సంజయ్ 'ద గుడ్ మహారాజా' కాదట | Sanjay Dutt not part of The Good Maharaja | Sakshi
Sakshi News home page

సంజయ్ 'ద గుడ్ మహారాజా' కాదట

Published Wed, Oct 4 2017 3:12 PM | Last Updated on Wed, Oct 4 2017 4:08 PM

Sanjay Dutt

ఇటీవల భూమి సినిమాతో ఆకట్టుకున్న బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ద గుడ్ మహారాజా అనే సినిమాలో నటిస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ లీడ్ రోల్ లో భూమి చిత్రాన్ని రూపొందించిన ఒమంగ్ కుమార్ దర్శకత్వంలోనే ద గుడ్ మహారాజా తెరకెక్కనుంది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఈ సినిమాలో సంజయ్ దత్, నవానగర్ మహారాజా సాహిబ్ దిగ్విజయ్ సింగ్జీ రజింత్ సింగ్జీ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వందలాది చిన్నారలకు ఆశ్రయం కల్పించిన సాహిబ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఈ ఆసక్తికర కథతో ఒమాంగ్ కుమార్ తెరకెక్కించబోయే సినిమాను పోలిష్ ఇంగ్లీష్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తాయన్న ప్రచారం జరిగింది.

అయితే తాజాగా సమాచారం ప్రకారం ద గుడ్ మహరాజా సినిమాలో సంజయ్ దత్ నటించటంలేదట. ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోలు విజువల్ రిప్రజెంటేషన్ కోసం ఫొటోషాప్ ద్వారా తయారు చేసినవి మాత్రమే అని చిత్రయూనిట్ తెలిపారు. ప్రస్తుతం సంజయ్ సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ 3 సినిమాతో పాటు మరో రెండు సినిమాలో బిజీగా ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement