Sarbjit
-
'ఆ సీన్లు ఉంటే బాగుండేది'
న్యూఢిల్లీ: తాను చేసే ప్రతి పనిలో ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉంటానని బాలీవుడ్ నటి రిచా చద్ధా అంటోంది. 'ఓయ్ లక్కీ ఓయ్'తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రిచా చద్ధా. ఆమె నటించిన 'ఔర్ దేవదాస్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగతున్నాయి. ఓమంగ్ కుమార్ తీస్తున్న 'సరబ్ జిత్' మూవీ నిడివిగా తగ్గించారని చెప్పింది. దీంతో తాను నటించిన 10 సీన్లలో దాదాపు 8వరకు తొలగించనున్నారని, అంతేకాదు ఐశ్వర్యరాయ్ చేసిన 20 సీన్లలో 6 సీన్లకు కత్తెర వేశారట. 'సరబ్జిత్' లో నటనకుగానూ ఈ అమ్మడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సీన్లు కట్ చేశారని తాను కంప్లెంట్ చేయడం లేదని జస్ట్ ఈ విషయాన్ని చెబుతున్నానంది. ఇలాంటి విషయాలను తాను లెక్కచేయనని, చేసే పనిపై ఎప్పుడూ కాన్ఫిడెంట్ గా ఉండటం అలవాటని చెప్పుకొచ్చింది. తాను నటించిన సీన్లు తొలగించకపోతే మూవీకి ఎంతో ఉపయోగపడేవని, చివరికి మూడు, నాలుగు సీన్లే మిగిలాయని ముద్దుగుమ్మ కాస్త దిగులు చెందుతోంది. క్యాబరే'లో స్మోకింగ్ సీన్లలో కూడా అద్భుతంగా నటించింది. డైరెక్టర్ చెప్పినట్లు రియల్ గానే స్మోక్ చేయడంతో హెల్త్ అప్ సెట్ అయిన విషయం తెలిసిందే. -
ఆ సిన్మాకు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అంతంతే!
ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐశ్యర్యరాయ్ తాజా చిత్రం 'సరబ్జిత్' తొలి వీకెండ్లో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. పాకిస్థాన్ జైలులో మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్జిత్ సింగ్ జీవితకథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ తీసిన మరో బయోపిక్ 'సరబ్జిత్'. ఆయన గతంలో ప్రియాంకచోప్రాతో తెరకెక్కించిన 'మేరికోమ్' సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. రణ్‌దీప్ హుడా సరబ్జిత్గా, ఐశ్యర్యరాయ్ ఆయన సోదరిగా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన 'సరబ్జిత్' గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తొలి వీకెండ్లో మొత్తంగా 13.9 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం 3.69 కోట్ల అత్యల్ప వసూళ్లతో ప్రస్థానం మొదలుపెట్టిన ఈ సినిమా రెండోరోజు శనివారం 4.56 కోట్లు, మూడో రోజు ఆదివారం 5.71 కోట్లు రాబట్టింది. 'సరబ్జిత్'కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినా.. కలెక్షన్లలో మాత్రం పెద్దగా ఆ ప్రభావం కనిపించడం లేదని అంటున్నారు. ఈ సినిమా కలెక్షన్లు రాబోవు రోజుల్లో పెరుగకపోతే దారుణంగా ఫ్లాప్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అభి ప్రవర్తనతో షాక్ తిన్న ఐష్!
ఇటీవల అట్టహాసంగా జరిగిన 'సరబ్జిత్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా భార్య ఐశ్యర్యరాయ్ పట్ల అభిషేక్ బచ్చన్ ప్రవర్తించిన తీరు.. అక్కడున్న వారిని కనుబొమ్మలు ముడేసేలా చేసింది. వయస్సు పెరుగుతున్నా వన్నె తగ్గని అందాల రాశి ఐశ్యర్య తాజా సినిమా 'సరబ్జిత్' ప్రీమియర్ షో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఐష్ భర్త అభి, మామ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఐష్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చాలామందే వచ్చారు. కానీ, ఎందుకో ఈ వేడుకలో అభి చాలా ముభావంగా కనిపించాడు. ఐష్‌ను కొంత తప్పుకొని తిరిగాడు. ఫొటోలు దిగడంలో ఆసక్తి చూపించలేదు. ఫొటోగ్రాఫర్ల అభ్యర్థనతో ఐశ్ చేయి పట్టుకొని పిలుచుకొని వస్తే తప్ప భార్యతో కలిసి అతను ఫొటోలు దిగేందుకు ఒప్పుకోలేదు. అది కూడా ఐష్ పక్కన కొంతసేపు మాత్రమే నిలబడి.. పోజు ఇచ్చి.. అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అభి ప్రవర్తనతో ఆమె బిత్తరపోయింది. ఫొటోగ్రాఫర్లను సర్దిచెప్పడానికి, మళ్లీ అతన్ని పిలువడానికి ప్రయత్నించింది. కానీ, అభి ధోరణిలో అభి ఉండటంతో వదిలేసింది. నిజానికి 'సరబ్జిత్'లో ఐష్ నటన సూపర్ అంటూ అభి కితాబు కూడా ఇచ్చాడు. కానీ ప్రీమియర్ షో సమయంలో ఈ దంపతుల మధ్య ఏం గొడవ జరిగిందో, ఎందుకు వీరు అలా ఎడమొహం పెడమొహం ఉన్నారోనని బాలీవుడ్ గాసిప్ రాయుళ్లు ఇప్పుడు చెవులు కొరుక్కుంటున్నారు. -
తొలిరోజు యావరేజ్ కలెక్షన్లే!
ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐశ్యర్యరాయ్ తాజా చిత్రం 'సరబ్జిత్' తొలిరోజు కలెక్షన్ల విషయంలో తుస్సుమంది. పాకిస్థాన్ జైలులో మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్జిత్ సింగ్ జీవితకథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ తీసిన మరో బయోపిక్ 'సరబ్జిత్'. ఆయన గతంలో ప్రియాంకచోప్రాతో తెరకెక్కించిన 'మేరికోమ్' సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో రణ్‌దీప్ హుడా సరబ్జిత్గా, ఐశ్యర్యరాయ్ ఆయన సోదరిగా ఎమోషనల్ డ్రామాగా 'సరబ్జిత్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా కథపరంగా, ప్రధాన పాత్రల నటనపరంగా ఈ సినిమా ప్రేక్షకులను కదిలింపజేస్తోంది. పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినప్పటికీ తొలిరోజు 'సరబ్జిత్' సినిమా కేవలం రూ. 3.69 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్లో మిగతా రెండు రోజుల్లో వచ్చే కలెక్షన్లు ఈ చిత్రానికి కీలకం కానున్నాయి. ఈ సినిమా హిట్టా.. ఫట్టా అన్నది ఇక ప్రేక్షకుల చేతుల్లోనే ఉన్నది. -
ఐశ్వర్య రెండో ప్రయత్నం కూడా ఆకట్టుకోలేదు
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. నిజజీవిత కథల ఆదారంగా తెరకెక్కిన సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే బాటలో ఇటీవల విడుదలైన ఎయిర్ లిఫ్ట్, నీర్జా లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో మరో బయోపిక్ వెండితెర మీదకు వచ్చింది. అయితే ఎలాంటి సెలబ్రిటీ స్టేటస్ లేకపోయినా అన్యాయంగా పాకిస్థాన్ జైలులో ప్రాణాలు కోల్పోయిన ఓ సామాన్యుడి కథను సరబ్జీత్ పేరుతో వెండితెర మీద ఆవిష్కరించారు. తన అన్న విడుదల కోసం 23 ఏళ్ల పాటు పోరాటం చేసే సోదరి పాత్రలో ఐశ్వర్యారాయ్ నటించటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. జెబ్జా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఐష్, ఆ సినిమాతో నిరాశపరిచినా సరబ్జీత్ ఆకట్టుకుంటుదన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దులో భిఖివిండ్ గ్రామంలో నివసించే సాధారణ రైతు సరబ్జీత్ సింగ్. అంతా ప్రశాతంగా సాగుతున్నా రైతు జీవితంలో జరిగిన ఓ సంఘటన అతన్ని తన కుటుంబానికీ, దేశానికీ దూరం చేసింది. అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన సరబ్‌జీత్‌ను లాహోర్ బాంబు పేలుళ్ల నిందితుడిగా పేర్కొంటూ పాక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధిస్తుంది. ఈ విషయం తెలిసి సరబ్జీత్ సోదరి దల్బీర్‌కౌర్, తన అన్నను నిర్దోషిగా నిరూపించేందుకు ఏకంగా 23 ఏళ్ల పాటు పోరాటం చేస్తుంది. తన ప్రయత్నాలు కొనసాగుతుండగానే.., ఓ రోజు జైలులో ఖైదీల దాడిలో సరబ్జీత్ చనిపోతాడు. సరబ్ జీత్ మరణం తరువాత దల్బీర్ ఏం చేసింది.? తన అన్నను నిర్ధోషిగా నిరూపించిందా లేదా అన్నదే సరబ్ జీత్ కథ. ఎన్నో అంచనాల మధ్య ఓమాంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సరబ్జీత్ అంచనాలను అందుకోవటంలో తడబడింది. ఎలాంటి తప్పు చేయకపోయినా 23 ఏళ్ల పాటు పాకిస్థాన్ జైలులో ఉండి, అక్కడే మరణించిన వ్యక్తి జీవితంపై.., సినిమా అనగానే ప్రేక్షకుల్లో అతని కథ తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతోంది. అయితే కథ మీద కన్నా ఎక్కువగా ఎమోషన్స్‌ను చూపించటం మీదే దర్శకుడు దృష్టి పెట్టాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమాలో కావాలని పాటలు ఇరికించటం కూడా కాస్త ఇబ్బంది కలిగించింది. ఐశ్వర్యా రాయ్ , రణదీప్ హుడాలు సాంకేతికంగా జరిగిన తప్పులను తమ నటనతో కవర్ చేసే ప్రయత్నం చేశారు. యువతిగా మధ్య వయస్కురాలిగా నటించిన ఐష్ రెండు వేరియేషన్స్‌ను అద్భుతంగా చూపించింది. ఇక సరబ్ జీత్ పాత్రలో రణదీప్ హుడా ఒదిగిపోయాడు. ఇలా నటన పరంగా ఆకట్టుకున్న సాంకేతికంగా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఐశ్వర్య రీ ఎంట్రీలో రెండో ప్రయత్నంలో కూడా ఆకట్టుకోలేకపోయింది. -
'ఆ సినిమా ఒక కుటుంబ భావోద్వేగం'
ముంబై: సరబ్ జిత్ సింగ్ సినిమా ఒక కుటుంబ భావోద్వేగానికి సంబంధించినదని ఆ చిత్ర హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ అన్నారు. ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో అనంతరం ఐశ్వర్యారాయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా అందరి గుండెలకు హత్తుకుంటుందని అన్నారు. సరబ్ జిత్ చిత్రానికి పన్నును మినహాయించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఐష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సరబ్ జిత్ సింగ్ పాత్రలో రణదీప్ హుడా, అతని అక్క పాత్రలో ఐశ్వర్య నటించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాకిస్థాన్ లో గూఢచర్యం, ఉగ్రవాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అక్కడ జైలులో తోటి ఖైదీలు దాడి చేయగా భారత్ కు చెందిన సరబ్ జిత్ మరణించిన కథాంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను నిర్మించారు. -
ప్రధాని మోదీపై ప్రముఖ హీరోయిన్ ప్రశంసలు
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రశంసల జల్లు కురిపించింది. దేశం కోసం మోదీ ఎంతో కష్టపడుతున్నారని, ప్రధాని పదవి నిర్వర్తించడం అంత సులువైన విషయం కాదని ఆమె పేర్కొంది. ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఐశ్వర్య.. దేశం, దేశ ప్రజల మేలు కోసం ప్రధాని కష్టపడుతున్నారని పేర్కొంది. రాజకీయాల్లో ఎంట్రీపై.. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశముందా? అన్న ప్రశ్నకు ఐశ్యర్య రాయ్ నేరుగా సమాధానమివ్వలేదు. ప్రస్తుతం ఓ మంచి తల్లిగా, కూతురిగా, భార్య, బాధ్యతాయుతమైన పౌరురాలిగా తాను విభిన్నమైన పాత్రలు పోషిస్తు బిజీగా ఉన్నానని, తన వృత్తి పట్ల తనకు సంతృప్తి ఉందని ఆమె పేర్కొంది. రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న ప్రశ్నకు ఆమె కచ్చితంగా సమాధానం ఇవ్వలేదు. తాను ఏమీ చెప్పలేనని, తన రాజకీయ ఎంట్రీపై సాధ్యాసాధ్యాలను చెప్పలేనని తెలిపింది. మీ జీవితంలో ఏవైనా కొత్త లక్ష్యాలు పెట్టుకున్నారా? అన్న ప్రశ్నకు కాస్తా వేదాంతంగా ఐశ్యర్య సమాధానమిచ్చింది. జీవితమనేది ఒక ప్రయాణమని, అందులో ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చింది. అభిషేక్ బచ్చన్ భార్యగా బిగ్ బీ ఇంట అడుగుపెట్టిన ఐశ్యర్య ప్రస్తుతం తన తాజా చిత్రం 'సరబ్జిత్'పై చాలా ఆశలే పెట్టుకుంది. ఈ నెల 20న విడుదలకానున్న ఈ సినిమా ప్రపంచానికి మీడియా శక్తిని చాటుతుందని చెప్పింది. -
స్టార్ హీరోకు ఛాన్స్ ఇవ్వలేదు..
పాకిస్తాన్ లో ఖైదు అయ్యి, చివరికి అక్కడి జైలులో చనిపోయిన భారతీయుడు సరబ్జిత్. అతని జీవితాన్నే కథాంశంగా చేసుకుని 'సరబ్జిత్' చిత్రం రూపొందిస్తున్నారు. ఒమంగ్ కుమార్ చిత్రానికి గౌరవ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నటిస్తున్నారు. ఈ గెటప్‌లో ఐష్‌ని గుర్తు పట్టడం కాస్త కష్టంగానే ఉంటున్న వార్తలు వినిపించాయి. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ మూవీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాత్ర ఉండొచ్చునని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ స్పందిస్తూ.. సల్మాన్ ను ఈ మూవీ కోసం తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సరబ్జిత్ ను విడుదల చేయాలంటూ 2012లో కండలవీరుడు ట్విట్టర్లో పోస్టులు చేస్తూ చాలా మందికి ప్రేరణగా నిలిచి చైతన్యాన్ని తీసుకొచ్చాడు. గుఢచర్యం ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న భారతీయుడు సరబ్జిత్ విడుదల కోసం సల్మాన్ తనవంతుగా కార్యక్రమాలు నిర్వహించినందున స్టార్ హీరో కూడా ఈ మూవీలో భాగమవుతాడని తాజాగా కథనాలొస్తున్నాయి. తమ స్క్రిప్టులో సల్మాన్ ప్రస్తావనే లేదని, అసలు ఆయనను మూవీ టీమ్ సంప్రదించనేలేదని వివరించారు. -
కొత్త లుక్‌తో... దిల్ ఖుష్!
ఎర్రటి పంజాబీ డ్రెస్‌లో, చందమామ లాంటి మోముతో తళతళలాడుతున్న అందాల తార ఐశ్వర్యారాయ్ ‘సరబ్జిత్’ సిన్మా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఐష్‌ది మెయిన్ రోల్ కాకపోయినా ఆమే ఈ చిత్రానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే చిత్ర బృందం ఐష్ స్టిల్స్‌ను ఎక్కువగా విడుదల చే సి, సినిమాకు మరింత ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత గూఢచారి అనే అభియోగంతో జీవితాంతం జైల్లోనే మగ్గిపోయిన ‘సరబ్జిత్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. తమ్ముడికి జరిగిన అన్యాయం గురించి పోరాడిన సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే సహజత్వానికి దగ్గరగా లుక్స్ విషయంతో చిత్ర దర్శకుడు ఒమంగ్ కుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరబ్జిత్గా రణదీప్హుడా, ఆయన భార్యగా రిచా చద్దా కనిపించనున్నారు. ఆ మధ్య ‘జజ్బా’ చిత్రం అనుకున్న ఫలితమివ్వకపోవడంతో, ఈ సినిమాతోనైనా హిట్ సాధించాలని ఐశ్వర్య శ్రమిస్తున్నారు. -
అదరగొడుతున్న ఐశ్వర్య
ముంబై: 'సరబ్ జిత్' మూవీలో సరబ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా చిత్ర దర్శకుడు రిలీజ్ చేసిన ఫొటోలను గమనిస్తే ఇదే నిజమనిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఆమె ఆ పాత్రలో జీవిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ స్టిల్స్ ను దర్శకుడు ఒముంగ్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేశారు. సరబ్జిత్ పాత్రలో రణదీప్, దల్బీర్ పాత్రలో విశ్వసుందరి ఫొటోలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. జజ్బా సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఐష్ ఆ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మధ్య వయస్కురాలైన సరబ్ సోదరి దల్బీర్ పాత్ర ఎంపికలో పెద్ద సాహసమే చేసింది. కథ విన్నవెంటనే ఆమె భావోద్వేగానికి గురయ్యారనీ, కేవలం 15 నిమిషాల్లోనే సినిమాకు ఓకే చెప్పడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని గతంలో దర్శకుడు మీడియాకు వెల్లడించారు. 'మేరీ కొమ్' బయోపిక్ ద్వారా అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు ఒముంగ్ కుమార్ సరబ్జిత్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సరబ్ జిత్ సింగ్ ను ఉగ్రవాదిగా భావించిన పాకిస్తాన్, ఆయన జైల్లో పెట్టింది. తోటి ఖైదీలు ఆయనపై దాడి చేయడంతో గాయాలపాలైన సరబ్ జిత్ సింగ్ 2013లో మరణించాడు. కానీ అప్పటివరకు అన్న సరబ్ విడుదల కోసం, సోదరి దల్బీర్ పెద్ద పోరాటమే చేసింది. ఈ నిజ జీవిత గాథను ఒమంగ్ సినిమా కథగా మార్చి తెరకెక్కిస్తున్నాడు. సరబ్ జిత్ సింగ్ పాత్రలో రణదీప్ హూడా నటిస్తుండగా.. రిచా చద్దా, దర్శన్ కుమార్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకోసం రణదీప్ ఏకంగా 28 కిలోల బరువు తగ్గి సంచలనం సృష్టించాడు. -
సరబ్జిత్ సోదరిగా 'ఐశ్వర్యరాయ్'