ప్రధాని మోదీపై ప్రముఖ హీరోయిన్ ప్రశంసలు | Aishwarya Rai Bachchan heaps praise on Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై ప్రముఖ హీరోయిన్ ప్రశంసలు

Published Wed, May 11 2016 8:06 PM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

ప్రధాని మోదీపై ప్రముఖ హీరోయిన్ ప్రశంసలు - Sakshi

ప్రధాని మోదీపై ప్రముఖ హీరోయిన్ ప్రశంసలు

ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ప్రశంసల జల్లు కురిపించింది. దేశం కోసం మోదీ ఎంతో కష్టపడుతున్నారని, ప్రధాని పదవి నిర్వర్తించడం అంత సులువైన విషయం కాదని ఆమె పేర్కొంది. ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఐశ్వర్య.. దేశం, దేశ ప్రజల మేలు కోసం ప్రధాని కష్టపడుతున్నారని పేర్కొంది.

రాజకీయాల్లో ఎంట్రీపై..
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశముందా? అన్న ప్రశ్నకు ఐశ్యర్య రాయ్‌ నేరుగా సమాధానమివ్వలేదు. ప్రస్తుతం ఓ మంచి తల్లిగా, కూతురిగా, భార్య, బాధ్యతాయుతమైన పౌరురాలిగా తాను విభిన్నమైన పాత్రలు పోషిస్తు బిజీగా ఉన్నానని, తన వృత్తి పట్ల తనకు సంతృప్తి ఉందని ఆమె పేర్కొంది. రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న ప్రశ్నకు ఆమె కచ్చితంగా సమాధానం ఇవ్వలేదు. తాను ఏమీ చెప్పలేనని, తన రాజకీయ  ఎంట్రీపై సాధ్యాసాధ్యాలను చెప్పలేనని తెలిపింది. మీ జీవితంలో ఏవైనా కొత్త లక్ష్యాలు పెట్టుకున్నారా? అన్న ప్రశ్నకు కాస్తా వేదాంతంగా ఐశ్యర్య సమాధానమిచ్చింది. జీవితమనేది ఒక ప్రయాణమని, అందులో ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చింది. అభిషేక్‌ బచ్చన్ భార్యగా బిగ్‌ బీ ఇంట అడుగుపెట్టిన ఐశ్యర్య ప్రస్తుతం తన తాజా చిత్రం 'సరబ్‌జిత్‌'పై చాలా ఆశలే పెట్టుకుంది. ఈ నెల 20న విడుదలకానున్న ఈ సినిమా ప్రపంచానికి మీడియా శక్తిని చాటుతుందని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement