ప్లీజ్! షూటింగ్ చేసుకోనివ్వండి... | When Aishwarya Rai Was Mobbed by Fans on the Sets of Sarabjit | Sakshi
Sakshi News home page

ప్లీజ్! షూటింగ్ చేసుకోనివ్వండి...

Published Sat, Dec 26 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

ప్లీజ్! షూటింగ్ చేసుకోనివ్వండి...

ప్లీజ్! షూటింగ్ చేసుకోనివ్వండి...

అది ముంబయ్ నగరానికి దూరంగా ఉన్న ప్రాంతం. ముంబయ్ నుంచి అక్కడికి వెళ్లాలంటే మూడు గంటలు పడుతుంది. పెద్దగా జనాలు ఉండరు. షూటింగ్‌కి అనువుగా ఉంటుందని ‘సరబ్‌జిత్’ చిత్రం షూటింగ్‌ని అక్కడ ప్లాన్ చేశారు చిత్రదర్శకుడు ఒమంగ్ కుమార్. పాకిస్తాన్‌లో ఖైదు అయ్యి, అక్కడే చనిపోయిన సరబ్‌జిత్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా నటిస్తున్నారు ఐష్. ఇది డీ-గ్లామరైజ్డ్ రోల్. ఈ గెటప్‌లో ఐష్‌ని గుర్తు పట్టడం కాస్త కష్టంగానే ఉంటుందట.

అందేకని, పబ్లిక్ ప్లేసెస్‌లో షూటింగ్ చేసినా ఇబ్బంది లేదనుకున్నారట ఒమంగ్ కుమార్. కానీ, అభిమానులు గుర్తుపట్టకుండా ఉంటారా? ఐష్ షూటింగ్ చేస్తున్నారని విని, దాదాపు నాలుగు వందల మంది అభిమానులు గుమిగూడిపోయారట. దానివల్ల షూటింగ్‌కి ఆటంకం ఏర్పడిందని సమాచారం. చివరికి ఐష్ జోక్యం చేసుకుని, ‘మమ్మల్ని షూటింగ్ చేసుకోనివ్వండి.. ప్లీజ్’ అని అభ్యర్ధించారట. అభిమాన తార అంతలా అడిగితే.. అభిమానుల మనసు కరిగిపోదూ! షూటింగ్‌కి ఆటంకం కలగజేయకుండా అక్కణ్ణుంచి వెళ్లిపోయారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement