ముందే వస్తున్న మోదీ బయోపిక్‌ | Narendra Modi Biopic Release Prepone to April 5 | Sakshi
Sakshi News home page

ముందే వస్తున్న మోదీ బయోపిక్‌

Published Tue, Mar 19 2019 11:06 AM | Last Updated on Tue, Mar 19 2019 1:20 PM

Narendra Modi Biopic Release Prepone to April 5 - Sakshi

ఎన్నికల సీజన్‌లో వెండితెర మీద కూడా గట్టి పోటి కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ ఎన్నికల సమయంలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ మోదీ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మేరీ కోమ్‌, సరబ్జిత్‌ లాంటి బయోపిక్‌ లను తెరకెక్కించిన ఒమాంగ్ కుమార్ దర్శకుడు. లెజెండ్ గ్లోబల్‌ స్టూడియో నిర్మిస్తున్న ఈ సినిమాను రికార్డ్ సమయంలో పూర్తి చేశాడు దర్శకుడు.

జనవరి 27న లాంచనంగా ప్రారంభమైన మోదీ బయోపిక్‌ ఫిబ్రవరి రెండో వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు 60 రోజుల్లోనే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయాలని భావించారు. కానీ ముందే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తవుతుండటంతో ఏప్రిల్ 5నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అదే రోజు రిలీజ్‌ కానుంది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement