అదరగొడుతున్న ఐశ్వర్య | Aishwarya Rai Bachchan, Randeep Hooda in new sarbjit stills | Sakshi
Sakshi News home page

అదరగొడుతున్న ఐశ్వర్య

Published Thu, Feb 18 2016 4:07 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

అదరగొడుతున్న ఐశ్వర్య

అదరగొడుతున్న ఐశ్వర్య

ముంబై:  'సరబ్ జిత్' మూవీలో సరబ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్  పాత్రలో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా చిత్ర దర్శకుడు రిలీజ్ చేసిన ఫొటోలను గమనిస్తే ఇదే నిజమనిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఆమె ఆ పాత్రలో జీవిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం  షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ స్టిల్స్ ను దర్శకుడు ఒముంగ్ కుమార్  ట్విట్టర్‌లో షేర్ చేశారు. సరబ్‌జిత్ పాత్రలో రణదీప్, దల్బీర్ పాత్రలో విశ్వసుందరి ఫొటోలను ఆయన అభిమానులతో పంచుకున్నారు.

జజ్బా సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఐష్ ఆ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మధ్య వయస్కురాలైన సరబ్ సోదరి  దల్బీర్  పాత్ర ఎంపికలో పెద్ద సాహసమే చేసింది. కథ విన్నవెంటనే ఆమె భావోద్వేగానికి గురయ్యారనీ,  కేవలం 15 నిమిషాల్లోనే  సినిమాకు ఓకే చెప్పడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని గతంలో దర్శకుడు మీడియాకు వెల్లడించారు.

'మేరీ కొమ్' బయోపిక్ ద్వారా అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు ఒముంగ్ కుమార్  సరబ్‌జిత్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సరబ్ జిత్ సింగ్ ను ఉగ్రవాదిగా భావించిన పాకిస్తాన్, ఆయన జైల్లో పెట్టింది. తోటి ఖైదీలు ఆయనపై దాడి చేయడంతో గాయాలపాలైన సరబ్ జిత్ సింగ్ 2013లో మరణించాడు. కానీ అప్పటివరకు అన్న సరబ్ విడుదల  కోసం,  సోదరి దల్బీర్ పెద్ద పోరాటమే చేసింది. ఈ నిజ జీవిత గాథను ఒమంగ్ సినిమా కథగా మార్చి తెరకెక్కిస్తున్నాడు. సరబ్ జిత్ సింగ్ పాత్రలో రణదీప్ హూడా నటిస్తుండగా.. రిచా చద్దా, దర్శన్ కుమార్  ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకోసం రణదీప్ ఏకంగా 28 కిలోల బరువు  తగ్గి  సంచలనం సృష్టించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement