Omung Kumar
-
మోదీ బయోపిక్ రిలీజ్ డేట్ ఖరారు
ఎన్నికల వేడిలో రాజకీయ నాయకుల జీవిత చిత్రాలను వెండితెరపై ప్రదర్శించడం కాసింత కష్టమే. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్, ఏపిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, మమతా బెనర్జీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈసీ పలుమార్లు బ్రేకులు వేసింది. ఎట్టకేలకు ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది. ఇప్పటికే చాలాసార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను మే 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో మోదీ పాత్రలో వివేక్ ఒబేరాయ్ నటించగా.. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. -
కమర్షియల్ ఎంటర్టైనర్లా మోదీ బయోపిక్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ పీఎం నరేంద్ర మోదీ. ఈ సినిమాకు మేరీ కోమ్, సరబ్జిత్ లాంటి బయోపిక్ లను తెరకెక్కించిన ఒమాంగ్ కుమార్ దర్శకుడు. లెజెండ్ గ్లోబల్ స్టూడియో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కమర్షియల్ సినిమాకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ బయోపిక్ తెరకెక్కినట్టుగా అనిపిస్తోంది. మోదీ బాల్యంతో పాటు దేశ పర్యటన, ఆర్ఎస్ఎస్ లాంటి అంశాలతో పాటు గోద్రా అల్లర్లు, ప్రధానిగా తీసుకున్న నిర్ణయాలు లాంటి అంశాలను సినిమాలో ప్రధానంగా తెరకెక్కించారు. దాదాపు భారతీయ భాషలన్నింటిల రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహబ్, సేన్ గుప్తాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 27న లాంచనంగా ప్రారంభమైన మోదీ బయోపిక్ ఫిబ్రవరి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు 60 రోజుల్లోనే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయాలని భావించారు. కానీ ముందే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తవుతుండటంతో ఏప్రిల్ 5నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అదే రోజు రిలీజ్ కానుంది. -
నేను రెండు రాష్ట్రాల పౌరుడిని: సంజయ్ దత్
ఆగ్రా(ఉత్తర్‌ప్రదేశ్): తాను ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన పౌరుడినని బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ చెప్పారు. తాజా చిత్రం ‘భూమి’లో షూటింగ్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తన నాయనమ్మ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని, తాత బిహార్‌కు చెందిన వారు అవ్వడం వల్ల తాను ఈ రెండు రాష్ట్రాలకు చెందినవాడినవుతానని తెలిపారు. భూమి సినిమాకు సంబంధించిన షూటింగ్ బాగా జరుగుతోందన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో కెమెరా ముందుకు వచ్చినట్లు తెలిపారు. చివరిసారి 2014లో ‘పీకే’ చిత్రంలో చిన్న పాత్రతో మెరిశాడు. భూమి చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ , శేఖర్ సుమన్ కీలక పాత్రలు చేస్తున్నారు. -
ఆ సినిమా పాక్‌లో విడుదలవ్వాలి
తాను తీస్తున్న తాజా చిత్రం సరబ్జిత్.. పాకిస్థాన్‌లో కూడా విడుదలైతే బాగుంటుందని ఆ సినిమా దర్శకుడు ఒమంగ్ కుమార్ అంటున్నారు. ఆ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏవీ లేవు కాబట్టి అక్కడ కూడా విడుదల చేయాలని ఆశిస్తున్నాడు. పాకిస్థానీ జైలులో అక్కడి ఖైదీల చేతిలో దాడికి గురై మరణించిన భారత పౌరుడు సరబ్జిత్ సింగ్ గురించి, అతడి ఆచూకీ కోసం అతడి సోదరి దల్బీర్ కౌర్ సాగించిన పోరాటం గురించి ఈ సినిమా ఉంటుంది. పాకిస్థాన్ సెన్సార్ బోర్డుకు కూడా తమ సినిమా పంపుతున్నామని, వాళ్ల ఆమోదంతో అక్కడ కూడా దాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని ఒమంగ్ చెప్పారు. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో రణదీప్ హూడా నటిస్తున్నాడు. ఇంతకుముందు ప్రియాంకా చోప్రా హీరోయిన్గా మేరీ కోమ్ సినిమా తీసి ఘన విజయం సాధించిన ఒమంగ్ కుమార్.. పాకిస్థానీ సెన్సార్ బోర్డు వాళ్లు తన సినిమా చూడాలని కోరుతున్నాడు. వాళ్లు సినిమా చూస్తే అంతా అర్థమవుతుందని చెబుతున్నాడు. సినిమా చూడకుండా అది తప్పని ఎవరైనా ఎందుకు అనాలన్నది ఒమంగ్ వాదన. ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఇంకా ఇతర పాత్రల్లో రిచా ఛద్దా, దర్శన్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. -
28 రోజుల్లో 18 కేజీలు తగ్గాడు
బాలీవుడ్లో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న మరో నటుడు రణదీప్ హూడా. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ ఇలా ఏ పాత్రకైన తన వంతు న్యాయం చేసే రణదీప్, ప్రస్తుతం తను నటిస్తున్న సరబ్జిత్ సినిమా కోసం భారీ రిస్క్ చేశాడు. ఈ సినిమాలో పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీ సరబ్జిత్గా నటిస్తున్న రణదీప్, ఆ పాత్ర కోసం 28 రోజుల్లో ఏకంగా 18 కిలోల బరువు తగ్గాడు. అంత తక్కువ సమయంలో అంత భారీగా బరువు తగ్గటం మంచిది కాదని డాక్టర్లు చెప్పినా, పాత్రకు న్యాయం చేయడం కోసం రణదీప్ హుడా రిస్క్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు ఒమాంగ్ కుమార్ స్వయంగా ప్రకటించాడు. రణదీప్ డిఫరెంట్ లుక్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒమాంగ్, అతనికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇదే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా షాకింగ్ లుక్‌లో కనిపించనుంది. @RandeepHooda thank u for taking my vision forward #sarbjit releasing 19th may pic.twitter.com/MqTMniMvKS — Omung Kumar (@OmungKumar) February 5, 2016 -
ప్రియాంక చేతుల మీదుగా 'మేరి కోమ్' టీజర్
బాక్సింగ్ క్రీడాకారిణి మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'మేరి కోమ్' చిత్ర టీజర్ ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆవిష్కరించింది. మేరి కోమ్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం తన 32 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీజర్ ను ప్రియాక చోప్రా విడుదల చేసింది. ఓ నిజమైన పోరాటయోధురాలి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాను. పూర్తిస్థాయి ట్రైలర్ త్వరలో విడుదల అవుతుంది అని ట్విటర్ లో ప్రియాంక చోప్రా ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. 54 సెకన్ల వీడియో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. For you… a sneak peak into the life of a true fighter… http://t.co/d8B2e29PGE #MaryKomPunch Full trailer coming soon. Cant wait to share it — PRIYANKA (@priyankachopra) July 18, 2014