ప్రసుత్తం సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పలు రంగాలకు చెందిన ప్రముఖల జీవితగాథల ఆధారంగా సినిమాలు రూపొందుతున్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల కాగా, మరి కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం విడుదల చేశారు. ‘దేశభక్తే నా శక్తి’ అనే క్యాప్షన్ ఈ చిత్రంపై ఆసక్తి కలిగించేలా ఉంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ దాదాపు 23 భాషల్లో రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వివేక్ ఒబెరాయ్, మోదీ హావభావాలతో కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. సందీప్ ఎస్ సింగ్, సురేశ్ ఒబెరాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంది.
जय हिन्द. జై హింద్. ஜெய் ஹிந்த். Jai Hind 🇮🇳🙏 We humbly ask for your prayers and blessings on this incredible journey. #AkhandBharat #PMNarendraModi pic.twitter.com/t0lQVka7mJ
— Vivek Anand Oberoi (@vivekoberoi) 7 January 2019
Comments
Please login to add a commentAdd a comment