దీపిక, రణ్వీర్లపై అరెస్టు వారంటు జారీ | arrest warrant issued against deepika padukone, ranveer singh | Sakshi
Sakshi News home page

దీపిక, రణ్వీర్లపై అరెస్టు వారంటు జారీ

Published Sat, May 3 2014 2:59 PM | Last Updated on Mon, Aug 20 2018 4:35 PM

దీపిక, రణ్వీర్లపై అరెస్టు వారంటు జారీ - Sakshi

దీపిక, రణ్వీర్లపై అరెస్టు వారంటు జారీ

రామ్ లీలా చిత్రంలో నటించిన దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ సహా దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీపై కూడా అరెస్టు వారెంటు జారీ అయ్యింది. ముజఫర్నగర్లోని ఓ కోర్టు ఈ వారంటు జారీ చేసింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఈ వారంట్లు జారీచేశారు.

సినిమాకు మరో నిర్మాతగా త్యవహరించిన కిషోర్ లుల్లా, సంగీత దర్శకులు, గీత రచయితలపై కూడా వారంట్లు జారీ అయ్యాయి. వాళ్లందరినీ అరెస్టు చేసి జూన్ 4వ తేదీన కోర్టులో హాజరు పరచాలని ముంబై పోలీసు కమిషనర్ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది ఈ సినిమాలో సన్నివేశాల గురించి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement