ప్రియాంక చేతుల మీదుగా 'మేరి కోమ్' టీజర్
బాక్సింగ్ క్రీడాకారిణి మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'మేరి కోమ్' చిత్ర టీజర్ ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆవిష్కరించింది
బాక్సింగ్ క్రీడాకారిణి మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'మేరి కోమ్' చిత్ర టీజర్ ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆవిష్కరించింది. మేరి కోమ్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం తన 32 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీజర్ ను ప్రియాక చోప్రా విడుదల చేసింది.
ఓ నిజమైన పోరాటయోధురాలి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాను. పూర్తిస్థాయి ట్రైలర్ త్వరలో విడుదల అవుతుంది అని ట్విటర్ లో ప్రియాంక చోప్రా ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.
54 సెకన్ల వీడియో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.