స్టార్ హీరోకు ఛాన్స్ ఇవ్వలేదు.. | Salman Khan was never part of 'Sarbjit', says Omung Kumar | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోకు ఛాన్స్ ఇవ్వలేదు..

Published Fri, Apr 22 2016 7:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

స్టార్ హీరోకు ఛాన్స్ ఇవ్వలేదు..

స్టార్ హీరోకు ఛాన్స్ ఇవ్వలేదు..

పాకిస్తాన్‌ లో ఖైదు అయ్యి, చివరికి అక్కడి జైలులో చనిపోయిన భారతీయుడు సరబ్‌జిత్. అతని జీవితాన్నే కథాంశంగా చేసుకుని 'సరబ్‌జిత్' చిత్రం రూపొందిస్తున్నారు. ఒమంగ్ కుమార్ చిత్రానికి గౌరవ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నటిస్తున్నారు. ఈ గెటప్‌లో ఐష్‌ని గుర్తు పట్టడం కాస్త కష్టంగానే ఉంటున్న వార్తలు వినిపించాయి. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ మూవీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాత్ర ఉండొచ్చునని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ స్పందిస్తూ.. సల్మాన్ ను ఈ మూవీ కోసం తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

సరబ్జిత్ ను విడుదల చేయాలంటూ 2012లో కండలవీరుడు ట్విట్టర్లో పోస్టులు చేస్తూ చాలా మందికి ప్రేరణగా నిలిచి చైతన్యాన్ని తీసుకొచ్చాడు. గుఢచర్యం ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న భారతీయుడు సరబ్జిత్ విడుదల కోసం సల్మాన్ తనవంతుగా కార్యక్రమాలు నిర్వహించినందున స్టార్ హీరో కూడా ఈ మూవీలో భాగమవుతాడని తాజాగా కథనాలొస్తున్నాయి. తమ స్క్రిప్టులో సల్మాన్ ప్రస్తావనే లేదని, అసలు ఆయనను మూవీ టీమ్ సంప్రదించనేలేదని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement