సినిమా రివ్యూ: సుందర దృశ్యకావ్యం 'రామ్ లీలా' | Ram leela: romantic and poetic love story on celluloid | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: సుందర దృశ్యకావ్యం 'రామ్ లీలా'

Published Fri, Nov 15 2013 3:27 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

సినిమా రివ్యూ: సుందర దృశ్యకావ్యం 'రామ్ లీలా'

సినిమా రివ్యూ: సుందర దృశ్యకావ్యం 'రామ్ లీలా'

బాలీవుడ్ లో అద్బుతమైన సెట్టింగులు, భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా చిత్రాలు తీయాలంటే కేవలం సంజయ్ లీలా భన్సాలీకే సాధ్యమని 'హమ్ దిల్ దే చుకే సనమ్', 'దేవదాస్', 'బ్లాక్', 'గుజారిష్'లతో నిరూపించాయి. గుజరాత్ నేపథ్యంగా సుమారు 35 కోట్ల వ్యయంతో షేక్ స్పియర్ నవల 'రోమియో జూలియట్' ఆధారంగా 'రామ్ లీలా' చిత్రాన్ని భన్సాలీ రూపొందించారు. సంగీతపరంగా సినీ అభిమానులను ఆకట్టుకున్న 'రామ్ లీలా' నవంబర్ 15 శుక్రవారం విడుదలైంది. 
 
తుపాకుల శబ్దాలు, హింసాత్మక సంఘటనలు, పగ, ప్రతీకారంతో రెండు వర్గాలు  రగిలిపోతున్న ఒక ఊర్లో ఓ జంట ఆకర్షణకు లోనై.. ఆకర్షణ ప్రేమగా మారితే దాని కి ఎన్నో అడ్డంకులు ఉంటాయనేది అక్షరాల నూటికి నూరుపాళ్లు కాదనలేని వాస్తవం. 
 
ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఒక వర్గంలోని రామ్ అనే అబ్బాయి, మరో వర్గంలోని లీలా అనే అమ్మాయి ప్రేమించుకుంటే ఏమవుతుదంటే.. వారిద్దరిని వీడ దీయడం, అమ్మాయికి పెళ్లి ముహుర్తాలు పెట్టించడం, చివరికి వీటన్నింటిని ఎదురించి ఎలా ఒక్కటయ్యారనేది సహజసిద్ధంగా సినిమాటిక్ గా ఉండే క్లైమాక్స్. ఓ అందమైన ప్రేమకథలో ఉండే క్లైమాక్స్ కు భిన్నంగా ప్రేమలో గొప్పదన్నాన్ని అందంగా, కళాత్మకంగా, వీనులకు విందుగా ఉండే సంగీతంతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరపై మ్యాజిక్ చేయడమే 'రామ్ లీలా' కథ. 
 
రామ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ ప్రేక్షకులను తన నటనతో మెస్మరైజ్ చేశాడు. గతంలో బ్యాండ్ బాజా బరాత్, లుటేరా చిత్రాలతో రణవీర్ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే రామ్ లీలా రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రణ్ వీర్ విశ్వరూపం ప్రదర్శించాడు. స్టార్ హోదాతో తాను అగ్రనటుల జాబితా, రేసులో తాను ఉన్నానని ఈ చిత్రం చెప్పకనే చెప్పాడు. 'తత్తడ్ తత్తడ్' ఈ చిత్రంలో ఎంట్రీ ఇచ్చి.. సిక్స్ ప్యాక్ దేహంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ చిత్రంతో రణ్ వీర్ కు మహిళాభిమానులను సంపాదించుకోవడం ఖాయం. రామ్ పాత్రకు రణ్ వీర్ పూర్తిగా న్యాయం చేశాడు. 
 
లీలాగా ఇక దీపిక పదుకొనే అభినయం, గ్లామర్ ను మాటల్లో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్న దీపికాకు మళ్లీ తన ఖాతాలో సూపర్ హిట్ ను వేసుకుంది. తొలుత ఈ చిత్రంలో కరీనా కపూర్ ను, ఆతర్వాత ప్రియాంక చోప్రాను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వారిని నిరాకరించడంతో ఆ అవకాశం దీపికాకు దక్కింది. కొన్ని సీన్లలో రణ్ వీర్ పై కూడా కూడా పైచేయి సాధించింది. రణ్ వీర్ తో కలిసి దీపికా నటించిన శృంగార భరిత సన్నివేశాలు వాహ్ అనిపించేలా ఉన్నాయి. 
 
రిచా చద్దా( గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్), సుప్రియా పాఠక్ కపూర్, అభిమన్యు సింగ్ లు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. 
 
ఈ చిత్రంలో క్యాస్ట్యూమ్స్ ప్రధాన పాత్రే ఉంది. క్యాస్ట్యూమ్స్ ద్వారా సినిమా చాలా రిచ్ గా కనిపించింది. ఓ పాటలో దీపికా పదుకొనే 30 కేజీల గాగ్రాను ధరించింది. దీపికాకు అంజు మోడీ క్యాస్టూమ్స్ డిజైన్ చేయగా, రణవీర్ సింగ్ కు మాక్సిమా బసు డిజైన్ చేశారు. 
 
గుజారీష్ చిత్రం తర్వాత మళ్లీ సంజయ్ లీలా భన్సాలీ మరోసారి మోంటీశర్మతో కలిసి  సంగీత దర్శకత్వం వహించారు. భన్సాలీలో కనిపించే కళాత్మక అభిరుచి తన సన్నివేశాల్లోనే కాక సంగీతంలో కూడా ప్రతిబింబించింది. అందమైన ట్యూన్స్ కు ఆత్మను నింపి తెరపై అద్బుతాన్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరంలో వచ్చిన అన్ని ఆల్బం లన్నింటిలోనూ రామ్ లీలా సంగీతం ఓ ప్రత్యేకంగా ముందువరుసలో నిలిచింది. 
 
'తత్తడ్ తత్తడ్', 'అంగ్ లగా దే', 'రామ్ చాహే లీలా', 'దిల్ కే ఏ గోలి చలే నైనాకు బందుక్ సే...  ఇష్కియా డిష్కియా' చాలా బాగున్నాయి.  ఎడిటర్ గా, నిర్మాతగా, స్ర్కీన్ ప్లే, దర్శకత్వంతో సంజయ్ లీలా భన్సాలీ అదరగొట్టారు. రామ్ లీలాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా ఓ దృశ్యకావ్యంగా భన్సాలీ రూపొందించారు.  చిత్ర ద్వితీయార్ధంలో కొంత రొటిన్ గా అనిపించినా, క్లైమాక్స్ పై కొంత అసంతృప్తి కలిగినా.. ఎలాంటి సందేహాలు లేకుండా వీకెండ్ ను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు రామ్ లీలా చక్కటి చాయిస్. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement