28 రోజుల్లో 18 కేజీలు తగ్గాడు | Randeep Hooda lost 18kg in 28 days | Sakshi
Sakshi News home page

28 రోజుల్లో 18 కేజీలు తగ్గాడు

Published Fri, Feb 5 2016 7:28 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

28 రోజుల్లో 18 కేజీలు తగ్గాడు

28 రోజుల్లో 18 కేజీలు తగ్గాడు

బాలీవుడ్లో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్న మరో నటుడు రణదీప్ హూడా. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ ఇలా ఏ పాత్రకైన తన వంతు న్యాయం చేసే రణదీప్, ప్రస్తుతం తను నటిస్తున్న సరబ్‌జిత్ సినిమా కోసం భారీ రిస్క్ చేశాడు. ఈ సినిమాలో పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీ సరబ్‌జిత్గా నటిస్తున్న రణదీప్, ఆ పాత్ర కోసం 28 రోజుల్లో ఏకంగా 18 కిలోల బరువు తగ్గాడు.

అంత తక్కువ సమయంలో అంత భారీగా బరువు తగ్గటం మంచిది కాదని డాక్టర్లు చెప్పినా, పాత్రకు న్యాయం చేయడం కోసం రణదీప్ హుడా రిస్క్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు ఒమాంగ్ కుమార్ స్వయంగా ప్రకటించాడు. రణదీప్ డిఫరెంట్ లుక్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒమాంగ్, అతనికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇదే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా షాకింగ్ లుక్లో కనిపించనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement