ఆ సిన్మాకు ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్లు అంతంతే! | Sarbjit earns Rs 13.96 cr in first weekend | Sakshi
Sakshi News home page

ఆ సిన్మాకు ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్లు అంతంతే!

Published Mon, May 23 2016 1:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

ఆ సిన్మాకు ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్లు అంతంతే!

ఆ సిన్మాకు ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్లు అంతంతే!

ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐశ్యర్యరాయ్‌ తాజా చిత్రం 'సరబ్‌జిత్‌' తొలి వీకెండ్‌లో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. పాకిస్థాన్‌ జైలులో మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్‌జిత్‌ సింగ్ జీవితకథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ తీసిన మరో బయోపిక్‌ 'సరబ్‌జిత్‌'. ఆయన గతంలో ప్రియాంకచోప్రాతో తెరకెక్కించిన 'మేరికోమ్‌' సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

రణ్‌దీప్‌ హుడా సరబ్‌జిత్‌గా, ఐశ్యర్యరాయ్‌ ఆయన సోదరిగా ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన 'సరబ్‌జిత్‌' గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తొలి వీకెండ్‌లో మొత్తంగా 13.9 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం 3.69 కోట్ల అత్యల్ప వసూళ్లతో ప్రస్థానం మొదలుపెట్టిన ఈ సినిమా రెండోరోజు శనివారం 4.56 కోట్లు, మూడో రోజు ఆదివారం 5.71 కోట్లు రాబట్టింది. 'సరబ్‌జిత్‌'కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ మౌత్‌టాక్‌ వచ్చినా.. కలెక్షన్లలో మాత్రం పెద్దగా ఆ ప్రభావం కనిపించడం లేదని అంటున్నారు. ఈ సినిమా కలెక్షన్లు రాబోవు రోజుల్లో పెరుగకపోతే దారుణంగా ఫ్లాప్‌ అయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement