'ఆ సినిమా ఒక కుటుంబ భావోద్వేగం' | Made 'Sarbjit' keeping in mind sensitivity of family:Aishwarya | Sakshi
Sakshi News home page

'ఆ సినిమా ఒక కుటుంబ భావోద్వేగం'

Published Thu, May 19 2016 8:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

Made 'Sarbjit' keeping in mind sensitivity of family:Aishwarya

ముంబై:  సరబ్ జిత్ సింగ్ సినిమా ఒక కుటుంబ భావోద్వేగానికి  సంబంధించినదని ఆ చిత్ర హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ అన్నారు. ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో  అనంతరం ఐశ్వర్యారాయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా అందరి గుండెలకు హత్తుకుంటుందని అన్నారు. సరబ్ జిత్  చిత్రానికి పన్నును మినహాయించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఐష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సరబ్ జిత్ సింగ్ పాత్రలో రణదీప్ హుడా, అతని అక్క పాత్రలో ఐశ్వర్య నటించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాకిస్థాన్ లో గూఢచర్యం, ఉగ్రవాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అక్కడ జైలులో తోటి ఖైదీలు దాడి చేయగా భారత్ కు చెందిన సరబ్ జిత్ మరణించిన కథాంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను నిర్మించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement