ఐటమ్ సాంగ్ చేయడం లేదు: ప్రియాంక చోప్రా | Priyanka Chopra not doing 'Ram Leela' item song | Sakshi
Sakshi News home page

ఐటమ్ సాంగ్ చేయడం లేదు: ప్రియాంక చోప్రా

Published Fri, Aug 23 2013 7:53 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

ఐటమ్ సాంగ్ చేయడం లేదు: ప్రియాంక చోప్రా

ఐటమ్ సాంగ్ చేయడం లేదు: ప్రియాంక చోప్రా

రామ్ లీలా చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలను బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా తోసిపుచ్చింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రామ్ లీలాలో తాను ఐటమ్ సాంగ్ చేయడం లేదు అని స్పష్టం చేసింది. గతంలో ఐటమ్ సాంగ్ కోసం ఐశ్వర్య రాయ్ తో భన్సాలీ సంప్రదింపులు జరిపారు. 
 
నిరాధారమైన వార్తలు నన్ను అప్ సెట్ చేశాయి. ఓ నటిని తొలగించారు. మరో నటి ఈ చిత్రంలో నటిస్తోంది అని మీడియాలో వచ్చే వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. స్పష్టత లేకపోతే రాయకూడదు అని మీడియాకు సూచించింది. రామ్ లీలా చిత్రంలో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారత బాక్సర్ మేరి కోమ్ జీవిత కథ అధారంగా భన్సాలీ నిర్మిస్తున్న ప్రియాంక నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement