'ఐష్' సినిమాకు పన్ను మినహాయింపు | 'Sarbjit' declared tax-free in UP | Sakshi
Sakshi News home page

'ఐష్' సినిమాకు పన్ను మినహాయింపు

Published Wed, May 18 2016 7:23 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

'ఐష్' సినిమాకు పన్ను మినహాయింపు - Sakshi

'ఐష్' సినిమాకు పన్ను మినహాయింపు

ముంబై: ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 'సరబ్ జీత్' సినిమాపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరుణ చూపింది. ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది. తమ విజ్ఞప్తి మేరకు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సరబ్ జీత్' యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సినిమాకు పన్ను మిహాయింపు ఇచ్చినందు యూపీ సర్కారుకు నిర్మాత జాకీ భగ్నానీ ధన్యవాదాలు తెలిపారు.

ఒమాంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 20న విడుదల కానుంది. పాకిస్థాన్ లో జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన భారతీయ ఖైదీ సరబ్ జీత్ సింగ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సరబ్ జీత్ గా రణదీప్ హుడా, అతడి సోదరి దల్బీర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement