
హో చి మిన్ సిటీ (వియ త్నాం): ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 3 పతకాలు ఖాయమయ్యా యి. శనివారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో భారత మేటి బాక్సర్ మేరీకోమ్‌తో పాటు శిక్ష (54 కేజీలు), ప్రియాంక చౌదరి (60 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. తద్వారా కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు.
ఈ టోర్నీలో గతంలో 4 స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకున్న 34ఏళ్ల మేరీకోమ్ (48కేజీ) క్వార్టర్స్‌లో చైనీస్‌తైపీకి చెందిన మెంగ్ చిన్ పిన్‌పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో సుబాసా కొమురా (జపాన్)తో మేరీకోమ్ తలపడుతుంది. 54 కేజీ విభాగం క్వార్టర్స్‌లో శిక్షా, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఫెరాంగిజ్ ఖొషిమోవాపై, ప్రియాంక శ్రీలంకకు చెందిన డులాంజని లంకపురయాలగేపై గెలుపొందింది. సెమీస్‌లో శిక్షా.. లిన్ యు టింగ్ (చైనీస్ తైపీ)తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment