్రమంగా స్థిరత్వం కనిపిస్తోంది.2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. చైనా తన నలుగురు సైనికులు మరణించినట్లు తర్వాత వెల్లడించింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్ఠంభన, రాజకీయ, ఆర్థిక, దౌత్య సంబంధాల్లో తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. సైనిక, దౌత్య చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ విస్తృత సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.అరుణాచల్‌ప్రదేశ్ అంశం కూడా ఇరు దేశాల మధ్య కీలక వివాదంగా కొనసాగుతోంది. మొత్తం అరుణాచల్‌ను చైనా ‘జాంగ్నాన్’ లేదా దక్షిణ టిబెట్‌గా పేర్కొంటూ హక్కు కోరుతోంది. భారత్ ఆ వాదనను తిరస్కరిస్తూ అరుణాచల్‌ప్రదేశ్ దేశంలో అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. ఇటీవల అప్పర్ సుబన్సిరి ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు, దూకుడు వైఖరిపై వచ్చిన నివేదికలు ఆందోళన పెంచాయి.మోదీ-జిన్‌పింగ్ భేటీలో సరిహద్దు సమస్య, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు, ఎల్ఏసీ వెంబడి మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు చర్చకు వచ్చే అవకాశముంది. బ్రిక్స్ సహా బహుపాక్షిక వేదికల్లో సహకారం పెంపుపైనా ఇరువురు నేతలు దృష్టి సారించే అవకాశం ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో రెండు రైల్వే ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) దేశవ్యాప్తంగా రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 17 జిల్లాల మీదుగా ఐదు ప్రాజెక్టులు నిర్మించనున్నారు.ఇందులో భాగంగా ఏపీ పరిధిలో రేణిగుంట–అరక్కోణం మార్గంలో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైను పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పనులను 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రూపొందించారు. తద్వారా ప్రజల రాకపోకలతో పాటు సరుకు రవాణా అత్యంత సులభతరం కానుంది. పనులు పూర్తయితే రైల్వే నెట్వర్క్ సామర్థ్యం పెరిగి రైళ్ల రద్దీ తగ్గుతుంది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు మహర్దశ ఈ రైల్వే లైన్ల విస్తరణ పనులతో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఏపీలోని తిరుపతి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాలకు, తెలంగాణలోని యాదగిరి గుట్ట ఆలయానికి ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మొత్తంగా ఐదు ప్రాజెక్టుల వల్ల సరుకు రవాణా సామర్థ్యం పెరగడంతోపాటు, ఇంధన ఆదాతో పాటు పర్యావరణానికి భారీ ప్రయోజనం కలగనుంది. వాతావరణంలోకి 42 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది సుమారు 2 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
మోదీకి ఊహించని షాక్.. భారత్‌కు ముయిజ్జు వెన్నుపోటు?
ఒకప్పుడు ‘ఇండియా ఔట్’ అంటూ భారత్‌ను మాల్దీవుల నుంచి దూరం చేయాలని ప్రయత్నించిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. ఇటీవలే న్యూఢిల్లీతో స్నేహగీతం ఆలపించారు. భారత్ సాయంతో నిర్మిస్తున్న థిలమాలే బ్రిడ్జిని ఇరు దేశాల శాశ్వత స్నేహానికి ప్రతీకగా కొనియాడారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతలోనే భారత్‌కు షాకిస్తూ.. వ్యూహాత్మకంగా కీలకమైన థిలాఫుషి పోర్ట్ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించిన విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ముయిజ్జు భారత్‌కు వెన్నుపోటు పొడిచారా? అన్న చర్చ మొదలైంది.మాల్దీవుల ప్రభుత్వ ఆధీనంలోని మాల్దీవ్స్ పోర్ట్స్ లిమిటెడ్.. థిలాఫుషి పోర్ట్ అభివృద్ధి తొలి దశ పనులను చైనా హార్బర్ ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించింది. ప్రస్తుతం మాలేలోని పోర్టులపై ఉన్న రద్దీని తగ్గించి.. దేశ వాణిజ్య కార్యకలాపాల్లో కీలక భాగాన్ని థిలాఫుషికి తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అంటే భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకటిగా థిలాఫుషి మారబోతోంది. ఇక్కడే భారత్‌కు అసలు ట్విస్ట్ ఎదురవుతోంది. అదే థిలాఫుషికి భారత్ భారీ కనెక్టివిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు కింద మాలే, విలిమాలే, గుల్హిఫాల్హు, థిలాఫుషిలను అనుసంధానించే 6.7 కిలోమీటర్ల బ్రిడ్జిలు, రహదారులు, కాజ్‌వేలను భారత్ నిర్మిస్తోంది. 400 మిలియన్ డాలర్ల రుణం, మరో 100 మిలియన్ డాలర్ల గ్రాంట్‌తో ఈ ప్రాజెక్టుకు భారత్ మద్దతు ఇస్తోంది.అంటే.. థిలాఫుషికి చేరుకునే కనెక్టివిటీని భారత్ నిర్మిస్తుంటే.. అక్కడి కీలక పోర్టును చైనా అభివృద్ధి చేయబోతోంది. హిందూ మహాసముద్రంలో కీలకమైన సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవుల విషయంలో ఈ పరిణామం సాధారణ నిర్మాణ ఒప్పందంగా చూడలేని పరిస్థితి. మౌలిక వసతుల వెనుక భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయి.భారత్‌కు నమ్మకద్రోహం..ఇక, ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తీరు చూస్తే ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 2023లో ‘ఇండియా ఔట్’ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. తొలుత చైనాతో సంబంధాలను బలోపేతం చేశారు. తన తొలి విదేశీ పర్యటనను కూడా చైనాలోనే చేపట్టారు. భారత్ సైనిక సిబ్బందిని వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం ముయిజ్జును మళ్లీ భారత్‌వైపు చూసేలా చేసింది. భారీ రుణభారం, ఆర్థిక ఒత్తిళ్ల సమయంలో భారత్.. మాల్దీవులకు ఆర్థిక సహాయం అందించింది. 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ సదుపాయంతో పాటు రూ.3,000 కోట్ల మేర సహకారం అందించింది. దీంతో ముయిజ్జు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇటీవల థిలమాలే బ్రిడ్జిని ప్రశంసించడం, మోదీకి కృతజ్ఞతలు చెప్పడం కూడా ఈ మార్పులో భాగమే. దీంతో మాల్దీవులు పూర్తిగా భారత్ వైపు వచ్చేశాయని భావించిన సమయంలోనే.. చైనాకు థిలాఫుషి పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.అయితే, మాల్దీవులకు ఆర్థికంగా భారత్ అవసరం.. మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో చైనా కూడా కీలక భాగస్వామే. అందుకే మాలే ఒకరిని ఎంచుకోవడం కంటే ఇద్దరితోనూ సంబంధాలు కొనసాగించాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, భారత్‌కు మాత్రం థిలాఫుషి పరిణామం కీలక హెచ్చరిక. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీకి అనుసంధానంగా ఉన్న కీలక పోర్టు చైనా చేతుల్లోకి వెళ్లడం.. హిందూ మహాసముద్రంలో బీజింగ్ ప్రభావం పెరగడానికి మరో అవకాశమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భారత్‌కు నష్టం ఎక్కడ?మొదటిది.. వ్యూహాత్మక ప్రభావం. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీ చివరకు చైనా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కీలక వాణిజ్య పోర్టుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే భారత్ నిర్మించిన మౌలిక వసతులు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు.. చైనా ప్రభావం ఉన్న పోర్టు ప్రాంతానికి యాక్సెస్‌ను మరింత సులభం చేయవచ్చు.రెండోది.. చైనా ప్రభావం పెరిగే అవకాశం. థిలాఫుషి భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన కార్గో హబ్‌గా మారనుంది. అక్కడ చైనా కంపెనీకి నిర్మాణపరమైన కీలక పాత్ర లభించడం వల్ల బీజింగ్‌కు మాల్దీవుల సముద్ర వాణిజ్య మౌలిక వసతుల్లో మరింత పట్టు ఏర్పడే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో ఇది భారత్‌కు సున్నితమైన అంశం.మూడోది.. భారత్ ప్రభావానికి సవాలు. 2024లో భారత్, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇప్పుడు చైనా సంస్థకు కీలకమైన పనులు వెళ్లడం.. మాలే తన మౌలిక వసతుల భాగస్వామ్యాలను భారత్‌తో మాత్రమే పరిమితం చేయడం లేదని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా? -
భారీగా జీతం పెంచుకున్న సింగపూర్ ప్రధాని
ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రభుత్వాధినేత ఎవరో తెలుసా?. చాలా దేశాలు అధికారికంగా ఆ విషయం బయటకు చెబుతున్నా.. కొన్ని దేశాల్లో మాత్రం అలవెన్స్, ఎగస్ట్రాల రూపంలో అడ్డగోలుగా అందుకుంటున్నారు. ఇక చైనా, ఉత్తర కొరియా, రష్యా లాంటి కొన్ని దేశాధినేతల జీతాలపై క్లారిటీ అంటూ లేకుండా పోయింది. అయితే ఈ విషయంలో ఇప్పుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న ప్రధానిగా ఆయన రికార్డు నెలకొల్పారు.తాజాగా.. సింగపూర్ పార్లమెంట్లో చట్ట సభ్యుల జీతాల సవరణ జరిగింది. అందులో ప్రధాని లారెన్స్ వాంగ్(Lawrence Wong) వార్షిక వేతన ప్యాకేజీని ఏకంగా 64 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన జీతం 3.6 మిలియన్ డాలర్లకు చేరనుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.25 కోట్లకు పైగా. ఈ కొత్త వేతన విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.ఒకేసారి అంతా..!!లారెన్స్ వాంగ్ ప్రస్తుత వార్షిక వేతన ప్యాకేజీ 2.2 మిలియన్ సింగపూర్ డాలర్లు కాగా.. కొత్త విధానంతో అది 3.6 మిలియన్ డాలర్లకు పెరగబోతోంది. అంటే.. అదనంగా 1.4 మిలియన్ సింగపూర్ డాలర్ల అదనపు ఆదాయం. సింగపూర్ రాజకీయ నాయకులకు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు ఉన్నాయి. అధిక జీతాల వల్ల ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడంతోపాటు అవినీతికి దూరంగా పాలన సాగించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.మరోవైపు సాధారణ పౌరుల ఆదాయంతో పోలిస్తే రాజకీయ నాయకుల వేతనాలు భారీగా ఉండటంపై దేశంలో విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ పెంపు మొత్తాన్ని తన పదవీకాలంలో వచ్చే ఐదేళ్ల పాటు మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు.మంత్రుల జీతాలూ పెంపుదాదాపు 15 ఏళ్ల తర్వాత సింగపూర్ రాజకీయ వేతనాల వ్యవస్థలో ఈ మార్పులు చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుల నెలవారీ అలవెన్స్‌ను కూడా 13,750 సింగపూర్ డాలర్ల నుంచి 18,500 డాలర్లకు పెంచనున్నారు. ప్రధాని మాత్రమే కాకుండా ఇతర రాజకీయ పదవుల వేతనాల్లోనూ మార్పులు చేయనున్నారు. డిప్యూటీ ప్రధాని బెంచ్‌మార్క్ వార్షిక వేతనం 1.87 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 3.06 మిలియన్ డాలర్లకు పెరగనుంది. మంత్రుల వేతనాలు వారి హోదా, బాధ్యతలను బట్టి 1.80 మిలియన్ నుంచి 2.88 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు ఉండేలా కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్ణయించారు.అయితే మంత్రులందరికీ వెంటనే కొత్త బెంచ్‌మార్క్ వేతనం అందదు. ప్రస్తుత పదవీదారులకు అక్టోబర్ 15 నుంచి గరిష్ఠంగా 9 శాతం వరకు ఒకేసారి పెంపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వేతన మార్పులు వ్యక్తిగత పనితీరు, బాధ్యతల ఆధారంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.ప్రపంచంలో అత్యధిక వేతనాలు! వీళ్లే..అంతర్జాతీయ రాజకీయ నేతల వేతనాలను పోల్చే (PoliticalSalaries) డేటా ప్రకారం, 2025లో టాప్-10లో ప్రధానంగా సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల నేతలు ఉన్నారు. ఈ జాబితాలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మొదటి స్థానంలో ఉన్నారు.1. లారెన్స్ వాంగ్ – సింగపూర్ ప్రధాని2. కరీన్ కెల్లర్-సట్టర్ – స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు3. డొనాల్డ్ ట్రంప్ – అమెరికా అధ్యక్షుడు4. ఫ్రెడ్రిక్ మెర్జ్ – జర్మనీ ఛాన్సలర్5. ఆంటోనీ అల్బనీస్ – ఆస్ట్రేలియా ప్రధాని6. క్రిస్టియన్ స్టాకర్ – ఆస్ట్రియా ఛాన్సలర్7. బార్ట్ డి వెవర్ – బెల్జియం ప్రధాని8. క్రిస్టోఫర్ లక్సన్ – న్యూజిలాండ్ ప్రధాని9. మార్క్ కార్నీ – కెనడా ప్రధాని10. లూక్ ఫ్రైడెన్ – లక్సెంబర్గ్ ప్రధానిమరి మోదీ స్థానం ఎంత?ప్రధాని నరేంద్ర మోదీ టాప్-10లో లేరు. ఆయన అధికారిక వార్షిక వేతనం అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే చాలా తక్కువ. సుమారు అమెరికా 30 వేల డాలర్ల పరిధిలో ఉన్నట్లు గత అంతర్జాతీయ వేతనాల డేటాలో నమోదైంది. అయితే కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం జీతం, నియోజకవర్గం, విధి నిర్వహణకు సంబంధించిన రోజువారీ భత్యాలను కలిపి చూస్తే మోదీ వార్షిక మొత్తం సుమారు రూ.25-26 లక్షల పరిధిలో ఉంటుంది.ఇదీ చదవండి: సీఎం గొంతుతో మిమిక్రీ చేసి భారీ కుంభకోణం! -
11న మోదీ, పుతిన్ భేటీ
న్యూఢిల్లీ: బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండియా, ఇండోనేసియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన ‘బ్రిక్స్’శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏడాది సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 12, 13న ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే సమావేశానికి కూటమి దేశాల అధినేతలు హాజరుకాబోతున్నాయి. సదస్సు కంటే ఒక రోజు ముందు ఈ నెల 11న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ విషయాన్ని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారం నిర్ధారించారు. ఆయన భారత జర్నలిస్టులతో ఆన్లైన్లో సంభాషించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు దృష్టి పెట్టునున్నట్లు పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. అత్యంత సున్నితమైన అంశాలపై బహిరంగంగా, నిర్మాణాత్మకంగా చర్చించేలా మోదీ, పుతిన్ ఆచరణాత్మక దృక్పథం, చిత్తశుద్ధి కలిగి ఉన్నారని పెస్కోవ్ వివరించారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులను మోదీకి వివరించడానికి పుతిన్‌కు ఇది మరో అవకాశం కానుందని అభిప్రాయపడ్డారు. రష్యా మార్కెట్లో విస్తరణ చర్యలు చేపట్టడానికి, రష్యా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి భారతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఆయా కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలియజేశారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణను ముగించడానికి భారత్ చేసే ఎలాంటి శాంతి ప్రయత్నాలనైనా తాము స్వాగతిస్తామని స్పష్టంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం సాధించాలన్న భారత్ వైఖరికి రష్యా వ్యూహం చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించారు. -
అభివృద్ధిని చూడలేని నారాజ్ మామ
వడోదర: ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ విషయంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా చూడలేక విమర్శకులు నిత్యం అసంతృప్తి చెందుతూ అలిగిన మామ(నారాజ్ ఫుఫా) లాగా ఫిర్యాదులు చేస్తూ, లేనిపోని సమస్యలను సృష్టిస్తారని అన్నారు. అలాగే ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. రాహుల్ నిర్వహిస్తున్న ఛాత్రోంకీ గూంజ్(విద్యార్థుల ప్రతిధ్వని) సభలను ఝూట్ కీ గూంజ్(అబద్ధాల ప్రతిధ్వని)గా కొట్టిపారేశారు. మోదీ మంగళవారం గుజరాత్లో పర్యటించారు. వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.35,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నవీ ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీని అనుసంధానించే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని మూడు కీలక సెక్షన్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వేగంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నత్తనడకలా సాగేవని ఆక్షేపించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. తప్పులు వెతకడమే వారి పని ‘‘తప్పులు వెతకడమే ప్రతిపక్షాల పనిగా మారింది. కొత్తగా ప్రారంభించిన ఫ్రైట్ కారిడార్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ ఎల్లప్పుడూ తప్పులు వెతుకుతారు. ముంబై ఓడరేవు నుంచి వడోదరకు ఇటీవల డబుల్–స్టాక్ కంటైనర్ సరుకు రవాణా రైలును నడిపించాం. దీనివల్ల ఒకే ప్రయాణంలో 250కి పైగా ట్రక్కులకు సమానమైన సరుకును ఆ రెండు నగరాల మధ్య రవాణా చేయగలిగాం. ఇప్పుడు నారాజ్ ఫుఫాజీ (అలిగిన మామగారు) నోటికి పని చెబుతారు. డబుల్–స్టాక్ కంటైనర్ రైళ్లు వస్తే ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ట్రక్కులు ఎక్కడికి వెళ్తాయి? ప్రజలు కొనుగోలు చేసిన ట్రక్కుల మాటేంటి? అని ప్రశ్నిస్తారు. విమర్శలు చేయడానికి ఫుఫాజీకి ఇప్పుడు కొత్త విషయం దొరికింది. రవాణా కారిడార్‌పైనా వారికి సందేహాలు వస్తాయి. దేశ పురోగతికి వ్యతిరేకంగా విమర్శలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకైనా వెళ్తాయి. ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి వారికి ఏదో ఒక సాకు కావాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌తో పోలిస్తే ఎన్డీయే పదేళ్ల పాలనలో ఆధునీకరణ వేగంగా జరిగింది. 2014 తర్వాత 50,000 ఆధునిక రైలు బోగీలను నిర్మించాం. గత ప్రభుత్వం పదేళ్లలో కనీసం 50,000 మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయింది. రాజకీయ ప్రసంగాల కంటే వాస్తవికతకే యువత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు. రాజకీయ తప్పుదారి పట్టించే చర్యలకు గురికావొద్దు. అబద్ధాలతో అడుగడుగునా తప్పుదోవ పట్టించేవారు కనిపిస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నేటి యువత సత్యం వైపే నిలబడుతుంది. సౌర, పవన, జల, అణు శక్తి వంటి రంగాల్లో ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్ధితో పనిచేస్తోందో యువతకు తెలుసు’’ అని మోదీ అన్నారు.ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ‘‘దేశంలో లక్షలాది మంది యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏటా మన కుటుంబాల ఆదాయంలో చాలాభాగం కోచింగ్‌ల కోసమే ఖర్చవుతోంది. అందుకే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే మా లక్ష్యం’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘నమో కమలం’ ప్రారంభం దక్షిణ గుజరాత్‌లోని నవసారి పట్టణంలో బీజేపీ నూతన కార్యాలయం ‘నమో కమలం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అధికార పార్టీకి ఉన్న అధికారం, పదవులు, సంస్థాగత బలం పూర్తిగా ప్రజాసేవ కోసమేనని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. బీజేపీలో సాధారణ క్షేత్రస్థాయి కార్యకర్త కూడా ఎప్పుడూ అధికార మదంతో విర్రవీగలేదని అన్నారు. తమ కార్యకర్తలు ప్రజాసేవకు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. తమ దృష్టిలో అధికారం కేవలం సేవాభావం కోసమేనని తెలిపారు. -
‘ధురంధర్’లా మోదీ ఎంట్రీ.. ‘ఆరీ ఆరీ’ పాటతో గ్రాండ్ వెల్కమ్
గాంధీనగర్: గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఆయన వడోదరలోని మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయంలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీ కార్యక్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టే సమయంలో ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరీ ఆరీ’ పాట వినిపించింది. అంతకుముందు క్వీన్ బృందానికి చెందిన ‘వీ విల్ రాక్ యూ’ పాటను కూడా వినిపించారు. యువత పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో మోదీ వారిని ఉద్దేశించి చేతులు ఊపుతూ ముందుకు సాగారు. ‘ఆరీ ఆరీ’ (Aari Aari) అనేది రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ ది రివెంజ్' సినిమాలోని సూపర్‌హిట్ పాట.#WATCH | Gujarat | PM Modi receives an enthusiastic welcome from the crowd attending the 'NaMo for Viksit Bharat' event in Vadodara(Video source: ANI/DD) pic.twitter.com/klrHAJri9T— ANI (@ANI) September 8, 2026 మోదీ రాక సందర్భంగా ప్రత్యేకంగా ‘వై’ ఆకారంలో వేదికను ఏర్పాటు చేశారు. దాని చుట్టూ యువత కూర్చొని ఉండగా, మోదీ ఆ వేదికపై నడుస్తూ వారిని పలకరించారు. వడోదర పర్యటనలో మోదీ రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రైల్వే, రహదారులకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.ఈ సందర్భంగా మోదీ సరుకు రవాణా రైలు సేవలను, టాండా రోడ్ నుంచి వడోదరలోని ప్రతాప్‌నగర్‌కు అనుసంధానించే కొత్త ప్రయాణికుల రైలును ప్రారంభించారు. పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా మార్గంలోని 3 కీలక విభాగాలు, రైల్వే, రహదారి మౌలిక వసతులతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. -
ప్రధాని మోదీ పర్యటనకు ముందు కలకలం
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటన సందర్భంగా తీవ్ర కలకలం చెలరేగింది. ప్రధాని పాల్గొనాల్సిన కార్యక్రమంలో ఇద్దరు అగంతకులు చొరబడ్డారు. పీఎంవో అధికారులమంటూ అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకితో పాటు ఫేక్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వేదికగా ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026’ సదస్సు జరగాల్సి ఉంది. ఈ సదస్సును ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రావాల్సి ఉంది. అంతకంటే ముందే రోహన్ పరేఖ్ తాను ప్రధాన మంత్రి కార్యాలయ అధికారినంటూ ఆ ఈవెంట్‌కు వచ్చారు. తనిఖీల్లో భాగంగా అతని వద్ద నకిలీ పీఎంవో ఐడీ కార్డుతో పాటు తుపాకీ లభించడంతో భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అతనితో పాటు ఉన్న సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన తీవ్రత దృష్ట్యా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లు, గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు.తుపాకులతో, నకిలీ ఐడీలతో నేరుగా ప్రధాని మోదీ హాజరు కావాల్సిన కార్యక్రమానికి ఎందుకు వచ్చారనే అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక ఫిన్‌టెక్ సదస్సులలో ఒకటైన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026’ను ముంబైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన వేళ జరిగిన ఈ భద్రతా లోపం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. -
ప్రధాని మోదీ సభకు భారీ క్రేజ్.. బేజారెత్తిన బుక్‌మైషో!
వడోదరా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) గుజరాత్‌లోని వడోదరాలో పాల్గొననున్న ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఉచితంగా అందుబాటులో ఉంచిన బుక్‌మైషోలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన గంటలోపే పూర్తయ్యాయి. మరోవైపు 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వడోదరాలోని మహారాజా సయాజీరావు యూనివర్సిటీ (ఎంఎస్‌యూ) పావిలియన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుంది.వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) రిజిస్ట్రేషన్ల కోసం ప్రైవేటు టికెటింగ్ వేదికను వినియోగిస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు నమోదు చేసుకున్న వారికి వారి బుక్‌మైషో ఖాతాల ద్వారా ఎం-టికెట్ అందుతుంది. అందులోని లైవ్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రవేశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ, ప్రవేశం, సీటింగ్ మొత్తం డిజిటల్ విధానంలోనే నిర్వహించనున్నారు.ప్రధాని మోదీ వడోదరా పర్యటనలో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని మూడు విభాగాలను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 326 రూట్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గాలను రూ.20,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. న్యూ సనంద్ (నార్త్)-న్యూ మకర్పురా, న్యూ ఉమర్గావ్-న్యూ సఫాలే, న్యూ సఫాలే-న్యూ జేఎన్పీటీ మార్గాలు ఇందులో ఉన్నాయి.జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీతో కొత్త రైలు అనుసంధానం ఎగుమతి, దిగుమతి సరుకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు పారిశ్రామిక కేంద్రాలు, నౌకాశ్రయాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గడంతోపాటు ముంబై రైల్వే నెట్‌వర్క్‌పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.న్యూ సనంద్ (నార్త్), న్యూ మకర్పురా, న్యూ ఉమర్గావ్, న్యూ జేఎన్పీటీ నుంచి సరుకు రవాణా రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. టాండా రోడ్-వడోదరా ప్రతాప్‌నగర్ మధ్య రైలును కూడా ప్రారంభిస్తారు. అలాగే ఛోటా ఉదేపూర్-ధర్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జోబట్-టాండా రోడ్ కొత్త రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో అలీరాజ్‌పూర్‌లోని మారుమూల, గిరిజన ప్రాంతాలు విస్తృత రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయి.మోదీ పర్యటనకు ఒక రోజు ముందు సోమవారం సాయంత్రం గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఆధ్వర్యంలో వడోదరాలో ‘వికసిత్ భారత్ పాదయాత్ర’ నిర్వహించారు. డాండియా బజార్‌లోని ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రారంభమైన యాత్ర కీర్తి స్తంభం మీదుగా సాగి సూరసాగర్ సరస్సు వద్ద ముగిసింది. మోదీ పర్యటనకు వచ్చిన స్పందనకు అందుబాటులో ఉన్న సామర్థ్యానికి దాదాపు మూడు రెట్లు రిజిస్ట్రేషన్ల డిమాండ్ ఉందని సంఘవి తెలిపారు. ప్రధాన వేదికలో సీట్లు లభించని వారి కోసం ప్రత్యేక ఫ్యాన్ జోన్లను కూడా ఏర్పాటు చేశారు.ఇది కూడా చదవండి: ఏఐ మరో సంచలనం.. జంతువుల భాష డీకోడ్ చేస్తూ.. -
బుక్ మై షో ద్వారా ప్రధాని ఈవెంట్
వడొదర: గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమ నిర్వహణ మొదటిసారిగా ‘బుక్ మై షో’ద్వారా జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్దేశించిన ఉచిత రిజి్రస్టేషన్‌కు భారీ స్పందన కూడా లభించింది. ప్రారంభించిన గంటలోనే టిక్కెట్లు మొత్తం బుక్ అయిపోయాయి. మంగళవారం నాటి కార్యక్రమాల్లో ప్రధాని సుమారు 35 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. దీంతోపాటే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ మొట్ట మొదటిసారి ప్రైవేట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో ద్వారా రిజి్రస్టేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రారంభించిన గంటలోనే సుమారు 42,000 మంది వెయిటింగ్ లిస్ట్‌లోకి చేరడంతో బుక్ మై షో తదుపరి రిజి్రస్టేషన్‌ను నిలిపివేసింది. ప్రధాని కార్యక్రమంలో ప్రవేశానికి కూడా పూర్తిస్థాయి డిజిటట్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బుక్ మై షో ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్న వారికి వారి అకౌంట్ ద్వారా డిజి టల్ ఎం–టికెట్ లభిస్తుంది. ఇందులోని క్యూ ఆర్ కోడ్‌ను ఉపయోగించి కార్యక్రమం జరిగే ప్రాంగణంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. రి జి్రస్టేషన్ మొదలుకొని సీటింగ్ ఏర్పాట్ల వర కూ అన్నీ డిజిటల్ పద్ధతిలోనే జరగనున్నాయి. -
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. యువత, విద్యార్థుల సమస్యలపై మాట్లాడాల్సిన వేదికపై.. ప్రశ్నించే యువతను ‘దిమాగీ నక్సల్స్’ అంటూ ముద్ర వేయడం ఏమిటంటూ సీజేపీ తీవ్రంగా మండిపడింది. విద్య, ఉద్యోగాలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రధాని మాట్లాడాల్సిందిపోయి.. విమర్శకులను టార్గెట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శించారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో ఒకటైన SRCCలో యువతను ‘దిమాగీ నక్సల్స్’గా పేర్కొనడం ప్రధానమంత్రి చేయగలిగే అత్యంత అవమానకరమైన పని అంటూ విమర్శించారు. ప్రధాని యువతకు ఆశలు కల్పించాలి.. ప్రశ్నలు అడుగుతున్నందుకు వారిని నిందించకూడదు అని దాస్ వ్యాఖ్యానించారు. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. SRCCలోనే ఉపాధ్యాయులు మెడికల్, చైల్డ్‌కేర్ లీవ్ వంటి అంశాలపై ఆందోళన చేయాల్సి వస్తోందని.. కళాశాలలో మౌలిక వసతుల పరిస్థితి, విద్యార్థులపై పెరుగుతున్న పోటీ ఒత్తిడి వంటి అంశాలను ప్రధాని ప్రస్తావించాల్సిందని విమర్శించారు.మరోవైపు.. ఆశుతోష్ రంకా కూడా ప్రధాని ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. SRCC శతాబ్ది వేడుకల వంటి వేదికపై విద్య, ఉపాధి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే 20 ఏళ్లలో భారత్ ప్రపంచంలో తన స్థానాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలన్న అంశాలపై ప్రధాని మాట్లాడాల్సిందని అన్నారు. కానీ అందుకు బదులుగా ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలకు దిగారని ఆరోపించారు.Wow. Going to one of India’s premier colleges and once again branding a young, questioning generation as “Dimagi Naxals” has got to be among the most shameful things a Prime Minister can do. And on Teacher’s Day.He could have spoken about why SRCC’s own teachers have had to… https://t.co/U8EMRtikcu— Saurav Das (@SauravDassss) September 5, 2026అసలు మోదీ ఏం అన్నారు?SRCC శతాబ్ది వేడుకల్లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను ప్రస్తావించిన ‘దిమాగీ నక్సల్స్’ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. తాను ‘దిమాగీ నక్సల్’ అంటూ చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఆ భావజాలానికి మద్దతిస్తున్నవారు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారని మోదీ అన్నారు. తన వ్యాఖ్యలను విమర్శిస్తున్నవారి తీరును ఉద్దేశిస్తూ.. ప్రజలు కూడా వారి అసలు రంగును గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సీజేపీ విమర్శలకు కారణమయ్యాయి. అయితే మోదీ ప్రసంగంలోని ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. విద్యార్థుల సమస్యలపై చర్చ జరగాల్సిన SRCC వేదిక.. మోదీ-విమర్శకుల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారడం చర్చనీయాంశంగా మారింది. -
ఇస్రోలో ఏం జరుగుతోంది?.. కేంద్రంపై ఉద్యోగుల ఆగ్రహం
ఆరు ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు కేంద్రం తలుపులు తెరిచింది. ఇప్పుడు అదే నిర్ణయం ఇస్రోలో కొత్త చర్చకు తెరతీసింది. రాకెట్ల తయారీ, ఉపగ్రహాల నిర్మాణం, లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ వంటి కీలక బాధ్యతలు క్రమంగా ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు బదిలీ కానున్నాయన్న వార్తల నేపథ్యంలో.. ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు తొలిసారి సమష్టిగా గళం విప్పాయి. అసలు కేంద్ర ప్రభుత్వ విధానం ఏంటి? ఇస్రో భవిష్యత్ పాత్ర ఏమిటి? తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలతో ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి వి. నారాయణన్‌కు లేఖ రాశాయి. ప్రైవేటీకరణ విధానం, ఇస్రో భవిష్యత్ పాత్ర, ప్రస్తుత ఉద్యోగుల పరిస్థితి, భవిష్యత్ నియామకాలపై అధికారిక వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.సెప్టెంబర్ 4న ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి నారాయణన్‌కు ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. ఇటీవల ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఛైర్మన్ పవన్ కుమార్ గోయెంకా చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావించారు. భవిష్యత్‌లో ఇస్రో స్వయంగా లాంచ్ వెహికల్స్ తయారు చేయదని.. వాటి తయారీ మొత్తం ప్రైవేటు రంగం లేదా ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లోకి వెళ్తుందని గోయెంకా పేర్కొన్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్పు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV)తో ప్రారంభమైందని.. భవిష్యత్‌లో PSLV, LVM3 వంటి కీలక రాకెట్ల తయారీకి కూడా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందా?లాంచ్ వెహికల్స్ తయారీ, సాధారణ ఉపగ్రహాల ఉత్పత్తిని ఇస్రో నుంచి బయటకు తరలించడం, కులశేఖరపట్నంలో ప్రతిపాదిత స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ వంటి కొత్త మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలకు తెరవడంపై కూడా ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పటికే ఇస్రోకు చెందిన దాదాపు 120 సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసినట్లు లేఖలో పేర్కొన్నాయి. ఈ పరిణామాలపై అధికారిక విధాన పత్రం లేకపోవడం ఉద్యోగుల్లో, వారి కుటుంబాల్లో ఆందోళనకు కారణమవుతోందని సంఘాలు తెలిపాయి. ఇస్రోలో అంతర్గత పనులు తగ్గిపోతే ఉద్యోగుల సంఖ్యపై కోత పడే అవకాశం ఉందని, ప్రమోషన్లు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కూడా దెబ్బతినవచ్చని పేర్కొన్నాయి.‘ఇది కేవలం తయారీ కాంట్రాక్ట్ కాదు’లాంచ్ వెహికల్ డిజైన్, తయారీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగాలు.. ఇవి కేవలం తయారీ కాంట్రాక్టులు కాదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఇవే ఇస్రోకు ఉన్న ప్రధాన సాంకేతిక సామర్థ్యం, దశాబ్దాలుగా ఏర్పడిన సంస్థాగత అనుభవం, వ్యూహాత్మక సామర్థ్యమని పేర్కొన్నాయి. అయితే ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి తాము వ్యతిరేకం కాదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. NSIL ద్వారా నిర్ణీత విధానంలో వాణిజ్య కార్యకలాపాలు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామని తెలిపాయి. అయితే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, ఇస్రో సొంత తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా తొలగించడం మధ్య స్పష్టమైన గీత ఉండాలని డిమాండ్ చేశాయి.నారాయణన్‌కు కీలక ప్రశ్నలుఇదే ఇప్పుడు ఉద్యోగ సంఘాల ప్రధాన ఆందోళన. రాకెట్ డిజైన్ చేయడం మాత్రమే కాదు.. దాని తయారీ, అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగం వరకు మొత్తం ప్రక్రియలో ఇస్రోకు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ పనులు బయటకు వెళ్లిపోతే ఇస్రో కేవలం పరిశోధన, డిజైన్ సంస్థగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గోయెంకా వ్యాఖ్యలు నిజంగా కేంద్ర ప్రభుత్వ విధానమేనా? లేక వ్యక్తిగత అభిప్రాయమా? PSLV, LVM3, SSLVతో పాటు భవిష్యత్ లాంచ్ వెహికల్స్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగ బాధ్యతలు ఇస్రో వద్దే కొనసాగుతాయా? అనే అంశాలపై అధికారిక స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. మొత్తంగా, అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరించే కేంద్రం విధానంపై ఇస్రో ఉద్యోగుల్లోనే ప్రశ్నలు తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కేంద్రం విధానం ఏంటి?కేంద్రం తీసుకున్న దిశ మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. 2023 స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు మరింత పెద్ద పాత్ర కల్పించింది. NSIL వాణిజ్యీకరణ, పరిశ్రమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుండగా.. IN-SPACe ప్రైవేటు సంస్థలకు అనుమతులు, ప్రోత్సాహం, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. 2025-26లో IN-SPACe, NSIL, ISRO కలిసి 100 టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందాలు పూర్తి చేశాయని కేంద్రం తెలిపింది. SSLV టెక్నాలజీని HALకు బదిలీ చేయడం ఇందులో అత్యంత కీలకమైన ఉదాహరణగా నిలిచింది. PSLV, LVM3 టెక్నాలజీ బదిలీకి కూడా ప్రక్రియ మొదలైంది. అయితే ఇస్రో పూర్తిగా రాకెట్ల తయారీ నుంచి వైదొలగుతుందా? అన్న అంశంపై ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలు కోరుతున్న స్థాయిలో స్పష్టమైన అధికారిక వివరణ వెలువడలేదనే అంశమే ప్రస్తుత వివాదానికి కేంద్రంగా ఉంది.ఇదీ చదవండి: గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి -
పిల్లల బాల్యాన్ని కాపాడాలి
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యసనం పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. పిల్లలను క్రీడలు, శారీరక వ్యాయామం, సృజనాత్మక కార్యకలాపాల వైపు ప్రోత్సహించాలని, తద్వారా వారు సెల్ఫోన్లతో ఎక్కువ సమయం వృథా చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉత్తమ ఉపాధ్యాయులుగా జాతీయ అవార్డుకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ వీడియోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి సంభాషించారు. పిల్లల బాల్యాన్ని కాపాడాలని, వారిలో సహజ కుతూహలాన్ని పెంపొందించాలని చెప్పారు. తరగతి గది అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి సృజనాత్మక పద్ధతులను ఎంచుకోవాలని అన్నారు. చదువులు మాత్రమే కాకుండా పిల్లల ప్రవర్తన, దైనందిన జీవితం పట్ల కూడా శ్రద్ధ వహించాలని స్పష్టంచేశారు. ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న తరుణంలో విద్యార్థుల జీవితాల్లో టీచర్లు మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వారికి సరైన మార్గనిర్దేశం చేస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు నడిపించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. విద్యార్థుల్లోనూ డ్రగ్స్ వ్యసనం పెరిగిపోతుండడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. పెద్ద నగరాలు, విశ్వవిద్యాలయాల్లో ఎవరు ఎవరికి ఏమి ఇస్తున్నారో తెలియడం లేదని, దీనివల్ల డ్రగ్స్ బారిన పడిన వారిని గుర్తించడం కష్టమని అన్నారు. అందుకే విద్యార్థుల్లో డ్రగ్స్ ముప్పుపై తగిన అవగాహన కల్పించడానికి టీచర్లే చొరవ తీసుకోవాలని చె ప్పారు. డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు గుర్తిస్తే వారి ని ఆ వ్యసనం నుంచి దూరం చేయాలని పే ర్కొన్నారు. వారి జీవితాల్లో బాల్యాన్ని సజీవంగా ఉంచడం ద్వారా ఉపాధ్యాయులు గొప్ప సహకారాన్ని అందించగలరని వెల్లడించారు.నిజ జీవిత నైపుణ్యాలతో అనుసంధానించాలి విద్యార్థుల్లో స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం ఒక ప్రధాన సమస్యగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు. పిల్లలు స్క్రీన్‌పై ఎంత సమయం గడుపుతున్నారు? రాత్రిపూట మొబైల్ ఫోన్లు ఎన్ని గంటలు వాడుతున్నారు? అనేదానిపై వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. క్రీడలు, శారీరక శ్రమతో కూడిన ఆటలు, సృజనాత్మక కార్యకలాపాలు, కళలపై ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా స్క్రీన్ సమయాన్ని సహజంగా తగ్గించవచ్చని స్పష్టంచేశారు. -
విశ్వాసం పెంచిన ఆర్థిక వృద్ధి
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధి, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలపై ఆరోపణలు చేస్తున్నవారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చినవారే.. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడాన్ని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. శనివారం ఢిల్లీలో శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ వందేళ్ల వేడుకలో ప్రదానమంత్రి పాల్గొన్నారు. ఆయన ఈ కళాశాలకు రావడం 2013 తర్వాత ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, వాణిజ్యానికి అంతరాయాలు ఉన్నప్పటికీ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ వృద్ధి దేశ విశ్వాసాన్ని పెంచిందన్నారు. మన దేశాన్ని అత్యంత బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థల(ఫ్రాౖజైల్ ఫైవ్) జాబితాలోకి నెట్టి అపఖ్యాతి పాలైన వారికి నేడు ఈ గణాంకాలను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2013లో తాను ఈ కాలేజీలో చేసిన ప్రసంగం అప్పట్లో ఒక అలజడిని సృష్టించిందని, 13–14 ఏళ్లు గడిచినప్పటికీ దాని ప్రభావం నేటికీ చెక్కుచెదరలేదని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఒక దార్శనికతను(విజన్) ఆవిష్కరించానని అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి మాటా తన దృఢ విశ్వాసానికి నిదర్శనమని, ఆ మాటలకు అనుగుణంగానే ఎప్పుడూ జీవించానని ఉద్ఘాటించారు. నక్సలిజం నడ్డి విరిగింది 2013 నాటి ఆర్థిక పరిస్థితులను ప్రధానమంత్రి గుర్తుచేశారు. అప్పట్లో బలహీనమైన రూపా యి, దాదాపు 10 శాతం ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయి కరెంట్ అకౌంట్ లోటు, మందగించిన పారిశ్రామిక వృద్ధి, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడాన్ని ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందన్నారు. ప్రపంచం భారత్‌ను ఫ్రాౖజైల్ ఫైవ్‌లో ఒకటిగా పిలిచేదని చెప్పారు. అప్పట్లో కుంభకోణాలు తారస్థాయికి చేరాయని, అవినీతిపరులు నిర్భయంగా తిరిగేవారని వెల్లడించారు. ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని, పాకిస్తాన్‌పై నియంత్రణ తప్పిందని విమర్శించారు. కానీ, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు నేడు చిత్తుగా ఓడిపోయారని, పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే భారత సైన్యం వారి గడ్డపైకే వెళ్లి దాడులు చేస్తోందని తెలిపారు. నక్సలిజం నడ్డి విరిగిందన్నారు. విధానపరమైన స్తబ్దత నుంచి చైతన్యవంతమైన విధానాల అమలు వరకు భారత్ ఎంతో పురోగతి సాధించిందని స్పష్టంచేశారు. ఈ రోజు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడాన్ని ప్రపంచం చూస్తోందని వెల్లడించారు. తాజా జీడీపీ గణాంకాలు దేశ ఆ ర్థిక బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలియజేశారు. దేశం వృద్ధి చెందడమే కాకుండా నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. దేశం ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా చాలా సురక్షితంగా ఉందని చెప్పారు. ఇది చూసిన తర్వాత కొందరిలో అసహనం పెరుగుతోందన్నారు. అలాంటి దిమాగీ నక్సలైట్లకు ఎర్రకోట(స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం) నుంచే హోమియోపతి మందు ఇచ్చానని వ్యాఖ్యానించారు. దిమాగీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్న వారి నిజ స్వరూపాన్ని ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని చెప్పారు. ప్రాథమిక సేవలు, అవకాశాల కోసం సామాన్య పౌరులు మాయి–బాప్(తల్లి–తండ్రి) సంస్కృతిపై ఆధారపడి ఉండాలని కొందరు కోరుకుంటున్నారని, అందుకే ఆర్థిక సమ్మిళితాన్ని వ్యతిరేకిస్తున్నారని మోదీ ఆరోపించారు. ‘మాయి–బాప్’ సంస్కృతిని సమర్థించేవారికి ఎదురుగా తాను ఒక బండరాయిలా నిలబడతానని ప్రధాన మంత్రి తేల్చిచెప్పారు. యువతను ఆకట్టుకొనే యత్నం ‘జెన్ జెడ్’ను ఆకట్టుకొనేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. నేటి తరం యువ తకు బాగా తెలిసిన ‘ఓజీ’ వంటి పదాలను తన ప్రసంగంలో చేర్చారు. ‘దురంధర్’ అనే సినిమా ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. శ్రీరామ్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఓజీలు(అసలైన దిగ్గజాలు) అని ప్రశంసించారు. వారు దురంధర్‌లు కాకపోయినా ఎన్నో సంచలనాలు సృష్టించారని చెప్పారు. సత్య గర్జన ముందు అబద్ధాల ప్రతిధ్వని నిలవదు కొందరు వ్యక్తులు దేశ పురోగతి పట్ల నిరాశావాదంతో ఉన్నారని మోదీ విమర్శించారు. ‘సగం నిండిన గ్లాసు’ ఉపమానాన్ని ప్రస్తావించారు. కొందరు గ్లాసును సగం నిండినట్లుగా, మరికొందరు సగం ఖాళీగా ఉన్నట్లుగా చూస్తారని చెప్పారు. అయితే, తాను మాత్రం గ్లాసు పూర్తిగా నిండినట్లుగా, అందులో సగ భాగం నీరు, సగ భాగం గాలి ఉన్నట్లుగా భావిస్తానని వివరించారు. 2013లో గ్లాసు సగం ఖాళీగా ఉందని భావించినవారు ఇప్పటికీ దేశాన్ని అదే దృక్పథంతో చూస్తున్నారని ఆక్షేపించారు. వారి దృష్టిలో గ్లాసు ఎప్పుడూ సగం ఖాళీగానే ఉంటుందన్నారు. తాను కేవలం గ్లాసు గురించే మాట్లాడుతున్నానని, ఖాళీగా ఉండే మరో దాని గురించి కాదని ప్రతిపక్షాలపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. తన ప్రసంగాన్ని ‘రిపోర్ట్ కార్డు’గా మోదీ అభివరి్ణంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీపై పరోక్షంగా విమర్శలు చేశారు. సత్య గర్జన ముందు అబద్ధాల ప్రతిధ్వని నిలవలేదని తేల్చిచెప్పారు. -
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జెన్ జీని ఆకట్టుకునేలా ప్రసంగించారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది వేడుకల్లో శనివారం మోదీ పాల్గొని మాట్లాడారు. “ధురంధర్ కాకపోయినా, ధూమ్ మాత్రం మచాయీ హై” అని అన్నారు. ప్రతి రంగంలోనూ ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు.“ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థులు కూడా చాలా ప్రత్యేకమైనవారు. మీ భాషలో చెప్పాలంటే, ఇక్కడి పూర్వ విద్యార్థులు ఒరిజినల్ గ్యాంగ్ సభ్యులు. వారు ఎస్ఆర్సీసీ పేరును ప్రపంచవ్యాప్తంగా చాటారు. వివిధ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మన అరుణ్ జైట్లీ జీ ఇక్కడ చదువుకున్నారు. ఆయనతో జరిగిన సమావేశాల్లో బహుశా ఎస్ఆర్సీసీ రోజులకు సంబంధించిన ఒక సంఘటనను చెప్పని సమావేశం ఉండేది కాదు. కొన్నిసార్లు నాకు విసుగు వచ్చేది. ఎందుకంటే ఆయన అదే సంఘటనను పదేపదే చెప్పేవారు. ఇప్పటికీ నా బృందంలో ఉన్న సంజీవ్ సన్యాల్ ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థే. ఇక్కడ చదువుకున్న మరెంతో మంది సహచరులు మనతో ఉన్నారు. ఎస్ఆర్సీసీ నుంచి ఆర్థిక రంగానికి చెందినవారు మాత్రమే వచ్చినట్లు కాదు. కళాకారుల నుంచి రాజకీయ నాయకులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల వరకు ప్రతి రంగానికి చెందినవారు ఇక్కడి నుంచి వెలుగులోకి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా నా 2013 ప్రసంగం గురించి మాట్లాడుకున్నారు. ప్రజలు దానిని గుర్తు చేసుకున్నారు, మళ్లీ విన్నారు, మళ్లీ చదివారు. కొత్త తరానికి చెందినవారు కూడా దానిని మరోసారి చూసి ఉండవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, ఆ ప్రసంగం ఒక అలను సృష్టించింది. ఒక అల ఉప్పొంగి వెళ్లింది. ఇప్పటికీ, 13-14 ఏళ్ల తర్వాత కూడా, ఆ సమావేశం, ఆ ప్రసంగం ప్రభావం కొనసాగుతోంది” అని అన్నారు.2013లో అలా ఉండేది.. మీకు తెలియదుగతంలోని విషయాలను నరేంద్ర మోదీ చెప్పారు. “2013లో మీ సీనియర్లు ఇక్కడ కూర్చున్నారు. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. అయితే దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలో సభ్యుడిగా కూడా ఉన్నాను. అప్పటి కేంద్ర ప్రభుత్వంపై సుదీర్ఘంగా, తీవ్రంగా దాడి చేస్తానని, ఆరోపణల వర్షం కురిపిస్తానని బహుశా ప్రజలు ఆశించి ఉంటారు. కానీ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ, ఆ వేదికను ఆ ఉద్దేశం కోసం ఉపయోగించలేదు. ఒక దార్శనికతను వివరించాను. సానుకూలంగా మాట్లాడాను. అప్పుడు నేను చెప్పినదంతా నా నమ్మకం. ఆ ఆలోచనలు, కలలను నేను ఎప్పుడూ ఆచరణలో పెట్టాను. ఆ మార్గంలోనే కొనసాగాను. దేశానికి నా సంపూర్ణ అంకితభావాన్ని కొనసాగించాను. దేశం కోసం జీవించాలనే తపనను కలిగి ఉన్నాను. ఆ సమయంలో మీలో చాలామంది పాఠశాలలో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజు మీరు ఇంటర్నెట్లోకి వెళ్లి 2013లో, ఆ కాలానికి సమీపంలోని రోజుల్లో వచ్చిన వార్తలను చదివితే, అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో మీకు అర్థమవుతుంది” అని అన్నారు.పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నవారు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని మోదీ అన్నారు. ‘‘పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, భారత సాయుధ దళాలు వారి భూభాగంలోకి ప్రవేశించి దాడి చేస్తున్నాయి. జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పెరిగింది. మావోయిస్టు ఉగ్రవాదం, నక్సలిజం వెన్ను విరిచాం. ఒకప్పుడు భారత విధాన స్తబ్ధత గురించి ఆందోళన చెందిన ప్రపంచం.. ఈ రోజు భారత విధాన చైతన్యం గురించి మాట్లాడుతోంది” అని అన్నారు. -
మోదీ ‘గేర్’కు వరద బ్రేక్.. డ్రీమ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సెటైర్లు
‘గేర్ మార్చే’ ఎక్స్‌ప్రెస్‌వే.. వరద నీటిలో ఎందుకు మునిగింది? ఢిల్లీలో కురిసిన భారీ వర్షం ఇప్పుడు ప్రకృతితో పాటు రాజకీయ తుఫాన్నూ రేపింది. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లోనే వరద నీరు చేరడంతో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన టన్నెల్లో గంటపాటు తాను చిక్కుకుపోయానంటూ కాంగ్రెస్ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ వీడియో విడుదల చేయడం.. ఇప్పుడు మోదీ సర్కార్‌కు కొత్త తలనొప్పిగా మారింది.ఈ సందర్భంగా ‘ప్రజల జీవితాల్లో గేర్ మారుస్తుంది’ అన్న ప్రాజెక్టు.. భారీ వర్షం పడగానే నీటిలోనే ఆగిపోయిందంటూ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. అసలు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ టన్నెల్లో నీరు ఎందుకు నిలిచింది? మౌలిక వసతులపై ప్రభుత్వ గొప్పలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంత భిన్నంగా ఎందుకున్నాయన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.मैं जिस टनल में एक घण्टे से फँसा हूँ इसे मोदी सरकार ने प्रति किलोमीटर 250 करोड़ रुपये खर्च करके बनाया है। यह उसी Dwarka Expressway का टनल है जिसके उद्घाटन को प्रधानमंत्री मोदी ने लोगों के जीवन का गियर बदलना बताया था। pic.twitter.com/dl5kjSHSkz— Brijendra Singh (@BrijendraSpeaks) September 4, 2026దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షాలతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే, 2024లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన సమయంలో ప్రధాని మోదీ.. ఈ ప్రాజెక్టు ఢిల్లీ-హర్యానా మధ్య ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుందని, వాహనాలే కాకుండా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లోనూ ‘గేర్ మారుతుందని’ పేర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టులోని టన్నెల్ భారీ వర్షాలకు నీటమునగడంతో కాంగ్రెస్ ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది.మరోవైపు.. భారీ వర్షం కారణంగా ఢిల్లీ ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. భారీ వర్షాల ప్రభావం ఢిల్లీ విమానాశ్రయంపైనా పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో సామాన్లతో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య కనీసం తొమ్మిది విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. అటు గురుగ్రామ్‌లోని సైబర్ సిటీ, శంకర్ చౌక్, శీత్లా మాతా రోడ్ ప్రాంతాల్లోనూ భారీగా నీరు నిలిచింది. ఇక వర్షాలపై భారత వాతావరణ శాఖ ఢిల్లీకి తొలుత ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. పరిస్థితి తీవ్రతరం కావడంతో రెడ్ అలర్ట్‌కు పెంచింది. ఉరుములు, మెరుపులతో పాటు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒకవైపు భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు రాజకీయ విమర్శలకు దారితీశాయి. The tunnel is part of the most expensive road ever built in India at INR 250 crs per kilometre (against 20 ) i.e. Dwarka e-way in NCR and opened less than 2 yrs ago.This e-way was actually inaugurated twice in the last two years. Yesterday’s drizzle of a receding monsoon and… pic.twitter.com/jmq2xc6Vf6— Ankur Bisen (@AnkurBisen1) September 5, 2026 -
ఇటలీ ప్రధానిగా 1,413 రోజులు మెలోనీకి మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని పదవిలో దీర్ఘకాలం కొనసాగిన జార్జియా మెలోనీ(49)కి ప్రధాని మోదీ శుక్రవారం అభినందనలు తెలిపారు. 2022 అక్టోబర్ 22వ తేదీన ఇటలీ ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. మొట్టమొదటి మహిళా ప్రధానిగాను ఆమె రికార్డు నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశ ప్రధాని పదవిలో ఏకబిగిన 1,413 రోజులు కొనసాగిన ఏకైక ప్రధానిగా ఆమె నిలిచారు. ఇటలీ ప్రజలు మెలోనీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ఇది నిదర్శనమని ప్రధాని మోదీ శుక్రవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా కొనసాగిన నేత నా మిత్రురాలు, ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు. ఈ చరిత్రాత్మక మైలురాయి ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనం’అని ప్రధాని మోదీ తెలిపారు. స్పందించిన మెలోనీ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన మోదీ.. మీ సందేశానికి, మీ స్నేహానికి ధన్యవాదాలు. భారత్–ఇటలీ సంబంధాలు మునుపెన్నడూ లేనంత దృఢంగా ఉన్నాయి’అని తెలిపారు. -
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
ప్రపంచ రాజకీయాల్లో ఈ జంట కనిపిస్తే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇద్దరి సరదా సంభాషణలు, ఆప్యాయ పలకరింపులు ఇప్పటికే ‘మెలోడీ’ పేరుతో వైరల్‌గా మారాయి. తాజాగా మెలోనీకి మోదీ చేసిన ఓ ప్రత్యేక విషెస్ ఈ స్నేహాన్ని మరోసారి చర్చలోకి తెచ్చింది.ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నేతగా ఆమె తాజాగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. మెలోనీని తన స్నేహితురాలిగా పేర్కొంటూ.. ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని అన్నారు.“నా స్నేహితురాలు ప్రధాని మెలోనీకి అభినందనలు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రధానిగా ఆమె నిలిచారు” అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్ట్ చేశారు. మెలోనీ నాయకత్వంలో భారత్–ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మెలోనీతో కలిసి మరింత సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.Mi congratulo con la mia amica, il Primo Ministro Meloni, per essere diventata il Primo Ministro con il mandato più lungo nella storia del dopoguerra italiano. Questo traguardo riflette la fiducia che il popolo italiano ripone nella sua leadership. La sua amicizia è stata…— Narendra Modi (@narendramodi) September 4, 2026అలా ప్రధానిగా..1977లో రోమ్‌లో జన్మించిన జార్జియా మెలోనీ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో యువజన రాజకీయ ఉద్యమంలో చేరిన ఆమె.. ఆ తర్వాత ఇటలీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2008లో అప్పటి ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ ప్రభుత్వంలో యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2012లో ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించి, 2014లో దాని అధ్యక్షురాలయ్యారు. 2022 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో.. అదే ఏడాది అక్టోబర్ 22న ఇటలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా మెలోనీ రికార్డు సృష్టించారు. తాజా రికార్డుపై ఇటు తన సోషల్ మీడియాలో మెలోనీ సైతం ఓ పోస్ట్ చేశారు.Oggi il nostro Governo diventa il più longevo della storia della Repubblica italiana.È un dato che accolgo con gratitudine e con un forte senso di responsabilità. Perché la stabilità non è un record da esibire, ma la condizione che consente a una Nazione di programmare,… pic.twitter.com/EpdHe35vJa— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026మెలోనీ కంటే ముందు..ఇటలీ రిపబ్లిక్ ఏర్పడిన 1946 తర్వాత ఎంతోమంది ప్రధానులు మారారు. మెలోనీకి ముందు సుదీర్ఘకాలం నిరంతరంగా ప్రధానిగా కొనసాగిన రికార్డు సిల్వియో బెర్లుస్కోనీ పేరిట ఉండేది. 2001లో ప్రారంభమైన ఆయన రెండో ప్రభుత్వం 1,412 రోజులు కొనసాగింది. 2022 అక్టోబర్ 22న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెలోనీ తాజాగా ఆ రికార్డును అధిగమించారు.‘మెలోడీ’గా ఫేమస్..మోదీ, మెలోనీ మధ్య స్నేహం అంతర్జాతీయ వేదికలపైనా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరి సమావేశాలు, సంభాషణలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ‘మెలోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. మెలోనీ కూడా గతంలో మోదీతో తన స్నేహాన్ని సానుకూలంగా ప్రస్తావించారు. ఆఖరికి ఈ బంధం మెలోడీ చాక్లెట్లు పంచుకునే సరదా స్థాయి దాకా వెళ్లింది. అయితే ఈ బంధం గురించి ఇటు ఇండియాలో రాజకీయ దుమారం రేపిన సందర్భమూ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇక్కడ మోదీ రికార్డేఇటలీలో మెలోనీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ రికార్డు నెలకొల్పిన వేళ.. భారత్‌లోనూ ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2019, 2024లో వరుసగా ఎన్నికై మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతల జాబితాలో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. భారత్‌లో నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్నికై ప్రధానిగా కొనసాగుతున్న నేతగా మోదీ నిలిచారు. ఇటలీలో మెలోనీ, భారత్‌లో మోదీ.. ఇద్దరూ తమ తమ దేశాల్లో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంతో ప్రత్యేక ముద్ర వేశారు.మరింత బలపడనున్న బంధంఇటలీతో భారత్ సంబంధాలు మోదీ ప్రధాని అయ్యాకే క్రమక్రమంగా బలపడుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మెలోనీ స్నేహం కీలకంగా ఉందని మోదీనే చాలాసార్లు పేర్కొన్నారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఈ సంబంధాలు మరింత విస్తరించనున్నాయని మోదీ సంకేతమిచ్చారు.ఇదీ చదవండి: మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా? -
భారత ఆర్థిక వృద్ధితో కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ: వాణిజ్యం, రక్షణ, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, టెక్నాలజీ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, బెల్జియం నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వేవెర్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రక్షణ సంబంధాలను పెంపొందించుకోవడం, పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం సహా ఇతర అంశాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని రెట్టింపు చేయాలన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అనంతరం మోదీ, వేవెర్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. గత త్రైమాసికంలో భారత్ సాధించిన 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశం ఎదుగుదలను ప్రపంచ విశ్వాసానికి, కొత్త అవకాశాలకు మూలకారణంగా అభివరి్ణంచారు. నేడు ప్రపంచం సంక్షోభ కాలాన్ని ఎదుర్కొంటోందని గుర్తుచేశారు. అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయని, అనిశ్చితి వల్ల ఆహారం, ఇంధనం, సప్లై చైన్లు సహా ప్రతి రంగం ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ పరుగు ఎక్కడా ఆగడం లేదన్నారు. గత త్రైమాసికంలో ఏకంగా 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం ప్రశంసనీయమని ఉద్ఘాటించారు. భారత్, బెల్జియం మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మొత్తం సంబంధాలకు మూలస్తంభంగా మోదీ అభివరి్ణంచారు. రెండు దేశాల మధ్య సైనిక మారి్పడులు, శిక్షణా సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించామని చెప్పారు. ఇరుదేశాల ప్రభుత్వాలు, రక్షణ పరిశ్రమల మధ్య కుదిరిన ఒప్పందాలు రక్షణ సహ–అభివృద్ధి, సహ–ఉత్పత్తికి కొత్త అవకాశాలను తెరుస్తాయని స్పష్టంచేశారు. నేరాల నిర్మూలనలో రెండు దేశాల ఏజెన్సీల మధ్య నిఘా సమాచార మారి్పడి, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. భారత్, బెల్జియం ప్రజల మధ్య సంబంధాలే ఇరుదేశాల బంధానికి అతిపెద్ద బలం అని ప్రధానమంత్రి వెల్లడించారు. స్టార్టప్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, మారిటైమ్ రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపారు. విశ్వవిద్యాలయ, పరిశోధన సహకారాన్ని కూడా బలోపేతం చేస్తామన్నారు. ప్రతిభావంతుల బదిలీని సులభతరం చేయడానికి, త్వరలో ‘వలస, బదిలీ భాగస్వామ్య ఒప్పందం’కుదుర్చుకుంటామని తెలియజేశారు. చట్టబద్ధ పాలన, సంప్రదింపులు, దౌత్యంపై భారత్, బెల్జియం దేశాలకు ఎనలేని విశ్వాసం ఉందన్నారు. పునరుత్పాదక ఇంధనంపై నేడు కుదిరిన అవగాహన ఒప్పందం మన సుస్థిరత సహకారానికి కొత్త ఊపునిస్తుందని మోదీ వివరించారు.గతంలో కంటే విస్తృతమైన సంబంధాలు: వేవెర్ భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల బెల్జియం ప్రధానమంత్రి వేవెర్ హర్షం వ్యక్తంచేశారు. ఇదొక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. అలాగే భారత్, బెల్జియం దేశాలు గతంలో కంటే విస్తృతమైన, మరింత వ్యూహాత్మకమైన సంబంధాలను నిర్మించుకుంటున్నాయని వివరించారు.


