'మేరి కోమ్'కు యూపీ పన్ను మినహాయింపు!
'మేరి కోమ్'కు యూపీ పన్ను మినహాయింపు!
Published Sun, Aug 31 2014 4:32 PM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
లక్నో: భారత బాక్సర్ మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రానికి వివిధ రాష్ట్రాల్లో ఆదరణ లభిస్తోంది. మేరీకోమ్ చిత్రానికి ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర బాటలోనే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేరింది.
'మేరికోమ్' చిత్రానికి యూపీ కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. యూపీలోని మహిళలకు స్పూర్తిగా నిలిచే చిత్రంగా 'మేరికోమ్' చిత్రం నిలువాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా 'మేరీ కోమ్' పాత్రను పోషిస్తోంది. 'మేరి కోమ్' చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలవుతోంది.
Advertisement
Advertisement