‘దర్శక నిర్మాతలు కోరి ఉంటే ‘మేరీ కోమ్’ పాత్రను ఉచితంగానైనా చేసి ఉండేదాన్ని అంతలా నన్ను ఆ పాత్ర ఆకట్టుకుంది..’ అని నటి ప్రియాంక చోప్రా చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతూ నేను నటించే ప్రతి చిత్రం నా ‘మొఘల్-ఇ-అజామ్’ చిత్రంలానే ఉండాలనే కోరుకుంటానని తెలిపింది. ఒలంపిక్ మెడల్ విజేత మేరీ కోమ్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన చిత్రంలో టైటిల్ పాత్రను ప్రియాంకచోప్రా పోషించింది. కాగా, ఈ సినిమా పాటల ఆవిష్కరణ సందర్భంగా మేరీ కోమ్ తన భర్త కె ఆన్లెర్ కోమ్‌తో పాటు ప్రత్యేక అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.
పతి సినిమాకు తాను కష్టపడతానని చెప్పింది. అది బర్ఫి అయినా.. మేరీ కోమ్ అయినా.. నటించడం నా వృత్తి.. ప్రతి పాత్రకు న్యాయం చేయడానికి నా శక్తిమేర కష్టపడతాను. దానికి డబ్బుతో ముడిపెట్టను. నా పాత్రకు డబ్బు వస్తే సంతోషం.. లేదంటే మేరీ కోమ్ లాంటి సినిమాలు ఫ్రీగా చేయడానికైనా సిద్ధం..’ అని చెప్పింది. తన జీవితానికి, మేరీ కోమ్ జీవితానికి కొన్ని పోలికలున్నాయని ప్రియాంక అంది. తామిద్దరూ మహిళలైనప్పటికీ పురుషాధిక్యత ఎక్కువగా ఉండే రంగాల్లో తట్టుకుని నిలబడగలిగామని తెలిపింది. మేరీ కోమ్ జీవితం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రియాంక కొనియాడింది. తాను నటించిన చిత్రాన్ని మేరీ కోమ్ చూసినప్పుడు కొంత ఒత్తిడికి లోనయ్యాయని చెప్పింది.
‘ ఒక ఒలంపిక్ మెడల్ విజేత నేను నటించిన సినిమాను చూస్తోందని అనిపించే సరికి కొంత ఒత్తిడికి లోనయ్యా.. ఒకవేళ ఆ సినిమాలో ఏ సన్నివేశమైన ఆమెకు నచ్చి ఉండకపోతే నటిగా నేను విఫలమైనట్లేనని అనుకున్నా.. ఒక క్రీడాకారిణి జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నప్పుడు ఆమె వ్యక్తిత్వాన్ని నేను ఆ పాత్రలో వ్యక్తపరచాలి.. అందుకే మేరీ కోమ్ సినిమా చూసినప్పుడు నేను భయపడ్డా. అయితే ఆ సినిమా చూశాక మేరీ నన్ను మెచ్చుకుంది. అప్పుడే అనుకున్నా..నేను పాత్రపరంగా విజేతగా నిలిచానని.’ అని ప్రియా ంక చెప్పుకొచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లకు రానుంది. అలాగే హీరో హీరోయిన్ల పారితోషికాల్లో చాలా తేడా ఉందన్న విషయాన్ని ప్రియాంక అంగీకరించింది.
ఫ్రీగానైనా చేసేదాన్ని..
Published Thu, Aug 14 2014 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement